శృంగార సమయంలో.. స్పర్శ కూడా చాలా ముఖ్యమే..!

శృంగార సమయంలో.. స్పర్శ  కూడా చాలా ముఖ్యమే..!

స్పర్శ అనేదానికి (Touch)  ఉన్న శ‌క్తి ఎలాంటిదో మ‌నంద‌రికీ తెలుసు. మన మ‌న‌సులో ఉన్న ప్రేమ‌ను ఒకే ఒక్క స్ప‌ర్శ‌తో ఎదుటివ్య‌క్తికి తెలియ‌జేయ‌వ‌చ్చు. అందుకే శృంగారంలో (sex) పాల్గొనే స‌మ‌యంలో పురుషులు త‌మ శ‌రీరంలోని కొన్ని భాగాలను భార్య‌లు స్పృశించాల‌ని ఆశిస్తారు.  ఇంత‌కీ ఆ శ‌రీర భాగాలు ఏవంటే..


1. మీ భుజాల వ‌ద్ద‌..శృంగారం మొద‌ల‌య్యేది ఫోర్ ప్లేతోనే! ఈ స‌మ‌యంలోనే మూడ్‌ని మ‌రింత పెంచేందుకు, క‌ల‌యిక‌లోని ఆనందాన్ని మ‌రింత పెంచుకునేందుకు చెంప‌లు, పెద‌వులు, మెడ‌.. వంటి భాగాల‌ను ముద్దుల‌తో ముంచెత్త‌డం స‌హ‌జ‌మే. అయితే ఈసారి మెడ ప్రాంతంలో ముద్దులు పెట్టిన త‌ర్వాత మీ భాగ‌స్వామిని.. మీ భుజాల వద్ద కూడా మృదువుగా చేతుల‌తో స్పృశిస్తూ, సుతారంగా ముద్దు పెట్ట‌మ‌ని కోరండి. ఒక్క‌సారి ఆ స్ప‌ర్శ‌లోని అనుభూతి చ‌విచూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాల‌ని మ‌నసు కోరుకోకుండా ఉండ‌దంటే అతిశ‌యోక్తి కాదు.


Kiss


2. చెవుల వెనుక భాగంలో..చెవుల వెనుక ఉన్న ప్రాంతం ఎంత సెన్సిటివ్‌గా ఉంటుందో తెలుసా? ఒక్క‌సారి మీ భాగ‌స్వామిని చెవుల వెనుక భాగంలో ముద్దు పెట్ట‌మ‌ని అడ‌గండి. ఆ అనుభూతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. వెంట‌నే మూడ్ రావ‌డం ఖాయం.


3. మెడ భాగం..లైంగిక చ‌ర్య‌లో పాల్గొనేలా మ‌న‌ల్ని ప్రేరేపించే శ‌రీర భాగాల్లో మెడ కూడా ఒక‌టి. అందుకే అక్క‌డ మునివేళ్ల‌తో స్పృశించినా లేక ముద్దు పెట్టుకున్నా.. మ‌న‌కు మూడ్ వ‌చ్చేస్తుంటుంది. కాబ‌ట్టి ఈసారి మీ భాగ‌స్వామిని మెడ భాగంలో కూడా ముద్దు పెట్ట‌మని చెప్పి, ఆ అనుభూతిని మీరూ ఆస్వాదించండి.


 


4. అధ‌రాలు..మీకు తెలుసా.. పురుషుల కంటే మ‌హిళ‌లకే ముద్దు పెట్ట‌డం అంటే చాలా ఇష్ట‌మ‌ట‌! ఈ అధ‌ర చుంబ‌నాన్ని ఆస్వాదిస్తూనే చాలామంది త‌మ ర‌సిక ఆనందానికి బాట‌లు వేసుకుంటూ ఉంటారు. పైగా శృంగారంలో ఇది కీల‌కం కూడా..! అందుకే ఈసారి మీ భాగ‌స్వామిని.. మీ అధ‌రాల‌పై ఘాటుగా ఒక ముద్దు పెట్ట‌మ‌ని కోరండి.


 


5. ఛాతీ ప్రాంతం..కొంత‌మంది మ‌హిళ‌ల‌కు చ‌నుమొన‌ల‌ను స్పృశిస్తే చాలు.. ఆర్గాజ‌మ్ పొందుతుంటారు. క‌ల‌యిక‌లో మ‌రింత ఆనందాన్ని పొందేందుకు ఇది కూడా ఒక మార్గం. కాబ‌ట్టి మీ భాగ‌స్వామి , మీరు కూడా దీనిని ఓసారి ప్ర‌య‌త్నించి చూడండి.


 


6. తొడ‌ల మ‌ధ్య‌లో..మ‌న శ‌రీరంలో ఉన్న అత్యంత సెన్సిటివ్ భాగాల్లో ఇవి కూడా ఒక‌టి. అందుకే వీటిని సుతారంగా స్పృశించినా లేక ముద్దు పెట్టుకున్నా ఆ ప్ర‌కంప‌న‌లు ఒళ్లంతా వ్యాపిస్తాయి. మ‌నల్ని మ‌రింత మైకంలో ప‌డిపోయేలా చేసి ర‌తి క్రీడ‌లో పాల్గొనేలా ప్రేరేపిస్తాయి.


 


7. వెన్ను వ‌ద్ద‌..వెన్నులో వ‌ణుకు పుట్టించ‌డం అనే సామెత మీకు గుర్తుండే ఉంటుంది. అయితే ఇదేమీ ఊరికే వ‌చ్చిన సామెత కాదు. మ‌న శ‌రీరంలో ఎన్నో న‌రాలు వెన్నుపాము ఉన్న ప్రాంతంలోనే ముగుస్తాయి. అందుకే ఆ ప్రాంతం కూడా చాలా సెన్సిటివ్ అని చెప్ప‌వ‌చ్చు. మ‌న‌ల్ని లైంగిక చ‌ర్య‌లో పాల్గొనేలా ప్రేరేపించే శ‌రీర భాగాల్లో ఇదీ ఒక‌టి.


 


8. న‌డుము వ‌ద్ద‌..న‌డుము వ‌ద్ద ఉండే ఒంపుని తాకాల‌ని పురుషులు ఆరాట‌ప‌డ‌డం స‌హ‌జం. అందుకే ఎక్కువ‌గా న‌డుమును తాకే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఈసారి మీ భాగ‌స్వామిని న‌డుము వ‌ద్ద తాక‌నిచ్చి ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఒక్క‌సారి చ‌విచూడండి.


 


9. మ‌ణిక‌ట్టు ప్రాంతంలో..చాలా సినిమాల్లో హీరోలు హీరోయిన్లు మ‌ణిక‌ట్టు ప్రాంతంలో ముద్దులు పెట్టుకోవడం మ‌నం చూస్తూనే ఉంటాం. సాధార‌ణంగా ఈ ప్రాంతంలో చ‌ర్మం చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. అందుకే దానికి ఏది త‌గిలినా వెంట‌నే ఆ స్ప‌ర్శ మ‌న‌కు తెలుస్తుంది. కాబ‌ట్టి ఇలాంటి ప్ర‌దేశంలో ముద్దు పెట్ట‌డం ద్వారా లైంగిక చ‌ర్య‌కు ప్రేరేపించ‌డం సుల‌భం అవుతుంది.


 


10. మోకాలి వెనుక భాగంలో..సాధార‌ణంగా ఈ భాగంలో స్పృశిస్తే లైంగిక చ‌ర్య‌లో పాల్గొనేలా అది మ‌న‌ల్ని ప్రేరేపిస్తుంద‌న్న విష‌యం చాలామందికి తెలీదు. అదే.. మోకాలి వెనుక భాగం. ఇది కూడా చాలా నరాలను ప్రభావితం చేసే  భాగం కాబట్టి.. చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. అందుకే ఈసారి ఈ భాగాన్ని కూడా మృదువుగా తాక‌మ‌ని మీ భాగ‌స్వామిని కోరండి.


 


Gif


Images: Giphy, Shutterstock, Tumblr


ఇవి కూడా చ‌ద‌వండి


మొద‌టిసారి సెక్స్‌కి సంబంధించి.. మీకున్న ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానాలివే..!


శృంగారం జరిపే సమయంలో మెద‌డులో ఎలాంటి ఆలోచ‌న‌లు వ‌స్తాయో తెలుసా..?


సెక్స్ అంటే ఏమిటి? తొలిరేయి అనుభవాలపై నెటిజన్లు చెప్పిన ఆసక్తికర విషయాలు