ADVERTISEMENT
home / Bollywood
‘జెర్సీ’ చిత్రంలో మనల్ని కన్నీళ్లు పెట్టించే.. టాప్ 6 సన్నివేశాలు ఇవే..!

‘జెర్సీ’ చిత్రంలో మనల్ని కన్నీళ్లు పెట్టించే.. టాప్ 6 సన్నివేశాలు ఇవే..!

న్యాచురల్ స్టార్ నాని (Nani) జెర్సీ (Jersey) చిత్రం ద్వారా నటుడిగా ఒక మెట్టు ఎక్కితే.. మన తెలుగు సినిమా స్థాయి మరో పది మెట్లు ఎక్కిందని చెప్పాలి. ఎందుకంటే సహజత్వానికి తెలుగు సినిమా దూరం. ఎప్పుడు ఫాంటసీకి, కమర్షియల్ హంగులకు కేర్ అఫ్ అడ్రస్‌గా తెలుగు చిత్రాలుంటాయి అని వచ్చే కామెంట్స్‌కి.. ఈ జెర్సీ ఒక స్ట్రెయిట్ డ్రైవ్ రూపంలో సరైన సమాధానం ఇచ్చింది.

ఇక ఈ చిత్రంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సన్నివేశాలున్నాయి. అందులో నుండి ఓ ఆరు (సిక్స్) సన్నివేశాల గురించి ఇక్కడ విపులంగా చెప్పుకుందాం. గమనిక – ఈ చిత్రం చూడనివారికి ఈ సన్నివేశాల విశ్లేషణ వల్ల “జెర్సీ” కథ ముందుగా తెలిసిపోయే అవకాశముంది.

 jersey-movie-trailer-version-1

1. “నీకు అవసరానికి మించి ఆశపడే కొడుకున్నా… సంపాదించే పెళ్ళాం లేదు” – అర్జున్‌తో సారా

ADVERTISEMENT

అర్జున్  (నాని) తన కొడుకుకి (రోనిత్ ఖమ్రా) ఇండియన్ క్రికెట్ టీం జెర్సీ కొనివ్వడానికి.. సరిపడా డబ్బులు లేక భార్య సారాని (శ్రద్ధ శ్రీనాధ్) అడిగితే ఆమె “నీకు అవసరానికి మించి ఆశపడే కొడుకున్నా… సంపాదించే పెళ్ళాం లేదు” అని ఘాటుగా సమాధానమిస్తుంది. ఆ సన్నివేశంలో ఇద్దరూ అత్యద్భుతంగా నటించారని చెప్పవచ్చు.

తన కొడుకు తనని కోరిన మొదటి కోరికని తీర్చలేకపోవడానికి తన అసక్తతే కారణమైనప్పుడు.. భార్యని సహాయం అడిగితే.. ఆమె చెప్పే సమాధానంతో మరింతగా కుంగిపోతాడు అర్జున్. అసలు తన కొడుకుకి జెర్సీ ఇవ్వడమే.. ఈ సినిమా స్టోరీ లైన్ కావడంతో.. అందుకోసం అర్జున్ ఏం చేశాడు అనేది ఈ చిత్రం మొత్తం మనకి కనిపించే ఆసక్తికరమైన అంశం. 

jersey-version-2

2. “నువ్వు నన్ను కొట్టావు అంటే ఎవరు నమ్మరు నాన్న” – అర్జున్‌తో నాని

ADVERTISEMENT

న్యూజిలాండ్‌తో హైదరాబాద్ క్రికెట్ క్లబ్ తరపున ఆడితే వచ్చే మ్యాచ్ ఫీజ్ రూ 1000/-తో.. తన కొడుకుకి ఇండియన్ క్రికెట్ టీం జెర్సీ కొనివచ్చు అనుకుంటాడు అర్జున్. అదే ఉద్దేశ్యంతో తనకి ఇష్టం లేకపోయినా ఆ మ్యాచ్ ఆడతాడు. ఆట ముగిశాక మ్యాచ్ ఫీజ్ సహా.. ఆ మ్యాచ్‌కి వచ్చిన డబ్బులన్ని చారిటీ ఫౌండేషన్‌కి వెళతాయి అని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన మరుక్షణం తన గురువు అని కూడా చూడకుండా మూర్తిని (సత్యరాజ్) తిడతాడు అర్జున్ (నాని).

ఆ సమయంలోనే ‘జెర్సీ’ కోసం తనను విసిగిస్తున్న కొడుకుని.. ఏమి చేయాలో తోచక చేయి చేసుకుంటాడు అర్జున్. అయితే చెంప పైన “ఆ దెబ్బ ఏంటి” అని అడిగిన తన తల్లికి మాత్రం అబద్దం చెబుతాడు అర్జున్ కొడుకు. అలా అబద్దం ఎందుకు చెప్పావు అంటే ” నువ్వు నన్ను కొట్టావు అంటే.. ఎవరు నమ్మరు నాన్న” అని తన సమాధానమిస్తాడు ఆ కుర్రాడు. తనకి దుఃఖాన్ని కొడుకుకి కనపడకుండా ముఖాన్నిపక్కకి తిప్పుకుని ఏడ్చే సన్నివేశం థియేటర్‌లో ప్రేక్షకుల చేత కూడా కంటతడిపెట్టిస్తుంది.

jersey-version-3

3. “నువ్వు ఇంతకుమించి దిగ జారవు అన్న ప్రతిసారి … యూ ప్రూవ్ మీ రాంగ్ (నా నమ్మకాన్ని తప్పు అని నిరూపిస్తున్నావ్)” – అర్జున్‌తో సారా

ADVERTISEMENT

జెర్సీ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం కావడంతో పాటు.. ఎక్కడా అప్పు కూడా దొరక్కపోవడంతో.. ఎలాగైనా తన కొడుకుకి ‘జెర్సీ’ కొనివ్వాలనే తపనతో సతమతమవుతాడు అర్జున్. ఈ క్రమంలో తన భార్య పర్సులో డబ్బులు ఉన్నాయో లేవో అని చూస్తాడు. అదే సమయానికి ఆ గదిలోకి వచ్చిన సారా.. తన భర్త చేతిలో డబ్బులను చూస్తుంది.  దాంతో ఒకేసారి కోపం, బాధ తన్నుకు వచ్చి “నువ్వు ఇంతకుమించి దిగజారవు అన్న ప్రతిసారి … యూ ప్రూవ్ మీ రాంగ్ (నా నమ్మకాన్ని తప్పు అని నిరూపిస్తున్నావ్)” అని అంటూ ఏడుస్తూ ..బీరువాలో ఉన్న మిగిలిన డబ్బు కూడా తీసి బయటపెడుతుంది. ” నీకు నచ్చినంత తీసుకో.. అసలు మనమున్న పరిస్థితి నీకేమైనా అర్థమైతుందా” అంటూ అర్జున్ పై చేయి కూడా చేసుకుంటుంది.

“నిన్ను తిట్టినా.. చివరికి కొట్టినా కూడా.. నీకన్నా ఎక్కువ నేనే బాధపడుతున్నా. అసలు దీనంతటికి కారణం నేనే అనిపించి రోజు రోజు కుమిలిపోతున్నా” అని ఆమె తన బాధని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ సన్నివేశంలో ఆ ఇద్దరి నటన మనల్ని కట్టిపడేస్తుంది. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబాల్లో ఉండే సన్నివేశాలని ఈ ఒక్క సన్నివేశంలో దర్శకుడు గౌతమ్ చాలా చక్కగా చిత్రీకరించాడు.

 jersey-movie-4

4. రైల్వే స్టేషన్‌లో తన ఆనందాన్ని.. “అరుపు” రూపంలో వ్యక్తపరిచే అర్జున్

ADVERTISEMENT

పదేళ్ళ క్రితం వదిలేసిన క్రికెట్‌ని మళ్ళీ ఆడడం ప్రారంభించాక.. దానికి తన చుట్టూ ఉన్న వారు ఎవరు సహకరించకపోయినా ఎంతో పట్టుదలతో ప్రయత్నిస్తాడు అర్జున్. అందుకు ప్రతిఫలంగా 10 ఏళ్ళ తరువాత.. 36 ఏళ్ళ వయసులో హైదరాబాద్ రంజీ క్రికెట్ టీంకి ఎంపిక అవుతాడు అర్జున్.

నోటిస్ బోర్డులో తన పేరుని చూసుకున్న తరువాత.. తనకి కలిగిన ఆ ఆనందాన్ని.. ఆ ఆనందంతో కూడిన ఉద్వేగాన్ని ఎలా చూపించాలో తెలీక.. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్‌కు వెళ్తాడు. అక్కడ ఖాళీగా ఉన్న ప్లాట్ ఫారమ్‌ వద్ద నిలబడి.. సరిగ్గా రైలు స్టేషన్ నుండి వెళుతున్న సమయంలో.. గట్టిగా అరిచి తనలోని ఆనందాన్ని, బాధను ఒకేసారి వ్యక్తపరుస్తాడు. 

తనలో ఉన్న ఎన్నో భావాలని ఇలా ఒక “అరుపు” రూపంలో దర్శకుడు మనకి చూపిస్తాడు. ఈ ఒక్క సన్నివేశంలో నాని చేసే అభినయం ఒక్కటి చాలు.. తనలో ఎంత గొప్ప నటుడో తెలియజేయడానికి. 

jersey-version-5

ADVERTISEMENT

5. “నువ్వు చెప్పు నాని.. క్రికెట్ ఆడాలా ? వద్దా?” అని కొడుకుని అర్జున్ అడుగుతాడు

భార్య తన వద్దకి వచ్చి తను, తన బిడ్డ కావాలో లేక క్రికెట్ కావాలో తేల్చుకో.. అని అడగగానే ఇంకేం మాట్లాడకుండా ఇంటికి వచ్చేస్తాడు అర్జున్. ఆ సమయంలో తన కొడుకుతో గదిలో ఉండగా “నాన్న.. మా క్లాస్‌లో ఏ ఒక్కరి డాడీ ఫోటో కూడా పేపర్ లో రాలేదు. నీదే వచ్చింది! అందుకనే సచిన్ పోస్టర్ మా ఫ్రెండ్‌కి ఇచ్చేసి నీ ఫోటోని పోస్టర్‌గా పెట్టుకున్నా” అని తన కొడుకు చెప్పే మాటలకి ఏం మాట్లాడాలో తెలియక అర్జున్ కుప్పకూలిపోతాడు.

అప్పుడు ఆ కుర్రాడు “నువ్వెందుకు క్రికెట్ ఆడటం మానేసావు నాన్న?” అని అడగగా .. అర్జున్ – “నువ్వు చెప్పు నాని.. క్రికెట్ ఆడాలా ? వద్దా?” అని కొడుకుని ప్రశ్నిస్తాడు. దానికి ఆ కుర్రాడు – ” క్రికెట్ ఆడు నాన్న.. నువ్వు ఆడుతుంటే హీరోలా ఉంటావు” అని అనగానే వెంటనే రంజీ ఫైనల్ మ్యాచ్‌కి ఆడేందుకు సిద్ధమైపోతాడు అర్జున్.

jersey-version-6

ADVERTISEMENT

6. “అందరు అనుకుంటున్నట్టు మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోలేదు! చనిపోతాను అని తెలిసి కూడా ప్రయత్నించాడు”.. – నాని తన తండ్రి గురించి ‘జెర్సీ’ లాంచ్‌లో …

చిత్రం చివరలో అర్జున్ రంజీ సీజన్‌లో చేసిన పరుగుల ఆధారంగా.. అతన్ని 1996 ఇంగ్లాండ్ టూర్‌లో భాగంగా..  భారత టెస్ట్ జట్టుకి ఎంపిక చేసారన్న విషయాన్ని ఓ బీసీసీఐ సభ్యుడు తెలియజేస్తాడు. అందుకు సంబంధించిన అధికారిక పత్రాన్ని కూడా సభికులకు చూపిస్తాడు. అలాగే అర్జున్ కథని “జెర్సీ” అనే పుస్తక రూపంలో చదివి తెలుసుకున్నాక.. తాను చేసిన కృషికి నివాళిగా.. “అర్జున్ 36” అనే ఇండియన్ క్రికెట్ టీం జెర్సీని.. అర్జున్ కొడుక్కి బీసీసీఐ (BCCI)  అందజేస్తుంది.

అప్పుడు అర్జున్ కొడుకు మాట్లాడుతూ – “మా నాన్న రంజీ ఫైనల్ మ్యాచ్ ఆడిన రెండు రోజుల తరువాత ఆసుపత్రిలో హార్ట్ ఫెయిల్యూరై చనిపోయారు. అయితే నాకు తెలిసిన నిజమేంటంటే – ఆయనకు గుండె సమస్య వల్ల ..శారీరకంగా ఎక్కువ శ్రమ చేస్తే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం తెలిసీ 26 ఏళ్ళ వయసులో నా కోసం,  అమ్మ కోసం క్రికెట్‌ని వదులుకున్నారు,

అయితే మళ్ళీ నేను క్రికెట్ ఆడమన్నానని “చనిపోతాను అని తెలిసి కూడా.. మా నాన్న ప్రయత్నించాడు”. అలాగే నేను “జెర్సీ” కావాలని 23 ఏళ్ళ క్రితం అడిగిన తరువాత.. ఆయన లేకపోయినా కూడా ఈ జెర్సీ నా దగ్గరికి వచ్చింది. అంటే మా నాన్న నాకు జెర్సీ ఇవ్వడం అనేది ఎంత పవిత్రంగా తన మనసులో అనుకున్నారో నాకు ఇప్పుడు అర్ధమవుతున్నది ..” అంటూ తన తల్లికి ఆ జెర్సీ ఇస్తాడు.

ADVERTISEMENT

ఈ ఆరు సన్నివేశాలు “జెర్సీ” చిత్రంలోని ఆరు విభిన్నమైన కోణాలు కలిగినవి. అయినప్పటికి ఈ ఆరు సన్నివేశాల్లోనూ.. మనకి “కొడుకు అడిగిన “జెర్సీ” ఇచ్చేందుకు తండ్రి పడే తపనే కనిపిస్తుంటుంది”. ఇంతటి గొప్ప చిత్రాన్ని మనకి అందించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి (Gowtham Tinnanuri)  తెలుగు సినిమా ప్రేక్షకుల తరపున.. మా తరపున కృతజ్ఞతాభివందనాలు.

ఇవి కూడా చదవండి

‘జెర్సీ’ తో నానీ సిక్స్ (సక్సెస్) కొట్టాడా లేదా? – మూవీ రివ్యూ

సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ చిత్రం ద్వారా.. యువతకి కనెక్ట్ అయ్యే 7 అంశాలు ఇవే..!

ADVERTISEMENT

అల్లు అర్జున్ – త్రివిక్రమ్‌ల AA19 చిత్రం.. హాలీవుడ్ ఫ్రీ-మేకా?

 

22 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT