అల్లు అర్జున్ - త్రివిక్రమ్‌ల AA19 చిత్రం.. హాలీవుడ్ ఫ్రీ-మేకా?

అల్లు అర్జున్ - త్రివిక్రమ్‌ల  AA19 చిత్రం.. హాలీవుడ్ ఫ్రీ-మేకా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. దాదాపు ఏడాది కాలం పాటు వచ్చిన గ్యాప్ తర్వాత ఒకేసారి తన తదుపరి మూడు చిత్రాలు ప్రకటించి అభిమానులకు తీపి కబురు అందించాడు. అయితే వాటిలో ముందుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో (Trivikram ) కలిసి పని చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా ఈ మధ్యే జరగడం విశేషం. అంతేకాదు.. ఈ నెల (ఏప్రిల్) 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.


ఈ క్రమంలోనే #AA19కి సంబంధించిన కొన్ని వార్తలు చిత్రసీమలో హల్చల్ చేస్తున్నాయి. సీనియర్ నటి టబు (Tabu) చాలా ఏళ్ల తర్వాత తిరిగి తెలుగులో నటించనుందన్న వార్త కూడా వాటిలో ఒకటి. ఇందులో ఆమె అల్లు అర్జున్‌కి అత్త పాత్రలో కనిపించనున్నారట.


అంతేకాదు.. కీలకమైన పాత్రలో ప్రముఖ నటుడు సత్యరాజ్ కూడా నటించనున్నారని వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర కథానాయికగా పూజా హెగ్డే ఖరారు కాగా ఈ సినిమా ప్రధాన తారాగణానికి సంబంధించి వినిపిస్తోన్న మిగతా వార్తల విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గతంలో దువ్వాడ జగన్నాధం చిత్రంలో బన్నీ, పూజా కలిసి నటించిన సంగతి తెలిసిందే.


అలాగే ఈ సినిమా టైటిల్‌కి సంబంధించి కూడా ఓ వార్త ప్రధానంగా వినిపిస్తోంది. త్రివిక్రమ్ చివరిగా అరవింద సమేత వీర రాఘవ (Aravinda Sametha Veera Raghava) అనే టైటిల్‌తో హిట్ కొట్టిన నేపథ్యంలో.. మరోసారి అదే తరహాలో టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న #AA19 చిత్రానికి అలకనంద (Alakananda) అనే విభిన్నమైన టైటిల్ పెట్టాలని యోచిస్తున్నారట..


 
 

 

 


View this post on Instagram


A post shared by Trivikram Srinivas (@trivikramcelluloid) on
అంతేకాదు.. హాలీవుడ్ చిత్రం నుంచి స్ఫూర్తి పొందిన ఓ కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారనే వార్తలు కూడా చిత్రసీమలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే త్రివిక్రమ్ గతంలో తెరకెక్కించిన అజ్ఞాతవాసి (Agnyathavaasi) చిత్రం కూడా ఒక ఫ్రెంచ్ సినిమాకు రీమేక్ అని వార్తలు వచ్చాయి. అదే సమయంలో అజ్ఞాతవాసి సినిమా తన చిత్రాన్ని పోలి ఉందని.. ఆ ఫ్రెంచి చిత్రం దర్శకుడు జెరోమ్ సాలే స్వయంగా స్టేట్ మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా నిర్మించే చిత్రంపై కూడా ఇదే తరహా వార్తలు వినిపిస్తుండడంతో అభిమానులు ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎన్నో వార్తలు వస్తున్నా.. దర్శక- నిర్మాతలు లేదా చిత్ర యూనిట్ ఏ విధంగానూ స్పందించలేదు. అలాగని వీటిని ఖండించిందీ లేదు. ఈ క్రమంలో నిజానిజాలు తెలుసుకోవాలన్న ఆసక్తి, కుతూహలం ఇటు అభిమానుల్లోను, సగటు ప్రేక్షకుల్లోనూ బాగా పెరిగిపోతోంది. 


మరోవైపు ఈ సినిమా సంగీతానికి సంబంధించి సిట్టింగ్స్ ఇప్పటికై చెన్నైలో ప్రారంభమైపోయాయని, తమన్ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సిట్టింగ్స్‌లో త్రివిక్రమ్ సహా సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి.


 
 

 

 


View this post on Instagram


A post shared by Trivikram Srinivas (@trivikramcelluloid) on
మొత్తానికి ఈ చిత్ర షూటింగ్‌కి ముందే వార్తలు రావడంతో.. విడుదలకి చాలా నెలల ముందే చిత్రం అందరి దృష్టిని ఆకర్షించగలిగింది.


ఇక హారిక హాసిని క్రియేషన్స్ (Haarika Haasine Creations) సంస్థ, అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడవ చిత్రం కావడంతో నిర్మాణ విలువల పరంగా కూడా ఈ చిత్రం పెద్ద రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు.


మరి చూడాలి... టబు వంటి గొప్ప నటి, త్రివిక్రమ్ వంటి మేటి దర్శకుడు, అల్లు అర్జున్ వంటి కష్టపడే నటుడు, అందం-అభినయం కలగలిసిన పూజ హెగ్డే కలయికలో రానున్న ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో.


ఇవి కూడా చదవండి


అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో.. మరో కొత్త చిత్రం..!


అల్లు అర్జున్ సినిమాలో.. ఛాన్స్ కొట్టేసిన 'గీత గోవిందం' హీరోయిన్..!


ఒరు అదార్ ల‌వ్ తెలుగు ఆడియో విడుద‌ల‌కు.. ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్..!