#ToMaaWithLove అమ్మంటే ఎందుకు ఇష్టం? అమ్మంటే ఎందుకు కోపం? (ఈ 30 విషయాలు చదివేయండి)

#ToMaaWithLove అమ్మంటే ఎందుకు ఇష్టం? అమ్మంటే ఎందుకు కోపం? (ఈ 30 విషయాలు చదివేయండి)

అమ్మంటే అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ తనంటే ఇష్టమే. తనేం చేసినా మన క్షేమం కోరే చేస్తుంది. మనకేం కాకూడదని చాలా జాగ్రత్తలు తీసుకొంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం మనకు తన పట్ల చాలా కోపం వచ్చేస్తుంటుంది. అదేంటి.. అమ్మ (mother) ఇలా చేస్తుందని మనకు అనిపిస్తుంది.


మరికొన్నిసార్లు అమ్మ (mom) కాబట్టే.. మనకోసం ఇంత త్యాగం చేస్తుందనుకొంటాం. సాధారణంగా అమ్మ కొడుకు పక్షాన మాట్లాడుతున్నట్టు కనిపించినా.. కూతురి కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. అమ్మాయికి సంబంధించిన ప్రతి విషయంలోనూ, అమ్మ ఏదో ఒక రూపంలో తన తోడ్పాటును అందిస్తుంది. అయినా తనలో మనకు నచ్చిన, నచ్చని అంశాలు ఎన్నో ఉంటాయి. వాటిలో మచ్చుకు కొన్ని మీకోసం..


అమ్మలో నాకు నచ్చే పది విషయాలు


1. తను నా అమ్మ. మా అమ్మ అందరి కంటే స్పెషల్. 


i-love-you-mom-4


2. నేను ఇప్పుడు ఒకరికి భార్యను. ఓ బిడ్డకు తల్లిని. అయినా ఇప్పటికీ నన్ను "పిల్లా" అని పిలుస్తుంది. చిన్న పిల్లలానే చూస్తుంది.


3. నా కంటే ఎక్కువ ప్రేమగా నా బిడ్డను సాకుతోంది. నా వృత్తిప‌ర‌మైన జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తోంది.


4. నేను బాధపడుతుంటే తను చూడలేదు. నన్ను ఓదార్చి సముదాయిస్తుంది.


i-love-you-mom


5. ఇది చదువు.. ఆ ఉద్యోగం చెయ్యి అని ఎప్పుడూ చెప్పలేదు. కెరీర్ విషయంలో నా నిర్ణయానికే ప్రాధాన్యమిచ్చింది.


6. మా అమ్మ వంట చాలా బాగా చేస్తుంది. రోజూ అమ్మ చేతి వంట తినడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను.


7. చక్కగా టీవీ చూస్తూ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తుంది.


i-love-you-mom-3


8. మా అమ్మకి మంచి టేస్ట్ ఉంది. తను సెలెక్ట్ చేసింది.. ఏదైనా సరే చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది.


9. నొప్పించకుండా ఎలా ఒప్పించాలో అమ్మకి తెలుసు.(ఎందుకో నాకు ఈ లక్షణం అలవడలేదు).


10. నాకు అవసరమైనప్పుడు ఉపయోగపడే సలహాలిస్తుంది.


i-love-you-mom-2


అమ్మలో నాకు నచ్చని పది విషయాలు:


1. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తక్కువ. ఆరోగ్యం బాగా లేకపోయినా.. బాగానే ఉన్నానని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.


2. కాసేపు కూడా విశ్రాంతి తీసుకోదు. రోజంతా ఏదో పని చేస్తూనే ఉంటుంది.


3. తన పట్ల కనీస శ్రద్ధ వహించదు. ఎప్పుడూ ఇంట్లో వాళ్ల గురించే ఆలోచిస్తుంది.


4. బయటకు వెళ్లినప్పుడు కాస్త ఆలస్యమైనా చాలు.. ఇంకా రాలేదేంటని ఫోన్ చేస్తుంది.


i-hate-you-mom


5. ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతున్నా.. ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తున్నా.. ఎప్పుడూ ఫోన్ తో ఆటలేంటి? అని తిడుతుంది.


6. ఏది కొనిస్తానన్నా వద్దంటుంది. ఇప్పుడు నాకు వాటితో అవసరం లేదంటుంది.


7. ఒంట్లో బాగా లేనప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడదు. అదే తగ్గిపోతుందిలే అంటుంది.


i-hate-you-mom-2


9. ఎంత తిన్నా‘సరిగ్గా తినట్లేదు. ఇంకేం సత్తువ ఉంటుంది’ అని తిడుతుంది.


10. కొన్ని విషయాల్లో చాదస్తం పాళ్లు కాస్త ఎక్కువ.


అమ్మ విషయంలో నాకు చిరాకు తెప్పించే పది విషయాలు:


1. నేను ప్యాంట్ వేసుకొంటే తనకి అంతగా నచ్చదు. అబ్బాయిలా.. అ బట్టలేంటి? అంటుంది.


mom-frustated


2. పొద్దున్న లేచింది మొదలు "తల దువ్వుకో.. స్నానం చేయి" అని సతాయిస్తుంది.


3. ఏదైనా కొంటుంటే.. "డబ్బులు చెట్లకు కాస్తున్నాయా" అని వెటకారమాడుతుంది.


4. సీరియస్‌గా పనిచేసుకొంటున్నప్పుడు వచ్చి ‘ఎంతసేపు ఆ కంప్యూటర్ ముందు కూర్చోకపోతే.. లేచి అటూ ఇటూ తిరగొచ్చు కదా..’ అన్నప్పుడు చిరాకు వస్తుంది చూశారూ..


5. ఏ విషయం గురించైనా చెబుతున్నప్పుడు మధ్యలో వంద ప్రశ్నలేస్తుంది. అది అస్సలు నచ్చదు. చెప్పింది వినొచ్చు కదా?


mom-frustated-2


6. తలస్నానం చేసినప్పుడు నల్ల బట్టలు వేసుకొన్నా.. కాళ్లకు పసుపు రాసుకోకపోయినా.. పీకే చిన్నపాటి క్లాస్‌కి నాకైతే చాలా కోపం వస్తుంది.


7.  పీరియడ్స్ టైంలో "అది ముట్టుకోకు.. దీన్ని తాకకు.. దూరంగా ఉండు." అంటే ఎక్కడలేని కోపం వస్తుంది.


mom-frustated-4


8. నా చేతిలో ఫోన్ ఎక్కువ సేపు ఉంటే ఊరుకోదు కానీ.. తను మాత్రం గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుంది.


9. పక్కవాళ్లను చూసి నేర్చుకోమన్నప్పుడు వచ్చే కోపం తారస్థాయికి వెళ్లిపోతుంది.


mom-frustated-3


10. బయటకు వెళుతున్నప్పుడు వెళ్లిన "పనిచూసుకొని త్వరగా రా" అని చెప్పినప్పుడు కూడా చాలా కోపం వస్తుంది.


GIFs: Giphy


ఇవి కూడా చదవండి:


కూతురిపై ప్రేమ‌తో.. అమ్మ ఎక్కువ‌గా అడిగే ప్ర‌శ్న‌లు, ఇచ్చే సూచ‌న‌లు ఇవే..!


అమ్మ కోసం ఎన్ని వేల సంతకాలో..! మాతృదినోత్స‌వ కానుకగా గిన్నిస్ రికార్డ్..!


సమాజం గొడ్రాలు అని ఏడిపిస్తే.. మొక్కలు ఆమెను వృక్షమాతను చేశాయి..!