బెటర్ మూడ్ అందించే సూపర్ ఫుడ్స్.. వీటిని రోజూ తినాల్సిందే..

బెటర్ మూడ్ అందించే సూపర్ ఫుడ్స్.. వీటిని రోజూ తినాల్సిందే..

వ్యక్తిగతంగానూ, వృత్తిప‌రంగానూ నిర్వహించాల్సిన బాధ్యతల ప్రభావం వల్ల కొన్నిసార్లు.. కాదు కాదు చాలా సార్లు మన మూడ్ (mood) ఉన్నట్టుండి మారిపోతుంది. క్రమంగా అది డిప్రెషన్‌కు దారి తీస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం బూస్టప్ చేసుకొంటూ ఉండాలి. అప్పుడే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. 


అలా మన మానసిక స్థితి సాధారణ స్థితికి చేరుకోవాలంటే కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ (super food) తినాల్సి ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి మన మూడ్‌కు బూస్టప్ ఇచ్చి ఉత్సాహంగా మార్చేస్తాయి. ఈ క్రమంలో మనం కూడా అసలు ఏ రకమైన ఆహారం తింటే.. మన మూడ్‌బెటర్‌గా మారుతుంది? వాటిని ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలి? మొదలైన విషయాలను తెలుసుకుందాం.


1. ఓట్ మీల్


2-mood-boosting-foods


సాధారణంగా బరువు తగ్గాలనుకొనేవారు, ఆరోగ్యంపై శ్రద్ద కాస్త ఎక్కువగా ఉన్నవారు రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా ఓట్ మీల్ తింటారు. శారీరక ఆరోగ్యం విషయంలోనే కాదు.. మానసిక ఆరోగ్యం విషయంలోనూ ఇది మనకు మేలు చేస్తుంది. దీనిలో ఉన్న మెగ్నీషియం మూడ్ బూస్టర్‌గా పనిచేసి డిప్రెషన్, ఒత్తిడి ప్రభావం మనపై పడకుండా చేస్తుంది.


ఓట్ మీల్ ద్వారా పుష్కలంగా లభించే పీచుపదార్థం మూడ్ స్వింగ్స్‌ను తగ్గిస్తుందట. కాబట్టి ఇకపై రోజూ అల్పాహారంలో ఓట్స్‌ను భాగంగా చేసుకోండి. ఓట్స్‌ను నేరుగా తినడం ఇష్టం లేని వారు వాటిని దోశలు, ఇడ్లీల మాదిరిగా తయారుచేసుకొని తినవచ్చు.


2. డార్క్ చాక్లెట్


1-mood-boosting-foods


చాక్లెట్ ఇష్టపడని అమ్మాయిలు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఇది తిన్నప్పుడల్లా మనకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్‌ను తగ్గిస్తాయట. ఫలితంగా ఒత్తిడి స్థాయులు తగ్గుముఖం పడతాయి. ఈ విషయం కొన్ని పరిశోధనల్లో సైతం వెల్లడైంది. కాబట్టి రోజూ చాక్లెట్ హాయిగా తినొచ్చు. అలాగని చాక్లెట్ మొత్తం తినేయద్దు. కొన్ని బైట్స్ మాత్రం తింటే సరిపోతుంది.


3. అరటిపండు


3-mood-boosting-foods


అరటి పండులో Tryptophan అనే అమైనో యాసిడ్ ఉంటుంది. అలాగే విటమిన్ ఎ, బి6, విటమిన్ సి, పీచుపదార్థం, పొటాషియం, పాస్ఫరస్, ఐరన్, కార్బోహైడ్రేట్ ఉంటాయి. అరటిపండులో ఉండే విటమిన్ బి6.. tryptophanను మూడ్ లిఫ్టింగ్ హార్మోన్‌గా మారుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కాస్త మూడ్ బాలేదనిపిస్తే ఓ అరటి పండు తినండి సరిపోతుంది. అలాగే ప్రతి రోజూ ఉదయం వేళల్లో మధ్యస్థ పరిమాణంలో ఉన్న అరటి పండు తినడం లేదా ఓట్ మీల్లో అరటిపండు స్లైసెస్ వేసుకొని తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండవచ్చు.


4. గింజలు


5-mood-boosting-foods


బాదం, జీడిపప్పు, వాల్ నట్స్‌లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు డిప్రెషన్ సైతం తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. రోజూ దాదాపు 25 గ్రా.ల వరకు ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. బాదం, వాల్నట్ పప్పులను నానబెట్టి తినడం మరచిపోవద్దు.


5. బెర్రీస్


4-mood-boosting-foods


పండ్లు ఎంత ఎక్కువగా తింటే డిప్రెషన్ వచ్చే అవకాశాలు అంత తక్కువగా ఉంటాయి. అందులోనూ బెర్రీస్‌కి మూడ్ బూస్టింగ్ ఫ్రూట్స్‌గా మంచి పేరుంది. వీటిలో అధికంగా ఉండే విటమిన్లు, మినరల్స్, మైక్రో న్యూట్రియెంట్స్ ఒత్తిడిని తగ్గించి మనల్ని ఉత్సాహంగా మారుస్తాయి.


6. కూరగాయలు


ఆహారంలో భాగంగా తాజా కూరగాయలు, ఆకుకూరలను ఎక్కువగా తింటూ ఉండాలి. వీటిలో ఉండే పీచుపదార్థం, విటమిన్లు, మినరల్స్ ఒత్తిడిని తగ్గిస్తాయి. అందుకే రోజూ ఆహారంలో రెండు నుంచి మూడు కప్పుల కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం మంచిది.


వీటితో పాటు చేపలు, చికెన్, పెరుగు, కాఫీ, అంజీర్.. మొదలైనవి కూడా మూడ్‌ను లిఫ్ట్ చేసి మనల్ని ఉత్సాహంగా మార్చేస్తాయి. కాబట్టి రోజూ వీటిని మీ ఆహారంలో భాగంగా చేసుకొని ఉత్సాహంగా ఉండండి.


Featured Image: Shutterstock


Running Images: Pixabay


ఇవి కూడా చదవండి:


డిప్రెషన్ మిమ్మల్ని కుంగదీస్తోందా? దాని పని ఇలా పట్టండి


ఏడు రోజుల్లోనే అధిక బరువు తగ్గించే.. అద్భుతమైన డైట్ ప్లాన్ ఇది..!


మీరు పెట్ పేరెంటా? ఈ పెట్ ఫ్రెండ్లీ మొక్కలతో ఇంట్లో పచ్చదనాన్ని నింపేయండి