మీ రాశిఫలాలు వీక్షించండి.. మీ సమస్యలను పరిష్కరించుకోండి..!

మీ రాశిఫలాలు వీక్షించండి.. మీ సమస్యలను పరిష్కరించుకోండి..!

ఈ రోజు (మే 19) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) –  ఈ రోజు మీరు చేసే లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే ఆయా లావాదేవీలు చేసేముందు.. కాస్త సంయమనం పాటించండి. నియ‌మ‌, నిబంధ‌న‌లను బాగా చ‌దువుకోండి. లేకపోతే పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది. అలాగే అవసరమైతే.. ఇలాంటి విషయాల్లో మీ కుటుంబీకుల సలహాలు కూడా తీసుకుంటే మంచిది.వృషభం (Tarus) –  ఈ రోజు మీరు గెలుపు కోసం ఆరాటపడతారు. అయితే ఇదే క్రమంలో మీ ప్రవర్తన.. కొన్ని వివాదాలకు కూడా కారణం కావచ్చు. ముఖ్యంగా స్నేహితులు, కొలీగ్స్ నుండి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక కొన్ని విషయాల్లో నిజాయతీగా వ్యవహరించడం మంచిది.


మిథునం (Gemini) –  ఈ రోజు మీరు పనిలో కాస్త కొత్తదనాన్ని చూపించాలని భావిస్తారు. ఈ క్రమంలో మీ కొలీగ్స్ సహాయం కూడా తీసుకుంటారు. అలాగే మీ కెరీర్‌కు పనికొచ్చే విధంగా.. మీ పనులు జరుగుతాయి. అయితే అత్యుత్సాహం మంచిది కాదనే విషయం కూడా మీరు నమ్మాలి. చేసే పనిని సమర్థంగా చేసేందుకు ప్రయత్నించాలి. అహంకారాన్ని వీడాలి. 


కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనుక ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్లడం మంచిది. ఇక మీరు ఈ రోజు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నట్లయితే.. సబ్జెక్టు నాలెడ్జి పెంచుకొని వెళ్లడం బెటర్. మీరు మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోనంత వరకూ.. అన్నీ మీకు అనుకూలంగానే జరుగుతాయి. సింహం (Leo) – ఈ రోజు మీ జీవితాన్ని ప్రభావితం చేసే సంఘటనలు జరుగుతాయి. అయినప్పటికీ మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా.. నిజాయతీగా మీ పనులు మీరు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా స్నేహితులు, బంధువులతో మీ మనసులోని ఆలోచనలను పంచుకోండి. మీ కుటుంబానికి సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించండి. క‌న్య (Virgo) – గ‌త కొద్ది రోజులుగా మిమ్మ‌ల్ని ఒక జ్ఞాప‌కం వేధిస్తోంది. బ‌హుశా.. మీకు ఉన్న స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్ట‌క‌పోవ‌డం కూడా ఇందుకు ఒక కార‌ణం కావ‌చ్చు. కాబ‌ట్టి ముందు స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టండి. అన్నీ స‌ర్దుకుంటాయి. ఈ రోజు మీరు మీ సమస్యలకు సంబంధించి పరిష్కారం కోసం.. ఓ ఊహించని నిర్ణయం తీసుకుంటారు. 


తుల (Libra) – ఈ రోజు మీరు మీకు ఉన్న అవ‌స‌రాల కంటే ఇత‌రుల‌కు ఉన్న అవ‌స‌రాల‌ను తీర్చేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. కానీ ప్ర‌స్తుతం మీపై మీరు దృష్టి పెట్ట‌డం చాలా అవ‌స‌రం. అలాగే మీ కుటుంబం కోసం కూడా సమయాన్ని కేటాయించండి.వృశ్చికం (Scorpio) –  గ‌త కొద్ది రోజులుగా మీరు ఊహించని సమస్యలతో స‌త‌మ‌త‌మైపోతున్నారు. కానీ ఒక్క‌సారి మీ మ‌న‌సును ప్ర‌శాంతంగా ఉంచుకొని ఆలోచించండి. ఏం చేయాలి? అనే విష‌యం మీకే అర్థ‌మ‌వుతుంది. ముఖ్యంగా ఆఫీసు విషయాల్లో లేదా బిజినెస్ విషయాల్లో వివాదాలకు దూరంగా ఉండండి.ధనుస్సు (Saggitarius) – మీ చుట్టూ జరుగుతున్న విషయాలు మిమ్మల్ని భయోత్పాతానికి గురి చేస్తున్నట్లు ఉండచ్చు. ఇలాంటి సమయంలోనే మానసికంగా ధైర్యంగా ఉండడం అవసరం. మీరు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నిజాయతీగా మీ సమస్యలను ఎదుర్కోండి. 


మకరం (Capricorn) – మీ కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు మీరు సిద్ధంగా లేరు. కానీ ఒక్క‌సారి మీపై మీరు విశ్వాసం ఉంచి ప్ర‌య‌త్నించి చూడండి. మీరే ఆశ్చ‌ర్య‌పోతారు. మ‌ళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు.కుంభం (Aquarius) – మీ చుట్టూ ఉన్న‌వారిలో కొంద‌రు మిమ్మ‌ల్ని ఇరాక‌ట ప‌రిస్థితుల్లో ప‌డేయాల‌ని భావిస్తున్నారు. కానీ మీపై మీరు న‌మ్మ‌కం ఉంచితే దీని నుంచి మీరు సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌చ్చు.


మీనం (Pisces) – ప్ర‌స్తుత పరిస్థితుల నుంచి మీరు త‌క్ష‌ణం బ‌య‌ట‌ప‌డ‌డం కాస్త క‌ష్ట‌మే. కానీ స‌మ‌స్య నుంచి దూరంగా ఉంటూ కాస్త ప్ర‌శాంతంగా ఆలోచిస్తే ప‌రిష్కారం త‌ప్ప‌క ల‌భిస్తుంది. మీపై మీరు న‌మ్మ‌కం ఉంచండి.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ


కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !


ఇవి కూడా చదవండి


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా


ధనురాశి అమ్మాయిల ప్రత్యేకతలు ఏమిటో ఆంగ్లంలో చదివేయండి


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?