మీ రాశిఫలాలు వీక్షించండి.. మీ గమ్యాలను నిర్దేశించుకోండి..!

మీ రాశిఫలాలు వీక్షించండి.. మీ గమ్యాలను నిర్దేశించుకోండి..!

ఈ రోజు (మే 17) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) – మీ ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో పెట్టేందుకు ఇదే స‌రైన స‌మ‌యం. అందుకోసం మీరు ఏవైనా ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించండి. అలాగే డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నించండి. మీ జీతంలో నుండి కొత్త మొత్తాన్ని సేవ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే పలు వివాదాలకు దూరంగా ఉండండి. మీ ఆఫీసులో మీరు పడుతున్న కష్టానికి  ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది.వృషభం (Tarus) – మీ ఆరోగ్యం బాగుండాలంటే ప్రతీ రోజూ డైట్  పై శ్రద్ధ  చూపించండి.. అలాగే క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం కూడా చేయండి. వీలైతే జిమ్ లేదా ఏదైనా ఫిట్‌నెస్ సెంటర్‌లో చేరండి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మిథునం (Gemini) – ఈ రోజు మీ భాగ‌స్వామికి మీరు బాగా చేరువ‌వుతారు. మీ ఇద్ద‌రూ క‌లిసి మీ భ‌విష్య‌త్తు గురించి క‌ల‌లు క‌న‌డం ప్రారంభిస్తారు. కనుక సాధ్యమైనంత వరకూ మీ భాగస్వామి పట్ల ప్రేమను కురిపించడం ప్రారంభించండి. మీ రెగ్యులర్ జీవితానికి కొన్నాళ్లు స్వస్తి పలికి లేదా ఆఫీసుకు సెలవు పెట్టి.. మీ జీవిత భాగస్వామితో కలిసి ఏవైనా ప్రాంతాలను సందర్శించండి. 
 


కర్కాటకం (Cancer) – ప్రేమ కోసం ప‌రిత‌పించేవారు ఒక్క‌సారి బ‌య‌ట‌కు వెళ్లి.. మీ చుట్టూ ఉన్న వారిని గ‌మ‌నించండి. ఈ క్ర‌మంలో ప్రేమ దేవ‌త దృష్టి మీపై ప‌డ‌చ్చు. మీ మనసులో ఎవరైనా ఉంటే.. వారికి మీ ప్రేమ గురించి తెలియజేయడానికి ఇదే సరైన సమయం.సింహం (Leo) – ప‌ని ప్ర‌దేశంలో వాతావ‌ర‌ణం ఇప్పుడిప్పుడే మెరుగ‌వుతోంది. మీ టీంతో క‌లిసి ప‌ని చేయ‌డానికి మీరు మ‌రింత పాజిటివ్‌గా, ఆత్మ‌విశ్వాసంతో ముందుకెళ్తారు. ఈ క్రమంలో మీకు ఎదురయ్యే లక్ష్యాలను కూడా మీరు ఛేదించాల్సి ఉంటుంది. మీరు పడిన శ్రమకు గుర్తింపు మీకు కచ్చితంగా దొరుకుతుంది. క‌న్య (Virgo) – మీ భాగ‌స్వామిని మీరు నిజంగానే ప్రేమిస్తున్నారా?? అయితే వారికి విధించిన ఆంక్ష‌ల‌ను స‌డ‌లించండి. స్వేచ్ఛను ఇవ్వండి. అదే నిజ‌మైన ప్రేమ అనే విషయాన్ని తెలుసుకోండి. మీ సంసారం సజావుగా సాగాలంటే.. భాగస్వామిని ప్రేమించడం కూడా ముఖ్యమే అని తెలుసుకోండి. అలాగే మీ ఆఫీసులో ఎదుర్కొనే సమస్యల ప్రభావం.. మీ కుటుంబం పై పడకుండా చూడండి. తుల (Libra) – మీరు మీ భాగ‌స్వామితో నిజంగానే ప్రేమలో ఉన్నారా? లేదా నామమాత్రంగానే వారితో క‌లిసి జీవిస్తున్నారా? ఒక్క‌సారి మిమ్మ‌ల్ని మీరు ప్ర‌శ్నించుకోండి. ప్రేమైక బంధానికి పెద్దపీట వేయండి. ధనము, ఉద్యోగం మాత్రమే జీవితం కాదు.. అనుబంధం, ఆప్యాయతలే అసలైన ఆనందాన్ని పంచుతాయన్న విషయాన్ని తెలుసుకోండి. వృశ్చికం (Scorpio) – మీ ఆఫీసు ప‌నిలో మీరు ఎవ‌రి స‌హాయం ఆశించ‌కండి. మీ ప‌ని మీరే క‌ష్ట‌ప‌డి పూర్తి చేయండి. అప్పుడే మీరు పొందే ఫలితం తాలూకు ఆనందాన్ని మీరు స్వేచ్ఛగా అనుభవించగలుగుతారు. మీ కష్టానికి ఇంకెవరికో క్రెడిట్ ఇవ్వడం మంచిది కాదనే విషయాన్ని నమ్మండి.ధనుస్సు (Saggitarius) – మిమ్మ‌ల్ని అమితంగా ప్రేమించే భాగ‌స్వామి లేదా స్నేహితులు మిమ్మల్ని ఈ రోజు క‌లుస్తారు. మీ కోసం వారు ఏమైనా చేస్తారు. ఈ క్రమంలో మీ జీవితంలో గతంలో జరిగిన సంఘటనల ప్రస్తావన రావచ్చు. ఆ ప్రస్తావన కొన్ని వివాదాలకు దారి తీయవచ్చు. అందుకే కొన్ని విషయాలలో కాస్త మనో నిబ్బరాన్ని పాటించండి. అనవసరంగా కోపతాపాలకు లోనై.. మంచి స్నేహాన్ని పాడుచేసుకోవద్దు. మకరం (Capricorn) – ఈ రోజు ప‌ని ప్ర‌దేశంలో మీ సీనియ‌ర్స్ గురించి ఎవ‌రితోనూ మాట్లాడ‌వ‌ద్దు. ఒక‌వేళ మాట్లాడాల్సి వ‌స్తే ఎంత త‌క్కువ‌గా మాట్లాడితే అంత మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు వివాదాలను ప్రేరేపించే అంశాల నుండి మాట్లాడకపోవడం మంచిది. కుంభం (Aquarius) – సంతోషం అనేది మ‌న‌లోనే ఉంటుంది. ఈరోజు.. ఈ క్ష‌ణం.. అది మీలోనే ఉంది. దాని కోసం మీరు దేని వెనుకా వెంప‌ర్లాడాల్సిన అవ‌స‌రం లేదు. ముఖ్యంగా సంతోషం కోసం అనైతికమైన పనులు చేయాల్సిన అవసరం లేదని నమ్మండి. మీ నమ్మకమే మీకు స్నేహితుడనే విషయంతో ఏకీభవించండి. మీనం (Pisces) – ఈ రోజు మీకు ప్ర‌యాణ స‌మ‌యం. ఈ క్రమంలో మీకు నచ్చే ప్ర‌తి ప‌నినీ సంతోషంగా చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల వద్ద..  కన్నీళ్లు పెట్టించే విషయాలను ప్రస్తావించవద్దు. మీ ఆఫీసు పనుల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరగుతాయి. వాటి ప్రభావం మీ కుటుంబంపై పడకుండా ఉంటే మేలు. వ్యాపారవేత్తలకు ఈ రోజు తమ జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. 


Credit: Asha Shah


ఇవి కూడా చదవండి


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా


ధనురాశి అమ్మాయిల ప్రత్యేకతలు ఏమిటో ఆంగ్లంలో చదివేయండి


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?