మీ రాశిఫలాలు వీక్షించండి.. మీ జీవిత సమస్యలకు పరిష్కారాలను పొందండి

మీ రాశిఫలాలు వీక్షించండి.. మీ జీవిత సమస్యలకు పరిష్కారాలను పొందండి

ఈ రోజు (మే 19) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) –  ఈ రోజు మీరు స్నేహితులతో ఎక్కువ సేపు గడుపుతారు. వారితో నచ్చిన ఆటలు ఆడుతూ, లాంగ్ డ్రైవ్‌కి వెళ్తూ లేదా డిన్నర్ చేస్తూ సరదాగా గడుపుతారు. అయితే ఇదే సమయంలో మీ మధ్య కొన్ని వివాదాస్పద విషయాలు కూడా చర్చకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మీరు వివేకంతో వ్యవహరించి.. పరిస్థితిని గంభీరంగా మార్చకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. 


వృషభం (Tarus) –  ఈ రోజు మీరు స్వేచ్ఛగా, హాయిగా కాలం గడుపుతారు. మీకంటూ ఉన్న స్పేస్‌లో ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అయితే.. మీ దూరపు బంధువులు కొందరు మిమ్మల్ని చూడడానికి  రావచ్చు. అంతేకాదు.. వారు ఓ సమస్య గురించి మీతో చర్చించడం ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారు.


మిథునం (Gemini) –  ఈ రోజు మీరు ఆధ్యాత్మిక చింతనతో.. నిర్మలమైన చిత్తంతో కొంతసేపు గడపాలని భావిస్తారు. అలాగే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఇదే క్రమంలో మీ సమస్యలకు పరిష్కారాలను వెతుక్కొనేందుకు కూడా ప్రయత్నిస్తారు. 


కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు చాలా సహనంతో నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ.. మీ చుట్టూ ఉన్నవారు మాత్రం మీపై ఒత్తిడి తీసుకురావడం లేదా డ్రామాలు ఆడడం వంటివి చేస్తుంటారు. అయితే మీరు ఇతరులను పూర్తిగా మార్చలేరు. కాబట్టి వారి నుంచి దూరం జరిగి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.


సింహం (Leo) – ఈ రోజు మీరు కొన్ని సందర్భాల్లో చాలా ఎమోషనల్‌గా ఫీలవుతారు. అయితే మీ చుట్టూ.. మీకు తెలియకుండా జరిగే విషయాల పట్ల కాస్త జాగరూకతతో వ్యవహరించడం మంచిది. మీ చుట్టూ ఉన్నవారు మీ నుంచి చాలా ఎక్కువగా ఆశిస్తున్నారని మీకు అనిపించవచ్చు. కనుక, వీలైనంతవరకు మీరు చెప్పాలనుకున్నది స్పష్టంగా ఎదుటివారికి చెప్పండి. మొహమాటం పడాల్సిన అవసరం లేదు.


క‌న్య (Virgo) – మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నప్పటికీ ఏమీ చేయకుండానే ఈ రోజు గడిచిపోతుంది. ఉదయం, మధ్యాహ్నం సాదాసీదాగా గడిచిపోతే.. సాయంత్రం మాత్రం అనుకోని స్నేహితులు, కుటుంబ సభ్యులను కలుసుకొని మీరు సంతోషంగా సమయం గడిపే అవకాశం ఉంది. 


తుల (Libra) – ఈ రోజు చేయాల్సిన పనులు చాలా ఎక్కువగా ఉన్న కారణంగా.. రోజంతా చాలా భారంగా గడుస్తున్నట్లు అనిపించవచ్చు. మీరు ఇతరులతో చాలా చక్కగా కమ్యూనికేట్ చేస్తూ వారిని కూడా మోటివేట్ చేస్తారు. మీ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికల గురించి పక్కాగా వ్యూహాలు రచిస్తారు.


వృశ్చికం (Scorpio) –  ఈ రోజు మీకోసం బోలెడన్ని సర్‌ప్రైజ్‌లు వేచి చూస్తుంటాయి. అయితే మీరు ఒకటి చేయాలని.. ప్లాన్ చేస్తే అది మరొకలా జరిగే అవకాశం ఉంది. మీ స్నేహితులు చివరి నిమిషంలో తమ మనసు మార్చుకోవడం వల్ల.. మీరు ఇరకాటంలో పడే అవకాశం ఉంది. అయినప్పటికీ రోజంతా చాలా సరదాగానే గడుస్తుంది. 


ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఉదయం నిద్ర లేచే సరికి మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఫీలవుతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ రోజంతా తీరిక లేనట్లుగా మీకు అనిపించినా.. మీరు చేయాల్సిన పనులు ఇంకొన్ని కూడా మీ దృష్టికి వస్తాయి. కానీ రోజు ముగిసే సమయానికి అలసిపోయినట్లుగా మీకు అనిపించవచ్చు.


మకరం (Capricorn) – ఈ రోజు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. లేదంటే దాని వల్ల మీరు ఈ రోజు చేయాలని భావిస్తున్న పనులన్నీ ప్రభావితం అవుతాయి. అంతేకాదు.. మీ మూడ్‌ కూడా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి చివరి నిమిషం వరకు ఆలోచిస్తూ ఉండిపోకుండా ముందే జాగ్రత్తపడితే మంచిది. 


కుంభం (Aquarius) –  ఈ రోజు ఉదయం నిద్ర లేచేసరికే బాగా అలసిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. కానీ మధ్యాహ్నం నుంచి రోజంతా తీరిక లేనట్లుగా గడుస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో గడిపేందుకు మీరు కొన్ని ప్లాన్స్ వేసుకుంటారు. కానీ వారు మీ సహనాన్ని పరీక్షించవచ్చు. అయినా ప్రశాంత చిత్తంతో వ్యవహరించండి.


మీనం (Pisces) – ఈ రోజు మీ జీవితం చాలా ప్రశాంతంగా గడుస్తుంది. కాబట్టి మీరు నిశ్శబ్దంగా ఉండడం మంచిది. మీరు ఏ ఒక్క పదం మాట్లాడినా.. అది అవతలివారు అపార్థం చేసుకునే వీలుంటుంది. కాబట్టి మీ మనసులో ఏం ఉన్నా సరే.. ఈ రోజు నిశ్శబ్దంగా ఉండడమే మీకు చాలా సులభం అనిపిస్తుంది. 


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ


కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !


ఇవి కూడా చదవండి


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా


ధనురాశి అమ్మాయిల ప్రత్యేకతలు ఏమిటో ఆంగ్లంలో చదివేయండి


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?