ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ జీవిత గమ్యాలను నిర్దేశించుకోండి..!

ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ జీవిత గమ్యాలను నిర్దేశించుకోండి..!

ఈ రోజు (మే 21) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – మీ వద్ద ఉన్న తక్కువ సమయంలోనే.. చాలా పనులు మీరు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆఫీసు పని విషయంలో మీ సహచరులు మీకు అండగా నిలుస్తారు. అయితే మీరు జాగ్రత్తగా మాట్లాడడంతో పాటు మీరు పని చేసే విధానాన్ని కూడా కాస్త మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయమై శ్రద్ధ వహించడం కూడా ముఖ్యమే.


వృషభం (Tarus) – ఈ రోజు మీ నమ్మకాలే మారిపోవచ్చు. కేవలం నమ్మకాలు మాత్రమే కాదు.. మీకున్న ఆలోచనలు కూడా మారవచ్చు. అది పని విషయమైనా సరే.. లేదా వ్యక్తిగత జీవితమైనా సరే. ఈ క్రమంలో మీరు ఎదుటివారికి సర్ది చెప్పేందుకు  చాలా శ్రమించాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఓపెన్‌గా ఉండండి.


మిథునం (Gemini) – మీరు చాలా బ్యాలెన్డ్స్‌గా వ్యవహరిస్తూ.. మీ మనసు చెప్పేది వినడానికి ప్రయత్నించండి. ఎవరో ఏదో చెప్పారని ఆ మాటలను పదే పదే పట్టించుకుంటే.. ఫలితం ఉండదని తెలుసుకోండి. పని విషయంలో మార్పులేవీ లేకపోయినా మీ పనితీరు పై మీకే అపనమ్మకం కలగవచ్చు. ఈ క్రమంలో మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు.


కర్కాటకం (Cancer) – మీరు ఎంత ప్రయత్నించినా పని చాలా నిదానంగా సాగుతుంది. అందుకే వీలైనంత వరకు సహనంతో వ్యవహరించండి. పని ప్రదేశంలో ఇతరులు మీ సహనాన్ని పరీక్షించినా సాయంత్రం అయ్యే సరికి అన్నీ సర్దుకుంటాయి. అందుకే నలుగురితో కలిసి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నించండి.


సింహం (Leo) – ఈ రోజు పని విషయంలో మీరు చాలా బ్యాలన్స్డ్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ కోపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిపైనా ప్రదర్శించకండి. లేదంటే దాని ద్వారా ఎదురయ్యే పరిస్థితులను సరిచేయడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది. కోపాన్ని నియంత్రించుకుంటూ మీ వద్దకు వచ్చే కొత్త అవకాశాల గురించి ఆలోచించండి.


క‌న్య (Virgo) – మీ మెదడులో క్లియర్ చేసుకోవాల్సిన సందేహాలు చాలానే ఉన్నాయి. అయితే ఇది మీ ఒక్కరి వల్లే సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఎవరి సహాయమైనా తీసుకోండి. మీరు కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పనిపై దాని ప్రభావం ఉండవచ్చు. మీ భాగస్వామితో వాగ్వాదాలకు దిగకండి.


తుల (Libra) – ఈ రోజు అన్నీ మీరు అనుకున్న ప్రకారమే జరుగుతాయి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో చాలా సరదాగా సమయం గడుపుతారు. మనసు విప్పి అన్ని విషయాల గురించి మాట్లాడతారు. గతంలో తలెత్తిన మనస్పర్థలను కూడా తొలగించుకుంటారు. సాయంత్రం వేళ మీకు నచ్చిన వారితో సమయం గడుపుతూ రిలాక్స్ అవుతారు.


వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు ఏ విషయంలోనూ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేరు. మీకు ఏం కావాలో మీకు తెలిసినప్పటికీ అది కార్యరూపంలో ఎలా సాధ్యమో మీకు అర్థం కాదు. స్పష్టత లేకపోవడం లేదా సమావేశాల్లో జాప్యం జరగడం వల్ల పని కాస్త ఆలస్యంగా ముగుస్తుంది. అలాగే సహచరులతో అభిప్రాయభేదాలు కూడా తలెత్తవచ్చు.


ధనుస్సు (Saggitarius) – మీరు నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఎవరిపైనా ఆధారపడకండి. మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలకు మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఎవరితోనూ జడ్జిమెంటల్‌గా వ్యవహరించకండి. ఎవరికి వారు బిజీగా ఉండడం వల్ల ఫ్యామిలీ లైఫ్ కూడా కాస్త బిజీగానే అనిపించవచ్చు. పనిని మీ జీవితంపై ప్రభావం చూపనీయకండి.


మకరం (Capricorn) – ఈ రోజు మీరు ఓ శుభవార్త వింటారు. అలాగే మీ వద్దకు కొన్ని కొత్త అవకాశాలు కూడా వస్తాయి. అయితే వాటికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్నే మార్చేస్తాయని గుర్తుంచుకోండి. అలాగే ఈ నిర్ణయాలు తీసుకునే క్రమంలో మీకు మీరుగానే ఆలోచించాలి తప్ప ఇతరులపై అస్సలు ఆధారపడకూడదు. హాజరుకావాల్సిన ఫంక్షన్స్, శుభకార్యాలు ఉన్నప్పటికీ నలుగురిలోకి వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపించరు.


కుంభం (Aquarius) – పని చేసే క్రమంలో ఇతరులతో వాదించాల్సి వచ్చినప్పటికీ మీరు కోరుకున్న ఫలితాలు మీకు లభిస్తాయి. ఎదుటివారు చెప్పేది పూర్తిగా విన్న తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవడం మంచిది. పనిలో ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ దానిని ఆఫీసులోనే వదిలేయడం మంచిది.


మీనం (Pisces) – ఫలితాలు మీరు అనుకున్న ప్రకారం రావడంతో.. పనిలో సమయం చాలా సంతోషంగా గడిచిపోతుంది. ఒకవేళ ఫలితంలో తేడా వచ్చినా దానిని మీరు అంతగా పట్టించుకోరు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు వద్దు. పనిలో సీనియర్స్ సలహాలు తీసుకోండి.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీకలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !


ఇవి కూడా చ‌ద‌వండి


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా


ధనురాశి అమ్మాయిల ప్రత్యేకతలు ఏమిటో ఆంగ్లంలో చదివేయండి


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?