బరువు సులభంగా తగ్గాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే..!

బరువు సులభంగా తగ్గాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే..!

సాధార‌ణంగా కాస్త లావుగా ఉండడం అంత పెద్ద త‌ప్పేమీ కాదు. కానీ మ‌న శ‌రీరంలో కొవ్వు పెరిగిపోతున్న కొద్దీ శ‌రీరం 'ఇక నా వ‌ల్ల కాదు' అంటూ చేతులెత్తేస్తుంది. మ‌రీ.. ఆ స్థాయి వ‌ర‌కూ తీసుకురాకుండా కాస్త బ‌రువు (weight) పెర‌గ‌గానే దాన్ని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి.


అయితే స‌మ‌స్య ఏంటంటే.. చాలామందికి త‌మ‌కు ఈ స‌మ‌స్య ఉంద‌ని కూడా తెలీదు. తెలిసిన తర్వాత బరువు తగ్గడం ఎలాగో అర్థం కాదు. అలాంటివారికోసమే ఈ సులువైన చిట్కాలు (tips).. వీటితో త్వరగా బరువు తగ్గే వీలుంటుంది.


41


1. భోజనానికి ముందు సూప్


తాజాగా జరిగిన ఓ సర్వేలో తేలిందేంటంటే భోజనం చేయడానికి గంట ముందు సూప్ తాగడం వల్ల ఆకలి తగ్గుతుందట. అయితే సూప్ అంటే ఏ ఇన్ స్టంట్ సూపో కాకుండా మీరే కూరగాయలను ఉడికించి తయారు చేసిన సూప్ అయితే మంచిది. ఇలా చేయడం వల్ల అవసరానికి మించి భోజనం చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. మీ పొట్ట కూడా నిండినట్లుగా ఉంటుంది.


Also Read: బ‌రువు త‌గ్గేందుకు పాటించాల్సిన నియ‌మాలు (Rules For Weight Loss)


2. ఆరోగ్యకరమైన ఆహారంతో..


ప్రస్తుతం కాలంతో పాటు పరుగెత్తడంలో బిజీ అయిపోయి.. మనలో చాలామంది బ్రేక్ ఫాస్ట్‌కి దూరంగా ఉంటున్నారు. కానీ బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల మన శరీరానికి రోజు మొత్తానికి అవసరమయ్యే శక్తి లభిస్తుంది. రోజూ సరైన సమయానికి మనం బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల మనకు రోగాలు తక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ బ్రేక్ ఫాస్ట్ కూడా ఆరోగ్యకరమైనది అయితే మంచిది.


wtloss2


3. కొద్దికొద్దిగా తింటూ ఉండండి.


బరువు తగ్గడానికి చాలామంది ఏమీ తినకుండా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కానీ దాని వల్ల అనర్థమే ఎక్కువగా జరుగుతుందని గుర్తుంచుకోవాలి. దీనికి బదులుగా బరువు తగ్గేందుకు ప్రతి రెండు, మూడు గంటలకోసారి తక్కువ మోతాదులో ఏదైనా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయులు తగ్గవు. పైగా ఆకలి పెంచే హార్మోన్ విడుదలవ్వకుండా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.


Also Read: 7 Days Diet Plan To Loose Weight Instantly


4. కారం ఎక్కువగా తినండి.


ఒకవేళ మీకు మంచి స్పైసీ ఫుడ్ ఇష్టమైతే మీరు బరువు ఇట్టే తగ్గినట్లే.. కారం ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల మన మెటబాలిజం సాధారణ స్థాయి కంటే 8 శాతం ఎక్కువ వేగంగా ఉంటుందట. దీని కోసం రాత్రి భోజనంతో పాటు పచ్చిమిర్చిని తప్పనిసరిగా తినాల్సిందే. ఇది మీ పొట్ట దగ్గర ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. అంతేకాదు.. కారపు పదార్ధాలు తినేవాళ్లు దాన్ని చాలా నెమ్మదిగా తింటారట. దీని వల్ల ఆహారం కూడా తక్కువగా తింటారు. బరువు త్వరగా తగ్గుతారు.


బరువు సులభంగా తగ్గాలంటే..


tea


5. రాత్రుళ్లు గ్రీన్ టీ తాగండి..


సాధారణంగా మనం గ్రీన్ టీ ఉదయం లేదా మధ్యాహ్నం తాగుతూ ఉంటాం. కానీ రాత్రి సమయంలో పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం వల్ల బరువు బాగా తగ్గుతారట. గ్రీన్ టీ మీ మెటబాలిజాన్ని పెంచుతుంది. దీని వల్ల కేవలం లావు మాత్రమే కాదు.. క్యాన్సర్ వంటి సమస్యలు కూడా దూరంగా ఉంటాయట. అయితే గ్రీన్ టీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి మరీ ఎక్కువగా తాగడం వల్ల చెడు ప్రభావాలు ఎదురవుతాయి. అందుకే మరీ ఎక్కువగా కాకుండా రోజుకి రెండు లేదా మూడు కప్పులు మాత్రమే తాగాలి.


Also Read మీరు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిన పోష‌క ప‌ధార్థాలు


6. నవ్వు మంచి వ్యాయామం


నవ్వు ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి వ్యాయామం. గంట సేపు నవ్వడం వల్ల అరగంట పాటు వెయిట్ లిఫ్టింగ్ చేసినంత ఫలితం లభిస్తుందట. అయితే మరీ ఒకేసారి గంట నవ్వాల్సిన అవసరం లేదు. కానీ రోజులో ఎక్కువ సమయం నవ్వుతూ ఉండాలి. గంట పాటు బాగా నవ్వితే నాలుగు వందల క్యాలరీలు కరుగుతాయట. కాబట్టి కనీసం రోజూ పావు గంట అయినా నవ్వడం మంచిది.


2


7. స్వీట్లకు దూరం ఉండండి..


లావుగా తయారవ్వడానికి ఉన్న కారణాల్లో చక్కెర కూడా ఒకటి. అందుకే మీరు బరువు తగ్గే ప్రయత్నం చేస్తుంటే.. చక్కెరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. టీ, కాఫీల్లో మరీ ఎక్కువ చక్కెర వేసుకోవద్దు. అన్నింట్లోనూ చక్కెర తగ్గించుకోవాలి. అంతేకాదు.. స్వీట్లను కూడా పూర్తిగా మానేయాలి.


8. నీలి రంగు ప్లేట్లలో తినండి.


మీరు నీలి రంగు ప్లేట్లలో భోజనం చేస్తే మీ బరువు చాలా వేగంగా తగ్గుతుంది. అదెలా అనుకుంటున్నారా? రీసర్చ్ ప్రకారం చూస్తే నీలి రంగు ప్లేట్లలో భోజనం చేయడం వల్ల ఆకలి చాలా తగ్గుతుందట. ఇలా చేయడం వల్ల మనం ఆహారం తక్కువగా తింటాం. తక్కువ ఆహారంతోనే మనకు కడుపు నిండిన భావన కావాలంటే నీలిరంగు ప్లేట్లను ఉపయోగించాలి.


1


9. చీకటిలో పడుకోండి.


పడుకునేటప్పుడు గది చీకటిగా ఉండేలా చూసుకోవడం వల్ల బరువు తగ్గే వీలుంటుంది. ఇది ఎన్నో పరిశోధనల్లో తేలిన నిజం కూడా. మనం పడుకున్నప్పుడు సాధారణంగా మన శరీరం మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. దీని వల్ల మన శరీరం బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువగా రూపొందిస్తుంది. దీన్ని కరిగించడం చాలా సులువు. ఈ మెలటోనిన్ చీకటిలో నిద్రపోయినప్పుడు చాలా ఎక్కువగా విడుదలవుతుంది. దీని వల్ల బరువు తొందరగా తగ్గే వీలుంటుంది. అందుకే పడుకునేటప్పుడు మీ గదిని పూర్తిగా చీకటిగా మార్చేయండి.


10. బాగా నిద్రపోండి.


మీరు నిజంగానే బరువు తగ్గాలనుకుంటే రాత్రి సుఖంగా, హాయిగా ఎనిమిది గంటల పాటు నిద్రపోండి. మీరు రోజంతా శ్రమ పడి అలసిపోయాక ఇది మీకు ఎంతో విశ్రాంతిని అందిస్తుంది. బరువు తగ్గడంలో మంచి నిద్ర ముఖ్య పాత్ర వహిస్తుంది. హ్యాపీగా నిద్రపోవడం వల్ల ఆకలి కలిగించే హార్మోన్లు కూడా తగ్గుతాయి. కాబట్టి ఆకలి తగ్గి, బరువు తగ్గుతుంది.


POPxo ఇప్పుడు పాఠకులకు ఆరు భాషల్లో లభ్యమవుతోంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, బెంగాలీ


అతి గొప్ప వార్త. POPxo SHOP ఇప్పుడు సరికొత్త  ఆఫర్లతో వస్తోంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25 % డిస్కౌంట్ అందిస్తోంది. POPXO FIRST అనే కూపన్ కోడ్‌ను ఉపయోగించండి. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మహిళలకు ఎన్నో సేవలను మేము అందిస్తున్నాం. 


ఇవి కూడా చదవండి.


పొట్ట దగ్గర కొవ్వు మటుమాయం కావాలా?? అయితే ఈ ఆహారం తినాల్సిందే..!


తొడలు లావుగా ఉన్నాయా? ఇలా చేస్తే సన్నగా కనిపిస్తారు..!


ఈసారి ఎవ‌రైనా బ‌రువు పెరిగావ‌ని చెబితే.. వారికి ధీటుగా బ‌దులివ్వండిలా..!