అదో అందమైన రొమాంటిక్ మజిలీ.. మా ఆలుమగలకు చాలా ప్రత్యేకమైంది..!

అదో అందమైన రొమాంటిక్ మజిలీ.. మా ఆలుమగలకు చాలా ప్రత్యేకమైంది..!

ప్రేమ (Love).. దీనికి ఒక్కొక్కరూ ఒక్కో నిర్వచనం ఇస్తుంటారు. కానీ నేను మాత్రం ఇద్దరు వ్యక్తుల మధ్య మనసులు మాత్రమే కాదు.. కెమిస్ట్రీ కూడా కలిస్తేనే అది అందమైన ప్రేమ అవుతుందని చెబుతాను. ప్రతిఒక్కరి అభిప్రాయాలు వేరుగా ఉండచ్చేమో.. కానీ నేను మాత్రం ప్రేమ, మోహం రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని నమ్మే మనిషిని. ఒకటి లేకపోతే ఇంకొకటి ఉండదు అని నా నమ్మకం. 


అందుకే నేను, నా భర్త తరచూ పడకగదిలో విభిన్న పద్దతుల్లో రొమాన్స్ చేయడానికి సిద్ధపడేవాళ్లం. అదే రొమాన్స్ మాలో లైంగిక చర్యకు (sex) ప్రేరణను అందించేది. ఆ ప్రేరణతోనే వివిధ భంగిమలు ట్రై చేస్తూ.. ఎన్నో ప్రయోగాలు చేసేవాళ్లం.


నిజం చెప్పాలంటే మేం అలా చేసిన ప్రతిసారి మా ఇద్దరి మధ్య దూరం తగ్గుతూ వచ్చింది. అందుకే రొమాన్స్‌ను మా ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించే మందుగా మేం భావించేవాళ్లం. 


అందుకే మాకు ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా.. ఒకరితో ఒకరం సమయం గడపడానికి ఇష్టపడేవాళ్లం. కనీసం వారానికోసారి లేదా రెండు సార్లు కలిసివాళ్లం.


మేమిద్దరం మా తల్లిదండ్రులతోనే ఉంటున్నా.. మా కోసం కాస్త సమయం కేటాయించుకొని.. బయటకు వెళ్లడం, హాయిగా పడకగదిలో గడపడం వంటివి చేసేవాళ్లం. దీంతో అసలు ఒకరికొకరు దూరంగా ఉండే పరిస్థితి మాకు ఎప్పుడూ రాలేదు. అలా వస్తే ఏం చేయాలో కూడా అప్పటిదాకా మేం నిర్ణయించుకోలేదు కూడా. కానీ ఒకసారి అలాంటి సమయం రానే వచ్చింది.


1


మేమిద్దరం మా పనుల్లో బిజీగా ఉండడం వల్ల వారమంతా ఇద్దరం కలిసే అవకాశమే రాలేదు.  ఒకరినొకరం గాఢంగా హత్తుకొని రోజంతా నిద్రపోవాలని అనిపించినా.. పని ఒత్తిడి వల్ల అస్సలు కలవడానికి కూడా వీలు పడలేదు. ఈ దూరం మమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఎంతో బాధపెట్టింది.


అందుకే ఇద్దరం ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా.. ఒక్కరోజు సెలవు పెట్టి ఎక్కడికైనా వెళ్లి ఆనందంగా గడపాలనుకున్నాం. రొమాన్స్, సెక్స్ అనేవి మా లిస్టులో ఉన్నా.. ఇద్దరం కలిసి చాలా రోజులవుతోంది కనుక దాదాపు ఎక్కువ సమయం గడపడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే సిటీ కాలుష్యానికి దూరంగా ఎక్కడికైనా వెళ్లాలని నిర్ణయించుకున్నాం.


సాధారణంగా బెంగళూరులో సెటిలైనా.. సిటీకి బయట ఆస్తులు కొనడం, అమ్మడం మాకు అలవాటు. అందుకోసం మేం వివిధ ప్రాపర్టీస్ వెతుకుతూ ఉంటాం. అలాగనే ఇంట్లో చెప్పి.. ఇద్దరం నందీ హిల్స్ దగ్గర్లోని ఓ రిసార్ట్‌కి వెళ్లాం. పచ్చని ప్ర‌కృతి అందాల మధ్య రిసార్ట్‌లో రొమాంటిక్ మ్యూజిక్, మంచి వైన్.. ఇవన్నీ మేం ఆనందంగా గడిపేందుకు మూడ్‌ని క్రియేట్ చేశాయి.


అదేదో సినిమా సెట్‌లా అనిపించింది. ఆ తర్వాత తను నా ఫేవరెట్ రొమాంటిక్ పాటను పెట్టి దానికి డ్యాన్స్ చేద్దామంటూ నన్ను పిలిచాడు. అలా రూమ్‌లో ఇద్దరమే ఉండి ఆనందంగా గడిపాం. నా జీవితంలో నేను గడిపిన అందమైన రోజుల్లో అదీ ఒకటి.


kissing


ఆ తర్వాత మా రొమాంటిక్ సెక్సీ స్టోరీ మొదలైంది. మా కలయిక.. మాలో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఒకటి, రెండుసార్లతో మాకు దానిని ఆపాలనిపించలేదు. కాసేపు రొమాన్స్ చేయడం.. మరికాసేపు ముద్దు ముచ్చట్లతో దుప్పట్లోనే గడపడం.. అలా చూస్తుండగానే మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయిపోయింది. అస్సలు టైం ఎలా గడిచిపోయిందో మాకు అర్థం కాలేదు. సాయంత్రం కాగానే రిసార్ట్ మొత్తం అందమైన లైట్లతో  మెరిసిపోతూ కనిపించింది.


దాంతో కాస్త వైన్ తాగి తిరిగి మా ప్రణయలోకంలో మునిగిపోయాం. ఆ రాత్రంతా అలా గడిపి మరుసటి రోజు ఉదయాన్నే తిరిగి బెంగళూరుకి వెళ్లాం. నా జీవితంలో నేను గడిపిన ఆనందకరమైన రోజుల్లో ఇది ముఖ్యమైనది. ఇలాంటి సెక్సీ వెకేషన్ నా జీవితంలో మళ్లీ వస్తుందేమో తెలీదు కానీ ప్రస్తుతం ఇప్పటివరకూ అయితే నేను గడిపిన రొమాంటిక్ డేట్స్‌లో ఇది ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆ రోజును మేమిద్దరం మర్చిపోలేం.


ఇప్పటికీ మేం కలిసినప్పుడు ఆ రోజుకి సంబంధించిన అనుభూతులు.. ఇంకా మమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతూనే ఉంటాయి. 


ఇవి కూడా చదవండి.


మీ సెక్స్ మూడ్‌ని.. రొమాంటిక్‌గా మార్చే విషయాలివే..!


ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!


నగ్నంగా నిద్ర పోతే.. ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలుసా?