ADVERTISEMENT
home / Health
నగ్నంగా నిద్ర పోతే.. ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలుసా?

నగ్నంగా నిద్ర పోతే.. ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలుసా?

నిద్ర (Sleeping) .. ప్రతి ఒక్కరి అవసరం. సౌకర్యంగా నిద్రపోవాలని చాలామంది కోరుకుంటారు. అయితే చాలాసార్లు ఎంతమంచి పరుపు, ఏసీ, పరిమళాలు.. ఇలా ఎన్ని ఉన్నా నిద్ర మనల్ని చేరదు. ఇలా ఎందుకు జరుగుతుందా? అని ఆలోచిస్తున్నారా? అయితే ఒకసారి నగ్నంగా(Naked) నిద్రపోయి ప్రయత్నించండి. ఈ మాట మేం చెప్పట్లేదు. రీసర్చ్ ప్రకారం తేలిన నిజం ఇది. దీని ప్రకారం ప్రపంచంలో కేవలం 30 శాతం మంది మాత్రమే దుస్తులు లేకుండా నిద్రపోతున్నారట.

అయితే ఇలా నిద్రపోవడం వల్ల గాఢమైన నిద్రను పొందవచ్చని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ సామ్మీ మార్గో వెల్లడిస్తున్నారు. ఆయన రాసిన గుడ్ స్లీప్ గైడ్ పుస్తకంలో దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత బ్యాలన్స్ అయ్యి రాత్రి నిద్రలో ఏమాత్రం ఇబ్బంది ఉండదని తెలిపారు.

అంతేకాదు.. చీకటి గదిలో ఇలా దుస్తులు లేకుండా నిద్ర పోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ కూడా విడుదలవుతుందట. ఇది సుఖమైన నిద్రకు బాగా తోడ్పడుతుంది. కేవలం ఇదే కాదు.. రాత్రి దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటంటే..

wtlos2

1. బరువు తగ్గొచ్చు..

ఒత్తిడి వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటు ఉద్యోగం, అటు రిలేషన్ షిప్.. ఇలా మీరు ఏ విషయంలో అయినా ఒత్తిడికి గురవ్వచ్చు. బరువు పెరగడానికి ముఖ్యంగా పొట్ట పెరగడానికి ఒత్తిడి ముఖ్య కారణం. మీరు హాయిగా నిద్రపోతే మీ ఒత్తిడి స్థాయులు చాలా వరకూ తగ్గుతాయి.

ADVERTISEMENT

అంతేకాదు.. ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ అనే హార్మోన్‌ని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ మనలో ఆహారం తినాలనే కోరికను పుట్టిస్తుంది. దీనివల్ల మనం ఎక్కువగా తినడం, లావవడం జరుగుతుంది. అందుకే నగ్నంగా నిద్రపోవడం వల్ల శరీరం, మెదడు రిలాక్స్ అయ్యి ఒత్తిడి తగ్గుతుంది. బరువు కూడా తగ్గుతుంది.

facehair3

2. చర్మ సమస్యలకు దూరం..

రోజూ రాత్రి దుస్తులు లేకుండా నగ్నంగా నిద్రపోవడం వల్ల మన చర్మానికి గాలి తగులుతుంది. ముఖ్యంగా మన కాళ్లు, అండర్ ఆర్మ్ వంటి ప్రదేశాల్లో చెమట వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. నగ్నంగా నిద్రపోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు.

రోజంతా టైట్‌గా ఉండే దుస్తులు ధరించడం వల్ల వచ్చే చెమట, దుమ్ము, ధూళితో నిండిన చర్మానికి.. నగ్నంగా నిద్రపోవడం వల్ల రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది. మన చర్మ రంధ్రాల నుంచి స్వేదం విడుదలవడం వల్ల చర్మంపై ఉన్న మృత కణాలు కూడా తొలగిపోతాయి. అందుకే నగ్నంగా నిద్రించే వారి చర్మం ఆరోగ్యంగా మెరిసిపోతుంది.

sex1

3. సెక్స్‌లో ఆనందం పెరుగుతుంది.

రోజూ బ్రా, ప్యాంటీల్లో బంధించి ఉంచే మన శరీరభాగాలకు.. రాత్రి పూట కాస్త గాలి తగిలేలా నగ్నంగా నిద్రపోవడం మంచిది. ఇలా చేయడం వల్ల మన శరీరానికి ఎంతో హాయిదనం లభిస్తుంది. ఇవి హాయిగా, ఆరోగ్యంగా ఉండడం వల్ల సెక్స్ లైఫ్‌లో ఆనందం ఎక్కువగా అందుతుంది.

ADVERTISEMENT

అంతేకాదు.. ఫీల్ గుడ్ హార్మోన్ అయిన ఆక్సిటోసిన్ విడుదల పెరుగుతుంది. ఓ సర్వే ప్రకారం నగ్నంగా నిద్రించిన జంటలు మిగిలిన జంటలతో పోల్చితే ఎక్కువగా తమ సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారట. అంటే నగ్నంగా పడుకోవడం వల్ల సెక్స్‌లో ఆనందాన్ని కూడా ఎక్కువగా పొందొచ్చన్నమాట.

straight1

4. ఆనందం.. ఆత్మవిశ్వాసం

రాత్రి పూట నగ్నంగా నిద్రపోతున్నామంటే మన శరీరం పై మనకు నమ్మకం పెరుగుతుంది. మనం ఎలా ఉన్నామో దాన్ని మనం ఒప్పుకోవడానికి ఆస్కారం పెరుగుతుంది. దీనివల్ల పగలు ఎలాంటి దుస్తులు ధరించినా.. మనలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందట. కొత్త తరహా దుస్తులు ధరించినప్పుడు ఇబ్బంది పడే వీలుండదు.

అంతేకాదు.. నిద్రపోయేటప్పుడు టైట్ దుస్తులు, ఎలాస్టిక్ వస్త్రాలను మనకు దూరంగా ఉంచడం వల్ల నిద్రపోయినప్పుడు సౌకర్యం పెరుగుతుంది. ఇది మనలో శారీరకంగా, మానసికంగా ఆనందాన్ని పెంచుతుంది. ఇది మీ పని, రిలేషన్ షిప్స్, చదువు.. ఇలా అన్ని అంశాలపై ప్రభావం చూపుతుంది.

grapes4

5. యవ్వనంగా కనిపించేలా..

మెలటోనిన్.. మన శరీరంసపై వార్థక్య ఛాయలు కనిపించకుండా చేసే హార్మోన్ ఇది. ఇది మనం హాయిగా నిద్రించినప్పుడు మన శరీరంలో విడుదలవుతుంది. అందుకే నిద్రకు బ్యూటీ స్లీప్ అనే పేరు వచ్చింది. మనం సాధారణంగా నిద్రపోయినప్పుడు కంటే నగ్నంగా నిద్రించినప్పుడు మన శరీర ఉష్ణోగ్రతల్లో తేడా కనిపిస్తుంది.

ADVERTISEMENT

మన శరీరం ఆరోగ్యకరమైన ఉష్ణోగ్రత దగ్గర ఉంటుంది. మెలటోనిన్ లేదా ఇతర హార్మోన్లు ఏవైనా ఇలాంటి ఆరోగ్యకరమైన ఉష్ణోగ్రత వద్ద బాగా పనిచేస్తాయి. అంటే నగ్నంగా నిద్రపోవడం వల్ల మన చర్మంపై ముడతలు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుదట.

ఇవి కూడా చదవండి.

నిద్రంటే మీకు ఇష్ట‌మా? అయితే ఈ నాసా ఉద్యోగం మీ కోస‌మే ..!

నిద్రంటే ప్రాణ‌మైతే.. ఇలాంటి ఆలోచ‌న‌లు మీకూ వ‌స్తుంటాయి..!

ADVERTISEMENT

సానియా మీర్జా 4 నెల‌ల్లో 22 కేజీల బ‌రువు త‌గ్గింది.. ఎలాగో తెలుసా..?

Images : shutterstock.

23 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT