ఈ రోజు (మే 1) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..
మేషం (Aries) – ఈ రోజు కాస్త పని ఎక్కువగా ఉండవచ్చు. ఈ కారణంగా మీ చుట్టూ ఉన్నవారు, మీ స్నేహితులతో మీరు సరిగా మాట్లాడలేకపోవచ్చు. కొత్త ఉద్యోగం లేదా ప్రాజెక్ట్ గురించి ఎదురుచూసేవారు ఓ వార్త వింటారు. అయితే ఉద్యోగం, బంధాల విషయంలో స్పష్టత ఉంటేనే ముందడుగు వేయండి.
వృషభం (Tarus) – మీ చుట్టూ ఉన్నవారు మీరు చేసే పని నుంచి చాలా ఆశించవచ్చు. అది మీకు ఇబ్బందికరంగానూ అనిపించవచ్చు. అయితే మీరు ఎవరితోనూ.. ముఖ్యంగా మీ ప్రియమైన వ్యక్తి లేదా జీవిత భాగస్వామితో గొడవ పడకుండా జాగ్రత్తపడుతూ పరిస్థితులను జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి.
మిథునం (Gemini) – మీ ఆఫీసులో పని ఎక్కువగా ఉండడంతో పాటు మీ సహచరుల రాజకీయాల కారణంగా మీరు ఇబ్బందిపడే సూచనలున్నాయి. మీ కుటుంబ సభ్యులకు కూడా ప్రాధాన్యం ఇస్తూ వారు చెప్పేది కూడా వినండి. మీ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టండి.
కర్కాటకం (Cancer) – మీరు చేయాలనుకున్న పనులు చేసిన తర్వాత ఖాళీ సమయాన్ని నిరుపయోగంగా గడిపేయకండి. మీ జీవిత భాగస్వామితో మనసారా మాట్లాడుతూ హాయిగా గడిపేందుకు ప్రయత్నించండి. మీ ఎమోషన్స్‌కు ఇతరులను బాధ్యులను చేయకండి. కొన్నాళ్లు ప్రశాంతంగా గడిపేందుకు ఏదైనా టూర్ ప్లాన్ చేయండి.
సింహం (Leo) – మీ వ్యక్తిగతమైన ఎదుగుదలకు ఈ రోజు చాలా బాగా ఉపకరిస్తుంది. అయితే మీరు తీసుకునే నిర్ణయాల్లో మీ ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటంగా కనిపించేలా చూసుకోండి. అవసరమైన సందర్భాల్లో ఆప్తమిత్రుల సలహాలు తీసుకోండి. నిద్రకు సరిపడా సమయం కేటాయించుకోండి.
కన్య (Virgo) – మీ చుట్టూ ఉన్నవారు ఈ రోజు మిమ్మల్ని చాలా స్పెషల్‌గా ఫీలయ్యేలా చేస్తారు. అలాగే పెద్దల ఆశీర్వాదాలు కూడా మీకు అందడంతో మరింత ఉత్సాహంగా రోజుని గడుపుతారు. కాస్త సమయం తీసుకున్నా సరైన ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం పని చేయండి.
తుల (Libra) – ఎవరో చేసిన పనులు లేదా తీసుకున్న నిర్ణయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మీరు చేస్తున్న పనిపై ఏకాగ్రత ఉండకపోవచ్చు. కాబట్టి కాస్త రిలాక్స్ అవ్వండి. గతంపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోకుండా.. కాస్త సమయం తీసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
వృశ్చికం (Scorpio) – మీరు కొత్తగా ప్రారంభించే పనుల్లో ఉత్సాహంగా పని చేసినప్పటికీ ఆశించిన అవుట్ పుట్ రాకపోవచ్చు. కాబట్టి కొత్తగా ఎవరితోనూ భాగస్వాములుగా చేరకండి. మీ ఉద్యోగంతో పాటు కుటుంబానికి కూడా సమ ప్రాధాన్యం ఇవ్వండి.
ధనుస్సు (Saggitarius) – ప్రస్తుతం మీరు సమయం, సందర్భానికి అనుగుణంగా నడుచుకుంటూ మీ పనులను పూర్తి చేస్తున్నారు. ఇవే మీకు కావాల్సిన కాన్ఫిడెన్స్‌ని అందిస్తాయి. కాబట్టి సమయానికి పని చేసుకుంటూనే మీ కుటుంబ బాధ్యతలను కూడా జాగ్రత్తగా నిర్వర్తించండి.
మకరం (Capricorn) – మీరు ఈ రోజు నిద్ర లేచే సమయానికే అలసిపోయినట్లుగా అనిపించవచ్చు. చాలా పనులకు సంబంధించి ఏం చేయాలా అని మీరు బాగా ఆలోచిస్తున్నారు. కానీ నెమ్మదిగా వాటిని ప్రారంభించడం మంచిది. మీరే మీపై ఒత్తిడిని పెంచుకోకండి. మనసులో ఉన్న ఫీలింగ్స్‌ని బయటపెట్టండి. అవి మీ బంధువులు, స్నేహితులను మరింత భద్రంగా ఫీలయ్యేలా చేస్తాయి.
కుంభం (Aquarius) – ఈ రోజంతా ముందుగా నిర్ణయించుకున్న పనులు, ప్రణాళికలతో చాలా బిజీగా ఉంటుంది. అలాగే ఇతరులను సౌకర్యవంతంగా ఫీలయ్యేలా చేస్తూ.. మీరు అందరి చూపునీ మీవైపు తిప్పుకుంటారు. అయితే ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
మీనం (Pisces) – ఇతరులను నియంత్రించడం లేదా ఇబ్బందిపెట్టడం వంటి పనులు చేయకండి. పనిలో ఆలస్యం జరగడం, మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు తలెత్తడం.. వంటివి జరుగుతాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి.
Credit: Asha Shah
ఇవి కూడా చదవండి
మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా..!