ఈ లక్షణాలుంటే మీ బాయ్ ఫ్రెండ్.. మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లే..!

ఈ లక్షణాలుంటే మీ బాయ్ ఫ్రెండ్.. మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లే..!

సాధారణంగా అమ్మాయిల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ (love), మనసులోని ఫీలింగ్స్ (feelings).. బయట పెట్టడంలో వారు ముందుంటారు. కానీ అబ్బాయిలు అలా కాదు. వాళ్లు తమ మనసులో ఉన్న ఫీలింగ్స్ అంత త్వరగా బయటపెట్టలేరు. అయితే దీని అర్థం వాళ్లు మనల్ని తక్కువగా ప్రేమిస్తున్నారని మాత్రం కాదు.


తన బాయ్ ఫ్రెండ్ (Boy friend) ఎంత చేసినా.. చాలామంది అమ్మాయిలకు వచ్చే సందేహం "నేను తనని ప్రేమిస్తున్నంతగా.. తను నన్ను ప్రేమించట్లేదు అని".. అయితే మీ బాయ్ ఫ్రెండ్ తన భావాలను బయట పెట్టకపోయినా సరే.. తన మనసులో మీపైన అపారమైన ప్రేమ ఉందని మీరు గుర్తించవచ్చు. అదెలా అనుకుంటున్నారా? ఈ లక్షణాలు ఉంటే చాలు.. తనకి మీపైన ప్రేమ ఉన్నట్లే..


2-signs-he-loves-you


1. మీ పట్ల గౌరవం


ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడే గౌరవం కూడా ఉంటుంది. తను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెబుతున్నా.. మీకు గౌరవం ఇవ్వకుండా మిమ్మల్ని వీలున్నప్పుడల్లా తక్కువ చేసి చూపించడం.. వంటివి చేస్తుంటే తనకి మీ మీద ఉన్నది నిజమైన ప్రేమ కాదని గుర్తించండి. నిజమైన ప్రేమలో గౌరవం ఉంటుంది. అందరూ ఉన్నప్పుడే కాదు.. మీ ఇద్దరే ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడడం తనకు ఇష్టం ఉండదు. అంతేకాదు.. తను మిమ్మల్ని చూసే చూపులో కూడా మీరంటే ప్రేమ, గౌరవం ఉట్టిపడుతుంటాయి.


రుతుపవన శృంగారం


2. మీకంటూ కాస్త స్పేస్


ప్రేమ, అనుమానం రెండూ ఒకే దగ్గర ఉండలేవు. అందుకే ఒకవేళ మీ బాయ్ ఫ్రెండ్‌కి మీపై ప్రేమ ఉంటే.. తనకి మీపై అనుమానం ఉండదు. మీ ఫోన్, మీ ఫేస్ బుక్, వాట్సాప్ ఛాటింగ్ హిస్టరీ వంటివన్నీ మీకు తెలియకుండా చెక్ చేయరు. మీరు వేరే అబ్బాయిలతో మాట్లాడుతున్నా "వారు కేవలం స్నేహితులే.. తన స్థానం తనకే ఉంటుందన్న ఫీలింగ్" వారి మనసులో ఉంటుంది. మీరు బయటకు వెళ్లినప్పుడు కూడా మీ భద్రత గురించి ఆలోచించి ఫోన్ చేయడమే తప్ప అనుమానంతో చేసే వీలుండదు.


romance 3


3. అప్పుడప్పుడూ కాస్త అసూయ


మీ స్పేస్ మీకిచ్చి అబ్బాయిలతో మాట్లాడినా అనుమానపడకపోవడాన్ని ప్రేమ అనుకున్నాం. కానీ అప్పుడప్పుడూ కాస్త అసూయ కూడా ప్రేమలో భాగమే. మిమ్మల్ని ఎవరైనా ఆరాధనగా చూస్తున్నా.. మీకు లైన్ వేయాలని ప్రయత్నిస్తున్నా తను కాస్త అసూయగా ఫీలవడం మీరు చూడొచ్చు. ఈ ఫీలింగ్స్ అన్నింటినీ తను బయటకు చెప్పకపోయినా అసూయ కూడా ప్రేమలో భాగమే కదా.


4. మీ స్నేహితులు తన స్నేహితులే..


మీ స్నేహితులంటే మీకు ఎంత ఇష్టమో తనకు బాగా తెలుసు. కాబట్టి వారితో కలిసిపోవడానికి వీలైనంతగా ప్రయత్నిస్తాడు. అంతేకాదు.. మీతో కలిసి వారి పుట్టినరోజులు.. ఇతర ప్రత్యేకమైన రోజులు గుర్తుంచుకొని వారిని సర్ ప్రైజ్ చేయడంలో మీకు సహాయం కూడా చేస్తాడు. మీరూ తన స్నేహితులతో ఇలాగే ఉంటారుగా మరి.


romance 5


5. అలా నొప్పి పోగొడతాడు..


నెలసరి సమయంలో ఆడవాళ్లకు భరించలేని నొప్పి ఎదురవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు... పీఎంఎస్ వల్ల ఆ సమయంలో మీరు చాలా చిరాగ్గా కూడా ఉంటారు. మనసైనవాళ్లు మంచి హగ్ ఇస్తే చాలు.. ఇవన్నీ మర్చిపోవచ్చు. అలాంటి పని చేసేందుకు మీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడూ ముందుంటాడు. అంతేకాదు.. ఈ సమయంలో మీకు నచ్చిన ఆహారం అందించడానికి తను సిద్ధంగా ఉంటాడు.


6. మీ కలల్లో తన సాయం..


మీకు ఫిజిక్స్ అంటే ఇష్టం. తనకు అసలు అదంటేనే అర్థం కాదు. కానీ మీ కెరీర్ ఛాయిస్‌లను తను ప్రోత్సహిస్తాడు. మీకు నచ్చిన రంగంలో.. మీరు అనుకున్నట్లుగా ఉన్నత స్థానాన్ని సాధించేందుకు తన వంతు సాయం అందిస్తాడు. మీకు నచ్చినవి తనకు నచ్చకపోయినా మీకు తోడ్పాటును అందిస్తాడు.


7. తను మీ మాట వింటాడు..


సాధారణంగా అబ్బాయిలు మాట వినడంలో పెద్దగా శ్రద్ధ పెట్టరు. ఒకవేళ తను అలా చేస్తే మాత్రం మీ బాయ్ ఫ్రెండ్‌ది నిజమైన ప్రేమని గుర్తుంచుకోండి. అవును. మీరు ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు తను ఫోన్ చూసుకోవడమో లేక గేమ్ ఆడుకోవడమో.. టీవీ చూడడమో చేయకుండా మీ కళ్లల్లోకి చూస్తూ.. మీ మాటలను విని దానికి తన అభిప్రాయాన్ని చెప్పాడంటే తను మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నట్లే లెక్క.


8-signs-he-loves-you


8. మీ ఇద్దరి భవిష్యత్తు గురించి మాట్లాడతాడు..


మీరిద్దరూ పెళ్లి చేసుకొని సెటిలవ్వాలని కోరుకునే వ్యక్తి అయితే.. పెళ్లయ్యాక మీ ఇద్దరి భవిష్యత్తు గురించి మీలాగే తను కూడా ఎన్నో కలలు కంటుంటాడు. నేను భవిష్యత్తులో ఇలా ఉంటాను అనే బదులు.. మనం ఇలా చేద్దాం.. ఇలా ఉండాలి అని మాట్లాడుతుంటే తను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లు లెక్క. మీతో భవిష్యత్తును వూహించుకుంటున్నాడని అర్థం. ఇలాంటి వ్యక్తి మీ బాయ్ ఫ్రెండ్ అయితే అది మీ లక్ అని చెప్పుకోవాలి.


9. గొడవలు బంధంపై ప్రభావం చూపవు..


చాలామంది ప్రేమికులు చిన్న చిన్న గొడవలకే బ్రేకప్ చెప్పుకుంటూ ఉంటారు. కానీ తను అలా కాదు. ఇద్దరి మధ్యా పెద్ద గొడవైనా.. తిరిగి తామిద్దరూ కలిసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తాడు. మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుంటే మీ గొడవలు కొన్ని గంటలు లేదా రోజుల్లోనే తగ్గిపోతాయి.


romance 4


10. ఐ లవ్ యూ చెప్పకపోయినా.. మీపై ప్రేమను చాటుతుంటాడు..


తను మీపై ప్రేమను చూపుతూ ఉంటాడు. మాటిమాటికీ "ఐ లవ్ యూ" అంటూ చెప్పకపోయినా మీపై ప్రేమ ఉన్నట్లే.. కానీ ఒకవేళ ఐ లవ్ యూ చెప్పాడంటే తనకు మీ మీదున్న ప్రేమ మరింతగా పెరిగిపోయిందన్నమాట.


ఇవి కూడా చదవండి.


ఉత్తమ భర్తలు అంటే వీరేనేమో.. ఎందుకో తెలుసా?


మీ బాయ్ ఫ్రెండ్‌కి గడ్డం ఉందా? అయితే ముద్దుపెట్టే ముందు మరోసారి ఆలోచించండి..!


మగవాళ్ల గురించి.. ఈ విషయాలు పెళ్లి తర్వాతే తెలుస్తాయి..!


Gifs : Giphy.