ADVERTISEMENT
home / సౌందర్యం
చర్మ, కేశ సౌందర్యాన్ని.. మరింత పెంచే పెరుగు బ్యూటీ ప్యాక్స్..!

చర్మ, కేశ సౌందర్యాన్ని.. మరింత పెంచే పెరుగు బ్యూటీ ప్యాక్స్..!

పెరుగు (curd).. ప్రోబయాటిక్స్ నిండి ఉన్న ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ ఆరోగ్యాన్నిస్తుందని మనందరికీ తెలుసు. అయితే దీని ప్రయోజనాలు ఆరోగ్యం వరకే పరిమితం కాలేదు. సౌందర్యపరంగానూ దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మన వంట గదిలో మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే పెరుగును ఉపయోగించి వేసుకొనే.. కొన్ని ఫేస్ ప్యాక్‌ల కారణంగా చర్మం (skin) అందంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.

అంతేకాదు.. వయసు కారణంగా చర్మంపై ఏర్పడే ముడతలను సైతం తగ్గిస్తుంది. ముఖ్యంగా వేసవిలో మనం ఎదుర్కొనే చర్మసమస్యలకు చక్కటి పరిష్కారంగా పెరుగు ఉపయోగపడుతుంది. చర్మానికి మాత్రమే కాదు కురులకూ (hair) ఇది మేలు చేస్తుంది. చర్మం, జుట్టు సంరక్షణ విషయంలో పెరుగు ఏవిధంగా మనకు దోహదపడుతుందో తెలుసుకొందాం. 

ట్యాన్ తొలగించుకోవడానికి:

రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టేబుల్ స్పూన్ తేనె కలిపి మిశ్రమంగా చేయాలి. ఆ తర్వాత.. క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకొని టవల్‌తో తుడుచుకోవాలి. అనంతరం పెరుగు, తేనె మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొంటే చర్మంపై ఉన్న ట్యాన్ తొలిగిపోతుంది. ఈ మిశ్రమాన్ని వారానికోసారి అప్లై చేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

ADVERTISEMENT

మొటిమలు తొలగించుకోవడానికి:

చిన్న గిన్నెలో టేబుల్ స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ శెనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ మాదిరిగా అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఈ ప్యాక్ వారానికోసారి వేసుకోవడం వల్ల చర్మం సున్నితంగా తయారవడంతో పాటు మొటిమలు, వాటి వల్ల ఏర్పడిన మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి.

బేకింగ్ సోడా వల్ల కలిగే సౌందర్య ప్రయోజనాలు

3-curd-for-skin-and-hair

ADVERTISEMENT

చర్మం ప్రకాశవంతంగా తయారవడానికి:

టేబుల్ స్పూన్ పెరుగులో పావు టేబుల్ స్పూన్ పసుపు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. పసుపులో ఉన్న యాంటీసెప్టిక్ గుణాలు మొటిమలు రాకుండా కాపాడటంతో పాటు.. పసుపు మేనిఛాయను సైతం పెంచుతాయి. వారానికోసారి ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.

చర్మం జిడ్డుగా మారకుండా ఉండటానికి:

రెెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిని సరిపడినంత పెరుగులో కలిపి మిశ్రమంగా చేయాలి. ఇది చాలా చిక్కగా ఉందనిపిస్తే మరికాస్త పెరుగును కలపొచ్చు. దీన్ని ముఖానికి దట్టంగా ఫేస్ ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఈ ప్యాక్ చర్మంపై అధికంగా ఉన్న నూనెలను తొలగించి ముఖాన్ని తాజాగా కనిపించేలా చేస్తుంది.

ADVERTISEMENT

స్క్రబ్ చేసుకోవడానికి:

టీస్పూన్ పెరుగులో టీస్పూన్ చక్కెర కలిపి ముఖంపై సమానంగా పరుచుకొనేలా రాసుకోవాలి. పావుగంట తర్వాత మెల్లగా రుద్దుకొంటూ ప్యాక్‌ను తొలగించాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మురికి, బ్లాక్ హెడ్స్ తొలగిపోవడంతో పాటు చర్మం సైతం సున్నితంగా తయారవుతుంది. వారంలో రెండు మూడు సార్లు పెరుగు, పంచదార మిశ్రమంతో చర్మాన్ని స్క్రబ్ చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.

1-curd-for-skin-and-hair

పొడిబారిన చర్మానికి:

ADVERTISEMENT

తరచూ చర్మం పొడిబారే సమస్యతో బాధపడేవారికి పెరుగు చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది. పెరుగు చర్మానికి అవసరమైన తేమను అందించి పొడిబారకుండా కాపాడుతుంది. దీని కోసం పెరుగులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. రోజూ ఇలా చేయడం ద్వారా కొన్ని రోజుల్లోనే చర్మం పొడిబారే సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

ముడతలు తగ్గించడానికి:

మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె వేసి రెండూ పూర్తిగా కలిసేంత వరకు కలపాలి. ఆపై ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఈ ప్యాక్ వయసు పెరగడం కారణంగా ముఖంపై ఏర్పడిన గీతలు, ముడతలను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.

ఎక్స్ఫోలియేట్ చేసుకోవడానికి:

ADVERTISEMENT

మూడు టేబుల్ స్పూన్ల ఎర్రచందనం పొడి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని ఈ రెండింటినీ మిశ్రమంగా కలపాలి. మీది పొడి చర్మమైతే దీనితో.. కొన్ని చుక్కల తేనెను కలుపుకోవాలి. జిడ్డు చర్మమైతే కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌లా వేసి పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఈ ప్యాక్‌ను తరచూ అప్లై చేసుకోవడం ద్వారా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

కురుల అందానికి:

2-curd-for-skin-and-hair

పెరుగుతో హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం ద్వారా జుట్టు రాలకుండా చూసుకోవచ్చు. చుండ్రు సమస్యతో బాధపడేవారు పెరుగు ఉపయోగిస్తే తక్కువ సమయంలోనే ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. పైగా జుట్టు సైతం ఆరోగ్యంగా తయారవుతుంది.

ADVERTISEMENT

చుండ్రు పోగొట్టుకోవడానికి:

కప్పు పెరుగులో ఐదు టీస్పూన్ల మెంతుల పొడి, టీస్పూన్ నిమ్మరసం కలపాలి. బ్రష్ సాయంతో ఈ మిశ్రమాన్ని జుట్టుకు మాస్క్‌లా వేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. 40 నిమిషాల తర్వాత మైల్డ్ హెర్బల్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు చొప్పున నెలరోజులు పాటిస్తే.. చుండ్రు సమస్య తగ్గిపోవడంతో పాటు జుట్టు కూడా ఆరోగ్యంగా తయారవుతుంది.

జుట్టు రాలకుండా ఉండటానికి:

15 నుంచి 20 వరకు మందార పూలు, పది  వేపాకులు తీసుకొని వాటిని మెత్తని పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ పేస్ట్‌లో కప్పు పెరుగు, కొద్దిగా నారింజ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని మరోసారి కలిపి తలకు ప్యాక్‌లా వేసుకోవాలి. అనంతరం అరగంట తర్వాత షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాల్సి ఉంటుంది. ఈ ప్యాక్ జుట్టును ఒత్తుగా మారేలా చేస్తుంది.

ADVERTISEMENT

Images: Instagram, Shutterstock

ఇవి కూడా చదవండి:

కళ్ల కింద నల్లటి వలయాలా? తేనెతో వాటిని దూరం చేసుకోవచ్చు

సహజమైన ఈ చిట్కాలు.. మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి

ADVERTISEMENT

జుట్టు ఎక్కువగా రాలుతోందా? అయితే ఈ నేచురల్ టిప్స్ మీకోసమే..

06 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT