ఆ సౌఖ్యాన్ని పెంచే లూబ్రికెంట్ గురించి.. తెలుసుకోవాల్సిన విషయాలు..!

ఆ సౌఖ్యాన్ని పెంచే లూబ్రికెంట్ గురించి.. తెలుసుకోవాల్సిన విషయాలు..!

ఎంత బాగా లూబ్రికేట్ అయితే.. అంత బాగా సెక్స్‌ను ఎంజాయ్ చేయచ్చు. దీన్ని సక్సెస్ ఫుల్ సెక్స్ మంత్రగా చెప్పుకోవచ్చు. భాగ‌స్వాములిద్ద‌రికీ లూబ్రికేషన్ బాగున్నప్పుడు.. శృంగారం ఎక్కువ సమయం ఆస్వాదించగలుగుతారు. కాకపోతే అన్ని సార్లు ఇద్దరికీ లూబ్రికేషన్ జరగాలని లేదు. కొన్ని కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో లూబ్రికేషన్ జరగకపోవచ్చు.


అలాంటి సందర్భంలోనే లూబ్రికెంట్స్ (lubricants) వాడుతుంటారు. వీటినే లూబ్ (lube) అంటారు. ఇవి శృంగార ఆటను(sex) మరింత రక్తి కట్టిస్తాయి. సాధారణంగా కలయిక సమయంలో కొంతమంది మహిళల్లో వచ్చే నొప్పిని ఇవి తగ్గిస్తాయి. అవసరమైన సమయంలో అక్కరొకచ్చే ఈ లూబ్రికెంట్స్ గురించి ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే. దానిపై ఉన్నఅపోహలు తొలగించుకోవాల్సిందే.


1.లూబ్రికెంట్స్ ఎన్ని రకాలు?


సాధారణంగా లూబ్రికెంట్స్ అన్నీ ఒకే రకమని భావిస్తుంటారు. కానీ అందులోనూ విభిన్న రకాలకు చెందినవి ఉంటాయి. వాటిని ఉపయోగించే విధానం సైతం వేర్వేరుగా ఉంటుంది. అయితే వాటర్ బేస్ట్ లూబ్రికెంట్స్‌ను ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు. ఇందులో రెండు రకాలున్నాయి. గ్లిజరిన్ ఉన్నవి, గ్లిజరిన్ లేనివి. ఇవి చాలా పలుచగా ఉండటంతో పాటు శుభ్రం చేసుకోవడం సులభం. సాధారణంగా గ్లిజరిన్ లేని వాటిని ఉపయోగించడం మంచిది. ఎందుకంటే. గ్లిజరిన్‌లో ఉండే చక్కెర వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. 


సిలికాన్‌తో తయారు చేసిన లూబ్రికెంట్స్ కాస్త చిక్కగా ఉన్నప్పటికీ వాటిని ఉపయోగిచడం వల్ల  ఎక్కువ సమయం సెక్స్‌లో పాల్గొనవచ్చు. కండోమ్ ఉపయోగించినప్పుడు సిలికాన్ లూబ్రికెంట్స్ ఉపయోగించవచ్చు.


ఆయిల్ బేస్డ్ లూబ్రికెంట్స్ కూడా ఉంటాయి. కానీ ఇవి దొరకడం చాలా కష్టమేనని చెప్పుకోవాలి. వాటికి బదులుగా సహజసిద్దమైన ఉత్పత్తులైన కొబ్బరి నూనె, పెట్రోలియం జెల్లీ ఉపయోగించవచ్చు. కాకపోతే వీటివల్ల వచ్చే సమస్య ఏంటంటే.. లాటెక్స్ కండోమ్స్ చిరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శుభ్రం చేసుకోవడం కూడా కష్టమవుతుంది.


2. లూబ్రికెంట్ ఎలా ఉపయోగించాలి?


కండోమ్ ఉపయోగించినప్పుడు సీమెన్ రిజర్వాయర్ (బుడిపెలా ఉండే భాగం)లో కొద్దిగా లూబ్రికెంట్ వేయాలి. దీనివల్ల కండోమ్, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడదు. దీనివల్ల మీ భాగస్వామి శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొంటున్నట్లయితే.. పురుషాంగంపై లూబ్రికెంట్ రాసి ఆ తర్వాత పని మొదలుపెట్టాల్సి ఉంటుంది. లూబ్రికెంట్ ఉపయోగించడం  వల్ల.. సెక్స్ చాలా స్మూత్‌గా జరగడంతో పాటు అక్కడి చర్మం రాపిడికి గురి కాదు.


3. లూబ్రికెంట్ వల్ల గర్భం దాల్చకపోవడం అంటూ ఏమీ ఉండదు


మీ లూబ్రికెంట్లో స్పెర్మిసైడ్ ఉంటే గర్భం రాదు. లేదంటే లూబ్రికెంట్స్ వల్ల ఫలధీకరణం చెందడం ఆగిపోదు. కానీ లూబ్రికెంట్ వల్ల శుక్ర కణాల వేగం మందగిస్తుంది. కానీ దాని వల్ల గర్భం రాకుండా ఉంటుందని ఎక్కడా నిరూపితమవ్వలేదు.


4. పంప్ బాటిల్సే ఉత్తమం


పంప్ బాటిల్స్, స్ర్కూ టాప్ బాటిల్స్‌లో లభిస్తుంది. మరి ఈ రెండింటిలో పంప్ బాటిల్స్ కొనుగోలు చేయడమే ఉత్తమం. పంప్ బాటిల్ నుంచి లూబ్రికెంట్ తీసుకోవడం సులభం. పైగా రెండు చేతులకు లూబ్రికెంట్ రెండు చేతులకు అంటదు.


4 lube sex


5. సిలికాన్ లూబ్రికెంట్స్‌ను.. సిలికాన్ సెక్స్ టాయ్స్‌‌తో ఉపయోగించకూడదు..


సిలికాన్ సెక్స్ టాయ్స్ మీరు ఉపయోగిస్తున్నట్లయితే దానికోసం వాటర్ బేస్డ్ ల్యూబ్రికెంట్ ఉపయోగించాల్సి ఉంటుంది. సిలికాన్ ల్యూబ్ ఉపయోగించడం వల్ల సిలికాన్ సెక్స్ టాయ్స్ పాడవుతాయి. ఈ సిలికాన్ ల్యూబ్‌ను సిలికాన్ కండోమ్‌తో ఉపయోగించవచ్చు. దానివల్ల ఎలాంటి నష్టమూ ఉండదు.


6. మాస్టర్బేషన్ (హస్తప్రయోగం)కు.. ఆయిల్ బేస్డ్ లూబ్రికెంట్స్ ఉత్తమం


లాటెక్స్ కండోమ్ లేదా సిలికాన్ కండోమ్ ఉపయోగిస్తున్నప్పుడు ఆయిల్ బేస్డ్ లూబ్రికెంట్ ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కండోమ్ చిరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ తరహా లూబ్రికెంట్స్‌ను హ్యాండ్ జాబ్, బ్లో జాబ్ లేదా మాస్టర్బేషన్ కోసం వాడేటప్పుడు.. ఆయిల్ బేస్డ్ లూబ్స్ ఉపయోగించవచ్చు. అయితే సింథటిక్ ఆయిల్ బేస్డ్ లూబ్రికెంట్స్ కంటే నేచురల్ ఆయిల్ బేస్డ్ లూబ్రికెంట్స్ ఉపయోగించడమే మంచిది. సింథటిక్ లూబ్రికెంట్స్ వల్ల అక్కడ దురద, మంట వచ్చే అవకాశం ఉంది.


7. వీటికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది


అన్ని వస్తువుల మాదిరిగానే లూబ్రికెంట్స్‌కి సైతం ఎక్స్పైరీ తేదీ ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద బాటిల్స్ కాకుండా చిన్న సైజులో ఉన్నవి తీసుకోవడం మంచిది. బాటిల్ మూత తెరచిన తర్వాత నిర్ణీత వ్యవధి లోపలే వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అది ఉపయోగించడానికి పనికి రాదు.


7 lube sex


8. గది ఉష్టోగ్రతల్లోనే భద్రపరచాలి


లూబ్రికెంట్‌కు గాలి సోకితే అది వెంటనే పాడయిపోతుంది. కాబట్టి దాని మూత ఎప్పుడూ గట్టిగా బిగించే ఉంచాలి. అలాగే గది ఉష్ణోగ్రతల్లోనే దాన్ని భద్రపరచాలి. అవసరమైనప్పుడు మాత్రమే బాటిల్ మూత తెరవాల్సి ఉంటుంది. లేదంటే అది ఉపయోగించడానికి వీల్లేకుండా అయిపోతుంది. పంప్ బాటిల్స్ ఉపయోగించడం వల్ల ఈ సమస్య తలెత్తదు.


9. దేనితో తయారుచేశారో కూడా తెలుసుకోవాలి


మనం ఏదైనా కొనుగోలు చేస్తున్నప్పుడు దాన్ని తయారుచేయడానికి ఏ పదార్థాలు ఉపయోగించారు? ఎక్స్పైరీ తేదీ ఏంటి? తదితర విషయాలన్నీ పరిశీలిస్తాం. అదే మాదిరిగా లూబ్రికెంట్‌కి సైతం లేబుల్ చెక్ చేయాల్సి ఉంటుంది. పారాబెన్స్, సింథటిక్ ఫ్రాగ్రెన్స్, ప్రొపలిన్ గ్లైకాల్ వంటి వాటితో తయారైన వాటిని ఉపయోగించకూడదు. వీటివల్ల జననాంగాల ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశం ఉంది. అలాగే ఫ్లేవర్డ్ లూబ్స్ కూడా ఉపయోగించకూడదు. వీటివల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.


10 lube sex


10. సెక్స్‌లో పాల్గొనే ప్రదేశాన్ని బట్టి లూబ్రికెంట్


చెమట ఎక్కువగా పట్టే ప్రదేశాల్లో లేదా షవర్ కింద శృంగారంలో పాల్గొనేటప్పుడు వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ వాడకూడదు. ఇలాంటి చోట్ల సిలికాన్ బేస్డ్ లూబ్ ఉపయోగించాల్సి ఉంటుంది.


11. లూబ్రికెంట్‌ను స్వయంగా మీరే తయారు చేసుకోవచ్చు


నిజమండీ.. లూబ్రికెంట్ తయారు చేసుకోవడం చాలా సులభం కూడా. దీనికోసం కావాల్సినవి నీరు, అవిశె గింజలు. ఈ రెండిటినీ కలిపి మరిగిస్తే సహజసిద్ధమైన లూబ్రికెంట్ రెడీ అవుతుంది. మీకు అవసరమైనప్పుడల్లా దీన్ని తయారుచేసుకోవచ్చు.


12. మరకలు ఏర్పడవచ్చు


లూబ్రికెంట్ ఉపయోగించడం వల్ల దుస్తులు, దుప్పట్లపై మరకలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయిల్ బేస్డ్ లూబ్రికెంట్స్ వల్ల మరకలు ఏర్పడతాయి. కాబట్టి వీటిని వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.


13 lube sex


Featured Image: Shutterstock


GIFs: Giphy


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీక్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.