ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
డిగ్రీ పూర్తి చేశారా.. అయితే మీకోసమే ఈ టాప్ 10 కెరీర్ ఆప్షన్స్

డిగ్రీ పూర్తి చేశారా.. అయితే మీకోసమే ఈ టాప్ 10 కెరీర్ ఆప్షన్స్

ఈ రోజుల్లో అందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులే చేస్తున్నారు. ఈ క్రమంలో సాధారణ డిగ్రీలైన బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి కోర్సులు చేస్తున్న వారికి.. సరైన కెరీర్ ఆప్షన్స్ (Career Options) లేవనే ఓ అపోహ ఉంది. కానీ అది నిజం కాదు. కేవలం డిగ్రీ చేసి కూడా.. మనం కెరీర్‌‌లో ఎదగచ్చు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. దానిని చేరుకోవడానికి ప్రయత్నించవచ్చు.

ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న వారికి దీటుగా మనమూ పలు రంగాల్లో రాణించవచ్చు. ఈ క్రమంలో మనం కూడా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ ఎంచుకుంటే బాగుంటుందో చూసేద్దామా..!

పోస్ట్ గ్రాడ్యుయేషన్  (Post Graduation) – డిగ్రీ తర్వాత ప్రతీ ఒక్కరూ స్వతహాగా ఆలోచించే విషయం పోస్టు గ్రాడ్యుయేషన్ చేయడం. తాము డిగ్రీలో చదువుకున్న సబ్జెక్టుని బట్టి ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ లాంటి కోర్సులను విద్యార్థులు ఎంచుకుంటారు. ఈ కోర్సులు కొందరు రెగ్యులర్‌గా చేస్తే.. మరికొందరు కరస్సాండెన్స్ రూపంలో కూడా చేస్తుంటారు.

అయితే ఈ కోర్సులు చేయడంతో పాటు సబ్జెక్టు నాలెడ్జి పెంచుకోవడానికి, ప్రాక్టికల్ అనుభవం గడించడానికి విద్యార్థులు ప్రయత్నించాల్సి ఉంటుంది. అందుకోసం తమ యూనివర్సిటీలో తమ సబ్జెక్టులపై ఏవైనా సెమినార్లు లేదా వర్క్ షాపులు నిర్వహించినప్పుడు విరివిగా పాల్గొనాలి. మీరు చదివే ప్రతీ అంశాన్ని బాగా అధ్యయనం చేయాలి. సబ్జెక్టుపై ఎంత పట్టు ఉంటే.. మీరు కెరీర్‌లో అంత బాగా రాణించగలరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

ADVERTISEMENT

 

via GIFER

ఎంబీఏ (MBA) – నేడు డిగ్రీ చేసిన వారికి ప్రధానంగా కనిపిస్తున్న మొట్టమొదటి ఆప్షన్ ఎంబీఏ (మాస్టర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్). నేడు ఎంబీఏలు అన్ని కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయి. కానీ క్యాట్ (CAT) వంటి ఎంట్రెన్స్ టెస్టులు రాసి ఐఐఎం వంటి ప్రీమియర్ ఇనిస్టిట్యూట్స్‌లో సీటు తెచ్చుకోవడానికి.. అహర్నిశలు కష్టపడే విద్యార్థులు కూడా కనిపిస్తారు. అయితే మంచి ఎంట్రప్రెన్యూర్‌గా రాణించాలంటే.. ఐఐఎంలోనే చదవాలని రూలేమీ లేదు.

సబ్జెక్టు మీద మంచి పట్టు ఉండి.. భవిష్యత్తులో ఏం చేయాలో ఒక అవగాహన ఉంటే.. మామూలు కాలేజీలో కూడా ఎంబీఏ చేయవచ్చు. ఎంబీఏ విద్యార్థులు థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జి కూడా చాలా ముఖ్యమేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంబీఏలో హెచ్ఆర్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, మార్కెటింగ్.. ఇలా అనేక ఆప్షనల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన దాన్ని మీరు ఎంచుకోవచ్చు. నేడు పలు కాలేజీలు తమ విద్యాలయాల ద్వారా ఎంబీఏ చేసే విద్యార్థుల కోసం క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నాయి.

ADVERTISEMENT

 

via GIFER

జర్నలిజం (Journalism) – డిగ్రీ చేసిన వారిని నేడు ప్రధానంగా ఆకర్షిస్తున్న ఫీల్డ్ జర్నలిజం అని చెప్పవచ్చు.జర్నలిజం చేయాలని భావించే విద్యార్థులు, వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించే పీజీ ఎంట్రెన్స్ టెస్టులు రాసి.. మాస్టర్స్ ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్సులు చేయవచ్చు.

అలాగే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, ఏషియన్ జర్నలిజం స్కూలు లాంటివి అఖిల భారతీయస్థాయిలో కూడా ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహిస్తున్నాయి. వాటిని కూడా రాయవచ్చు.

ADVERTISEMENT

ఇవే కాకుండా నేడు పలు పత్రికలు, టీవీ ఛానల్స్ తమ పరిధిలో ప్రైవేటు జర్నలిజం స్కూల్స్ నడుపుతున్నాయి. అలాగే పలు విశ్వవిద్యాలయాలు కరస్పాండెన్స్ ద్వారా జర్నలిజం కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వాటిల్లో కూడా చేరవచ్చు.

 

via GIFER

లా (న్యాయశాస్త్రం) (Law) – దక్షిణాదిలో న్యాయశాస్త్రంలో నేడు డిగ్రీ చేస్తున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారో చెప్పలేం కానీ.. నార్త్‌లో ఇప్పటికీ ఇంజనీరింగ్, మెడిసిన్ తర్వాత బాగా పాపులారిటీ దక్కించుకున్న కోర్సులుగా ఎల్‌ఎల్‌బీ, బీఎల్ కోర్సులను చెప్పుకోవచ్చు. నేడు డిగ్రీ చేసిన వారికి, లా అనేది మరో కెరీర్ ఆప్షన్‌గా మారుతోంది.

ADVERTISEMENT

ముఖ్యంగా అనేక లీగల్ ఏజెన్సీలు ప్రతీ సంవత్సరం వందలాది లా గ్రాడ్యుయేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. లీగల్ ట్రాన్స్‌క్రిప్షన్ రంగంలో కూడా లా కోర్సులు చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి.. లా డిగ్రీ చేస్తే స్వంత ప్రాక్టీసు మాత్రమే పెట్టుకోవాలి అన్న రూలేమీ లేదు. మీ ప్రతిభను బట్టి ప్రైవేటు రంగంలో కూడా మంచి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు.

 

via GIFER

బీఎడ్ (టీచింగ్ కోర్సులు) (Teaching) – డిగ్రీ చేసిన తర్వాత ప్రతీ ఒక్కరికి చేరువవుతున్న మరో కెరీర్ ఆప్షన్ టీచింగ్. అందుకే టీచింగ్ రంగంలో రాణించాలని భావించేవారు బీఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సులు చేస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ, మోడల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సిద్ధమవుతూ, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందుతున్నారు.

ADVERTISEMENT

నేడు ప్రైవేటు విద్యాలయాల్లో కూడా బీఎడ్ చేసినవారికి మంచి కెరీర్ ఆప్షన్సే ఉన్నాయి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండి.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులు బోధించడంలో మంచి నాలెడ్జి ఉన్న ఇండియన్ టీచర్స్‌కి విదేశాల్లో కూడా మంచి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి.

కేవలం డిగ్రీతోనే మంచి ఉపాధి అవకాశాలు..!
చాలామంది కుటుంబ లేదా ఆర్థిక పరిస్థితుల వల్ల కేవలం డిగ్రీతోనే చదువు ఆపేసి.. ఉపాధి కోసం ఆలోచించిన యెడల వారు నిరుత్సాహపడనవసరం లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటే.. పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా ఉద్యోగాలు పొందవచ్చు.

 

via GIFER

ADVERTISEMENT

కస్టమర్ సర్వీస్/బీపీఓ (Customer Service) – నేడు హెచ్‌ఎస్‌బీసీ, సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి విదేశీ బ్యాంకులు… భారతదేశంలో ఉన్న తమ కాల్ సెంటర్స్‌లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థుల కోసం ఎప్పటికప్పుడు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి.

ఇలాంటి ఉద్యోగాలకు డిగ్రీ చేసినవారు కూడా అప్లై చేయవచ్చు. అలాగే మల్టీ నేషనల్ కంపెనీలైన అమెజాన్, థామ్సన్ రాయ్‌టర్స్ లాంటివి కూడా ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. రానున్న కాలంలో భారతదేశంలో బీపీఓ రంగంలో జాబ్స్ మరిన్ని పెరిగే అవకాశం ఉందనేది ఒక అంచనా.

 

via GIFER

ADVERTISEMENT

ప్రైవేటు బ్యాంకింగ్/ఇన్సూరెన్స్ (Banking and Insurance) – భారతదేశంలో ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో దిగ్గజాలైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి సంస్థలు.. డిగ్రీ పాసై బ్యాంకింగ్ రంగంలోకి రావాలని భావించే యువత కోసం ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. అలాగే బిర్లా లైఫ్, ఎక్సైడ్, టాటా వంటి సంస్థలు ఇన్సూరెన్స్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావించే యువత కోసం కూడా మంచి ఉపాధి అవకాశాలనే అందించడం గమనార్హం.

 

via GIFER

ప్రభుత్వ ఉద్యోగాలు (Government Jobs) – అలాగే నేడు కేవలం డిగ్రీతోనే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి. కాకపోతే అభ్యర్థులు డిగ్రీతో పాటు అదనంగా పలు కంప్యూటర్, టైప్ రైటింగ్ కోర్సులు చేయాల్సి ఉంది. ఇలాంటి కోర్సులు చేస్తే, స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నిర్వహించే స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సులభంగా అప్లై చేసుకోవచ్చు.

ADVERTISEMENT

అలాగే ఆర్ఆర్‌బీ (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు), ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్‌బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వంటి ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహించే పరీక్షలకు కూడా హాజరు కావచ్చు. అలాగే అఖిల భారత స్థాయిలో నిర్వహించే సివిల్స్ పరీక్షలు కూడా రావచ్చు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే గ్రూప్ 1, గ్రూపు 2  ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

via GIFER

ఫిల్మ్ స్టడీస్/చలనచిత్ర రంగం (Film Studies) – నేడు డిగ్రీ చేసిన యువతను ఆకర్షిస్తున్న మరో రంగం చలనచిత్ర రంగం. ఈ రంగంలో రాణించాలని భావించే యువత పూణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, సత్యజిత్ రే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ వంటి ప్రభుత్వ సంస్థలు నిర్వహించే కోర్సుల్లో చేరవచ్చు. అయితే అఖిల భారతీయ స్థాయిలో ఎంట్రెన్స్ రాయాలి. నేడు అనేక ప్రైవేటు సంస్థలు కూడా ఫిల్మ్ స్టడీస్‌లో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు కూడా ఆఫర్ చేస్తున్నాయి. అందులో కూడా చేరవచ్చు.

ADVERTISEMENT

 

via GIFER

స్టార్టప్స్ ప్రారంభించడం  (Startups and Innovation) – మంచి తెలివితేటలు కలిగి.. మంచి ప్రాజెక్టులకు ఐడియాలు ఇవ్వగలిగే యువతకు విద్యార్హతలతో సంబంధం లేకుండా.. అనేక మల్టీ నేషనల్ కంపెనీలు అవకాశాలు కల్పిస్తున్నాయి. తగిన ఫండింగ్‌ను సమకూరుస్తున్నాయి. కనుక మీరు కూడా ఓ మంచి స్టార్టప్ ప్రారంభించి ప్రారంభించాలని భావిస్తే.. లోకల్ స్టార్టప్ కమ్యూనిటీలు నిర్వహించే వర్క్‌షాపులకు హాజరుకావడం మర్చిపోవద్దు.

రిలయెన్స్ నిర్వహిస్తున్న జియో జెన్ నెక్స్ట్, టాటా కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇన్నోవర్స్, భారత ప్రభుత్వం  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా ఇన్నోవేట్స్ మొదలైనవన్నీ యంగ్ ఎంట్రప్రెన్యూర్స్‌ని ప్రోత్సహించే పథకాలే. మీ వద్ద మంచి ఐడియాలుంటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు.

ADVERTISEMENT

చూశారుగా.. మనసుంటే మార్గముంది అన్నట్లు కేవలం డిగ్రీతోనే.. ఎన్నెన్ని అవకాశాలు పొందవచ్చో మనం తెలుసుకున్నాం కదా. మరికెందుకు ఆలస్యం.. మీరు కూడా మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని కెరీర్‌లో దూసుకుపోండి.

ఇవి కూడా చదవండి

ఆ ఆత్మహత్యలకు కారణం ఎవరు? చదువుల ఒత్తిడా? అధికారుల నిర్లక్ష్యమా?

వార్డెన్ గారూ.. అమ్మాయిలకో రూల్.. అబ్బాయిలకో రూలా? ఇక అలా కుదరదు

ADVERTISEMENT

గ్లామర్ ప్రపంచాన్ని వదిలి.. ఇండియన్ ఆర్మీకి సేవలందిస్తున్న బ్యూటీ క్వీన్..!

 

 

04 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT