ADVERTISEMENT
home / వెల్‌నెస్
గర్ల్ ఫ్రెండ్ పీరియడ్స్ ఆలస్యమైతే.. బాయ్ ఫ్రెండ్ ఏం ఆలోచిస్తాడంటే..!

గర్ల్ ఫ్రెండ్ పీరియడ్స్ ఆలస్యమైతే.. బాయ్ ఫ్రెండ్ ఏం ఆలోచిస్తాడంటే..!

పీరియడ్ (period) ఆలస్యమైతే అమ్మాయిలకే కాదు.. కొన్నిసార్లు అబ్బాయిలకు కూడా కంగారు వస్తుంటుంది. నిజానికి అది కంగారు అనే కంటే భయమనే చెప్పుకోవాలి. ఈ పరిస్థితి చాలా మంది అబ్బాయిలకు చాలా సార్లే వస్తుంది.

ముఖ్యంగా సెక్స్‌లో పాల్గొన్న సందర్భంలో కండోమ్ ఉపయోగించనప్పుడు ఈ భయం మరీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వారి మెదడుని ఎన్నో ప్రశ్నలు తొలిచేస్తుంటాయి. మరెన్నో ఆలోచనలు (thoughts) వస్తుంటాయి. ఏదో తెలియని భయం వారిని పట్టి పీడిస్తుంది.

ఆ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్‌కి పీరియడ్స్ వచ్చాయని తెలిసి ఊపిరి పీల్చుకొన్నా.. ఆ భయం మాత్రం ఓ పట్టాన వదలిపెట్టదు. అసలు పీరియడ్స్ రాలేదని అమ్మాయి చెప్పినప్పుడు వారి మనసులో ఏమనుకొంటారో ఓ లుక్కేద్దాం.

1. దేవుడా.. ప్లీజ్ నాతో ఆడుకోకు.

ADVERTISEMENT

2. వచ్చే నెల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈ స్ట్రెస్ భరించడం నా వల్ల కాదు.

3. పీరియడ్స్ రావడం లేటయిందా? ఎన్ని రోజులు లేటయితే పీరియడ్స్ లేటయిందంటారు?

4. పీరియడ్స్ ఇంకా రాలేదా అని అడిగితే నన్ను చంపేస్తుందేమో.

5. తనేంటి కొంచెం తేడాగా కనిపిస్తోంది.

ADVERTISEMENT

5-period-is-late-thoughts

6. తన కోపం చూస్తుంటే పీఎంఎస్‌లా అనిపిస్తుంది. అంటే తనకి పీరియడ్ వచ్చేస్తుంది. అంటే నేను కంగారు పడక్కర్లేదు.

7. ఇప్పుడు నేను తనని ఓదార్చలేదంటే.. చాలా భయపడిపోతుంది. లేదా నన్ను చంపేస్తుంది.

8. తనకు పీరియడ్స్ ఇంకా ఎందుకు రావట్లేదు. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఎందుకు రాలేదో తెలిసిపోతుంది కదా.

ADVERTISEMENT

9. ఈ నెల్లో మేం చాలా జాగ్రత్తగా ఉన్నామే.. అయినా ఇలా ఎలా జరుగుతుంది?

10.కండోమ్ వాడాను కదా. అయినా అది 100% పనిచేస్తుందని గ్యారెంటీ లేదు కదా.

10-period-is-late-thoughts

11. మనం చంద్రుడి మీదకు ఎలా వెళ్లాలో కనుక్కొన్నాం కానీ.. గర్భం రాకుండా ఆపగలిగే పూర్తిస్థాయి పద్ధతిని కనుక్కోలేకపోయాం.

ADVERTISEMENT

12. అస్సలు ఇక్కడ నుంచి సెక్స్ అనే మాట ఎత్తితే ఒట్టు.

13. నేనింత కంగారుపడుతున్నాను కానీ.. తనేంటి చాలా కూల్‌గా ఉంది. తనకి భయం వేయడం లేదా? భయం కనబడకుండా కవర్ చేస్తోందా?

14. ఒక వేళ తను కానీ ప్రెగ్నెంట్ అయితే.. నా జీవితం ఇక అయిపోయినట్లే.

15. ఇప్పుడు నేను తనకి తోడుగా నిలబడకపోతే నేను వేస్ట్. ఫోన్ చేసి తనకి కాస్త ధైర్యం చెబుతా.

ADVERTISEMENT

15-period-is-late-thoughts

16. ఇప్పుడు నేనేం చేయాలి? తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలా? ముందు అసలు తను ప్రెగ్నెంట్ అవునో కాదో తేల్చుకొందాం.

17. ఈ విషయం ఇంట్లో తెలిస్తే మా ఇద్దరి పరిస్థితి ఏంటి?

18. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అందరూ ఎలా ఉంటారు? చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారేమో. మరి నేనేంటి ఇలా చిన్నపిల్లాడిలా భయపడిపోతున్నాను?

ADVERTISEMENT

19. సెక్స్‌ను ఎంజాయ్ చేసినప్పుడు దాని పరిణామాలను కూడా నేను అంగీకరించాలి.

20. ముందు తనకు ఫోన్ చేస్తాను. అసలు విషయమేంటో కనుక్కొంటాను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు.

20-period-is-late-thoughts

21. ముందు నేను కూల్‌గా ఆలోచించాలి. లేదంటే భయం పెరిగిపోతుంది.

ADVERTISEMENT

Gifs: Giphy, tumblr  

Featured Image: Shutterstock

ఇవి కూడా చదవండి:

ఆ సౌఖ్యాన్ని పెంచే లూబ్రికెంట్ గురించి.. తెలుసుకోవాల్సిన విషయాలు..!

ADVERTISEMENT

నెల‌స‌రి స‌మ‌యంలో క‌ల‌యిక.. ఆరోగ్యానికి మంచిదేనా?

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

22 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT