ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే.. ఇలా చేయక తప్పదు బ్రదర్..! – (Tips To Impress A Girl In Telugu)

అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే.. ఇలా చేయక తప్పదు బ్రదర్..! – (Tips To Impress A Girl In Telugu)

అమ్మాయి (girl) మనసు గెలుచుకోవాలంటే ఆమెకు విలువైన బహుమతులు ఇవ్వాలనుకొంటారు చాలామంది అబ్బాయిలు. అది నిజం కాదు. అమ్మాయి మనసు గెలుచుకోవాలంటే.. అంతకుమించిన ఎన్నో అద్భుతమైన మార్గాలున్నాయి. గులాబీ పూలు, చాక్లెట్లు ఇస్తేనే ప్రేమ కలుగుతుందనుకొంటే పొరపాటే.

ఇలాంటి వాటి కంటే.. ఆమెపై నిజంగా, నిజాయతీగా మీరు చూపించే అభిమానమే మీపై ప్రేమ కలిగేలా చేస్తుంది. అలా ఆ ప్రేమను పొందాలంటే ప్రేమికుడిగా మీరు ఏం చేయాలి? ఆమెతో ఎలా ప్రవర్తించాలి? ఇతరుల విషయంలో ఎలా మెలగాలి? తెలుసుకొందాం.

సాధారణంగా అబ్బాయిలు (boys) తమకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ (impress) చేయడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో మీరు చేసే కొన్ని పనుల కారణంగా తనను ఆకట్టుకోవడానికే మాత్రమే.. మీరు ఇలా చేస్తున్నారనే విషయాన్ని ఆ అమ్మాయి గ్రహిస్తుంది.

ఒక్కసారి ఆమె ఈ విషయం గుర్తించిందంటే.. ఇక మీరు ఆమెను ఆకట్టుకోవడమనేది జన్మలో జరగని పని. కాబట్టి మీరు ఆమెను పనిగట్టుకొని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించకుండా.. ఆమె మనసును గెలుచుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ చాలా సహజంగా ఉండాలి. దానికోసం ఏం చేయాలో తెలుసుకొందామా?

ADVERTISEMENT

ఒక అమ్మాయి ఆకట్టుకోవడానికి చిట్కాలు

సోషల్ మీడియాలో ఎలా ఉండాలంటే..

ఒక అమ్మాయి ఆకట్టుకోవడానికి 16 చిట్కాలు (16 Effective Tips To Impress A Girl In Telugu)

1. ఆమెతో మాట్లాడండి.. ఆమె మాట వినండి (Talk To Her And Listen To Her)

అమ్మాయిలు (girls) చాలా ఎమోషనల్ అనే చెప్పుకోవాలి. వారికి సంబంధించిన ప్రతి విషయం భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. వారు ఆలోచించేవాటిలో లేదా మీతో పంచుకొనే విషయాల్లో మీకు చాలా వరకు సిల్లీగా అనిపించవచ్చు. ఈ అమ్మాయేంటి ఇలా ఆలోచిస్తుందనిపించవచ్చు.

ఆమె చెబుతున్న విషయాలు మీకు నచ్చకపోయినా సరే ప్రతిదీ మీరు జాగ్రత్తగా వినండి. అవసరమైతే చిన్న చిన్న సజెషన్స్ ఇవ్వండి. తాను చెప్పే కబుర్లన్నీ మీరు శ్రద్ధగా వింటున్నందుకు ఆమె చాలా సంతోషిస్తుంది. ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరు చెప్పేవి మరొకరు వినడం వల్ల మీ ఇద్దరి మధ్య అనుబంధం మీకు తెలియకుండానే బలపడిపోతుంది.

ADVERTISEMENT

8-tips-to-impress-a-girl

Also Read About కొవ్వొత్తుల వెలుగులో రాత్రిపూట భోజనం చేయు

2. కళ్లల్లోకి చూస్తూ మాట్లాడండి (Keep Eye Contact While Talking)

మనసుకి నచ్చిన అమ్మాయిని చూస్తే ఆమె రూపాన్ని కళ్లల్లో పూర్తిగా నింపుకోవడానికి ప్రయత్నిస్తారు అబ్బాయిలు. మీరు ఇష్టపడిన ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకోవాలంటే ఆమెను పై నుంచి కిందకు, కింద నుంచి పైకి స్కాన్ చేయడం ఆపేయండి. ఎందుకంటే మీరు ఇలా చూడటం వల్ల ఆమెకు ఇబ్బందిగా అనిపించవచ్చు.

ఆ తర్వాత మీతో స్నేహాన్ని తగ్గించుకోవచ్చు. అందుకే ఎగాదిగా చూడటం మానేసి నేరుగా ఆమె కళ్లల్లోకి చూస్తూ మాట్లాడండి. ఇలా చేయడం వల్ల మీపై ఆ అమ్మాయికి నమ్మకం కుదురుతుంది. అంతేకాదు.. ఐ కాంటాక్ట్ వల్ల ఇద్దరి మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది.

ADVERTISEMENT

3. మర్యాదపూర్వకంగా వ్యవహరించండి (Be Polite And Be A Gentleman)

ఇతరులతో మర్యాదగా వ్యవహరించే వారినే తమ భాగస్వామిగా ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు అమ్మాయిలు. ఆమెతో మాత్రమే కాదు.. ఇతరుల పట్ల మీరు ప్రవర్తించే విధానం సైతం మీపై ఓ నిశ్చితాభిప్రాయం ఏర్పడటానికి కారణమవుతుంది. కాబట్టి మీ దురుసుతనాన్ని, తూలనాడుతూ మాట్లాడే విధానాన్ని వదిలేయండి. ముఖ్యంగా కిందిస్థాయి వారితో మీరు ప్రవర్తించే విధానమే మీ అసలు స్వరూపానికి కొలమానం.

ఉదాహరణకి మీ ఇద్దరూ రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు మీకు వడ్డించే సర్వర్తో మీరు మాట్లాడే విధానం సైతం ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందరితోనూ మర్యాదగా వ్యవహరించండి. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇతరులతో మర్యాదగా ప్రవర్తిస్తున్నట్టు మాత్రం నటించకండి. కాస్త లేటయినా ఫర్వాలేదు.. ఇతరులను గౌరవించడం, మర్యాదగా మాట్లాడటం అలవాటు చేసుకోండి.

4-tips-to-impress-a-girl

4. ఆమెను నవ్విస్తూ ఉండండి (Make Her Laugh)

అమ్మాయిలకు నవ్వుతూ ఉండటమంటే ఇష్టం. అలాగే సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు. కాబట్టి మీరు కూడా కాస్త ఫన్నీగా ఉండటంలో తప్పులేదు. కానీ ఆ హాస్యం శ్రుతి మించినదిగా ఉండకూడదు. మీరు వేసిన జోక్స్‌కి, పంచ్ డైలాగ్స్‌కి నవ్వు రావాలి తప్ప.. చిరాకు కలిగించేవిగా ఉండకూడదు. కాబట్టి సునిశితమైన హాస్య చతురతను పెంచుకోండి. దాని కోసం మీరు జోక్స్ పుస్తకాలు కొనుక్కొని చదవాల్సిన అవసరం లేదు.

ADVERTISEMENT

మీరు బైక్ మీద వస్తున్నప్పుడో లేదా బస్సులో ఉన్నప్పుడో ఎదురైన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్పండి. చిన్నతనంలో, కాలేజీ రోజుల్లో మీరు చేసిన అల్లరి గురించి వివరించండి. ఆమె ముఖంపై కచ్చితంగా నవ్వులు పూస్తాయి. మీరు మాత్రమే చెప్పి ఊరుకోవడం కాదు. ఆమెను కూడా అడగండి. ఆమె ముఖంలో ఎంత సంతోషం కనిపిస్తుందో మీరే చూడండి.

5. టీజ్ చేయండి.. కానీ బాధపెట్టొద్దు.. (Tease Her But Don’t Hurt Her)

అమ్మాయిలు పైకి చెప్పరు కానీ టీజింగ్ అంటే వారికి ఇష్టమే. నిజం చెప్పాలంటే అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఇదో మంచి పద్ధతి. అయితే టీజ్ చేసే విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్. మీరు చేసే టీజింగ్‌ను ఆమె ఎంజాయ్ చేసేలా ఉండాలి కానీ.. మిమ్మల్ని చూడగానే భయపడి పారిపోయేలా ఉండకూడదు. అలాగే టీజ్ చేసే సమయంలో ఆమెపై మీరు వేసే జోకులు ఆమె తేలిగ్గా తీసుకొనేలా ఉండాలి కానీ.. మీపై కోపం, అసహ్యం కలిగించేవి కాకూడదు.

6. అవసరమైన సందర్భాల్లో ఆమెకు తోడుగా నిలబడండి (Be There When She Needs You)

మీరు ఇష్టపడుతున్న అమ్మాయి ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే.. వాటి నుంచి బయటపడటానికి ఆమెకు అవసరమైన సాయం చేయండి. ఇలా చేయడం వల్ల ఆమె మనసులో మీకో సుస్థిరమైన స్థానం లభిస్తుంది. తన క్షేమం కోసం ప్రయత్నం చేస్తున్న మీపై అభిమానమూ కలుగుతుంది. అంతకుమించి మీకేం కావాలి చెప్పండి. అయితే మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో  నిజాయతీగా వ్యవహరించాలి. అంతేకానీ ఆమెను ఇంప్రెస్ చేద్దామని నటిస్తే మాత్రం మీకే నష్టం జరుగుతుంది.

6-tips-to-impress-a-girl

ADVERTISEMENT

7. వెంటపడి వేధించవద్దు  (Do Not Harass And Chase Her)

ఓ అమ్మాయిని మీరు నిజంగా ప్రేమిస్తుంటే ఆమె వెంటపడి వేధించే ప్రయత్నం మాత్రం చేయకండి. ఆమె వెళ్లే ప్రతి చోటుకు వెళ్లడం.. నిత్యం ఆమె వెనకే తిరగడం వల్ల ఆమె భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరీ క్రేజీగా కాకుండా.. మామూలుగా వ్యవహరించండి. నిజం చెప్పాలంటే.. తమ వెనకెనుకే తిరిగేవారిని అమ్మాయిలు అంతగా ఇష్టపడరు.

అలాంటి వారి పట్ల సదుద్దేశం ఏర్పడదు. అమ్మాయిల గురించి పెద్దగా పట్టించుకోని, తమ పని తాము చేసుకొనే అబ్బాయిలనే ఇష్టపడుతుంటారు. కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి ప్రయత్నించండి.

8. సిన్సియర్‌గా కాంప్లిమెంట్స్ ఇవ్వండి (Give Her Sincere Compliments)

అమ్మాయిలను అభినందించే లేదా వారిని ప్రశంసించే అవకాశం దక్కితే  దాన్ని అస్సలు వదులుకోవద్దు. దాని కోసం మీరేమీ పెద్ద పెద్ద కవితలు రాసుకోవాల్సిన అవసరం లేదు. మన:పూర్వకంగా కంగ్రాట్స్ చెబితే చాలు. అలాగే మీకు ఆమె ఏదైనా సాయం చేస్తే మరచిపోకుండా థ్యాంక్స్ చెప్పండి.

మీరు ఇచ్చే ప్రశంస ఆమె సెల్ప్ కాన్ఫిడెన్స్ పెంచేదిగా ఉండాలి. అలాగే మీరిచ్చే కాంప్లిమెంట్ నిజాయతీగా ఉండాలి. ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె అందాన్ని లేదా ఆమెలో మీరు గమనించిన మంచి లక్షణాలను ప్రశంసించండి. ఇది మీపై మంచి అభిప్రాయాన్ని కలిగేలా చేస్తుంది.

ADVERTISEMENT

3-tips-to-impress-a-girl

9. మరీ ఎక్కువ బిల్డప్పులు ఇవ్వొద్దు (Don’t Give Extreme Buildups)

అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది చాలా నాటకీయంగా ప్రవర్తిస్తుంటారు. ఆమె గురించి పూర్తిగా తెలియకుండానే సర్ప్రైజ్‌లు ఇవ్వాలని చూస్తుంటారు. అలా అయితే ఆమె ఇంప్రెస్ అయిపోతుందని భావిస్తారు. డేటింగ్ చేస్తున్న మొదటి రోజే మీ గురించి మీరు అతిగా చెప్పుకోవడం కూడా మంచిది కాదు. అలా చేయడం వల్ల మీపై ఇంప్రెషన్ ఏర్పడటం పక్కన పెట్టి.. మీ మీద నెగెటివ్ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది.

10. నచ్చినవి.. నచ్చనివి తెలుసుకోండి (Don’t Forget Important Things Of Her)

ఆమె ఫేవరెట్ కలర్, తాను బాగా వినే పాట, తనకు ఇష్టమైన రెసిపీ, ఇష్టం లేని వంటకం ఇలా ఎన్నో ఉంటాయి.  అవి మీకు అంత ముఖ్యమైనవి కాకపోవచ్చు. కానీ ఆమెకు చాలా ముఖ్యమైనవి కదా. అందుకే వాటి గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఏదో మామూలు ప్రశ్నలా అడిగితే ఏం బాగుంటుంది? అందుకే కాస్త ఫన్ జోడించి ఈ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దాని కోసం ఫన్ గేమ్స్ లాంటివి ప్లాన్ చేయండి. దీనిలో మీ ఇద్దరి స్నేహితులను భాగస్వాములను చేయండి. కచ్చితంగా మీపై ఆమెకు మంచి అభిప్రాయం  ఏర్పడుతుంది.

2-tips-to-impress-a-girl

ADVERTISEMENT

11. నలుగురిలోనూ ఎగతాళి చేయద్దు.. (Never Insult Her Especially In Front Of People)

చాలామంది ఇలా చేయడాన్ని గొప్పగా భావిస్తుంటారు. ఇతరులను గేలి చేసి మాట్లాడటం వల్ల తనను అందరూ మెచ్చుకొంటారనే భావనలో ఉంటారు. మీరు ఇష్టపడే అమ్మాయి విషయంలో ఇలా కానీ వ్యవహరిస్తే ఆమె మిమ్మల్ని అసహ్యించుకొనే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే.. ఆమె విషయంలో మీరు సంతోషంగా ఉన్నారని, ఉండాలని భావిస్తుంది. మీరు చేసే ఎగతాళి కారణంగా ఆమె మనసు  బాధపడుతుంది. ఆమెతో మీకు ఏదైనా సమస్య ఉంటే ఆమెతోనే దాని గురించి చర్చించండి. అంతేకానీ.. దాని గురించి నలుగురిలోనూ మాట్లాడొద్దు. మీ ఇద్దరి మధ్య ఉన్న విషయాలు మీ ఇద్దరి మధ్యే ఉంచడానికి ప్రయత్నించండి.

12. చిన్న ప్రయత్నాన్ని సైతం మెచ్చుకోండి (Appreciate Her Even For A Small Thing She Does To You)

మీ మనసు దోచుకొన్న అమ్మాయి మీ కోసం చిన్న పని చేసినా సరే ఆ ప్రయత్నాన్ని మెచ్చుకోండి. అలాగే ఆమె చేసిన పనిని ఆధారంగా చేసుకొని దాన్ని అలుసుగా మాత్రం తీసుకోకండి. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ వర్కవుట్ కావాలంటే కాస్త సమతూకంగా వ్యవహరించడం మంచిది. మీ కోసం ఆమె చేసింది ఎంత చిన్న పనైనా సరే థ్యాంక్స్ చెప్పడం మాత్రం మరిచిపోవద్దు.

13. నిజాయతీగా ఉండండి (Be Honest)

ఏ విషయంలోనైనా సరే చాలా నిజాయతీగా వ్యవహరించండి. అలాగే మీరు ఆమెను ఇష్టపడుతున్నారనే కారణంతో ఆమె చెప్పిన ప్రతిదీ కరెక్టే అని చెప్పి తలాడించడం మాత్రం చేయవద్దు. మీరిలా చేయడం వల్ల మీమీద వ్యతిరేక అభిప్రాయం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు మిమ్మల్ని పరీక్షించడానికి సైతం ఇలా చేసే అవకాశాలున్నాయి.

సాధారణంగా అమ్మాయిలు సొంత అభిప్రాయం కలిగి ఉండి దాన్ని చెప్పడానికి భయపడని అబ్బాయిలను, వారి వ్యక్తిత్వాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాదు.. వారితో మాట్లాడటానికి సైతం ఆసక్తి చూపిస్తారు. సో.. మీకంటూ సొంత ఆలోచన, సొంత అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాగే మీ అభిప్రాయాలను తెలియజెప్పే క్రమంలో రూడ్‌గా మాట్లాడొద్దు. సున్నితంగా అసలు విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించండి.

ADVERTISEMENT

14. మీరు మీలానే ఉండండి.. నటించద్దు (Be Yourself. Don’t Try To Act)

అమ్మాయిని ఇంప్రెస్ చేసే విషయంలో ఇది చాలా ముఖ్యమైనది. మీరు మీలా ఉంటేనే అమ్మాయి మనసులో స్థానం సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మీరేం చెప్పారో వారికి గుర్తుండకపోవచ్చు. మీరేం చేశారో మరచిపోవచ్చు. కానీ మీరు వారి మనసుపై వేసిన ముద్రను మాత్రం ఎప్పటికీ మరచిపోలేరు. కాబట్టి మీరు మీరుగా ఉండటానికే ప్రయత్నించండి. పైగా అలా ఉండటం వల్ల మీరు చాలా కంఫర్టబుల్గా కూడా ఉండగలుగుతారు. అలా కాకుండా అమ్మాయి దగ్గర మీరు నటించాలని ప్రయత్నించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా మీరు నటిస్తున్నారనే విషయం తెలిస్తే మీ మీద ఏర్పడిన ప్రేమ స్థానంలో అసహ్యం ఏర్పడవచ్చు.

15. మీ భావాలను వివరించండి (Communicate Your Feelings)

సాధారణంగా అబ్బాయిలు తమ ఆలోచనలు, భావనలను తమలోనే ఉంచేసుకొంటారు. వాటిని ఇతరులతో పంచుకోవడానికి అంతగా ఆసక్తి చూపించరు. ఆసక్తి చూపించరు అనే కంటే.. తమ మనసులోని భావాలను ఇతరులతో పంచుకోవడమెలాగో వారికి అర్థం కాదు అనడం సరైనదేమో. పైగా ఇది అందరికీ తెలిసిన విషయం కూడా. అయినప్పటికీ మీరు మీ మనసులో ఉన్న భావాలను వ్యక్తీకరించడానికి ప్రయత్నించండి. ఏదైనా సలహా కావాలంటే ఆమెను అడగండి.

5-tips-to-impress-a-girl

16. ఆమెకు అండగా నిలబడండి (Support Her)

కెరీర్, వ్యక్తిగత విషయాల్లో ఆమెకు తోడుగా నిలబడటానికి ప్రయత్నించండి. అలాగని పూర్తిగా మీ మీదే ఆధారపడిపోయేలా మాత్రం చేయకండి. ఇలా చేయడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. కాబట్టి ఆమె పనిని ఆమెనే చేసుకోనివ్వండి. ఏదైనా సాయం అవసరమైతే చేయడానికి వెనకాడవద్దు. అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆమె వెంటే ఉంటాననే భరోసానివ్వండి. అది మాటల్లో కాకుండా చేతల్లోనూ చేసి చూపించండి. అవసరమైన సలహాలు ఇస్తూ ఆమె అభిమానాన్ని చూరగొనండి.

ADVERTISEMENT

సోషల్ మీడియాలో ఎలా ఉండాలంటే.. (How To Impress A Girl On Social Media)

ఇటీవలి కాలంలో ఏమి తెలుసుకోవాలన్నా.. ఏదైనా తెలియజేయాలన్నా.. అందరూ సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. అంటూ ఎప్పటికప్పుడు  అప్డేట్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో పెళ్లిళ్లను సైతం ఫేస్బుక్‌లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారంటేనే వాటి వినియోగం ఎంత ఎక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేనా..? ఈ మధ్య ఎవరి వ్యక్తిత్వం గురించైనా తెలుసుకోవాలన్నా వారి సామాజిక మాధ్యమాలను చెక్ చేస్తున్నారు. వాటిలో పోస్టులు, ఫొటోలు, లైకులు, కామెంట్లు అన్నీ మన ఆలోచనావిధానాన్ని తెలియజేస్తాయి. ఈ క్రమంలో మిమ్మల్ని ఇష్టపడుతున్న అమ్మాయి మీ గురించి తెలుసుకోవడానికి మీ ఫేస్బుక్ ఖాతా చెక్ చేసే అవకాశాలున్నాయి. అందుకే సోషల్ మీడియాను ఉపయోగించి సైతం ఆమె మనసును దోచుకొనే ప్రయత్నం చేయండి.

9-tips-to-impress-a-girl

Image: Unsplash

1. 24 గంటలూ ఆన్‌లైన్‌లో ఉండొద్దు (Using Your Photos In A Right Way (Think Twice Before Posting A Photo))

కొంతమందికి ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటు. తుమ్మినా, దగ్గినా.. కూడా పోస్టులు పెట్టేస్తుంటారు. మీక్కూడా ఇలా చేసే అలవాటు ఉంటే కనుక ఇకపై అలా మాత్రం చేయకండి. ఎందుకంటే ప్రతి పదినిమిషాలకో అప్డేట్ పెట్టడం వల్ల ఇతనికి మరో పనేమీ లేదా అనిపించే అవకాశం ఉంది. అలాగని పూర్తిగా సోషల్ మీడియాకు దూరంగా ఉండమని కాదు. అవసరమైనంత మేర దాన్ని ఉపయోగించుకోవడంలో, యాక్టివ్‌గా ఉండటంలో ఎలాంటి తప్పూ లేదు. కానీ అది అతిగా మారితేనే ఇబ్బంది. కాబట్టి సోషల్ మీడియా విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.

ADVERTISEMENT

2. ఫొటోలు షేర్ చేసేటప్పుడు జాగ్రత్త (Be Confident And Interested To Chat)

సాధారణంగా సోషల్ మీడియాలో మనం అందంగా కనిపిస్తున్న ఫొటోలనే షేర్ చేస్తుంటాం. అప్పుడే కదా మనకు ఎక్కువ లైక్ లు, కామెంట్లు వస్తాయి. పైగా ఫ్రెండ్ రిక్వస్ట్‌లు సైతం ఎక్కువగా వస్తుంటాయి. ఓ అమ్మాయిని సోషల్ మీడియాలో ఇంప్రెస్ చేయాలంటే ఇది సరిపోదు. మీరు ఎంత అందంగా ఉన్నారో చెప్పడం ఎంత ముఖ్యమో.. వ్యక్తిగా మీరేంటన్నది తెలియజేయడం కూడా అంతే ముఖ్యం. మీ స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలు, ట్రావెలింగ్‌కి వెళ్లినప్పుడు తీసుకొన్న ఫొటోలు మీపై మంచి ఇంప్రెషన్ ఏర్పడటానికి కారణమవుతాయి.

3. పోస్ట్ పెట్టే ముందు ఆలోచించండి (Strike Up The Conversation And Keep The Conversation Going)

సోషల్ మీడియాలో మీరు చేసే ప్రతి పోస్ట్ మీ స్నేహితులతో మాత్రమే కాదు.. ఈ ప్రపంచంతో కూడా పంచుకుంటున్నారు అన్న విషయాన్ని మరిచిపోవద్దు. కాబట్టి దేన్నైనా పోస్ట్ చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. మీరు చేసే పోస్టులు పాజిటివ్‌గా, సరదాగా, అందరినీ ఎడ్యుకేట్ చేసే విధంగా ఉంటే కచ్చితంగా మీ మీద మంచి ఇంప్రెషన్ కలిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. గుర్తింపు కోసం సోషల్ మీడియాలో ఒకలా.. బయట మరోలా ప్రవర్తించకండి. దాని వల్ల మీరే చిక్కుల్లో పడతారు.

4. మెసేజ్ చేయండి.. దాన్ని కొనసాగించండి.. (Write On Her Wall Something Cool And Keep It Clean)

మీరు ఇష్టపడిన అమ్మాయితో మాట కలపడానికి ఫేస్బుక్ మెసెంజర్ మంచి మార్గం. కాబట్టి ఆ అమ్మాయికి ప్రైవేట్ మెసేజ్ పంపించండి. ఏమని మెసేజ్ చేస్తారు? హాయ్ అనా? అలా చేయకండి. మీ మొదటి మెసేజ్ ఎప్పుడూ హాయ్, హలో కాకుండా చూసుకోండి. ఉదాహరణకి మీ ఇద్దరూ చదువుకొన్న స్కూల్ లేదా కాలేజీ లేదా మీ ఇద్దరూ ట్రైనింగ్ అయిన ఇనిస్టిట్యూట్ లేదా మీరు పనిచేస్తున్న ఆఫీసులో ఏదైనా ఈవెంట్ జరుగుతుంటే దానికి సంబంధించి ఆమె ఆలోచనలేంటో అడగండి. లేదా ఈమధ్యే విడుదలైన ఆమె ఫేవరెట్ హీరో సినిమా గురించి ఆమె అభిప్రాయం అడగండి.

ఈ తరహా మెసేజ్‌లు పంపడం వల్ల మీ ఇద్దరి మధ్య సంభాషణ జరగడానికి మంచి పునాది ఏర్పడుతుంది. సంభాషణ ప్రారంభించడం మాత్రమే కాదు.. దాన్ని కొనసాగించడం కూడా ఒక ఆర్టే. ‘ఇంకా ఏంటి?’, ‘భోజనం చేశావా?’ ఇలాంటి రొటీన్ రొడ్డకొట్టుడు మెసేజ్‌లు కాకుండా.. ప్రతి మెసేజ్‌లోనూ కాస్త కొత్తదనం కనిపించేలా ఉండాలి. అంటే మీరు పంపిన మెసేజ్‌కి తాను రిప్లై ఇచ్చేలా ఉండాలి. అప్పుడే మీ సంభాషణ మరికొంత సమయం కొనసాగుతుంది. ఇదంతా జరగాలంటే ముందు తాను మీ ఫేస్ బుక్ ఖాతాలో మీ ఫ్రెండ్ అయి ఉండాలి. కాబట్టి తనకి ముందు ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టండి.

ADVERTISEMENT

10-tips-to-impress-a-girl

Image: Unsplash

5. ఆమె వాల్ పై ఆకట్టుకొనే పోస్ట్ చేయండి (Keep Liking And Comment Her Posts In A Positive Way)

మీరు ఇష్టపడుతున్న అమ్మాయి వాల్ పై అందమైన పోస్ట్ ఒకటి పెట్టండి. ఈ పోస్ట్ మీకు గుర్తొచ్చినప్పుడు కాకుండా.. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే పోస్ట్ చేయండి. ముఖ్యంగా పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా ఆమె కోసమే పోస్ట్ చేయండి. ఆ పోస్ట్ చాలా హుందాగా ఉండాలి. ఆమె వ్యక్తిత్వాన్ని హైలేట్ చేసేదిగా ఉండాలి. అన్నింటికంటే ముందు ఆమెకు నచ్చేలా ఉండాలి.

6. లైక్స్, కామెంట్స్ తప్పనిసరి.. (Don’t Be Online 24/7)

ఆమె చేసిన పోస్టులకు లైక్స్, కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ కోసం స్టిక్కర్స్ వాడండి. ఇవి కచ్చితంగా ఆమెకు నచ్చుతాయి. అలాగని ఆమెపై జోకులు మాత్రం వేయకండి. కామెంట్లు చేసే విషయంలో కూడా హుందాగా వ్యవహరించండి. అలాగే ప్రతి పోస్ట్‌కి లైక్ కొట్టి, కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు బాగా నచ్చిన వాటినే లైక్  చేసి కామెంట్ పెట్టండి. ఆమె మిమ్మల్ని కచ్చితంగా గుర్తుంచుకొంటుంది.

ADVERTISEMENT

7. సోషల్ మీడియాలో ఎవరినీ కించపరచవద్దు (Never Bully Or Tease Someone Online)

ఇది రిలేషన్షిప్ విషయంలోనే కాదు.. మీ వ్యక్తిత్వం గురించి అంచనా వేయడానికి సైతం ఓ ప్రమాణంలా పనిచేస్తుంది. కాబట్టి అలా చేయకండి. మీకది సరదాగా అనిపించవచ్చు. లేదా మీ స్నేహితులు దాన్ని సరదాగా తీసుకోవచ్చు. కానీ మీరు చేసిన కామెంట్స్ వల్ల మిమ్మల్ని అన్ ఫ్రెండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో అనవసరమైన కామెంట్లు చేయకండి. ఇలా చేయడం సైబర్ బుల్లీయింగ్ కిందకు వస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో హుందాగా వ్యవహరించండి.

ఇవి కూడా చదవండి:

లివిన్ రిలేషన్షిప్ గురించి ప్రతిఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే..!

సంతోషంగా ఉండమని తెలిసినా.. బంధంలో ఎందుకు కొనసాగుతున్నారంటే..?

ADVERTISEMENT

నాతో సహజీవనం చేయడం కోసం.. సైఫ్ మా అమ్మని పర్మిషన్ అడిగాడు: కరీనా

28 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT