ADVERTISEMENT
home / వినోదం
అలా అనుకొంటే ఇలా జరిగిందేంటి రవి శాస్త్రి బాబాయ్..?

అలా అనుకొంటే ఇలా జరిగిందేంటి రవి శాస్త్రి బాబాయ్..?

ఇంగ్లండ్ లోని లార్డ్స్ మైదానం.. వరల్డ్ కప్(world cup) ఫైనల్ మ్యాచ్.. స్టేడియంలో ఒకటే అరుపులు, ఈలలు.. కోహ్లీ.. ధోనీ అని అరుస్తున్నారంతా. క్రికెట్ ఫీవర్(Cricket fever) కదా అలాగే ఉంటుంది. నా పక్కన రవి శాస్త్రి (Ravi Shastri) కూర్చున్నాడు. మధ్యమధ్యలో ఏవో కొన్ని సందేహాలడుగుతున్నాడు మ్యాచ్ చూస్తూనే వాటికి సమాధానం చెబుతున్నా. ఏదో మీరుంటే మాక్కొంచెం ధైర్యంగా ఉంటుందన్నారని బ్రిటన్ వచ్చాను లేకపోతే టీవీలోనే చూసి ఉండేదాన్ని. మ్యాచ్ గెలిచి తీరాలి. లేదంటే రవి శాస్త్రి దగ్గర నాకు మాటొచ్చేస్తుంది. అందుకే చాలా నిశితంగా అదే మొన్న సీత సినిమా చూసిట్టుగా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నా. బౌలింగ్ విషయం కోహ్లీ చూసుకుంటాడు కాబట్టి ఈ విషయంలో పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. మధ్యమధ్యలో బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. రవి శాస్త్రి నా మీద అభిమానం మరీ ఎక్కువ చూపించేస్తున్నాడు. వాళ్ల బ్యాటింగ్ అయిపోయింది. ఇక మన వంతు.

 3-cricket-fever

ఒక్కసారి నా కళ్ల ముందు 150 కోట్ల మంది భారతీయులు కనిపించారు. మన జెండా కనిపించింది. అంతే సై సినిమాలో రాజీవ్ కనకాల మాదిరి ఓ చిన్న స్పీచ్ ఇచ్చా. దానికి ఇన్స్పైర్ అయిపోయిన కోహ్లీ బ్యాచ్ ఎలాగైనా సరే వరల్డ్ కప్ కొట్టేస్తామని మాటిచ్చారు. ఆ ఊపులో క్రీజులోకి వెళ్లిన ధావన్, రోహిత్ చకచకా పరుగులు చేస్తున్నారు. స్కోర్ బోర్డ్ ని పరిగెట్టిస్తున్నారు. అబ్బ మనకు తిరుగులేదనుకొన్నా.. అంతే ఓ వికెట్ డౌన్. రాహుల్ ని పంపించనా? అన్నాడు రవిశాస్త్రి. ‘ఆ’ అని తలూపా. మళ్లీ కొంత సేపు స్కోర్ బోర్డ్ ఉత్సాహంగా పరిగెట్టింది. మళ్లీ వికెట్ డౌన్. నాకు బీపీ డౌన్. ఇఫ్పుడెవరిని పంపను అన్నట్టు కళ్లెగరేశాడు. నేను విజయ్ శంకర్ ను చూశా. కాస్త కంగారు పడ్డాడు. ఫర్లేదన్నట్టుగా తలూపా. సరేనని విజయ్ శంకర్ ను పంపించాడు. బౌలర్ చేతిలో బంతికి వేగం, విజయ్ చేతిలో బ్యాట్ కి చురుకు పెరిగింది. కానీ మధ్యలో రన్ రేట్ తగ్గింది. ఎందుకో టెన్షన్ మొదలైంది. మళ్లీ ఇంకో వికెట్ పడింది. కోహ్లీ కళ్లలో ఆందోళన. రవి శాస్త్రి ముఖంలో భయం. ఆ పక్కనే ధోనీ కూల్ గా కూల్ డ్రింక్ తాగుతున్నాడు. ఆ పక్కనే కనిపించాడు కేదార్ జాదవ్. ఈ సారి కేదార్ వంతు. అలా వెళ్లాడు.. ఇలా ఇంకొకరిని పెవిలియన్ కి పంపించాడు. అది కావాలని చేయలేదు. ఏదో అలా జరిగిపోయింది. ‘ప్లీజ్ నన్ను పంపించరా?’ చిన్నపిల్లాడిలా అడిగిన కోహ్లీని చూస్తే జెర్సీలో నానీ గుర్తొచ్చాడు. ‘బాబూ.. నువ్వెళ్లు’ అన్నా. అంతే గంతులేసుకొంటూ క్రీజ్ లోకి వెళ్లిపోయాడు. ఎందుకైనా మంచిదని ధోనీని కూల్ డ్రింక్ తాగడం ఆపి నెక్స్ట్ బ్యాటింగ్ కు రడీ అవ్వమన్నా. కూల్ గా చూసి మళ్లీ కూల్ డ్రింక్ తాగడం కంటిన్యూ చేశాడు. పరుగులు పెరుగుతున్నాయి.. బంతులు తరుగుతున్నాయి. మ్యాచ్ మరీ టఫ్ గా మారిపోయింది. వాళ్లు మరీ టఫ్ గా బౌలింగ్ చేస్తున్నారు. ఎలాగబ్బా అనుకుంటుంటే మళ్లీ వికెట్ పడింది. ధోనీ వంక చూశా. రవిశాస్త్రి మా ఇద్దరి వంక మార్చి మార్చి చూస్తున్నాడు. ధోనీ మాత్రం నింపాదిగా కూల్ డ్రింక్ ఓ సిప్పేసి వెళ్లాడు. ‘వార్నీ.. బాసూ! మనిషంటే నీలా ఉండాలిరా’ అనిపించింది మనసులో.

1-cricket-fever

ADVERTISEMENT

కోహ్లీ, ధోనీ చెరో పక్క నుంచి ఎడా పెడా బాదేస్తున్నారు. బౌలర్లు మారుతున్నారు గానీ వీళ్లిద్దరూ మాత్రం మారలేదు. మ్యాచ్ క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇంకో ఓవర్లో అటో ఇటో తేలిపోతుంది. చివరి నాలుగు బంతులు.. ఎనిమిది పరుగులు కొట్టాలి. టెన్షన్ తో గోళ్లు కొరికేసుకుంటున్నా. నా పక్కనున్న రవి శాస్త్రి చాలా కంగారు పడిపోతున్నాడు. అబ్బా.. ఒక బాల్ వేస్ట్ చేసేశాడు కోహ్లీ.. ఇంకా మూడు బంతులే ఉన్నాయి. ఎక్కడ లేని నీరసం వచ్చేసింది. గెలుస్తామా గెలవమా? అని సందేహం. మరో బంతి పడింది. ఈ సారి బంతి గాల్లోకి లేచింది కానీ బౌండరీ దాకా వచ్చి అక్కడ ఆగిపోయింది. ఉసూరుమనింది ప్రాణం. రవి ముఖంలో టెన్షన్ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఈ గ్యాప్ లో రెండు పరుగులు చేశారిద్దరూ. ఇంకా రెండు బంతులు ఆరు పరుగులు. ఈ సారి బ్యాటింగ్ ధోనీ వంతు. ధోనీయే కదా కొట్టేస్తాడులే. మనసుకి సర్ది చెప్పుకొంటున్నా. మరేం ఫర్వాలేదన్నట్టు రవిశాస్త్రి భుజం మీద తట్టా. కళ్లతోనే ఓకే అన్నాడు. బంతి ధోనీ బ్యాట్ మీదకొచ్చింది. బ్యాట్ తో పాటు బాల్  గాల్లోకి లేచింది. ప్చ్.. బాల్ రెండు స్టెప్పులేసి ఫీల్డర్ చేతిలోకెళ్లి ఆగింది. మళ్లీ నీరసం.. ఇంకా ఒకే ఒక్క బంతి.. ఆరు పరుగులు.. నరాలు తెగిపోయేలా ఉన్నాయి. ఏడు కొండలవాడా.. ఏంటయ్యా ఈ విషమ పరీక్ష. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు మాతో ఆడుకుంటున్నావే ఇదేమైనా భావ్యమా..? ఈ సారి స్పీడుగా వస్తున్నబంతిని కొట్టే ప్రయత్నం చేశాడు ధోనీ. బంతి బ్యాట్ కి అడుగు దూరం నుంచి వెళ్లింది. అంపైర్ వైడ్ అన్నాడు. నేను ఊపిరి పీల్చుకున్నాను. ఈ సారి మరీ వేగంగా వచ్చింది బంతి. బ్యాట్ తో లాగి ఒక్కటిచ్చాడు ధోని. ఇస్రో వదిలిన రాకెట్లా ఎగిరింది బంతి. అలా వెళ్లి.. బౌండరీ బయట పడింది. సిక్స్.. ఇండియా గెలిచేసింది.

2-cricket-fever

రవి కళ్లల్లో నీళ్లు. నా ముఖంలో ఆనందం. కోహ్లీ ముఖంలో సంబరం. నేను సాధించానన్న గర్వం. ధోనీ మళ్లీ కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకొన్నాడు కూల్ గా. గ్రౌండ్లో సంబరాలు మొదలయ్యాయి. ఈలలు, కేకలు, జెండా రెపరెపలు. చూడటానికి రెండు కళ్లూ చాలలేదు. క్వీన్ ఎలిజబెత్ వచ్చింది. వరల్డ్ కప్ కోహ్లీ చేతికిచ్చింది. కప్పు పక్కనున్న బుమ్రా చేతిలో పెట్టి షాంపెయిన్ బాటిల్ షేక్ చేసి మూత తీశాడు కోహ్లీ. ఆ షాంపెయిన్ వచ్చి ముఖం మీద పడింది. దెబ్బకు మెలకువ వచ్చింది. కోహ్లీ ఏడి? వరల్డ్ కప్ ఏది? అదేంటి నేను లార్డ్స్ లో ఉండాలి కదా ఇక్కడున్నానేంటి? అనుకొంటూ తల పైకెత్తి చూశా. ఎదురుగా మా ఆయన చేతిలో ఖాళీ గ్లాసుతో కూల్ గా కనిపించాడు. అప్పుడర్థమైంది. నాకొచ్చింది కలని. కలే ఇంత అద్భుతంగా ఉంటే.. నిజంగా జరిగితే ఎంత బాగుంటుందో. రవి శాస్త్రి బాబాయ్.. కాస్త నా కలను నిజం చెయ్యరాదూ..

Images: Twitter

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

31 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT