ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోండి

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోండి

ఈ రోజు (జూన్ 25) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) –  ఈ రోజు మీది చాలా సంక్షోభ సమయం. అయినప్పటికీ బంధువులు మరియు స్నేహితుల సహకారంతో  సమస్యలను అధిగమిస్తారు. అదేవిధంగా కొన్ని ప్రైవేటు కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. అలాగే మీ పై కొన్ని విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లోనే సంయమనం పాటించండి. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీకు ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. 

వృషభం (Tarus) – విద్యార్థులకు ఈ రోజు శుభదినం. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు విజయం సాధించే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు  కొత్త ఆదాయ వనరులను చూస్తారు.మీ భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి వద్ద  కోల్పోయిన విశ్వాసాన్ని మీరు తిరిగి పొందుతారు. అలాగే వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. సినీ రంగం లేదా మార్కెటింగ్ రంగంలో పనిచేసే వారికి ఈ రోజు బాగా కలిసొచ్చే రోజు. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 

మిథునం (Gemini) – ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి వ్యతిరేక దిశలో నడుస్తుంది. ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు రుణాలు తీసుకోవడం లేదా ఇచ్చే విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా అగ్రిమెంట్లు చేసుకోవడానికి ఇది అనువైన సమయం కాదు. అందుకు కొంత సమయం తీసుకోండి. కుటుంబ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చేలా కనిపించినా.. పరిస్థితులు విపరీతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక పలు వివాదాలకు దూరంగా ఉండండి.  

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. మీ వల్ల పలువురికి ఉపాధి లభించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు కూడా ఇది బాగా కలిసొచ్చే రోజు. మీ భాగస్వామితో కూడా ఈ రోజు సంబంధాలు బలంగా ఉంటాయి. పలు ఆధ్యాత్మిక విషయాలపై మీకు ఆసక్తి కూడా పెరిగే అవకాశం ఉంది. 

సింహం (Leo) – ఈ రోజు మీరు కొన్ని చేదువార్తలు వినే అవకాశం ఉంది. అయినా మనో ధైర్యంతో ముందుకు వెళ్లండి.  బంధువులు, స్నేహితులతో మాట పట్టింపులు అసలు పెట్టుకోవద్దు. అలాగే కొన్ని  వివాదాలకు దూరంగా ఉండండి. అయితే మీ పనులు ఆలస్యంగా ప్రారంభమైనా.. చివరికి ఎలాగోలా నెరవేరుతాయి. ఆర్థిక వివాదాలు లేదా కోర్టు కేసులు పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. మీ మద్దతు కోరుతూ పలువురు వ్యక్తులు మిమ్మల్ని కలిసే అవకాశముంది. 

క‌న్య (Virgo) – ఈ రోజు మీరు ఎండలో ఎక్కువగా తిరగద్దు. అలాగే పనులు మొత్తం ఒకేసారి చేయాలని భావించకండి. అప్పుడప్పడు విశ్రాంతి తీసుకోండి. ఈ రోజు మీరు కొన్ని శుభవార్తలను వినే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో తొలుత కాస్త అసహనంగా ఉన్నా.. తర్వాత ఉత్సాహంగా పనులు చేస్తారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త పడండి. మీ భాగస్వామితో సంబంధాలు బలంగా ​​ఉంటాయి. అలాగే వ్యాపార విశ్వసనీయత కూడా పెరుగుతుంది. 

ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట 

 

తుల (Libra) – ఈ రోజు మీ ఉద్యోగ జీవితంలో మార్పులు సంభవిస్తాయి. ప్రమోషన్లు లేదా బదిలీలు జరిగే అవకాశం ఉంది.  అలాగే కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార రంగంలో కొత్త భాగస్వాములతో కలిసి పనిచేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ పని శైలి మీ ఉద్యోగాన్ని మెరుగుపరుస్తుంది. విద్యార్థులకు కూడా ఈ రోజు బాగా కలిసొస్తుంది. వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక ప్రేమలో పడ్డవారు.. తమ బంధం గురించి పెద్దలకు చెప్పడానికి ఇదే సరైన సమయం. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీ వైవాహిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. మీ కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. అలాగే పాత మిత్రులను కలిసే అవకాశం ఉంది. కానీ మీరు ఆచితూచి మాట్లాడాల్సి ఉంది. అదేవిధంగా సంపద, గౌరవం పెరుగుతాయి. ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించాలని భావించేవారికి ఇది శుభదినం. కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని భావించేవారికి కూడా ఈ రోజు మంచి రోజే. 

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీ ఆఫీసులో కొన్ని వివాదాస్పద చర్చలు జరిగే అవకాశముంది. అటువంటి వాటిలో మీరు పాలుపంచుకోకపోతే మంచిది. మీ పని మీరు నిజాయతీగా చేసుకొని ముందుకు వెళ్లండి. అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో కాస్తా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక ఆరోగ్య విషయంలో శ్రద్ద కనబరచండి. యోగా చేయడం లేదా జిమ్‌కు వెళ్లడం ఈ రోజు నుండే ప్రారంభించండి.  

ఈ కథను కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

మకరం (Capricorn) – ఈ రోజు మీరు పలు సామాజిక లేదా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆఫీసులో పని మెరుగుపడుతుంది. ఆర్థికపరంగా కూడా మీకు బాగుంటుంది. రాజకీయాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అయితే ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. 

కుంభం (Aquarius) – ఈ రోజు పలు విషయాలు మీలో అసహనాన్ని పెంచుతాయి. అయినా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. విద్యార్థులు సోమరితనం వీడి.. చదువుపై మనస్సు లగ్నం చేయాల్సిన సమయం. ఉద్యోగస్తులు  సహనంతో పనిచేయండి. అలాగే  కుటుంబ విషయాలలో మీ భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. 

మీనం (Pisces) – ఈ రోజు మీ భాగస్వామి ఆరోగ్య విషయలంలో జాగ్రత్త వహించండి. అలాగే ఓ శుభవార్తను కూడా వినే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో మార్పులు సంభవిస్తాయి. పలువురు అధికారులు మిమ్మల్ని అభినందించే అవకాశం కూడా ఉంది. అయితే ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. 

ఈ కథను కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.