ADVERTISEMENT
home / సౌందర్యం
జుట్టు రాలకుండా ఉండాలంటే.. తలకు నూనె ఇలా రాసుకోవాలి (Hair Oiling Tips & Best Hair Oils In Telugu)

జుట్టు రాలకుండా ఉండాలంటే.. తలకు నూనె ఇలా రాసుకోవాలి (Hair Oiling Tips & Best Hair Oils In Telugu)

తలకు నూనె రాసుకోవడానికి కూడా ఓ పద్ధతా? నూనె(oil) రాసుకోవడం కూడా మాకు తెలియదనుకొంటున్నారా? అనొద్దు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తలకు నూనె రాసుకోవడం(hair oiling) మనకు అలవాటే. కానీ దాన్ని సరిగ్గా అప్లై చేసుకోకపోతే.. దానివల్ల ఎలాంటి ఫలితాన్ని మనం పొందలేం. చిన్నతనంలో తలకు నూనె రాసుకొంటే జుట్టు పొడవుగా ఎదుగుతుందని, జుట్టు రాలదని చెబుతుంది అమ్మ. నూనె రాయెద్దని మారాం చేస్తున్నా వినదు.

వీపు మీద రెండు దెబ్బలు వేసైనా సరే నూనె రాసి తీరుతుంది. నిజంగా అమ్మ చెప్పినట్టు తలకు నూనె రాసుకోవడం వల్ల అన్ని  ప్రయోజనాలున్నాయా?  కురుల విషయంలో మనకున్న సమస్యలను తగ్గించుకోవడానికి నూనె ఎలా రాసుకోవాలి? ఏ నూనెలు రాసుకోవడం వల్ల జుట్టు మరింత దఈడంగా తయారవుతుంది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

తలకు నూనె రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

తలకు నూనె ఎలా రాసుకోవాలి?

ADVERTISEMENT

ఎస్సెన్సియల్ నూనెలను ఇలా రాసుకోవాలి

వేర్వేరు సమస్యలకు నూనె ఎలా అప్లై చేసుకోవాలంటే..

నూనె రాసుకొనేటప్పుడు చేయకూడని పనులు ఇవే.

మీ జుట్టుకి తగిన నూనె ఎలా ఎంచుకోవాలంటే..

ADVERTISEMENT

తరచూ అడిగే ప్రశ్నలు

తలకు నూనె రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits Of Oiling Hair)

తలకు నూనె రాసుకోవడం మన జీవనశైలిలో ఒక భాగం. కొందరికి రోజూ.. మరికొందరికి వారానికోసారి నూనె రాసుకోవడం అలవాటు. వారానికి కనీసం ఒక్కసారైనా నూనె పెట్టుకోవడం వల్ల స్కాల్ప్ పై ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. చుండ్రు సమస్య రాదు. వెంట్రుకల కుదుళ్లకు తగిన  పోషణ అందుతుంది. ఫలితంగా అవి బలంగా, ఒత్తుగా తయారవుతాయి. ఒత్తిడి, తలనొప్పి తగ్గుముఖం పడతాయి. నిద్ర చక్కగా పడుతుంది.

తలకు నూనె ఎలా రాసుకోవాలి? (How To Apply Hair Oil)

మరీ తక్కువ లేదా మరీ ఎక్కువ నూనె రాసుకొన్నా దానివల్ల ఎలాంటి ప్రయోజనం కలగదు. అలాగే ఏదో రాసుకున్నాంలే అన్నట్టు కాకుండా ఓ పద్ధతి ప్రకారం నూనె పెట్టుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.

  1. ముందుగా తలను చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. సాధారణంగా నూనె రాసుకొన్న తర్వాత తల దువ్వుకొంటాం. కానీ నూనె పెట్టుకొనే ముందే చిక్కులు తీసుకోవాలి.
  2. నూనెను గోరువెచ్చగా ఉండేలా వేడి చేయాలి. అప్పుడే అది మాడుపై సులభంగా పరుచుకుంటుంది. వెంట్రుకలకు బాగా పడుతుంది.
  3. గోరువెచ్చగా ఉన్న ఈ నూనెలో చేతి వేళ్లను ముంచి మాడుకు రాసుకొని సున్నితంగా మర్దన చేసుకోవాలి. కనీసం పావుగంట సమయం మసాజ్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది.
  4. నూనె స్కాల్ప్ కి మాత్రమే రాసుకొంటే సరిపోదు. వెంట్రుకలు కుదుళ్ల నుంచి చివరి వరకు రాసుకోవాలి. దీనికోసం జుట్టును రెండు పాయలుగా విడగొట్టుకోవాలి.
  5. చేతిలో కొద్దిగా నూనె పోసుకొని రెండు చేతులతో బాగా రబ్ చేసి వెంట్రుకలకు రాసుకోవాలి. ఇలా నూనె పెట్టుకొనేటప్పుడు ఎక్కువ నూనె ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకొని అప్లై చేసుకోవాలి. ఒకవైపు పూర్తయిన తర్వాత మరోవైపు రాసుకోవాలి.
  6. ఇప్పుడు వేడి నీటిలో ముంచి బాగా పిండిన టవల్ ను తలకు చుట్టుకొని పదినిమిషాలు ఉండాలి.
  7. రెండు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేయాల్సి ఉంటుంది.

1-hair-oiling-tips

ADVERTISEMENT

ఎస్సెన్సియల్ నూనెలను ఇలా రాసుకోవాలి (How To Apply Essential Oil)

సాధారణ నూనెను రాసుకొన్నట్టుగా ఎస్సెన్సియల్ ఆయిల్ ను ఎక్కువ మొత్తంలో రాసుకోకూడదు. ఎందుకంటే వీటి గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని ఇతర నూనెలలో మిశ్రమంగా చేసి రాసుకోవాల్సి ఉంటుంది. కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ నూనె మీరు తలకు రాసుకొనేది ఏదైనా సరే పర్వాలేదు. ఒక చెంచా నూనెలో రెండు నుంచి మూడు చుక్కల ఎస్సెన్సియల్ నూనె కలపాలి. ఆ తర్వాత పైన చెప్పుకొన్న పద్ధతిలో నూనె అప్లై చేసుకోవాలి.

వేర్వేరు సమస్యలకు నూనె ఎలా అప్లై చేసుకోవాలంటే.. (Applying Hair Oils For Hair Problems)

తలనొప్పికి (Headache)

ఆయుర్వేదం ప్రకారం తలనొప్పి వాతం వల్ల వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి మీరు ఉపయోగించే నూనె ఏదైనా సరే.. దాన్ని సాయంత్రం ఆరుగంటల సమయంలో తలకు రాసుకొని మఈదువుగా మర్దన  చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలోనే మన శరీరంలో వాత లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. తరచూ నూనెను ఈ సమయంలో రాసుకోవడం ద్వారా వాతాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా తలనొప్పి కూడా తగ్గుతుంది. తలనొప్పితో బాధపుడుతున్నవారు వేడి చేసిన నూనెను రాసుకోకూడదు. చల్లటి నూనెనే రాసుకోవడం మంచిది.

చుండ్రు సమస్య తగ్గడానికి (Reduce Dandruff)

చుండ్రు, తలలో దురద చాలా మంది  ఎదుర్కొనే సమస్యలే. మరి వాటి నుంచి  బయటపడటం ఎలా? క్రమం తప్పకుండా నూనె రాసుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. దీనికోసం సాధారణ నూనె కాకుండా ప్రత్యేకంగా నూనె తయారుచేసుకోవాల్సి ఉంటుంది. కొబ్బరి నూనెలో కొన్ని వేపాకులు వేసి బాగా మరిగించి చల్లారనివ్వాలి. ఈ నూనెను తలకు అప్లై చేసుకొని గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

జుట్టు ఒత్తుగా పెరగడానికి (Hair Growth)

 తల ఒత్తుగా పెరగాలని కోరుకోని అమ్మాయిలుండరంటే అతిశయోక్తి కాదేమో. జుట్టు సాఫ్ట్ గా, మెరుస్తున్నట్టుగా ఉండటంతో పాటు. జుట్టు ఆరోగ్యాన్ని నాశనం చేసే స్ప్లిట్ ఎండ్స్ (వెంట్రుకల చివర్లు చిట్లిపోవడం) ఉండకూడదని కోరుకొంటారు. దీనికోసం రాత్రి నిద్రపోయే ముందు పైన మనం చెప్పుకొన్న పద్ధతిలో నూనె రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. మీరు తలస్నానం చేయాలనుకొన్న ప్రతి సారీ ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ప్రయోజనం కనిపిస్తుంది. అలాగని రోజూ తలస్నానం చేయడం కూడా మంచిది కాదు. వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. కొంతమంది తలస్నానం చేసిన తర్వాత నూనె రాసుకొంటూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా జుట్టు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే నూనెకున్న జిడ్డు స్వభావం, దుమ్మును ఆకర్షించే గుణం వల్ల తల మురికిగా కనిపిస్తుంది.

ADVERTISEMENT

చక్కటి నిద్ర పట్టడటానికి (Getting Good Sleep)

 పనుల ఒత్తిడి, ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా చాలామంది నిద్రకు దూరమవుతున్నారనేది కాదనలేని విషయం. తలకు నూనెను మర్దన చేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. దీనికోసం నిద్రపోవడానికి సరిగ్గా అరగంట ముందు తలకు నూనె రాసుకొని సున్నితంగా మర్దన చేసుకోవాలి. దీనికోసం నువ్వుల నూనె ఉపయోగించాల్సి ఉంటుంది. నూనెను గోరువెచ్చగా ఉండేలా వేడి చేసి తలకు రాసుకొని కాసేపు మర్దన చేసుకోవాలి. నువ్వుల నూనెకు బదులుగా కొబ్బరి నూనె కూడా ఉపయోగించవచ్చు.

Also Read: జుట్టు ఎక్కువగా రాలుతోందా? అయితే ఈ నేచురల్ టిప్స్ మీకోసమే..

నూనె రాసుకొనేటప్పుడు చేయకూడని పనులు ఇవే. (Don’ts While Applying Hair Oil)

నూనె వేడి చేయకుండా రాసుకోవడం (Heating Oil)

 సాధారణంగా మనం చల్లగా ఉన్న నూనెనే తలకు రాసుకొంటాం. దానికంటే గోరువెచ్చగా ఉన్న నూనెను రాసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతాం. నూనెను వేడి చేయడం వల్ల అది మాడుపై పూర్తిగా పరచుకోవడంతో పాటు కుదుళ్లను ప్రేరేపిస్తుంది. దీనివల్ల కురులు దృఢంగా తయారవుతుంది. పది సెకన్ల పాటు నూనెను మైక్రోవేవ్ లో ఉంచి వేడి చేయాలి. లేదా చిన్న గిన్నెలో నూనె వేసి దాన్ని వేడి నీటిలో గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచాలి. నూనెను మరీ ఎక్కువ సమయం వేడి చేయకూడదు. దానివల్ల అందులో ఉన్న పోషకాలు నాశనమవుతాయి.

ఎక్కువగా మసాజ్ చేసుకోవడం (Excessive Massage)

మర్దన చేసుకొంటే మంచిది కదా అని కొందరు మాడుని మరీ బలంగా రుద్దేస్తుంటారు. ఇలా గట్టిగా మర్దన చేసుకోవడం వల్ల జరిగే మంచి కంటే చెడే ఎక్కువ ఉంటుంది. గట్టిగా రుద్దినట్టు రాసుకోవడం వల్ల జుట్టు చిక్కులు పడిపోతుంది. కుదుళ్లు దెబ్బ తింటాయి. జుట్టు తెగిపోతుంది. కాబట్టి సున్నితంగా మర్దన చేసుకోవాల్సి ఉంటుంది. వేలి కొనలతో చాలా మఈదువుగా మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

ADVERTISEMENT

నూనె రాసుకోవడానికి ముందు తల దువ్వుకోకపోవడం (Donot Shave Your Head Before Oiling)

 సాధారణంగా మనం నూనె రాసుకొన్న తర్వాతే చిక్కులు తీసుకొంటూ ఉంటాం. కానీ అలా చేయడం సరైన పద్ధతి కాదట. నూనె రాసుకోవడానికంటే ముందే తలను బాగా దువ్వుకోవాలి. ఎందుకంటే మర్దన చేసుకొనే క్రమంలో జుట్టు మరింత చిక్కులు పడుతుంది. ఇలాచిక్కులు పడిన జుట్టును దువ్వితే జుట్టు తెగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందుగా చిక్కులు తీసుకొని ఆ తర్వాత నూనె రాసుకోవడం మంచిది.

2-hair-oiling-tips

ఒకే నూనెను ఉపయోగించడం (Using Only One Oil)

 సాధారణంగా తలకు ఏదో ఒక రకం నూనె మాత్రమే ఉపయోగిస్తాం. కానీ రెండు కంటే ఎక్కువ నూనెలను కలిపి తలకు రాసుకోవడం వల్ల మంచి ప్రయోజనం కనిపిస్తుంది. కొబ్బరి నూనె, ఆవ నూనె, కొన్ని చుక్కల ఆలివ్ నూనె కలిపి ఉపయోగిస్తే జుట్టు అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. కాబట్టి మీకు నచ్చిన నూనెలను మిశ్రమంగా చేసి అప్లై చేసుకోండి.

గట్టిగా బిగించి జడ వేసుకోవడం (Tightening)

నూనె రాసుకొన్న తర్వాత చాలామందికి జడ గట్టిగా బిగించి వేసుకోవడం లేదా పైకి బిగించి గట్టిగా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం చాలామందికి ఉన్న అలవాటు. కానీ నూనె పెట్టుకొన్న వెంటనే ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలహీనంగా తయారై జుట్టు రాలిపోవడం, తెగిపోవడం జరుగుతుంది.

ADVERTISEMENT

చేతి వేళ్లను ఉపయోగించడం (Using Fingers)

 సాధారణంగా మనం నూనెను చేతివేళ్లతోనే పెట్టుకొంటూ ఉంటాం. కానీ చేతివేళ్లకు బదులుగా దూది ఉపయోగిస్తే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది. దూదిని ఉపయోగించడం ద్వారా కుదుళ్లకు చాలా సున్నితంగా నూనె రాసుకోవడానికి వీలవుతుంది. గోరువెచ్చని నూనెలో దూదిని ముంచి బాగా పిండి.. దీనితో తలపై రుద్దుకోవాలి. అలాగే వెంట్రుకలకు సైతం దూదితో నూనె అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొంటే తలపై చేరిన మురికిని సైతం తొలగించుకోవచ్చు.

తరచూ నూనె రాసుకోవడం (Frequent Oiling)

 రెగ్యులర్ గా నూనె రాసుకోవడం మంచిదే. కానీ ప్రతీ రోజూ నూనె రాసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ఎక్కువ నూనె రాసుకోవడం వల్ల తలపై ఎక్కువ దుమ్ము చేరుతుంది. ఫలితంగా తల దురద పెడుతుంది. దీనివల్ల ఎక్కువసార్లు షాంపూ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎక్కువ సార్లు  షాంపూ చేసుకోవడం వల్ల తలపై సహజంగా ఉత్పత్తి అయ్యే నూనెలు పోవడంతో పాటు జుట్టు తన సహజత్వాన్ని కోల్పోతుంది. కాబట్టి వారానికి రెండు సార్లు రాసుకొంటే సరిపోతుంది.

నూనె ఎంచుకొనేటప్పుడు జుట్టు తత్వాన్ని పట్టించుకోకపోవడం (Choosing Wrong Hair Oil)

చర్మానికి తగ్గ మాయిశ్చరైజర్ ఎలా ఎంచుకొంటామో.. జుట్టుకి తగిన నూనెను ఎంచుకోవడం కూడా ముఖ్యం. అప్పుడే జుట్టుకి తగిన పోషణ అందుతుంది. మీ జుట్టు పొడి తత్వం కలిగినవారైతే.. ఆర్గాన్ ఆయిల్ ఉపయోగించడం మంచిది. డాండ్రఫ్ తో బాధపడుతున్నవారు ఆల్మండ్ ఆయిల్ ఉపయోగించడం మంచిది. జుట్టుకు సంబంధించి మీకేదైనా సమస్య ఉంటే.. దాన్ని తగ్గించే హెయిర్ ఆయిల్ వాడితే మంచిది.

స్కాల్ప్ నే మర్దన చేసుకోవడం (Scalp Massage)

 స్కాల్ప్ కు నూనె రాసుకోవడం ఎంత ముఖ్యమో వెంట్రుకలకు రాసుకోవడం కూడా అంతే ముఖ్యం. నూనె రాసుకోవడం వల్ల జుట్టు  ప్రకాశవంతంగా, అందంగా కనిపిస్తుంది. వెంట్రుకలకు నూనె రాసుకునేటప్పుడు జుట్టను పాయలుగా విడదీసి రాసుకోవాలి. ఇలా రాసుకొనేటప్పుడు చేత్తో కాకుండా నూనెలో ముంచిన కాటన్ ఉపయోగించడం మంచిది. ఇలా చేయడం వల్ల కురులకు అవసరమైన పోషణ అందుతుంది.

ADVERTISEMENT

నూనె రాసుకొన్న వెంటనే తలస్నానం చేయడం (Immediate Bath After Oiling)

నూనె రాసుకొన్న వెంటనే  తలస్నానం చేయడం చాలామందికి ఉన్న అలవాటు. ఇలా చేయకూడదు. తలను కనీసం గంట సేపైనా నూనెలో నాననివ్వాలి. నూనె రాసుకొన్న తర్వాత హాట్ టవల్ ను తలకు చుట్టుకోవాలి. దీనివల్ల నూనె తలకు బాగా పడుతుంది. అలాగే గోరువెచ్చని నీటిని తలస్నానానికి ఉపయోగించడం మంచిది.

తలస్నానం చేసిన వెంటనే డ్రైయర్ లేదా స్ట్రెయిటనర్ ఉపయోగించడం (Using Dryer)

తలకు నూనె బాగా పట్టించి గంటో రెండు గంటలో ఆగి ఆ తర్వాత తలస్నానం చేసినప్పటికీ హెయిర్ డ్రయర్ లేదా స్ట్రెయిటనర్ వంటివి ఉపయోగించడ వల్ల మీ కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. జుట్టు సంతరించుకొన్న మెరుపు పోతుంది. కాబట్టి కొంత కాలం పాటు హెయిర్ డ్రయ్యర్లను పక్కన పెట్టేయండి.

3-hair-oiling-tips

Also Read: జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. తలస్నానం ఇలా చేయాల్సిందే..!

ADVERTISEMENT

మీ జుట్టుకి తగిన నూనె ఎలా ఎంచుకోవాలంటే.. (Best Hair Oils In Telugu)

సాధారణమైన జుట్టు (Normal Hair)

నార్మల్ హెయిర్ అటు పొడిగానూ ఉండదు. అలాగని జిడ్డుగానూ ఉండదు. కాబట్టి ఈ తరహా జుట్టు కలిగిన వారు జొజొబా, ఆల్మండ్, ఉసిరి నూనెలను ఉపయోగించడం మంచిది.

1. కైరా కోల్డ్ ప్రెస్డ్ జొజొబా ఆయిల్ (Kyra Jojoba Oil)

kyra-jojoba-oil-Best hair Oils In Telugu

ధర: రూ. 650

ADVERTISEMENT

ఇక్కడ కొనండి.

2. సెయింట్ బొటానికా గోల్డెన్ వర్జిన్ ప్యూర్ జొజొబా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ (St. Botanica Pure Jojoba Oil)

stbotanica-jojoba-oi-Best hair Oils In Telugul

ధర: రూ. 699

ADVERTISEMENT

ఇక్కడ కొనండి.

3. అర్బన్ బొటానిక్స్ 100% ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ (Urban Botanics Almond Oil)

urban-botanics-almond-oi Best hair Oils In Telugul

ధర: రూ. 399

ADVERTISEMENT

ఇక్కడ కొనండి.

4. మార్ఫిమ్ రెమిడీస్ కోల్డ్ ప్రెస్డ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ (Morpheme Sweet Almond Oil)

morpheme-remedies-sweet-almond-oil Best hair Oils In Telugu

ధర: రూ. 460

ADVERTISEMENT

ఇక్కడ కొనండి.

5. ఖాదీ నేచురల్ ఆమ్లా హెర్బల్ హెయిర్ ఆయిల్ (Khadi Natural Herbal Hair Oil)

khadi-natural-amla-hair-oil Best hair Oils In Telugu

ధర: రూ. 298

ADVERTISEMENT

ఇక్కడ కొనండి.

డ్రైహెయిర్ (Dry Hair)

 పొడి జుట్టు నిర్జీవంగా, చిక్కులు పడినట్లుగా, చివర్లు చిట్లినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి తలకు అప్లై చేసుకొనేనూనె కురులకు పోషణ ఇవ్వడంతో పాటు మాడుపై సహజమైన నూనెలను ఉత్పత్తి చేసేదిగా ఉండాలి. అందుకే వీరికి కొబ్బరి, జొజొబా, ఆల్మండ్, నువ్వుల నూనె, ఆవనూనె ఉపయోగించడం మంచిది.

1. ఇండస్ వేలీ మస్టర్డ్ హెయిర్ ఆయిల్ (Indus Valley Mustard Oil)

indus-valley-mustard-hair-oil Best hair Oils In Telugu

ADVERTISEMENT

ధర: రూ. 199

ఇక్కడ కొనండి.

2. సోల్ ఫ్లవర్ సీసామె హెయిర్ ఆయిల్ (Soulflower Sesame Oil)

soul-flower-sessame-hair-oil Best hair Oils In Telugu

ADVERTISEMENT

ధర: రూ. 315

ఇక్కడ కొనండి.

3. అరోమామస్క్ యూఎస్డీయే ఆర్గానిక్ 100% ప్యూర్ నువ్వుల నూనె (An Aromamask Sesame Oil)

aromamusk-usda-organic-sesamme-oil Best hair Oils In Telugu

ADVERTISEMENT

ధర: రూ. 209

ఇక్కడ కొనండి.

4. ఇండస్ వ్యాలీ బయో ఆర్గానిక్ ఎక్సట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ (Bio Organic Coconut Oil)

indus-valley-bio-organic-coconut-oil Best hair Oils In Telugu

ADVERTISEMENT

ఇక్కడ కొనండి.

ధర: రూ. 239

5. అరోమా మస్క్ 100% ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ (An Sweet Almond Oil)

aromamusk-almond-oil Best hair Oils In Telugu

ADVERTISEMENT

ఇక్కడ కొనండి.

ధర: రూ 307

ఆయిలీ హెయిర్ (Oily Hair)

 తలలో ఎక్కువగా సీబమ్ ఉత్పత్తి కావడం వల్ల చాలా జిడ్డుగా మారిపోతుంది. ఇలాంటి వారు ఉపయోగించే నూనె సీబమ్ ఉత్పత్తిని నియంత్రించేలా ఉండాలి. దీనికోసం ఆలివ్ నూనె, నువ్వుల నూనె, జొజొబా నూనె వాడితే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

1. నేచర్స్ అబ్సల్యూట్స్ ఆలివ్ ఆయిల్ (Nature’s Absolute Olive Oil)

ADVERTISEMENT

natures-absolutes-olive-oil Best hair Oils In Telugu

ఇక్కడ కొనండి.

ధర: రూ 275

2. అరోమా మ్యాజిక్ ఆలివ్ ఆయిల్ (Aroma Magic Olive Oil)

ADVERTISEMENT

aroma-magic-olive-oil

ఇక్కడ కొనండి.

ధర: రూ. 175

3. ట్రూ ఆయిల్స్ నేచురల్ అండ్ ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె (True Sesame Oil)

ADVERTISEMENT

true-oils-sesame-oil Best hair Oils In Telugu

ఇక్కడ కొనండి.

ధర: రూ. 100

4. ఖాదీ ఒమ్రోజ్ నువ్వుల నూనె (Khadi Sesame Oil)

ADVERTISEMENT

khadi-sesame-oil Best hair Oils In Telugu

ఇక్కడ కొనండి.

ధర: రూ. 180

5. నూర్ సీక్రెట్స్ క్యారియర్ ఆలివ్ ఆయిల్ (Noor Secret Oil)

ADVERTISEMENT

noor-secrets-olive-oi Best hair Oils In Telugul

ఇక్కడ కొనండి.

ధర: రూ. 219

డాండ్రఫ్ ఉన్నవారికి (For Hair With Dandruff)

చుండ్రు కలిగిన వారు తాము ఉపయోగించే నూనెలో ఎస్సెన్సియల్ ఉపయోగించడం ద్వారా  దాన్ని తగ్గించుకోవచ్చు. దీనికోసం టీ ట్రీ ఆయిల్ మంచిది. అలాగే గుంటగలగర నూనె(భృంగ‌రాజ్‌ ఆయిల్) ఉపయోగించవచ్చు.

ADVERTISEMENT

1. సోల్ ఫ్లవర్ భృంగ‌రాజ్‌ ఆయిల్ (Bhrinraj Oil)

soul-flower-bhringraj-oil Best hair Oils In Telugu

ఇక్కడ కొనండి.

ధర: రూ. 315

ADVERTISEMENT

2. నేచర్స్ అబ్సల్యూట్స్ ప్యూర్ టీట్రీ ఆయిల్ (Nature’s Absolutes Essential Oil)

natures-absolutes-pure-tea-tree-oil Best hair Oils In Telugu

ఇక్కడ కొనండి.

ధర: రూ. 260

ADVERTISEMENT

3. సోల్ ఫ్లవర్ టీట్రీ స్కాల్ఫ్ అండ్ యాంటీ  డాండ్రఫ్ ఆయిల్ (Tea Tree Oil)

soul-flowe-tea-tree-oil Best hair Oils In Telugu

ఇక్కడ కొనండి.

ధర: రూ. 311

ADVERTISEMENT

4. ఆల్ నేచచురల్స్ 100% ప్యూర్ టీట్రీ ఆయిల్ (All Natural Tea YTree Oil)

all-naturals-teatree-oil Best hair Oils In Telugu

ఇక్కడ కొనండి.

ధర: రూ 199.

ADVERTISEMENT

5. మోర్ఫీమ్ రెమెడీస్ ప్యూర్ భృంగ‌రాజ్‌ ఆయిల్ (Bhringraj Oil)

morphrme-bhringraj-oil Best hair Oils In Telugu

ఇక్కడ కొనండి.

ధర: రూ. 601

ADVERTISEMENT

తరచూ అడిగే ప్రశ్నలు (FAQ’s)

1. తలస్నానం చేసిన తర్వాత తలకు నూనె రాసుకోవచ్చా?

చాలామందికి తలస్నానం చేసిన మరుసటి రోజు నూనె పెట్టుకొనే అలవాటు ఉంటుంది. అయితే దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే నూనె రాసుకోవడం వల్ల జుట్టుకి తగినంత పోషణ అందే మాట వాస్తవమే అయినప్పటికీ.. నూనె రాసుకొని ఎక్కువ సమయం ఉండటం వల్ల తలపై మురికి, దుమ్ము చేరతాయి. వీటివల్ల జుట్టు పొడిబారినట్లుగా తయారవుతుంది. అందుకే బయటకు వెళ్లేవారు తలస్నానం తర్వాత నూనె రాసుకోకపోవడమే మంచిది. ఇంట్లోనే ఉండేవారు కొద్దిగా మాడుకి నూనె రాసుకోవచ్చు. సాధారణంగా తలస్నానం చేయడానికి ముందు నూనె రాసుకొంటే జుట్టుకి తగిన పోషణ అందడంతో పాటు వెంట్రుకలు సైతం శుభ్రంగా ఉంటాయి.

2. తలనొప్పి ఉన్నవారు హాట్ ఆయిల్ మసాజ్ చేసుకోవచ్చా?

తలనొప్పి ఉన్నవారు మాత్రమే కాదు.. మాడుపై ర్యాషెస్, కురుపులు ఉన్నవారు కూడా హాట్ ఆయిల్ మసాజ్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం ఇవి వాత, పిత్త దోషాలకు సంబంధించినవి. హాట్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

3. సైనసైటిస్, జలుబు వంటి సమస్యలను ఆయిల్ మసాజ్ తో తగ్గించుకోవచ్చా?

గోరువెచ్చని నువ్వుల నూనెతో తలకు మర్దన చేసుకోవడం వల్ల సైనసైటిస్, జలుబు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయిన ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మీకు మీరుగా చికిత్స చేసుకోవడానికి ముందు వైద్యులను సంప్రదించడం మంచిది. వారి సూచనలు పాటిస్తూ ఈ చిట్కాను కూడా పాటించడం వల్ల సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది.

4. జుట్టు రాలకుండా ఉండటానికి ఏ నూనె ఉపయోగించడం మంచిది?

ఇటీవలి కాలంలో జుట్టు రాలే సమస్యతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రకాల నూనెలు ఉపయోగించడం ద్వారా జుట్టు రాలకుండా చూసుకోవచ్చు. నువ్వుల నూనె, ఆముదం, ఆలివ్ నూనె మొదలైనవి జుట్టు రాలకుండా ఆపుతాయి. జుట్టు రాలడం కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు సూచన కావచ్చు. కాబట్టి కేవలం నూనెలపైనే ఆధారపడకుండా.. వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందడం ద్వారా కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు.

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Images: Shutterstock

02 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT