ADVERTISEMENT
home / Health
పింక్ సాల్ట్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా??

పింక్ సాల్ట్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా??

వంటకాలు ఎంత అద్భుతంగా వండినా అందులో సరిపడినంత ఉప్పు (Salt) లేకపోతే వాటికి అసలు రుచే ఉండదు. రుచి మాత్రమే కాదు.. ఉప్పు తగినంత వేసిన తర్వాతే ఆ వంటకం ఘుమఘుమలు మరింత కమ్మగా రావడం కూడా మనం గమనించవచ్చు. అయితే మనం నిత్యం ఉపయోగించే ఈ ఉప్పులో కూడా ఎన్నో రకాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. బ్లాక్ సాల్ట్, సెల్టిక్ సాల్ట్, సీ సాల్ట్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కాస్త పెద్దగానే ఉంటుంది.

మరి, పింక్ సాల్ట్ (Pink salt) గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవునండీ.. దీనినే మనం ఇందుప్పు అని కూడా అంటాం. దీని వల్ల ఆరోగ్యపరంగానే కాదు.. సౌందర్యపరంగానూ మనకు బోలెడు ప్రయోజనాలు చేకూరతాయి. అసలింతకీ ఈ పింక్ సాల్ట్ గురించి, దాని వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి మీకు వివరంగా తెలుసుకోవాలనుందా? అయితే ఇది చదివేయండి..

ఈ కథనంలో మీరు తెలుసుకునే అంశాలు

– పింక్ సాల్ట్‌లో ఉండే పోషక విలువలు

– పింక్ సాల్ట్ ద్వారా చర్మానికి కలిగే ప్రయోజనాలు

ADVERTISEMENT

– పింక్ సాల్ట్ ద్వారా శిరోజాలకు కలిగే ప్రయోజనాలు

– పింక్ సాల్ట్ ద్వారా మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

– పింక్ సాల్ట్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్

– పింక్ సాల్ట్ గురించి తరచూ అడిగే కొన్ని ప్రశ్నలు – వాటికి సమాధానాలు

ADVERTISEMENT

పింక్ సాల్ట్‌లో ఉండే పోషక విలువలు..

పింక్ సాల్ట్ చూడడానికి సాధారణ రాళ్ల ఉప్పులానే కనిపిస్తుంది. అయితే ఇది నారింజ రంగులో ఉంటుంది. దీనికి కారణం ఇందులో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండడమే. ఈ ఉప్పుకి ఉన్న రంగు కారణంగానే చాలామంది దీనిని పింక్ సాల్ట్ అని పిలుస్తారు. అలాగే ఇది హిమాలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా లభ్యమవుతుంది. కాబట్టి దీన్నే హిమాలయన్ పింక్ సాల్ట్ అని కూడా అంటారు.

సాధారణ ఉప్పుతో పోలిస్తే ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని, మిగత రకాల ఉప్పులతో పోల్చి చూస్తే ఈ ఉప్పు చాలా స్వచ్ఛమైందనీ చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ సాధారణ ఉప్పుతో పోలిస్తే ఇందులో ఉండే సోడియం కాస్త తక్కువగానే ఉంటుంది. అందుకే చాలామంది దీనిని సూప్‌లు, సలాడ్స్‌లో భాగం చేసుకుంటూ ఉంటారు.

రసాయనికంగా సాధారణ ఉప్పుతో ఇందుప్పుని పోల్చి చూస్తే.. ఇందులో 98% సోడియం క్లోరైడ్ ఉంటుంది. దీంతో పాటు ఖనిజ లవణాలైన పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం.. మొదలైనవి కూడా ఇందులో కొద్ది మోతాదుల్లో ఉంటాయి. పింక్ సాల్ట్ నారింజ రంగులో కనిపించడానికి గల కారణం కూడా ఇదే. రుచిలో కూడా మిగతా ఉప్పులతో పోలిస్తే ఇందుప్పు భిన్నంగా ఉండడానికీ ఇదే కారణం.

పింక్ సాల్ట్ ద్వారా చర్మానికి కలిగే ప్రయోజనాలు..

ADVERTISEMENT

ఇందుప్పుని వినియోగించడం ద్వారా సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని మీకు తెలుసా?? ముఖ్యంగా దీనిని స్పా ట్రీట్ మెంట్స్‌లో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి, పింక్ సాల్ట్ ఉపయోగించడం ద్వారా చర్మానికి కలిగే ఆ ప్రయోజనాలేంటంటే..

చర్మాన్ని డీటాక్సిఫై చేస్తుంది..

ఇందుప్పులో డీటాక్సిఫికేషన్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. మన శరీరం లోపల ఉండే టాక్సిన్స్‌ని ఇది సులభంగా బయటకు పంపించగలదు. ముఖ్యంగా చర్మకణాల మధ్య ఇరుక్కుపోయిన దుమ్ము, కాలుష్యం, బ్యాక్టీరియా.. వంటి వాటిని లోతు నుంచీ శుభ్రం చేసి చర్మం లోపల నుంచి మెరిసేలా చేస్తుంది.

దీనికోసం స్నానం చేసే సమయంలో పింక్ సాల్ట్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. స్నానం చేసేటప్పుడు శరీరాన్ని నీటితో తడిపిన తర్వాత ఒక కప్పు ఇందుప్పు తీసుకొని.. దానితో చర్మంపై నెమ్మదిగా రుద్దుకోవాల్సి ఉంటుంది.

కాసేపటి తర్వాత స్నానం ముగించిన అనంతరం.. ఒక కప్పు చిక్కని పాలల్లో లావెండర్ నూనె, జునిపెర్ బెర్రీ ఆయిల్ కొద్ది చుక్కల చొప్పున వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని టబ్‌లో ఉండే నీటిలో కలిపి అందులో కాసేపు శరీరం అంతా మునిగి ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం లోతుగా శుభ్రపడడంతో పాటు టాక్సిన్స్ కూడా సులభంగా బయటకు వెళ్లిపోతాయి.

ADVERTISEMENT

Shutterstock

డెడ్ సెల్స్‌ని తొలగిస్తుంది..

చర్మంపై ఉండే మృతకణాలను సులభంగా తొలగించే స్క్రైబ్స్‌లో ఉప్పు కూడా ఒకటి. ఈ మధ్య పింక్ సాల్ట్‌ని స్క్రైబ్‌గా ఉపయోగించడం లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. దీని కోసం మనం చేయాల్సిందల్లా.. ఒక కప్పు పింక్ సాల్ట్‌లో అరకప్పు స్వచ్ఛమైన కొబ్బరినూనె, ఎండబెట్టిన గులాబీ పూరేకులు, జెరానీయం ఆయిల్ కొద్దిగా వేసి బాగా మిక్స్ చేయాలి.

దీనిని చర్మానికి స్క్రైబ్‌గా ఉపయోగిస్తే అందమైన చర్మాన్ని మన సొంతం చేసుకోవచ్చు. ఇవి మీకు అందుబాటులో లేనప్పుడు ఒక కప్పు పింక్ సాల్ట్‌లో పావుకప్పు ఆలివ్ ఆయిల్, మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా కొద్దిగా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కూడా మన చర్మానికి స్క్రైబ్‌గా ఉపయోగించవచ్చు.

ADVERTISEMENT

మొటిమలను తగ్గిస్తుంది..

పింక్ సాల్ట్‌లో సహజసిద్ధమైన యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. కాబట్టి మొటిమలు త్వరగా తగ్గుముఖం పట్టేలా చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. మొటిమలు రావడానికి ప్రధాన కారణమైన బ్యాక్టీరియాని ఇది సంహరిస్తుంది. ఇందుకోసం ఒక ఇందుప్పుతో ఒక స్ప్రే తయారు చేసి ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక స్ప్రే బాటిల్ లో అరచెంచా పింక్ సాల్ట్ వేసి అందులో అరకప్పు స్వచ్ఛమైన నీటిని వేయాలి. దీనిని బాగా మిక్స్ చేసి ఆ నీళ్లని ముఖంపై కొద్దికొద్దిగా స్ప్రే చేసుకుంటూ ఉండాలి.

ఫేస్ వాష్ గా..

చర్మాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించే చాలా క్లెన్సింగ్ ఉత్పత్తులు ఆల్కలినిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి చర్మం పీహెచ్ స్థాయులను దెబ్బతీస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడడంతో పాటు చర్మం పీహెచ్ విలువలను కూడా బ్యాలన్స్ చేసుకోవాలంటే పింక్ సాల్ట్ ఉపయోగించి మనమే స్వయంగా ఫేస్ వాష్ ని తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఫోమింగ్ సోప్ డిస్పెన్సర్ లో చెంచా ఇందుప్పు, టీ ట్రీ ఆయిల్, జెరానియం ఆయిల్, లావెండర్ నూనె 3 నుంచి 5 చుక్కల మోతాదులో తీసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో పావుకప్పు లిక్విడ్ క్యాస్టైల్ సోప్, ఒక కప్పు డిస్టిల్డ్ వాటర్ వేసి బాగా షేక్ చేయాలి. అంతే.. ఫేస్ వాష్ రడీ.. దీనిని రోజుకి రెండుసార్లు ఉపయోగిస్తే సరిపోతుంది.

Shutterstock

ADVERTISEMENT

టోనర్‌గానూ ఉపయోగపడుతుంది..

సాధారణంగా ఉప్పుకి చర్మాన్ని పొడిగా మార్చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. కానీ చర్మాన్ని అధిక సమయం తాజాగా కనిపించేలా చేసే టోనర్ గానూ దీనిని మార్చుకోవచ్చంటే మీరు నమ్ముతారా? నిజమండీ.. ఇది చర్మాన్ని బిగుతుగా మార్చడమే కాదు.. పెద్ద పరిమాణంలో ఉన్న చర్మరంధ్రాలను తిరిగి చిన్నవిగానూ మారుస్తుంది. దీని కోసం మనం చేయాల్సిందల్లా.. అరచెంచా పింక్ సాల్ట్, చెంచా కొబ్బరి నూనె ఒక చిన్న బాటిల్ లో వేయాలి.

ఇందులో నిమ్మ నూనె కొద్దిగా, అరకప్పు స్వచ్ఛమైన నీళ్లు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. తర్వాత దీనిని స్ప్రే బాటిల్ లో వేసి ఉపయోగిస్తే సరి. చర్మాన్ని క్లెన్సింగ్ చేసుకున్న తర్వాత కళ్లు మూసుకుని ఈ మిశ్రమాన్ని ముఖం పై స్ప్రే చేసుకుని ఆరిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే చాలు.. చర్మం భలే తాజాగా మెరిసిపోతుంది.

జిడ్డుదనాన్ని తగ్గిస్తుంది..

ఉప్పు సహజసిద్ధంగానే చర్మంపై ఉండే అధిక నూనె, జిడ్డు.. వంటి వాటిని పీల్చేసుకుంటుంది. కేవలం చర్మంపైనే కాదు.. జుట్టు కుదుళ్ల వద్ద ఉండే జిడ్డుని కూడా సులభంగా తొలగిస్తుంది. ఇందుకోసం మీరు ఉపయోగించే షాంపూలో పింక్ సాల్ట్ కొద్దిగా కలిపితే చాలు. అలాగే చర్మంపై ఉన్న జిడ్డుదనాన్ని తగ్గించుకునేందుకు పింక్ సాల్ట్ ఉపయోగించి తయారుచేసే ఫేసియల్ టోనర్ ని ఉపయోగిస్తే సరిపోతుంది.

పింక్ సాల్ట్ ద్వారా శిరోజాలకు కలిగే ప్రయోజనాలు..

ADVERTISEMENT

పింక్ సాల్ట్ వినియోగించడం ద్వారా కేవలం చర్మాన్నే కాదు.. మన శిరోజాలను కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇంతకీ ఇందుప్పు ఉపయోగించడం ద్వారా మన కేశాలకు కలిగే ఆ ప్రయోజనాలేవంటే.. 

Shutterstock

చుండ్రుని నివారిస్తుంది..

ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తూన్న కేశ సంబంధిత సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. దీని నుంచి ఉపశమనం పొందేందుకు ఎంతోమంది ఎన్నో చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఫలితం మాత్రం అంతగా కనిపించకపోవచ్చు. అయితే ఈసారి పింక్ సాల్ట్ ఉపయోగించి చూడండి. సమస్య నుంచి తప్పక బయటపడే అవకాశాలున్నాయి. దీని కోసం మీరు ఉపయోగించే సాధారణ షాంపూ, పింక్ సాల్ట్ సమపాళ్లలో తీసుకోవాలి. అంటే చెంచా పరిమాణంలో తీసుకున్న షాంపూకి చెంచా పింక్ సాల్ట్ కలపాలి. దీనిని తలస్నానం చేసేందుకు ఉపయోగిస్తే ఫలితం కనిపించవచ్చు.

ADVERTISEMENT

అందమైన శిరోజాల కోసం..

కొంతమంది కేశాలు ఎప్పుడు చూసినా చాలా ఫ్లాట్ గా కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఒత్తుగా, అలల్లా ఎగసేలా కనిపించేలా చేయడానికి రకరకాల ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ అనుకున్న ఫలితం కనిపించకపోవచ్చు. ఒకవేళ మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే ఈసారి దాని నుంచి బయటపడేందుకు పింక్ సాల్ట్ ని ప్రయత్నించి చూడండి.

ఇందుకోసం ఒక స్ప్రే బాటిల్లో చెంచా పింక్ సాల్ట్, అరకప్పు స్వచ్ఛమైన నీళ్లు, కొద్ది చుక్కల బెర్గమాట్ ఆయిల్ వేసి బాగా షేక్ చేయాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని స్ప్రే చేసి, కురులను టవల్ తో ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత మీ జుట్టు ఒత్తుగా కనిపించడం చూసి మీరే ఆశ్చర్యపోతారంటే అతిశయోక్తి కాదు.

జుట్టు వేవీగా కనిపిస్తుంది..

పింక్ సాల్ట్ ఉపయోగించి తయారు చేసే హెయిర్ స్ప్రే వినియోగిస్తే చాలు.. కురులు అందంగా మాత్రమే కాదు.. వేవీగా కూడా కనిపిస్తాయి.

ADVERTISEMENT

Shutterstock

పింక్ సాల్ట్ ద్వారా మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు..

· శరీరంలో ఉన్న నీటి స్థాయులను నియంత్రిస్తుంది

· వయసు పై బడుతున్న ఛాయలను సైతం అంత త్వరగా దరి చేరనీయదు

· శ్వాస కోశ వ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేస్తుంది

ADVERTISEMENT

· సైనస్ సంబంధిత సమస్యలను తగ్గుముఖం పట్టేలా చేస్తుంది

· ఎముకల్లో బలాన్ని పెంచుతుంది

· సక్రమంగా నిద్ర పట్టేందుకు కూడా పింక్ సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది

· రక్తంలో చక్కెర స్థాయులు కూడా ఆరోగ్యకరమైన స్థాయిలో ఉండేలా చేస్తుంది

ADVERTISEMENT

· జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేయడమే కాకుండా మనం తీసుకునే ఆహారం జీర్ణాశయ గోడలు బాగా శోషించుకునేలా కూడా చేస్తుంది

· గ్లాసు మంచి నీళ్లలో కొద్దిగా పింక్ సాల్ట్ వేసి కరికే వరకు బాగా కలిపి.. ఈ మిశ్రమంతో నోటిని పుక్కిలించడం ద్వారా చిగుళ్ల నుంచి రక్తస్రావం కాకుండా అరికట్టవచ్చు.

· మన శరీరానికి అవసరమయ్యే 84 ముఖ్యమైన ఖనిజాలు పింక్ సాల్ట్ లో లభ్యమవుతాయి. ఇవి శరీర కణాల మధ్య ఆరోగ్యకరమైన పీహెచ్ బ్యాలన్స్ కి చక్కగా ఉపయోగపడతాయి.

· శ్రుంగారపరమైన జీవితం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా సాగుతుంది.

ADVERTISEMENT

· శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మరింత బలపరుస్తుంది.

పింక్ సాల్ట్ ఉపయోగించడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్..

సాధారణ ఉప్పుతో పోలిస్తే ఇది ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావించినప్పటికీ దీనిని కూడా పరిమితంగానే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే దీని కారణంగా కలిగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోక తప్పదు. అవి..

  • అయోడిన్ లోపంతో బాధపడేవారు పింక్ సాల్ట్ ని తమ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వారి సమస్య మరింత జఠిలం అవ్వచ్చు. ఎందుకంటే సాధారణ ఉప్పు కంటే ఇందులో అయోడిన్ స్థాయులు తక్కువగా ఉంటాయి. కాబట్టి అయోడిన్ లోపంతో సతమతమయ్యేవారు పింక్ సాల్ట్ తీసుకున్నప్పటికీ అయోడిన్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
  • పింక్ సాల్ట్ ని మరీ ఎక్కువగా తీసుకుంటే ఎముకల సంబంధిత సమస్యలు తలెత్తడంతో పాటు గుండెల్లో మంట, హై బీపీ వంటి గుండె సంబంధిత సమస్యలు వంటివి కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి పింక్ సాల్ట్ ఉపయోగించే విషయంలో వైద్యులను కూడా ఓసారి సంప్రదించడం మంచిది.

తరచూ అడిగే కొన్ని ప్రశ్నలు – వాటి సమాధానాలు

Shutterstock

ADVERTISEMENT

పింక్ సాల్ట్ విషపూరితమా??

పింక్ సాల్ట్ లో లెడ్ కూడా ఉండడం వల్ల ఇది విషపూరితమని చాలామంది భావిస్తూ ఉంటారు. అదీకాకుండా ఇందులో ఉండే కొన్ని మినరల్స్ రేడియోధారిక్మత గుణాలు కలిగి ఉన్న కారణంగా వాటి ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుందని కూడా భావిస్తారు. వీటిలో కాస్త వాస్తవం ఉన్నప్పటికీ ఇవే పూర్తిగా నిజం కాదంటున్నాయి తాజా అధ్యయనాలు.

సాధారణ ఉప్పులానే దీన్ని కూడా ఉపయోగించవచ్చు. అయితే సోడియం, అయోడిన్.. సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సూచన మేరకే దీనిని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే పింక్ సాల్ట్ ని కేవలం పరిమితికి లోబడి మాత్రమే ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో దాదాపు 80కి పైగా ఖనిజ లవణాలు ఉంటాయి. వాటిలో అతికొద్ది సంఖ్యలో మాత్రమే స్వల్పస్థాయుల్లో నెగెటివ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

రోజూ నేను ఎంత పరిమాణంలో పింక్ సాల్ట్ తీసుకోవచ్చు?

2015 – 2020 డైటరీ గైడ్ లైన్స్ ఫర్ అమెరికన్స్ ప్రకారం ఒక వ్యక్తి రోజూ 2,300 మిల్లీ గ్రాముల సోడియం తమ ఆహారంలో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే దాదాపు ఒక చెంచా టేబుల్ సాల్ట్ తీసుకోవడం ద్వారా ఈ మొత్తాన్ని మనం పొందవచ్చు.

అయితే అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు మాత్రం ఒక రోజుకి 1500 మిల్లీ గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. అయితే సాధారణ ఉప్పు కంటే ఆరోగ్యానికి మేలు చేయడంలో పింక్ సాల్ట్ బాగా ఉపయోగపడుతుందని ఇప్పటివరకు ఎలాంటి అధ్యయనాల్లోనూ రుజువు కాలేదు. కాబట్టి మీ వైద్యులను ఒకసారి సంప్రదించి ఆ తర్వాతే మీరు ఎంత మోతాదులో పింక్ సాల్ట్ తీసుకోవచ్చనేది నిర్ణయించుకోవడం మంచిది.

ADVERTISEMENT

టేబుల్ సాల్ట్‌తో పోలిస్తే పింక్ సాల్ట్ మంచిదా?

దీనికి సమాధానం కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఇప్పటివరకు ఏ అధ్యయనాల్లోనూ పింక్ సాల్ట్ టేబుల్ సాల్ట్ కంటే మంచిదని నిరూపణ కాలేదు. పింక్ సాల్ట్ లో ఐరన్ ఆక్సైడ్ ఉండడం వల్ల అది నారింజ రంగులో మనకు కనిపిస్తుంది. అదీకాకుండా సాధారణ ఉప్పుతో పోలిస్తే ఇందులో ఉండే సోడియం, అయోడిన్ స్థాయులు కూడా కాస్త తక్కువే. పింక్ సాల్ట్ లో ఉండే క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం.. వంటి ఖనిజాలు కారణంగా సోడియం స్థాయులు తక్కువగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పింక్ సాల్ట్ ని టేబుల్ సాల్ట్ తో పోలిస్తే రంగు, రుచిలో మాత్రం తేడా స్పష్టంగా కనిపిస్తుంది.

పింక్ సాల్ట్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

పింక్ సాల్ట్ ఉపయోగించడం ద్వారా మనం అనేక ఆరోగ్యపరమైన ప్రయోజనాలు మాత్రమే కాదు.. సౌందర్యపరమైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ముఖ్యంగా 84 ఎస్సెన్షియల్ మినరల్స్ ఇందులో ఉంటాయి. అవన్నీ మన శరీరానికి ముఖ్యమైనవి మరియు అవసరమైనవే. అలాగే పింక్ సాల్ట్ లో సోడియం క్లోరైడ్ తో పాటు 15% ఖనిజాలు ఉంటాయి. ముఖ్యంగా శరీర కణాలలో పీహెచ్ ని బ్యాలన్స్ చేయడంలో పింక్ సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది.

రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచడం, సహజసిద్ధమైన స్లీప్ సైకిల్ ని క్రమబద్ధీకరించడం.. వంటి అంశాల్లోనూ ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా మన శరీరం లోపల ఉండే ఎలక్ట్రోలైట్స్ ని కూడా ఇది బ్యాలన్స్ చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే చాలామంది దీనిని తమ ఆహారంలో భాగం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.

పింక్ సాల్ట్ విషయంలో ఏమైనా అపోహలు ఉన్నాయా? అవి ఏవి?

పింక్ సాల్ట్ ఉపయోగించే విషయంలో రెండు అపోహలు చాలామందిలో మనకు కనిపిస్తుంటాయి. వాటిలో ఒకటి దీనిని మినరల్ సప్లిమెంట్ గా ఉపయోగించవచ్చు అనేదైతే; మరొకటి ఇందులో ఉండే రేడియో యాక్టివ్ మినరల్స్ ప్రమాదకరమైనవని అంటూ ఉంటారు. వీటిలో ఏదీ వాస్తవం కాదు. ఎందుకంటే పింక్ సాల్ట్ లో 84 రకాల ఖనిజాలు ఉన్నాయన్న మాట నిజమే.. కానీ దీని అర్థం పింక్ సాల్ట్ లో మినరల్స్ పుష్కలంగా లభిస్తాయని కాదు.

ADVERTISEMENT

అంటే ఏదైనా మినరల్ డెఫిషియన్సీతో బాధపడేవారికి దీనిని మినరల్ సప్లిమెంట్ గా ఇవ్వలేం. అలాగే ఇందులో ఉండే రేడియో యాక్టివ్ మినరల్స్ కూడా అంత ప్రమాదకరమైనవేమీ కావు. పింక్ సాల్ట్ మితంగా ఉపయోగించినంత వరకు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఈ విషయంలో అపోహలకు తావీయకుండా వైద్యుల సూచన, సలహాల మేరకు ఇందుప్పుని ఉపయోగించడం మంచిది.

ఇవి కూడా చదవండి

ఆయురారోగ్యాలను ప్రసాదించే.. తులసి మొక్క గురించి తెలుసుకోవాల్సిన అంశాలివే..!

మీకు తెలుసా?? బేకింగ్ సోడా మీ చర్మాన్ని అందంగా మార్చేస్తుందని..

ADVERTISEMENT

జుట్టు రాలకుండా ఉండాలంటే.. తలకు నూనె ఇలా రాసుకోవాలి

20 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT