ADVERTISEMENT
home / Dating
భాగస్వామి ఫోన్ మనం చెక్ చేయడం.. సరైన పనేనా?

భాగస్వామి ఫోన్ మనం చెక్ చేయడం.. సరైన పనేనా?

భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదంటారు పెద్దలు. కానీ రహస్యాలు లేని కాపురం ఉంటుందంటే ఆలోచించాల్సిన విషయమే. భాగస్వామితో పంచుకోని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని దాచి పెడితే ఫరవాలేదు. కానీ అన్ని విషయాలను దాస్తేనే సమస్య. సాధారణంగా భర్త లేదా ప్రియుడు  ఏదైనా రహస్యాన్ని దాచి పెడుతున్నారనే అనుమానం ఎవరికైనా సహజంగానే వస్తుంటుంది.

ఈ క్రమంలో మీకు మీ భాగస్వామి (Partner) ఫోన్  చెక్ చేయాలన్న ఆలోచన కూడా రావడం సహజమే. వాళ్లు ఎవరితోనైనా చాటింగ్ చేస్తున్నారా? లేదా డేటింగ్ యాప్స్ ఉపయోగిస్తున్నారా? అని మీకు కూడా తెలుసుకోవాలని అనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు తమ భాగస్వామి వద్ద ఫోన్ విషయంలో ఎలాంటి రూల్స్ పెట్టరు. కానీ మరికొందరు మాత్రం తమ ఫోన్‌ని పర్సనల్ విషయంగా భావిస్తారు. అలాంటప్పుడు మీ భాగస్వామి ఫోన్ తీసుకొని చూడడం సరైన పనేనా? మనమూ తెలుసుకుందాం రండి..

Shutterstock

ADVERTISEMENT

మీ భాగస్వామి ఫోన్ చెక్ చేసేముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే..  వారి అనుమతి లేకుండా వారి ఫోన్ చూడడం కూడా వారి ప్రైవసీకి భంగం కలిగించడమే. మీ భర్త కూడా మీకు తెలియకుండా మీ ఫోన్ చూస్తూ.. మీరు మీ స్నేహితురాలు ఛాట్ చేసుకున్న విషయాలన్నీ చదివితే ఎలా ఉంటుందో ఓసారి ఊహించండి. అలాగే మీరు కూడా.. మీ భాగస్వామి ఫోన్ చెక్ చేయాలని భావిస్తే.. మీ బంధంలో ఎక్కడో అపశ్రుతి దొర్లిందని అర్థం.

మీ బంధాన్ని మీరు అసురక్షితంగా భావించినా.. లేదా మీ భాగస్వామి మీ దగ్గర ఏదో దాస్తున్నారని అనుమానించినా ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అలాంటప్పుడు.. మీ భాగస్వామి ఫోన్ (phone) చెక్ చేసి అసలు విషయం తెలుసుకోవాలని అనిపించడం సహజమే. కానీ ఇది అప్పటికి సరైన విషయం. కానీ దానివల్ల కొంత కాలం తర్వాత సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది. వారు మాట్లాడిన కొన్ని మాటలు చదివి మీరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు.

Shutterstock

ADVERTISEMENT

మీ భాగస్వామి ఫోన్‌ని తన అనుమతి లేకుండా చూడడం తప్పు. కానీ ప్రతి ఒక్కరి బంధం వేరుగా ఉంటుంది. కొన్ని బంధాల్లో ఇలా ఒకరి వస్తువులు మరొకరు వాడుకొనే స్వేచ్ఛ కూడా ఉంటుంది. చాలామంది తమ భాగస్వామితో కలిసి పాస్ వర్డ్స్ వంటివన్నీ పంచుకుంటూ ఉంటారు. మరికొందరు అన్ని విషయాలను పంచుకుంటారు. కొందరికి తమ భాగస్వామి పక్కన లేనప్పుడు కూడా ఫోన్ చూసేంత స్వేచ్ఛ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన బంధం. అందుకు ఇద్దరూ ఒకరినొకరు నమ్మాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరిద్దరూ ఫోన్ పాస్ వర్డ్‌లు ఒకరితో మరొకరు పంచుకోకపోతే.. కాస్త ఆలోచించండి. ఇలాంటి సమయాల్లో ఎదుటి వ్యక్తి అనుమతి లేనిదే.. తన ఫోన్ చెక్ చేయకపోవడం బెటర్. 

Shutterstock

మీ భాగస్వామి తన ప్రైవసీ విషయంలో పరిమితులు పెట్టుకున్నా.. తన ఫోన్ చెక్ చేయాలని మీకు అనిపిస్తుందా? అయితే మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవడం మంచిది. నాకు ఇలా చేయాలని ఎందుకు అనిపిస్తోంది? ఇది మా బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందా? మా బంధంలో అనుమానం కంటే నమ్మకాన్ని పెంచుకునేందుకు నేనేం చేయగలుగుతాను? ఇలా చెక్ చేసేముందు నేను తన అనుమతి తీసుకుంటే ఏమవుతుంది? వంటి ప్రశ్నలు మీకు మీరు వేసుకోవడం మంచిది. అప్పుడు మీ బంధానికి సంబంధించి మీరు మరింత క్లారిటీ పొందే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు. 

ADVERTISEMENT

మీ భాగస్వామి మీ నుండి ఏదో దాస్తున్నారనిపిస్తే.. అలాగే కాస్త వింతగా ప్రవర్తిస్తుంటే.. మీ ఇద్దరూ కలిసి ఆనందంగా మాట్లాడుకునే సమయంలో ఆ విషయాలను ప్రస్తావించం మంచిది. అలాగే మీరు ఎలా ఫీలవుతున్నారో వారికి నిజాయతీగా చెప్పడం మంచిది. కానీ ఆయా విషయాల గురించి వాళ్లను తిట్టడం సరికాదు. ఎందుకంటే.. విషయం చర్చించడం అనేది సమస్య పరిష్కారం దిశగా మీరు వేసే సరైన అడుగుగా చెప్పుకోవచ్చు.

ఆలుమగలు లేదా ప్రేమికులు ఎప్పటికప్పుడు ఇలా చర్చించుకోవడం వల్ల అభూత కల్పనలు, అర్థం పర్థం లేని ఊహాలతో సతమతమవడం జరగదు. అలాగే మీ భాగస్వామి మీకు తగిన సమాధానం చెప్పేందుకు ఈ చర్చలు తోడ్పడతాయి. 

shutterstock

ADVERTISEMENT

సాధారణంగా దంపతుల మధ్యలో ఉండే అనుబంధం వివిధ రకాలుగా ఉంటుంది. కొందరు తమ భాగస్వామికి తమ గురించి, తమ వ్యక్తిగత విషయాల గురించి తెలిస్తే తాము ఫ్రీగా ఉండేందుకు వీలవుతుందని భావిస్తారు. అయితే ఇలా చేయాలంటే ఇద్దరు ఆ మెచ్యూరిటీతో ఉండాలి. లేకపోతే మీ భాగస్వామి స్నేహితులతో మాట్లాడే మాటలు, ఆన్‌లైన్‌లో చేసే పనులు మీకు ఇబ్బందిని కలిగించవచ్చు. ఇలా ఎదుటి వ్యక్తికి స్వేచ్ఛను ఇస్తున్నప్పుడు.. వాటిని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.

అలాగే మీ భాగస్వామి చేసే ఈ పనులను చూసి భరించే శక్తి ఉంటేనే ఆ స్వేచ్ఛను కోరుకోవడం మంచిది. మీ బంధంలో మీరు అనుమానంతో ఉంటే.. తన ఫోన్ చెక్ చేయాలనే ఆశ పుడుతుంది. కాబట్టి దానికి చోటివ్వకండి. కొన్ని పరిస్థితుల్లో మీ భాగస్వామి మీతో సరిగ్గా ఉండకపోయినా తనతో చర్చించి దాన్ని అర్థంచేసుకోండి.  అలాగే ఇద్దరికీ ఇష్టమైన రీతిలో మీ ఇద్దరి మధ్యా గీత గీసుకోవడం మంచిది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి.

ప్రేమ జీవితాంతం ఉండాలంటే.. గొడవ పెట్టుకోవాల్సిందే..!

వీరిద్దరిదీ సమాధులు కలిపిన ప్రేమ బంధం.. ఈ వింత ప్రేమకథ మీరూ చదవండి..!

తన పుట్టినరోజున నేనిచ్చిన సర్ ప్రైజ్ చూసి.. నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఫీలయ్యాడంటే..!

ADVERTISEMENT
19 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT