ప్రేమ మాధుర్యాన్ని అందంగా వివరించే.. 40 రిలేషన్ షిప్ కొటేషన్లు..!

ప్రేమ మాధుర్యాన్ని అందంగా వివరించే.. 40 రిలేషన్ షిప్ కొటేషన్లు..!

అనుబంధానికి (relationship) గట్టి పునాది ప్రేమ. ప్రేమలో పడితే చాలు ఎక్కడ లేని భావుకత వచ్చేస్తుంది. ప్రేమకవితలు అందంగా అల్లేస్తుంటారు. ఆ భావం అంత గొప్పది, తియ్యనిది. అప్పుడప్పుడూ మనం ప్రేమించిన వారికి కొటేషన్స్, కవితలు పంపించాలనుకుంటాం. కానీ ఆ సందర్భంలో ఏం పంపించాలో తెలియదు. అలాంటి సమయాల్లో ఇన్స్టెంట్‌గా పంపించడానికి వీలుగా మీకోసం మంచి రిలేషన్ షిప్ కొటేషన్స్ (relationship quotes) అందిస్తున్నాం. వాటిపై ఓ లుక్కేయండి..!

ఫన్నీ రిలేషన్‌షిప్ కొటేషన్లు (Funny Relationship Quotes)

 1. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి అసలు స్వభావం తెలుసుకోవాలంటే.. వారికి స్లో ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్ ఇవ్వండి – విల్ ఫెరెల్
 2. ఏంటి.. నాకు తల పట్టేసినట్లుంది. అలాగే ఒళ్లంతా గిలిగింతలు పెట్టినట్లుంది. నేను ప్రేమలో పడ్డానా? లేక చికెన్ పాక్స్ వచ్చిందా? – ఉడీ ఎలెన్
 3. ప్రేమకు మనం వెల కట్టలేం. దాని ధర నువ్వు నిర్ణయిస్తే నా ప్రేమను నీకు అర్పిస్తా – హుస్సేన్ నిషాహ్(ఇక్కడ ధర అంటే ప్రేమే. డబ్బు కాదు.)
 4. నా సమాధానం ప్రేమ. దీనికి తగ్గ ప్రశ్నను తయారు చేయగలవా? – లిల్లీ టామ్లిన్
 5. అనుబంధాన్ని నిలబెట్టుకోవడం ఫుల్ టైం జాబ్‌లా చాలా కష్టమైనది. దాన్ని అలాగే చూడాలి కూడా. మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ మీ నుంచి దూరమవ్వడానికి మీకు నోటీస్ పీరియడ్ కూడా ఇస్తారు. వారు మిమ్మల్ని విడిచి వెళ్లేముందు మీకిచ్చే పేమెంట్ చాలా దారుణంగా ఉంటుంది.
 6. రిలేషన్ షిప్‌లో ఉండటానికి, జైల్లో ఉండటానికి తేడా ఏంటో తెలుసా? జైల్లో ఉంటే వారానికోసారైనా మిమ్మల్ని కాసేపు అలా ఫ్రీగా వదిలేస్తారు. రిలేషన్ షిప్‌లో ఉంటే  ఆ అవకాశం ఉండదు – అగాథా క్రిస్టీ.
 7. ప్రేమ నడుం నొప్పి లాంటిది. ఎక్స్ రేలో కనిపించదు. కానీ దాని ప్రభావం మాత్రం మీపై కనిపిస్తుంది – జార్జ్ బర్న్స్
 8. అమ్మాయి, అబ్బాయి మధ్య బంధం దీర్ఘకాలం పాటు కొనసాగాలంటే.. వారిద్దరిలో ఎవరో ఒకరికి ఆజ్ఞ‌లు స్వీకరించే గుణం ఉండాలి – లిండా ఫెస్టా
 9. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు.. మీ అల్లరిని, మీ కోపాన్ని, మీ చిరాకును చూస్తారు. అయినా మిమ్మల్నే కోరుకుంటారు.

  సమయానికి తగు ఉపాయము (Best Love Quotes In Telugu To Make Him/Her Smile)

క్యూట్ రిలేషన్‌షిప్ కొటేషన్స్ (Cute Relationship Quotes)

 1. మనల్ని పేరు పెట్టి ఎంతో మంది పిలుస్తారు. కానీ ఒకే ఒక్కరు మాత్రం ఆ పేరును ప్రత్యేకంగా మారుస్తారు – కిమ్ జరాబెలో
 2. నేను మనంగా మారుతుంది. నిమిషాలు గంటలవుతాయి. అప్పటి వరకు భయపడేవారికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. అదే ప్రేమ మహిమ – రఘీబ్ క్లిస్టో
 3. అనుబంధం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే ఒకే వ్యక్తితో పదే పదే ప్రేమలో పడాల్సి ఉంటుంది – మిగ్నన్ మెక్ లాఫ్లిన్
 4. అందమైన అనుబంధాన్ని ఆస్వాదిస్తున్నవారికి చిన్న చిన్న సంతోషాలే పెద్దవిగా కనిపిస్తాయి – స్టీఫెన్ కోవీ
 5. ఒంటరిగా వంద జన్మలు ఎత్తే కంటే.. నీతో కలసి ఒక్క జన్మ జీవిస్తే చాలనుకుంటాను
 6. నావికుడికి సముద్రం గురించి  ఎంత బాగా తెలుసో.. భార్యకు తన భర్త గురించి అంత బాగా తెలుసు – హానర్ డె బల్జాక్
 7. నువ్వు నా ప్రతిబింబం. నా గురించి నేను తెలుసుకోవడానికి నిన్ను చూస్తే సరిపోతుంది.
 8. భార్యభర్తల మధ్య అనుబంధం ఎలా ఉంటుందంటే: ఇద్దరూ చిన్నపిల్లల్లా కొట్టుకుంటారు. ప్రాణ స్నేహితుల్లా మాట్లాడుకుంటారు. ప్రేమికుల్లా వాదులాడుకుంటారు. తోబుట్టువుల్లా ఒకరినొకరు కాపాడుకుంటారు.
 9. కొన్ని సార్లు కళ్లు చూడలేనివి హృద‌యం చూస్తుంది
 10. నీతో ఉంటే నేను ఈ లోకాన్నే మరచిపోతా

Best Quotes And Status For Whatsapp In Telugu

స్ఫూర్తిదాయకమైన రిలేషన్‌షిప్ కొటేషన్స్ (Inspirational Relationship Quotes)

 1. నీకు నేను గుర్తుంటే చాలు. ఇతరులు నన్ను మరచిపోయినా నాకు వచ్చే నష్టం ఏమీ లేదు.
 2. నీతో ఉన్నప్పుడు నాపై నాకు మరింత ఇష్టం పెరుగుతుంది.
 3. నావికుడికి సముద్రం గురించి  ఎంత బాగా తెలుసో.. భార్యకు తన భర్త గురించి అంత బాగా తెలుసు – హానర్ డె బల్జాక్
 4. అనుబంధం ఇల్లు లాంటిదైతే.. చిన్న చిన్న కలతలు ఇంట్లోని బల్బు లాంటివి. బల్బు మాడిపోతే కొత్తది తెచ్చి పెట్టుకుంటాం. కానీ ఇంటిని మార్చేయం కదా. అలాగే బంధంలో కలతలు వస్తే వాటిని తొలగించుకోవాలి కానీ.. బంధాన్ని వదులుకోకూడదు.
 5. ఆరంభంలో ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కంటే.. చివరి వరకూ ఆ ప్రేమను కొనసాగించడం ద్వారా అనుబంధం విడదీయరానిదిగా మారుతుంది.
 6. దీపం వెలగాలంటే చమురు మనమే పోయాలి కదా. ప్రేమ సందేశం మీరు వినాలకుంటే ముందు మీరే దాన్ని పంపించాలి – మదర్ థెరిసా
 7. అనుబంధం టూవే రోడ్ లాంటిది. ఇతరుల నుంచి మీరు ఆశిస్తున్న ప్రేమను ముందు వీరు వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి – చందా కొచ్చర్న
 8. నమ్మకం లేని చోట ప్రేమ ఉండటం అసాధ్యం – ఇందిరాగాంధీ
 9. అనుబంధం నమ్మకం మీద ఆధారపడి కొనసాగుతుంది. అది దెబ్బతింటే ఇద్దరి మధ్య అనుబంధం ముగిసిన అధ్యాయమే అవుతుంది – యువరాజ్ సింగ్
 10. ప్రేమంటే ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకోవడం కాదు. ఒకరి అంతరంగంలోకి మరొకరు వెళ్లి ఒకే రీతిలో చూసుకోవడం – ఆంటోనీ డి సెయింట్
 11. కొన్నిసార్లు మనం ప్రేమించిన వ్యక్తులు మనకు దూరంగా వెళ్లిపోతారు. అలా జరిగితే మీ కథ ముగిసినట్లు కాదు. మీ కథలో వారి పాత్ర ముగిసిపోయిందని అర్థం – ఫరాజ్ ఖాజీ

రిలేషన్ షిప్ మెసేజెస్ (Relationship messages)

 1. ప్రేమ ఎక్కడుందో జీవితమూ అక్కడే ఉంటుంది – మహాత్మా గాంధీ    
 2. ప్రేమను నిర్వచించాలంటే.. రెండు శరీరాల్లో నిండిన ఒకే  ఆత్మ అనవచ్చు – అరిస్టాటిల్
 3. చాలామంది తాము సరిగ్గా ఉన్నామో లేదో గుర్తించలేరు. కానీ సరైన వ్యక్తిని ప్రేమించాలని ప్రయత్నిస్తుంటారు – గ్లోరియా స్టీనెమ్
 4. జీవితంలో మనం ముఖ్యంగా పాటించాల్సిన నియమం.. ప్రేమను ఇవ్వడం, స్వీకరించడం – మోరీ స్క్వార్ట్జ్
 5. ప్రపంచమంతా మిమ్మల్ని ప్రేమించాలని మీరు అనుకోకపోవచ్చు. ఒక వ్యక్తి ప్రేమిస్తే సరిపోతుందనుకుంటారు – కెర్మిట్ ది ఫ్రాగ్
 6. మీ బంధాన్ని పటిష్టం చేసుకోండి. కలతల్ని కాదు – ఆంథోనీ జె డిఏంజిలో
 7. మిమ్మల్ని అర్థం చేసుకుంటే ప్రేమ పుట్టదు. మీ ప్రేమ వారికి కావాలనుకుంటేనే పుడుతుంది – రాబర్ట్ బ్రాల్ట్
 8. ఎప్పుడు దూరంగా ఉండాలి, ఎప్పుడు దగ్గరవ్వాలి అనేది తెలుసుకుంటే అనుబంధంలో కలతలు వచ్చే అవకాశమే ఉండదు – డొమెనికో సిరీ ఎస్ట్రాడా
 9. అన్నిటికంటే కష్టమైనదేంటో తెలుసా? మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం. మీతో మీరు ప్రేమలో పడటం.
 10. ప్రేమించడం గొప్ప కాదు. ప్రేమను పొందడం గొప్ప. ప్రేమిస్తూ ప్రేమించబడటం ఇంకా గొప్ప – టి.టొలిస్

 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది