వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా? మీ కోసమే ఈ 160 కొటేషన్లు..

వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా? మీ కోసమే ఈ 160 కొటేషన్లు..

వాట్సాప్ స్టేటస్ (Whatsapp Status).. రోజుకోసారైనా అప్డేట్ చేయనిదే చాలామందికి నిద్ర పట్టదు. ఫ్రెండ్స్‌తో కలసి దిగిన సెల్ఫీ, ఎక్కడికైనా వెళ్లినప్పుడు దిగిన ఫొటో లేదా ఫ్యామిలీతో కలసి ఉన్న ఫొటో ఇలా ఏదో ఒకటి అప్డేట్ చేస్తూనే ఉంటారు. ఫొటోలు మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ మనసులోని భావాలకు అక్షర రూపమిచ్చి.. వాట్సాప్ స్టేటస్ గా పెడుతుంటారు. మీరు కూడా అలా స్టేటస్ అప్డేట్ చేస్తూ ఉంటారు కదా. కాకపోతే కొన్నిసార్లు ఫొటోకి తగ్గ క్యాప్షన్ ఎలా పెట్టాలో తెలీదు. మరికొన్నిసార్లు.. మనసులో అనుకున్నది ప్రభావవంతంగా అక్షరరూపంలోకి రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మేం అందిస్తోన్న ఈ కొటేషన్లు ఇన్స్టెంట్ స్టేటస్‌గా పనికొస్తాయి. సందర్భాన్ని బట్టి మీకు నచ్చిన స్టేటస్ అప్డేట్ చేసుకోవడానికి వీలుగా 160 కొటేషన్లు మీకు అందిస్తున్నాం. ఈ లింక్‌ను బుక్ మార్క్ చేసుకుని.. మీకు అవసరమైనప్పుడల్లా వీటిని వాట్సాప్ స్టేటస్‌గా పోస్ట్ చేయండి.

Table of Contents

  యాటిట్యూడ్ కోట్స్ (Attitude Quotes For Whatsapp Status)

  1. నేను పొద్దున్నే నిద్ర లేస్తాను. కానీ నా ఉదయం 12 గంటలకు మొదలవుతుంది.
  2. నా స్టేటస్లో ఏముంది? పుస్తకాలు చదవండి. కొంతైనా ఉపయోగపడుతుంది.
  3. ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా మనల్ని బలహీనుల్నిచేసే వారు ఎవరో ఒకరు ఉంటారు.
  4. మనల్నిమిస్సవుతున్నామని చెప్పేవారు మనల్ని ఒక్కసారి కూడా చూడటానికి రారు.
  5. రాజు లేని రాణి ఎలా ఉంటుందో తెలుసా? చాలా పవర్ఫుల్‌గా..
  6. మీరు నన్ను ఇష్టపడినా.. ద్వేషించినా.. ఏం చేసినా నన్ను మార్చలేరు.
  7. వద్దన్నవి వంద నా దగ్గరకొస్తున్నాయి. కావాల్సింది ఒకటి కూడా రావడం లేదు.
  8. స్వర్గంలో బానిస బతుకు బతకడం కంటే నరకంలో రాజులా ఉండటం మేలు.
  9. నేను చాలా స్మార్ట్. అయినా పిచ్చి పనులే చేస్తా.
  10. నేను ఎంత మంచిదాన్నో అంతే చెడ్డదాన్ని. ఇది చాలా రేర్ కాంబినేషన్.
  11. మంచి కోసం పనిచేయండి. మెప్పు కోసం కాదు.
  12. బుర్ర చాలా విలువైనది. అందరికీ అది ఉండాలని కోరుకుంటున్నా.
  13. నేనెప్పుడూ ఓడిపోలేదు. అయితే గెలుస్తాను. లేకపోతే నేర్చుకుంటాను.
  14. నా ఆటిట్యూడ్ అద్దం లాంటిది. మీరేం చేస్తే అదే కనిపిస్తుంది.
  15. అందరితోనూ ఫ్రెండ్షిప్ చేసేవారిని నేను అస్సలు నమ్మను.
  16. ఇతరులను ద్వేషించడానికి నా దగ్గర సమయం లేదు. నచ్చితే ప్రేమిస్తా. లేదంటే వారిని పట్టించుకోను.
  17. గతం మీ తలుపు తడుతుంటే.. దానికి సమాధానం ఇవ్వొద్దు. ఎందుకంటే ఇప్పుడు దానితో మనకు పని లేదు. ఏమీ చెప్పాల్సి అవసరం లేదు.
  18. విజయం మనకు తెలియని, గుర్తించని శత్రువులను పెంచుతుంది.
  19. నా గురించి నన్ను తప్ప ఎవరినీ అడగొద్దు. ఎందుకంటే నా గురించి నాకు తప్ప ఎవరికీ తెలియదు కదా.
  20. నువ్వు నా గురించి అబద్దాలు చెప్పడం మానేస్తే.. నీ గురించి నిజం చెప్పడం మానేస్తాను.

  Read More: Good morning quotes in telugu

  వాట్సాప్ స్టేటస్ గా ప్రేమ వాక్యాలు (Love Attitude Quotes For Whatsapp Status)

  1. నిన్ను, నీ నవ్వునూ చూస్తూ ఎంత సేపైనా ఉండిపోతా.
  2. ఈ క్షణం నీ గురించే నేను ఆలోచిస్తున్నా.
  3. నువ్వు నన్ను నరకంలో పడేశావు. ఆ నరకాన్ని నేను ప్రేమ అంటాను.
  4. ప్రేమ మాటల్లో కాదు. చేతల్లో కనిపిస్తుంది.
  5. నీ గురించి ఒక్కమాటలో చెప్పమంటే ఏం చెబుతానో తెలుసా? ‘అమేజింగ్’.
  6. పట్టు పరుపులు శయనించడం కన్నా నీ భుజంపై తలవాల్చి నిద్రపోవడమే నాకు ఇష్టం.
  7. నీ ప్రేమ పొందినందుకు నేనెంత అద్ఈష్టవంతురాలినో నీకెప్పుడైనా చెప్పానా?
  8. నువ్వు నాకిష్టమైన, అందమైన పగటికల.
  9. నీ రూపం చూసి నిన్ను ప్రేమించలేదు. నీ గుణం చూసి ప్రేమించా.(అఫ్ కోర్స్ నువ్వు అందంగానే ఉంటావనుకో).
  10. ప్రతి ఉదయం నిద్రలేవగానే నాకొచ్చే మొదటి ఆలోచన నువ్వే.
  11. నిన్ను కలిసినప్పుడే నన్ను నేను గుర్తించాను.
  12. నీతో మాట్లాడకుండా ఉండటం చాలా కష్టం.
  13. నా ఫోన్ వైబ్రేట్ అయితే.. నువ్వే మెసేజ్ చేశావనుకుంటా.
  14. ప్రేమలో పడినప్పటి నుంచి నువ్వు తప్ప ఇంకెవ్వరు మాట్లాడినా విసుగ్గానే అనిపిస్తోంది.
  15. మనిద్దరం ఒకేచోట ఉన్నప్పుడు గంటలు నిమిషాలుగా మారిపోతాయి. దూరంగా ఉన్నప్పుడు నిమిషాలు గంటలుగా గడుస్తాయి.
  16. ఎవరినైనా మిస్సవుతున్నామనిపిస్తే.. వారిని ప్రేమిస్తున్నామని గుండె గుర్తు చేస్తుందన్నమాట.
  17. నిన్ను మిస్ అవడం కంటే కిస్ చేయడమే నాకిష్టం.
  18. నాకు జ్వరం వచ్చింది. నీ జ్వరం వచ్చిం.
  19. ప్రేమలో పిచ్చి లేకపోతే అది ప్రేమ కానే కాదు.
  20. నువ్వు నా జీవితంలో లేకపోతే.. ఇంకెవరూ నాకు అక్కర్లేదు.

  ప్రేమ మాధుర్యాన్ని అందంగా వివరించే.. 40 రిలేషన్ షిప్ కొటేషన్లు..!

  వాట్సాప్ స్టేటస్ గా జీవితం విలువను చెప్పే కొటేషన్లు (Life Quotes For Whatsapp Status)

  1. జీవితం చాలా చిన్నది. కాలం చాలా వేగమైనది. రీప్లే చేసుకోవడానికి, రివైండ్ చేసుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించండి.
  2. జీవితంలో విజయం సాధించాలంటే.. మనం అలవాటు చేసుకోవాల్సిన రెండు విషయాలు- కాన్ఫిడెన్స్, ఇగ్నోరెన్స్.
  3. జీవితం చాలా సరళమైనది. మనమే దాన్ని కఠినంగా మార్చేసుకుంటున్నాం.
  4. జీవితం సైకిల్ తొక్కడమంత సులభంగా ఉంటుంది. పడిపోకుండా మనం బ్యాలెన్స్ చేసుకుంటే చాలు.. ఎంత దూరమైనా వెళ్లిపోవచ్చు.
  5. జీవితం రోలర్ కోస్టర్లో రైడింగ్ లాంటిది. చాలా క్రేజీగా ఉంటుంది. ఎందుకంటే.. మరుక్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు.
  6. ఇతరుల జీవితాలను వెలిగించడానికి మన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు.
  7. అందరినీ ప్రేమించాలి. కొందరినే నమ్మాలి. ఎవరినీ బాధపెట్టకూడదు.
  8. మీ చూపు నక్షత్రాల వైపున్నా.. కాళ్లు మాత్రం నేల మీదే ఉండాలి.
  9. రెండే రెండు పదాల్లో జీవితం అంటే ఏంటో వివరించనా? ‘అదలా వెళ్లిపోతుంది’.
  10. జీవితం ఓ అద్భుతమైన సాహసయాత్ర.
  11. జీవితాన్ని సీరియస్‌గా తీసుకోవద్దు. బతికుండగా దాన్నుంచి తప్పించుకోలేవు.
  12. జీవితం ఓ సమస్య కాదు. అదో అనుభవం.
  13. మన లైఫ్ లోకి ఎంతో మంది వస్తారు. వెళ్తారు. కొందరు మాత్రం మనతోనే ఉంటారు.
  14. భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన వరమే జీవితం.
  15. అతిగా నమ్మొద్దు. అతిగా ప్రేమించొద్దు. అతిగా ఆశలు పెంచుకోవద్దు. అతి ఎప్పుడూ చేటే చేస్తుంది.
  16. జీవితం చక్కెర కంటే తీయగా ఉంటుంది. ఆ వెంటనే నిమ్మరసంలా పుల్లగా, కాకరకాయలా చేదుగా మారిపోతుంది.
  17. జీవితం కోర్టులో జరిగే ఆర్గ్యుమెంట్ లాంటిది. గెలుస్తామా? లేదా? అనేది జడ్జి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
  18. వస్తుందో రాదో తెలియని దాని కోసం ఆశగా ఎదురుచూడటమంత వెర్రితనం మరొకటి లేదు.
  19. నేనో విషయం తెలుసుకున్నా. జీవితాన్ని మనం ప్రేమిస్తే.. అది మనల్నితిరిగి ప్రేమిస్తుంది.
  20. జీవితం ఓ ప్రయోగశాల. మనమెన్ని ప్రయోగాలు చేస్తే మన జీవితం అంత మెరుగవుతుంది.

  Read More: Inspirational Quotes In Telugu

  వాట్సాప్ స్టేటస్ గా స్ఫూర్తిదాయకమైన కొటేషన్లు (Inspirational Quotes For Whatsapp Status)

  1. గడిచిపోయిన సంగతులు మన భవిష్యత్తుని నిర్దేశించకూడదు.
  2. ఎవరూ మీ లక్ష్యాన్ని నిర్దేశించరు. మీకోసం ఎవరూ వాటిని సాధించరు. ఇది మన జీవితం. ఏం చేసినా మనమే చేయాలి.
  3. పనిని మధ్యలో వదిలేసేవారు ఎప్పుడూ గెలవరు. గెలిచేవారు మధ్యలోనే ఆగిపోరు.
  4. లక్ష్యం లేని జీవితం వ్యర్థం.
  5. విజయం సాధించాలని కలలు కంటే సరికాదు. వాటిని సాధించే ప్రయత్నం కూడా చెయ్యాలి.
  6. లక్ష్యం విజయానికి దారి చూపిస్తే.. పట్టుదల విజయాన్ని చేరుకునే వాహనంలా మారిపోతుంది.
  7. ప్రతి క్షణాన్ని ఆనందంగా గడిపేవారే.. నిజమైన ధనవంతులు.
  8. చేస్తున్న పనిలో అపజయం ఎదురైందంటే.. దాని అర్థం మీరు విజయానికి చేరువ అవుతున్నట్టే.
  9. దేన్నైనా సాధించేంతవరకు దాన్ని పూర్తి చేయగలమనే విషయం మనకి కూడా తెలీదు.
  10. మన జీవితం ఓ పుస్తకం అయితే.. గడిచిపోతున్న ఒక్కో ఏడాది ఒక్కో అధ్యాయం అవుతుంది.
  11. నువ్వెంత గొప్పవాడివో నీ ఆస్తులు చెప్పవు. నీ వ్యక్తిత్వం చెబుతుంది.
  12. ఈ ప్రపంచాన్ని మార్చేయడానికి స్ఫూర్తినిచ్చే ఒక్క మాట చాలు.
  13. ఆశావాదంతో ఉండేవారు.. ప్రతి అవరోధంలోనూ అవకాశాన్ని చూస్తాడు. నిరాశావాదంలో కూరుకుపోయినవాడు.. ప్రతి అవకాశంలోనూ అడ్డంకులనే చూస్తాడు. – విన్స్టన్ చర్చిల్
  14. గెలుపు కంటే ఓటమే మనకు ఎక్కువ విషయాలు నేర్పిస్తుంది. అది మీ ఎదుగుదలకు అవరోధం కానే కాదు.
  15. భద్రత అనేది ఓ అపోహ మాత్రమే. ఎందుకంటే జీవితం ఓ అడ్వెంచర్ గేమ్ లాంటిది. – హెలెన్ కెల్లెర్
  16. తమపై తమకు నమ్మకం ఉన్నవారు ఇతరుల నమ్మకాన్ని సైతం చూరగొంటారు.
  17. ఇంటిలిజెన్స్‌కి ఫన్ తోడైతే క్రియేటివిటీ అవుతుంది.
  18. నీ దగ్గరున్న వాటితో ఏం చేయాలనుకుంటే అది చెయ్యి.. – థియోడర్ రూజ్వెల్ట్
  19. సరైనదేదో తెలిసినా దాన్ని చేయలేకపోతున్నామంటే.. ధైర్యం లేదని అర్థం – కన్ప్యూసియస్
  20. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో.. మెదడుకి పుస్తక పఠనం కూడా అంతే అవసరం.

  వాట్సాప్ స్టేటస్ గా రిలేషన్షిప్ కోటేషన్లు (Relationship Quotes For Whatsapp Status)

  1. ఇతరుల భావోద్వేగాలకు స్పందించేవారు అనుబంధాలను పదిలంగా కాపాడుకుంటారు.
  2. అనుబంధం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే మనం పాటించాల్సిన మూడు సూత్రాలు.. అబద్ధం చెప్పకూడదు. మోసం చేయకూడదు. నెరవేర్చలేని వాగ్ధానాలు చేయకూడదు.
  3. పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అంటే.. భార్యాభర్తల్లా కొట్టుకోవాలి. ప్రాణ స్నేహితుల్లా మాట్లాడుకోవాలి.
  4. మనిద్దరం కలిసి ఉంటే.. మనకెదురయ్యే కష్టాలు కూడా ఇష్టాలుగా మారిపోతాయి.
  5. ఎంత బలమైన అనుబంధాన్నైనా చిటికెలో నాశనం చేసేది అహం. కాబట్టి దాన్నిఇప్పుడే ఇక్కడే వదిలేయడం మంచిది.
  6. నిండు కుండను చిన్న రంధ్రం ఖాళీ చేసినట్టే అణువంత అహం అనుబంధాన్ని దెబ్బ తీస్తుంది.
  7. అనుబంధం రెండు హృద‌యాల‌కు సంబంధించినది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తికి ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వద్దు.
  8. మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్లం. ఒకరినొకరు ఏడిపించుకుంటాం. గొడవ పడతాం. అయినా ఒకరిని విడిచి మరొకరు ఉండలేం.
  9. బలమైన అనుబంధం ఎప్పుడు పుడుతుందంటే.. తాము ప్రేమించిన వారి కోసం దేన్నైనా త్యాగం చేయగలిన ఇద్దరు కలిసినప్పుడు.
  10. ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం పుస్తకం లాంటిది. రాయడానికి ఏళ్లకేళ్లు సమయం పడుతుంది. తగలబెట్టడానికి ఒక్క క్షణం చాలు.
  11. మీ గురించి ఎక్కువ ఆలోచించేవారిని, మీ గురించి తాపత్రయపడేవారిని ప్రేమించకుండా ఉండటం చాలా కష్టం.
  12. ప్రేమించడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ప్రేమను పొందడం చాలా గొప్ప విషయం.
  13. ‘నువ్వు సింగిలా?’ అని ఒకరు నన్ను అడిగారు. వారికి నా సమాధానం ఏంటంటే.. నా స్వేచ్ఛను పోగొట్టుకునే పని ఎన్నటికీ చేయను.
  14. అనుబంధం ప్రేమ పునాదులపై ఏర్పడుతుంది.
  15. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ఎప్పుడూ మనస్పర్థలు కలిగించలేడు. కానీ ఆ మనస్పర్థల వల్ల మీ మధ్య మూడో వ్యక్తి రావడానికి సరిపడ ఖాళీ ఏర్పడుతుంది.
  16. ఫ్లర్టేషన్ షిప్: ఫ్రెండ్షిప్ కి ఎక్కువ రిలేషన్షిప్ కు తక్కువ.
  17. కొన్ని అనుబంధాలను నిర్వచించలేం.
  18. నిజమైన మగాడు వంద మంది అమ్మాయిలను ప్రేమించడు. ఒకే అమ్మాయిని వంద రకాలుగా ప్రేమిస్తాడు.
  19. నీతో ప్రేమలో ఎప్పుడు పడిపోయానో నాకు గుర్తు లేదు. నా జీవితంలో జరిగిన అత్యద్భుతమైన విషయం ఇదే.
  20. నువ్వు చాలా స్వీట్ పర్సన్. అప్పుడప్పుడూ నిన్ను తినేయాలనిపిస్తుంది.

  100 లవ్ కోటేషన్స్ : ప్రియమైన నీకు.. ప్రేమతో.. ప్రేమగా రాయునది ఏమనగా..!

  నవ్వు తెప్పించే వాట్సాప్ స్టేటస్ (Funny Whatsapp Status)

  1. ఆరు నెలల చొప్పున ఏడాదికి రెండు సార్లు సెలవులిస్తే బాగుండు.
  2. ఒకే తప్పును రెండు సార్లు చేయద్దు. మనం చేయడానికి కొత్త తప్పులు బోలెడన్ని ఉన్నాయి. రోజుకోదాన్ని చేసేద్దాం.
  3. నా గురించి నేను తెలుసుకోవడానికి ఓ మాన్యువల్ ఉంటే బాగుండు. ఈ మధ్య బాగా కన్ఫ్యూజ్ అయిపోతున్నా.
  4. వీకెండ్ తర్వాత వచ్చే ఆ ఐదు రోజులు గడపడం చాలా కష్టమబ్బా.
  5. నువ్వు కన్విన్స్ చేయలేకపోతే.. కన్ఫ్యూజ్ చేసెయ్.
  6. విజయానికి నాకు కీ దొరికిందని సంబరపడే లోపు.. ఎవరో తాళం మార్చేస్తున్నారు.
  7. నిశ్శబ్ధంగా ఉంటే మూర్ఖుడు కూడా తెలివైన వాడిలాగే కనిపిస్తాడు.
  8. ఇల్లు చాలా నీట్ గా ఉందంటే.. ఇంట్లో ఏదో పగిలిందని గుర్తించాలి.
  9. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే... పర్వతమంత ఉన్న నీ అహంపైకి ఎక్కుతా. అక్కడి నుంచి నీ ఐక్యూలోకి దూకేస్తా.
  10. నీకు కావాలంటే నా సలహా తీసుకో. నేను దాన్ని పెద్దగా వాడట్లేదు.
  11. నా వ్యాలెట్ ఉల్లిపాయలాంటిది. దాన్ని తెరిచిన ప్రతిసారి నా కళ్లల్లోంచి నీళ్లొస్తాయి.
  12. జీవితాన్ని మరీ అంత సీరియస్ గా తీసుకోవద్దు. మనం బతికుండగా దాన్నుంచి బయటపడటం చాలా కష్టం.
  13. ‘ఫ్రీ షిప్పింగ్ అండ్ హ్యాండ్లింగ్’ ఆన్లైన్ షాపింగ్లో ఇది చూసినప్పుడు కలిగే ఆనందానికి మించింది ఏదీ లేదు.
  14. సెలవులో ఉన్నప్పుడు నేను చేసే ఉద్యోగం మీద ప్రేమ తెగ పెరిగిపోతుంది.
  15. డ్యాన్స్ చేయడం నేర్చుకోవడం చాలా ఈజీ.. శీతాకాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తే చాలు. వాకా వాకా పాటికి షకీరా కంటే బాగా డ్యాన్స్ చేస్తాం.
  16. హ్యాపీ మ్యారేజ్ సీక్రెట్ ఎప్పుడూ సీక్రెట్ గానే ఉంటుంది.
  17. ఎప్పుడూ సంతోషంగా ఉండే జంటను చూసి లవ్ బర్డ్స్ అని పిలుస్తాం. ఎప్పుడూ కొట్టుకునే వారిని యాంగ్రీబర్డ్స్ అనాలా?
  18. ఫొటోషాప్ 30 డేస్ ఫ్రీ ట్రయల్ పూర్తయ్యేదాకా ఈ ప్రపంచంలో మనకంటే అందమైన వాళ్లు ఇంకెవరూ ఉండరు.
  19. మన విషయంలో మనం ఎప్పుడూ నిజాయతీగానే ఉండాలి. అబద్ధాలు పక్కవాళ్లకి చెప్పాలి.
  20. ఈ ప్రపంచంలోని పుస్తకాలన్నింటి కంటే.. ఒకే ఒక్క వైన్ బాటిల్లో వేదాంతం ఎక్కువ ఉంటుంది.

  వాట్పాప్ స్టేటస్ గా స్నేహం విలువను చెప్పే కొటేషన్లు (Friendship Quotes For Whatsapp Status)

  1. ఫ్రెండ్స్ లేకపోతే జీవితమే లేదు.
  2. మన ప్రపంచాన్ని అందంగా మార్చేది స్నేహితులే.
  3. బాధలో ఉన్న మనకి ఓదార్పునిచ్చేవాడే స్నేహితుడు.
  4. మన గురించి అన్నివిషయాలు తెలిసినా మనల్ని ఇష్టపడేవాడే స్నేహితుడు.
  5. జీవితమనే రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన ముఖ్యమైన పదార్థం స్నేహితులు.
  6. దేవుడు నిజంగా గొప్పోడు. నీ లాంటి ప్రెండ్ ను నాకు బహుమతిగా ఇచ్చాడు.
  7. స్నేహితులతో గడిపిన ప్రతి క్షణం మధుర జ్ఞాప‌కంగా మిగిలిపోతుంది.
  8. ఫేక్ ఫ్రెండ్స్: వీళ్లెప్పుడూ మనల్ని భోంచేయమని అడగరు. రియల్ ఫ్రెండ్స్: మనకి ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు.
  9. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎప్పుడూ ఒకేలా ఆలోచించరు. ఒకే విధంగా ఉండరు. కానీ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు.
  10. స్నేహం అద్దం లాంటిది. అది పగిలిన తర్వాత అది అతకదు. ఒకవేళ అతికినా.. ఆ పగుళ్లు మాత్రం అలాగే మిగిలిపోతాయి.
  11. కొవ్వొత్తి గదిలో మాత్రమే వెలుతురు నింపగలుగుతుంది. స్నేహితుడు మాత్రం జీవితంలోని ప్రతిరోజును వెలుగుతో నింపేస్తాడు.
  12. మీ నవ్వులను ఆస్వాదించేవారి కంటే.. మీ కన్నీళ్లను గుర్తించిన వారే మీ నిజమైన స్నేహితులు.
  13. నిజమైన ఫ్రెండ్అంటే.. మీ గతాన్ని అంగీకరించి మీ భవిష్యత్తుపై నమ్మకముంచేవాడు. ఈ రోజు మీ పరిస్థితిని అర్థం చేసుకునేవాడు.
  14. మీరు ఎంత కించపరిచినా స్నేహితుడు ఎప్పుడూ ఫీలవ్వడు. పైగా మిమ్మల్నే మరింత దారుణంగా ఏడిపిస్తాడు.
  15. స్నేహం అనే మొక్క నెమ్మదిగా ఎదుగుతుంది. కానీ దాని వేళ్లు మాత్రం నేలలో బలంగా పాతుకుపోతాయి.
  16. స్నేహం అంటే అర్థం చేసుకోవడం. స్నేహం అంటే క్షమించడం. ఎప్పటికీ మరచిపోవకపోవడం.
  17. స్నేహితులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒకరి పట్ల మరొకరు శ్రద్ధ వహిస్తారు. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటారు.
  18. బిజీ లైఫ్లో కూడా మీ కోసం సమయం కేటాయించే స్నేహితులను గౌరవించడం మంచిది.
  19. ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నప్పుడే ఏదైనా మరింత రుచిగా మారిపోతుంది.
  20. మనమెలా ఉన్నా సరే వచ్చి మనల్ని హత్తుకునేవారే మన బెస్ట్ ఫ్రెండ్

  స్నేహమేరా జీవితం: ఫ్రెండ్‌షిప్ విలువను తెలియజెప్పే 40 కొటేషన్లు

  ట్రావెల్ వాట్సాప్ స్టేటస్ (Travel Whatsapp Status)

  1. నేను: ఇంకా చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. నా బ్యాంక్ అకౌంట్: బ్యాలెన్స్ నిల్. ట్రై అగైన్ లేటర్.
  2. నా టెన్షన్లన్నీ మరచిపోయేంత వరకు ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి కొన్ని రోజులు గడపాలని ఉంది.
  3. ఏడాదికోసారి మనకు పరిచయం లేని ప్రదేశానికి వెళితే ఎంత బాగుంటుందో కదా.
  4. ప్రపంచమంతా నా జ్ఞాప‌కాలు వదిలి వెళ్లాలని నేను భావిస్తున్నా.
  5. టూరిస్ట్‌గా ఉండి పోతే ఎలా? ట్రావెలర్‌గా మారేదెప్పుడు?
  6. నాకు పరిచయమే లేని ప్రదేశాలతో నేను ప్రేమలో పడిపోతున్నా.
  7. ఒంటరిగా ప్రయాణం చేస్తూ నాకే తెలియని నా గురించి తెలుసుకుంటున్నా.
  8. మన టూర్ పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. హ్యాపీగా సాగిపోతే చాలు.
  9. సోలో ట్రావెలింగ్.. నీలో దాగున్న భయాలను తొలగిస్తుంది.
  10. ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణం చేస్తున్నామనుకోవద్దు. ఈ ప్రపంచమంతా మనకు స్నేహితులే ఉన్నారు. వారు మీకోసం ఎదురు చూస్తున్నారు.
  11. ఇప్పుడు వెళ్లకపోతే.. ఎప్పటికీ వెళ్లలేం.
  12. వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది.- లావో ట్జు
  13. మిమ్మల్ని మీరు కలుసుకునేంత వరకు ప్రయాణిస్తూనే ఉండండి – డేవిడ్ మిషెల్
  14. వాట్ ఏ వండర్ఫుల్ వరల్డ్.. ఈ ప్రపంచాన్నిచూడటానికి ఈ రెండు కళ్లూ సరిపోవడం లేదు.
  15. ఒడ్డున ఉన్నంత వరకు ఓడ చాలా సురక్షితంగా ఉంటుంది. అలా ఒడ్డున ఉంచడం కోసం దాన్ని తయారు చేయలేదు.
  16. నేనెక్కడికి వెళితే అదే నా ఇల్లు.
  17. జీవితం ఓ ప్రయాణం. అదే గమ్యం కాదు.
  18. మనం చూడని దాని గురించి వంద సార్లు వినడం కంటే ఒక్కసారి దాన్ని చూడటం మేలు.
  19. ఎక్కడికి వెళ్లినా మన హృద‌యం మన వెంటే ఉండాలి.
  20. మనం ఏం చేసినా.. అది మనల్ని సంతోషపెట్టేదే అయి ఉండాలి.

  Featured Image: Shutterstock

  POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

  క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది