అమ్మతనంలోని ఆనందం ఇదే.. తన సీమంతం ఫోటోలు షేర్ చేసిన సమీరారెడ్డి

అమ్మతనంలోని ఆనందం ఇదే.. తన సీమంతం ఫోటోలు షేర్ చేసిన సమీరారెడ్డి

బాలీవుడ్ నటి సమీరారెడ్డి (sameera reddy), అక్షయ్ వర్దే దంపతులు మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నారు. తమ రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ప్రస్తుతం మూడు నెలల గర్భిణిగా ఉన్న సమీరా.. ఈ సందర్భంగా జరిగిన వేడుకల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. నరసింహుడు, జై చిరంజీవా, అశోక్ లాంటి తెలుగు చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఆమె బాగా సుపరిచితమే. అలాగే ఆమె పలు తమిళ చిత్రాలలో కూడా నటించింది. రాజమండ్రిలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించిన సమీరా రెడ్డి.. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్‌గా ఎదగడం విశేషం. 

Instagram

నిన్ననే సమీరా రెడ్డి తన సీమంతం (గోద్ బరాయ్) ఫోటోలను తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది. సంప్రదాయపద్దతిలో పసుపు రంగు కాంజీవరం పట్టుచీరను ధరించిన ఆమె.. ఆ వేడుకలో పూర్తి దక్షిణాది అమ్మాయిలా మెరిసిపోయింది. చాకర్ నెక్లస్, బ్రైట్ రెడ్ లిప్ స్టిక్‌తో అచ్చమైన తెలుగమ్మాయిలా.. తను ఆ ఫంక్షన్‌లో కనిపించడం విశేషం. 

తన భర్త అక్షయ్, అలాగే తన నాలుగేళ్ల కొడుకు హన్స్‌తో దిగిన ఫోటోను ఈ సందర్బంగా ఆమె పోస్టు చేసింది. "ఈ రోజు నేను మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను. ఈ తీపి గుర్తులు చాలు నన్ను జీవితాంతం సంతోషంగా ఉంచడానికి ❤️" అని ఆమె పోస్టు చేయడం విశేషం. 

 

 

Instagram

అలాగే సమీరా రెడ్డి, తన సోలో షాట్‌ను కూడా పోస్టు చేసింది, "నాతో పాటు ఈ లోకం, నువ్వు కూడా నవ్వుతూ ఉండాలి 🌟.@beenaseematti @seemattitextiles .. కస్టమ్ కాంచీపురం సిల్క్ శారీని అందించినందుకు నా సన్నిహితులకు ధన్యవాదాలు.  ఈ రోజు చాలా స్పెషల్‌‌గా ఫీలవుతున్నాను ❤️ #godhbharai #positivevibes అని తెలిపింది. 

 

Instagram

"ఇలాంటి సందర్భాల్లో ప్రతీ అమ్మాయి కూడా.. తన చుట్టూ తాను ఇష్టపడే వారుంటే ఎంతో సంతోషిస్తుంది. నేను సూపర్ లక్కీ. ఎందుకంటే నా బెస్టీలందరూ నా పాటు ఇక్కడే ఉన్నారు" అని సమీరా తన స్నేహితురాళ్లతో కలిసి దిగిన ఫోటోలను పోస్టు చేసింది. 

 

Instagram

ఇటీవలే సమీరా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో.. పలు విషయాలను పంచుకుంది. తొలిసారి తాను తల్లి అయినప్పుడు.. ఎదుర్కొన్న అనుభవాలను కూడా తెలిపింది. "సాధారణంగా బిడ్డ పుట్టాక, అందరు తల్లుల మాదిరిగానే నేను కూడా బరువు తగ్గాలని భావించాను. కానీ అన్ని అనుకున్నట్లే జరగవు. ఇలాంటి విషయాల్లో ఒక ప్లానింగ్ అనేది అవసరం. ఒకవైపు బిడ్డ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ మన ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి.

అయినా సరే తక్కువ సమయంలోనే నేను కోరుకున్నవన్నీ చేయగలిగాను. బిడ్డ పుట్టాక అందం తరిగిపోతుందనే వాదనలో అర్థం లేదు. అలా అయితే, నేను ఇప్పుడు కూడా చాలా హాట్‌గా ఉన్నాను.  ఇప్పుడు బిడ్డ పుట్టాక కూడా మహిళలు తమ రంగాల్లో రాణించగలుగుతారు" అని ఆమె తెలిపింది.

ఈ వ్యాసం కూడా చదవండి - తల్లికాబోతున్న గీతామాధురి.. సీమంతం ఫోటోలతో అందరికీ సర్ ప్రైజ్

ఇటీవలే సమీరారెడ్డి తన బేబీ బంప్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్టు చేయగా... ఆమెను చాలా మంది విమర్శించారు. అలాగే విపరీతంగా ట్రాల్ చేశారు. అయితే దానికి సమీరా దీటుగా రిప్లై ఇచ్చారు. "డియర్ దేశీ మెన్. మీ కామెంట్లు నేను చదివాను. మీరు మరీ అంత ఎక్కువగా ఇలాంటి విషయాల గురించి ఆలోచించవద్దు. ఇది 2019. నేను నా శరీరాన్ని ఎలా చూపించాలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు" అని గట్టిగానే బదులిచ్చింది సమీరారెడ్డి.