తల్లి కాబోతున్న గీతామాధురి.. సీమంతం ఫొటోలతో అందరికీ సర్ ప్రైజ్..!

తల్లి కాబోతున్న గీతామాధురి.. సీమంతం ఫొటోలతో అందరికీ సర్ ప్రైజ్..!

గీతా మాధురి (Geetha madhuri).. తన అందమైన గాత్రంతో తెలుగుతో పాటు దక్షిణాది ప్రేక్షకులందరి మనసులను ఆకట్టుకున్న సింగర్ ఆమె. 2014లో నటుడు నందుని (Nandu)  పెళ్లాడిన గీతామాధురి.. ఆ తర్వాత కూడా తన కెరీర్‌లో దూసుకుపోయింది. తన పాటలతో మంచిపేరు సంపాదించుకోవడంతో పాటు.. బిగ్ బాస్ 2 లో పాల్గొని అభిమానులను సైతం పెంచుకుంది. బిగ్ బాస్ షో గెలవలేకపోయినా.. రన్నరప్‌గా నిలిచి అందరి మనసులను గెలిచింది గీత.

Instagram

గత రెండు రోజుల నుండీ సోషల్ మీడియాలో గీతా మాధురి తల్లి కాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. మూడు రోజుల క్రితం జరిగిన ఆమె సీమంతం వేడుకకి వెళ్లిన ఆమె స్నేహితులు పర్ణిక, అంజనా సౌమ్య, మాళవిక, శ్యామల వంటి వాళ్లందరూ పలు పోస్టులు పెట్టారు. సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.. అంటూ గీతతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో అందరికీ గీత తల్లి కాబోతోందేమోనన్న అనుమానాన్ని కలిగింది. వెంటవెంటనే ఈ సీమంతం ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Instagram

అయితే రెండు రోజుల నుంచి గీతా మాధురి లేదా ఆమె భర్త నందు కానీ ఈ విషయంపై ఏమీ స్పందించలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు. తాజాగా గీత మాత్రం సీమంతం వీడియోను ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వెబ్ సైట్లలో పంచుకుంది.

సాధారణంగా సంప్రదాయబద్దంగా జరిగే ఈ వేడుకకు సంబంధించిన అన్ని కార్యక్రమాల చిత్రాలు ఈ వీడియోలో ఉండడం విశేషం. మంగళస్నానం నుంచి గణపతి పూజ, సీమంతం వరకు అన్నింటినీ తన వీడియో భాగంగా పోస్ట్ చేసింది గీత. ఇంట్లోనే సింపుల్‌గా జరిగిన ఈ వేడుక కోసం.. సంప్రదాయబద్ధంగా సిద్ధం చేసిన వేదికతో పాటు ఇంటిని డెకరేట్ చేసిన విధానం కూడా పలువురిని ఆకర్షిస్తోంది.

Screengrab from video

గీతా మాధురి సడన్‌గా చెప్పిన ఈ శుభవార్తకు సర్ ప్రైజ్ అయిన.. ఆమె అభిమానులంతా ఆమెను శుభాకాంక్షల్లో ముంచెత్తుతున్నారు. సీమంతం వేడుక మొత్తంలో గీత చాలా ఎనర్జిటిక్‌గా.. ఎంతో అందంగా కనిపించింది. 

Screengrab from video

గీతా మాధురికి సంబంధించిన వ్యక్తిగత విషయాలకు వస్తే.. సంగీతంపై ఆమెకున్న ఆసక్తిని గమనించిన తన తల్లిదండ్రులు ఆమెకు బాల్యం నుండే కర్ణాటక సంగీతంలో శిక్షణను ఇప్పించడం ప్రారంభించారు. లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీలో కచ్చర్లకోట పద్మావతి, రామాచారిల వద్ద తను శాస్త్రీయ, సినీ, లలిత సంగీతాలలో  శిక్షణను సైతం పొందింది.

ఈటీవీలో ప్రసారమైన సై సింగర్స్ ఛాలెంజ్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచి ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. కుల శేఖర్ దర్శకత్వం వహించిన "ప్రేమలేఖ రాశా" చిత్రంలో పాట పాడి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. మగధీర చిత్రంలోని ధీర ధీర ధీర పాటతోనే ఆమె బాగా పాపులర్ అయ్యింది. 

ఆ తర్వాత 'ఏక్ నిరంజన్‌'లో 'గుండెల్లో ఏదో సడి'. 'నచ్చావులే' చిత్రంలోని 'నిన్నే నిన్నే కోరా'.. చిరుతలో 'చమ్కా చమ్కా చమ్కీరే', మొగుడు చిత్రంలో 'ఎట్టాంటి మొగుడో నాకొచ్చే మొగుడు', శ్రీమంతుడు చిత్రంలో దిమ్మదిరిగే, గోలీమార్ సినిమాలోని 'మగాళ్లు వట్టి మాయగాళ్లు'.. ఇద్దరమ్మాయిలతో సినిమాలోని టాప్ లేసిపోద్ది, మిర్చి సినిమాలో డార్లింగే.. గరుడవేగలో 'డియో డియో' పాటలతో మంచి పేరు సంపాదించింది.

తను పాడిన పాటల్లో ఎదలో నదిలాగా పాటకు, నచ్చావులే సినిమాలోని నిన్నే నిన్నే కోరా పాటకు గాను నంది పురస్కారాలు అందుకున్న గీతా మాధురి, బాహుబలిలోని జీవనది, గోలీమార్‌లోని మగాళ్లు వట్టి మాయగాళ్లు పాటలకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా సాధించింది. బాహుబలిలోని జీవనది, జనతా గ్యారేజ్ సినిమాలోని నేను పక్కా లోకల్ పాటకు గాను ఐఫా పురస్కారాలు కూడా గెలుచుకుంది. వీటితో పాటు గామా, సైమా, అప్సర వంటి ఎన్నో పురస్కారాలను తన పాటలకు గాను గెలుపొందింది గీతా మాధురి. వివిధ సినిమాలు, ఆల్బమ్స్‌లో కలిపి 550 కి పైగానే పాటలు పాడిన గీత.. ఎన్నో మ్యూజిక్ గేమ్ షోలు, లైవ్ షోలలో పాల్గొంది. 

 

 

Facebook

2013లో అదితి అనే షార్ట్ ఫిల్మ్‌లో నందు సరసన నటించింది గీతా మాధురి. ఆ పరిచయం వీరిద్దరి మధ్య ప్రేమకు దారి తీసి 2014 ఫిబ్రవరిలో వీరిద్దరూ పెళ్లాడారు. 100% లవ్ చిత్రంలో నటించి గుర్తింపు సాధించిన నందు ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో కనిపించినా అవి పెద్దగా హిట్ కాలేదు. ప్రస్తుతం నందు నటిస్తోన్న ఓ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ అందాల జంటకు అందమైన బుజ్జాయి పుట్టాలని కోరుకుంటూ.. కాబోయే ఈ తల్లిదండ్రులకు మనమూ కంగ్రాట్స్ చెప్పేద్దాం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ఇవి కూడా చదవండి.

అమ్మతనంలోని అనుభూతే వేరు.. నేను తల్లిని కాబోతున్నా: అమీ జాక్సన్

తొందరగా గర్భం దాల్చేందుకు.. ఈ చిట్కాలు మీకు తప్పనిసరి..

ప్రెగ్నెన్సీ సమయంలో అడిగేందుకు.. ఇబ్బందిపడే సందేహాలకు సమాధానాలివిగో..!