బాలీవుడ్ తారల.. వింత అలవాట్ల గురించి మీకు తెలుసా?

బాలీవుడ్ తారల.. వింత అలవాట్ల గురించి మీకు తెలుసా?

నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు పెన్సిళ్లు, బలపాలు తినే వింత (wierd) అలవాటు ఉండేది. నాలాగే చాలామందికి రకరకాల వింత అలవాట్లు (habits) ఉంటాయి. కొందరు రకరకాల వస్తువులను సేకరించి పెట్టుకుంటే.. మరికొందరు బబుల్ ర్యాప్‌తో ఆటలాడడం, వీడియోగేమ్స్ లేదా సినిమా సీడీలను దాచుకోవడం వంటివి చేస్తుంటారు. 


కొందరు తమకున్న ఈ అలవాట్లు చూసి గర్వపడుతుంటారు కూడా. ఇదేం వింత అలవాటు అని అడిగితే కొన్నింటికి కారణాలుండవు అంటూ చెప్పడం కూడా చూస్తుంటాం. దీనికి సెలబ్రిటీలు కూడా ఏమాత్రం అతీతులు కారు. బాలీవుడ్ తారలకు కూడా ఇలాంటివే వింత అలవాట్లు చాలా ఉన్నాయి. వారి అలవాట్ల గురించి తెలుసుకుంటే.. మీవి చాలా చిన్నగా అనిపిస్తాయి మరి..


1 1483804


అక్షయ్ కుమార్


తాజాగా కేసరి సినిమాతో మంచి విజయాన్నే సాధించిన అక్షయ్ కుమార్‌కి ఓ అలవాటు ఉంది. తాను కష్టపడి నటించే సినిమాల విడుదల తేది అంటే తనకు భయమట. పైగా సినిమా విడుదలైన రోజు.. తాను మన దేశంలో ఉంటే  కలెక్షన్లు సరిగ్గా రావేమోనని భయపడతాడట. అందుకే సినిమా విడుదలకు ముందే వేరే దేశానికి ట్రిప్‌కి చెక్కేస్తాడట ఈ హీరో.


2 652896


అమితాబ్ బచ్చన్


వింత అలవాట్లకు ఎవరూ అతీతం కాదు. అది బాలీవుడ్ బిగ్ బీ అయినా సరే. అమితాబ్ సమయం పట్ల కచ్చితంగా ఉంటారట. రెండు టైమ్ జోన్లలో సమయం గురించి తెలుసుకునేందుకు ఆయన రెండు రిస్ట్ వాచీలు ధరిస్తారట. ముఖ్యంగా అభిషేక్, ఐశ్వర్య విదేశాల్లో పర్యటిస్తుంటే ఇలా చేస్తూ ఉంటారట బిగ్ బీ. అంతేకాదు.. ఎక్కడికైనా వెళ్తే అక్కడ నెట్ వర్క్ సమస్య ఏర్పడుతుందేమోనని బిగ్ బీకి భయం. అందుకే నెట్ వర్క్ సమస్య లేకుండా ఉండేందుకు ఒకటీ, రెండు కాదు.. నాలుగైదు ఫోన్లను తన దగ్గర ఉంచుకుంటారట. వీటితో పాటు రెండు చేతులతో రాయగలిగే నైపుణ్యం కూడా ఆయన సొంతం. కాబట్టి అప్పుడప్పుడూ రాస్తూ ఉంటారట.


3 5527498


సల్మాన్ ఖాన్


బాలీవుడ్ కండల వీరుడు.. దేశంలోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్. ఈ హీరోకి సబ్బులంటే ఎంతో ఇష్టమట. ఎంతగా అంటే ఆయన బాత్ రూంలో ఎన్నో రకాల సబ్బులు అందుబాటులో ఉంటాయట. హెర్బల్, హ్యాండ్ మేడ్, సెంటెడ్.. ఇలా రకరకాల సబ్బులను సేకరించి తన బాత్రూంలో ఉంచుకోవడం సల్మాన్‌కి అలవాటు. అయితే వీటన్నింటిలోనూ పండ్లు, కూరగాయల నుంచి తీసిన రసంతో చేసిన సబ్బులను ఆయన ఎక్కువగా ఇష్టపడుతుంటాడట.


4


సన్నీ లియోనీ


సన్నీ లియోనీకి ఓ వింత అలవాటు ఉంది. తన కాళ్లను ఆమె ప్రతి పావు గంటకోసారి కడుక్కుంటూ ఉంటుందట. దీనివల్ల షూటింగులకు ఆలస్యమైనా సరే.. ఆమె తన అలవాటును మార్చుకోలేదట. జిస్మ్ 2 సినిమా షూటింగ్ సమయంలో ఈ అలవాటు గురించి అందరికీ తెలిసింది. అయితే మిగిలిన వాళ్లకు కాస్త ఇబ్బంది కలిగినా.. తనకున్న ఈ అలవాటుతో ఈ అమ్మడుకి ఎలాంటి ఇబ్బందీ లేదట.


6 5811395


షారూఖ్ ఖాన్


కింగ్ ఖాన్ షారూఖ్‌కి గ్యాడ్జెట్స్, గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే ఆయన నివాసం మన్నత్‌లో ఒక ఫ్లోర్ మొత్తం గేమింగ్ డివైసెస్, వివిధ రకాల గ్యాడ్జెట్స్ కోసం అంకితం ఇచ్చేసాడట. అప్పుడప్పుడూ స్నేహితులు, బంధువులను పిలిచి వారితో గేమింగ్ పోటీలు కూడా పెట్టుకుంటూ ఉంటాడట. వీటితో పాటు షారూఖ్‌కి ఐస్ క్రీం అంటే ఇష్టం ఉండదట. తాను తినేటప్పుడు ఫొటోలు తీయడం కూడా షారూఖ్‌కి ఇష్టం ఉండదట.


5 7474100


ప్రీతీ జింతా


ప్రీతి జింతాకి శుభ్రత అంటే ఎంతో ఇష్టం. ఒకరకంగా చెప్పాలంటే అదో పెద్ద వ్యసనం. తన ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలనుకునే ఆమె ఏదైనా హోటల్‌లో దిగితే.. అక్కడ తన గది ముఖ్యంగా బాత్రూం శుభ్రంగా ఉందా? లేదా? అని ముందు చెక్ చేసుకుంటుందట. తను బాత్రూంలోకి వెళ్లినప్పుడు, అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా బాత్రూం శుభ్రంగా ఉండేలా చూసుకుంటుందట.


21980574 351940615256129 9179446173662969856 n


సుస్మితా సేన్


అందాల విశ్వసుందరి సుస్మితా సేన్ చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. కానీ తనకున్న ఓ వింత అలవాటు గురించి తెలుసా? తనకు పాములంటే ఎంతో ఇష్టమట. తను పాములను పెంచుకుంటూ ఉంటుంది కూడా. ప్రస్తుతం ఓ కొండచిలువను పెంచుతోందామె..


7


అయుష్మాన్ ఖురానా


సాధారణంగా ఆరోగ్యం గురించి మనం కేర్ తీసుకోవడం మామూలే. కానీ కాస్త అతి జాగ్రత్త తీసుకుంటే వింతగా అనిపిస్తుంది. ఆయుష్మాన్‌కి అలాంటి అలవాటే ఉంది. ఈ హీరో తన పళ్ల ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త వహిస్తాడు. ఎక్కడికి వెళ్లినా తన డెంటల్ కిట్‌ని తీసుకువెళ్తుంటాడట. అంతేకాదు.. పళ్లు చాలా శుభ్రంగా ఉండడానికి ఏదైనా తినగానే బ్రష్ చేస్తుంటాడట.


9 2461858


సైఫ్ అలీ ఖాన్


పటౌడీ నవాబ్ అయిన సైఫ్‌కి నవాబుల్లా వివిధ రకాల వస్తువులను సేకరించడం అలవాటట. అయితే తనకున్న వింత అలవాటు మాత్రం బాత్రూంలో ఎక్కువ సమయం గడపడం. దీనికోసం సైఫ్ తన బాత్రూంలో ఓ లైబ్రెరీతో పాటు ఫోన్‌ని కూడా పెట్టించుకున్నాడట. ఇల్లంతా ఉండగా బాత్రూంలో గడపడం అంటే కాస్త వింతే కదండీ..


8 5732157


అమీషా పటేల్


బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్‌కి గులాబీ రంగంటే ఎంతో ఇష్టమట. సాధారణంగా గులాబీ రంగు అమ్మాయిలందరికీ ఇష్టమే. కానీ అమీషాకి మాత్రం దానిపై ఉన్న ఇష్టం ఎంతంటే తన గదిలోని కర్టెన్ల నుంచి వార్డ్ రోబ్ వరకూ.. డేటా కేబుల్స్ నుంచి గోడల వరకూ ప్రతి ఒక్కటీ పింక్ రంగులోనే ఉంటాయట.


11 913075


జితేంద్ర


సాధారణంగా మనం మలబద్ధకానికి గురైతే దాన్ని తగ్గించుకోవడానికి పండ్ల ముక్కలు.. ముఖ్యంగా బొప్పాయి ముక్కలు తీసుకుంటూ ఉంటాం. కానీ బాలీవుడ్ ఐకానిక్ స్టార్ జితేంద్ర మాత్రం బాత్రూంలో బొప్పాయి తింటూ ఉంటారట.


10


బాబీ డియోల్


టచ్ వుడ్.. మనం ఏదైనా జరిగితే బాగుండు.. లేదా జరగకపోతే బాగుండు అని కోరుకున్నప్పుడు చెక్కను ముట్టుకుంటే అనుకున్నది జరుగుతుందనేది ఓ నమ్మకం. కొందరు నమ్మి చెప్పే పదం ఇది. అయితే ఎప్పుడో ఒకసారి ఇలా అనడం వేరు. కానీ బాబీ డియోల్ తను మాట్లాడిన ప్రతి రెండో మాటలో దీన్ని ఉపయోగిస్తారట. అందుకే ఇలా మాట్లాడినప్పుడు ముట్టుకోవడానికి తన దగ్గర ఓ చెక్క ముక్కను కూడా ఉంచుకుంటారట.


చూశారా.. ఎన్ని వింత అలవాట్లో... ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు అందుకే మరి..


ఇవి కూడా చదవండి.


ఆ నిమిషం నేను సినిమాలు వదిలేసి మెడిసిన్ చేద్దామనుకున్నా : సాయి పల్లవి


ఐశ్వర్యరాయ్ పై వివాదాస్పద మీమ్‌ను షేర్ చేసిన వివేక్.. నెటిజన్ల మండిపాటుతో క్షమాపణ..!


తారక రాముడి గురించి ఈ విశేషాలు మీకు తెలుసా? (ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్)