ఐశ్వర్యరాయ్ పై వివాదాస్పద మీమ్‌ను షేర్ చేసిన వివేక్.. నెటిజన్ల మండిపాటుతో క్షమాపణ..!

ఐశ్వర్యరాయ్ పై వివాదాస్పద మీమ్‌ను షేర్ చేసిన వివేక్.. నెటిజన్ల మండిపాటుతో క్షమాపణ..!

ఐశ్వర్యా రాయ్ (Aishwarya rai).. మాజీ ప్రపంచ సుందరి.. బాలీవుడ్ అందాల తార. అంతేకాదు.. బాధ్యత గల భార్యగా, తల్లిగా బాధ్యతలూ నిర్వర్తిస్తూ తన జీవితాన్ని ఆనందంగా సాగిస్తోందీ బ్యూటీ. అయితే ఆమె వివాహానికి ముందు సల్మాన్ ఖాన్‌తో, ఆ తర్వాత వివేక్ ఒబెరాయ్‌తో (vivek oberoi)  ప్రేమలో పడిన సంగతి చాలామందికి తెలిసిందే.


తన కెరీర్ ప్రారంభంలోనే సల్మాన్‌తో ప్రేమలో పడిన ఐశ్వర్య.. అతడి వ్యక్తిత్వం, ప్రవర్తన నచ్చక తనతో విడిపోయింది. ఆ తర్వాత చాలా తక్కువ కాలం పాటు వివేక్‌తో డేటింగ్ చేసింది. అయితే ఈ వ్యవహారం నచ్చని సల్మాన్ వివేక్‌కి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడని.. ఒక్క రాత్రిలోనే 41 సార్లు తనకు ఫోన్ చేశాడని మీడియాకు వెల్లడించాడు వివేక్. ఈ గొడవలు జరుగుతుండగానే ఐష్.. వివేక్‌తోనూ తన బంధాన్ని తెంచుకుంది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు సింగిల్‌గానే ఉన్న ఆమె.. 2007లో అభిషేక్ బచ్చన్‌ని వివాహమాడింది. వారిద్దరి ముద్దుల కుమార్తె ఆరాధ్య గురించి మనం వార్తల్లో వింటూనే ఉన్నాం.


vivek2


అయితే 2003లో ఐష్ నుంచి విడిపోయిన రోజు నుంచి ఇప్పటివరకూ.. వివేక్ సల్మాన్‌ని క్షమాపణ కోరుతూనే ఉన్నాడు. కానీ సల్మాన్ మాత్రం వివేక్‌తో కలిసి మాట్లాడేందుకు అస్సలు ఆసక్తి చూపలేదు. ఇదే వివేక్ కెరీర్ పై కూడా ప్రభావం చూపిందని.. బాలీవుడ్‌లో పెద్ద హీరోగా ఆయన ఎదగకపోవడానికి అదే కారణమని కూడా చాలామంది చెబుతారు. ఇప్పుడు తాజాగా నరేంద్ర మోదీ బయోపిక్‌తో మన ముందుకొస్తున్న తరుణంలో.. ఈ చిత్రాన్ని వివేక్ ఓ బ్రేక్‌లా వెల్లడించారు.


ఈ సినిమాను జనరల్ ఎలక్షన్స్ ఫలితాలు విడుదలైన ఒక రోజు తర్వాత.. అంటే మే 24న విడుదల చేయనున్నారు. అయితే తాజాగా.. జనరల్ ఎలక్షన్స్ ఫలితాలపై ఓ నెటిజన్ మీమ్‌ని రూపొందించాడు. ఇందులో ఐశ్వర్య సల్మాన్, వివేక్, అభిషేక్‌లతో కలిసి ఉన్న ఫొటోలను జత చేశాడు. మొదటి ఫొటోకి ఒపీనియన్ పోల్ అని, రెండో దానికి ఎగ్జిట్ పోల్ అని, మూడో దానికి రిజల్ట్ అని కూడా సదరు నెటిజన్ మీమ్‌లో పేర్కొన్నాడు.


tweet


వివేక్ ఈ మీమ్‌ని షేర్ చేస్తూ "హాహా. చాలా క్రియేటివ్‌గా ఉంది. ఇందులో పాలిటిక్స్ ఏమీ లేదు. కేవలం జీవితం మాత్రమే.. "అంటూ రాసుకొచ్చాడు. పెళ్లయిన స్త్రీ గతంలో కొనసాగించిన బంధం గురించి ప్రతిఒక్కరూ మర్చిపోయి జీవిస్తున్నా.. దాన్ని మర్చిపోకుండా తనని ఆ బంధాల ద్వారా అగౌరవపర్చేలా ఉన్న ఈ మీమ్‌ని.. షేర్ చేసినందుకు ప్రతిఒక్కరూ వివేక్‌ని తప్పుబట్టారు.
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ దీని గురించి స్పందిస్తూ "చాలా అసహ్యంగా.. క్లాస్ లెస్‌గా ఉంది" అంటూ ట్వీట్ చేయగా.. గుత్తా జ్వాల "ఇది చాలా అసహ్యంగా ఉంది. చాలా నిరాశపర్చింది" అంటూ ట్వీట్ చేసింది. ఊర్మిళ, మధుర్ బండార్కర్ లాంటివారందరూ ఈ అసహ్యకరమైన ట్వీట్‌ని డిలీట్ చేసి క్షమాపణ చెప్పాలని కోరారు. కేవలం వీరే కాదు.. ఎంతో మంది సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలు కూడా ట్విట్టర్ వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వివేక్ చేసిన ఈ పనికి మహిళా కమిషన్ అతడికి నోటీస్ కూడా పంపింది.


ఈ విషయంపై తన అభిప్రాయం అడిగిన మీడియాతో మాట్లాడుతూ.. వివేక్ మరింత ఘాటుగా స్పందించారు. "మీమ్‌లో ఉన్నవారికి ఏమాత్రం సమస్య లేదు కానీ.. మిగిలిన వారందరికీ ఇది ఇబ్బందిగా అనిపిస్తోంది" అంటూ సల్మాన్, ఐశ్వర్య స్పందించకపోవడాన్ని ప్రస్తావించారు. అంతేకాదు.. "మీమ్‌కే  జైల్లో పెడతారా?" అంటూ ప్రశ్నించారు. మహిళా కమిషన్ నోటీస్ గురించి చెబుతూ వారిని నేను స్వయంగా కలిసి దీని గురించి వెల్లడిస్తాను అని చెప్పారు. తాను ట్వీట్ చేసి తప్పేమీ చేయలేదని.. కేవలం మీమ్ చూసి దానిపై నవ్వానని చెప్పుకొచ్చారు వివేక్. అంతేకాదు.. సోనమ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ "సోనమ్.. మీరు మీ సినిమాలో కాస్త ఓవరాక్షన్ తక్కువ చేయండి. సోషల్ మీడియాలో ఓవర్‌గా రియాక్టవడం తగ్గించండి" అంటూ చెప్పుకొచ్చారు.


tweet2


తాను చేసిన ట్వీట్ పై రాత్రి ఈ విధంగా స్పందించిన వివేక్ ఉదయానికి మనసు మార్చుకున్నట్లున్నారు. ఉదయాన్నే తన ట్వీట్‌ని డిలీట్ చేసి మహిళలందరికీ క్షమాపణకు చెప్పారు. "కొన్నిసార్లు మనం ఫన్నీగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా నవ్వుకునేలా ఉందని భావించే అంశాలు కూడా ఇతరులకు తప్పుగా కనిపించవచ్చు. నేను గత పదేళ్లలో బాలికల విద్య, వికాసం వంటి అనేక అంశాలపై ప్రచారం చేశాను.  నేను ఎప్పటికీ ఒక స్త్రీని అవమానించేలా మాట్లాడను. నా ట్వీట్ లేదా దానికి నేను ఇచ్చిన సమాధానం ఏ ఒక్క అమ్మాయినైనా ఇబ్బంది పెట్టి ఉంటే వారికి నేను క్షమాపణలు చెబుతున్నా. నా ట్వీట్ డిలీట్ చేస్తున్నా" అని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు వివేక్. అయితే ఆ తర్వాత ఆ ట్వీట్లను కూడా డిలీట్ చేయడం విశేషం. 


అయితే ఈ ట్వీట్లతో వివేక్ పై ట్రోల్స్ ఏమాత్రం తగ్గలేదు. కానీ గతంలో చిన్నపిల్లలపై రేప్ గురించి కామెంట్లు చేసిన తన స్నేహితుడు తన్మయ్ భట్ విషయంలో.. తనని వెనకేసుకొచ్చిన సోనమ్ ఇప్పుడు వివేక్ పోస్ట్ చేసిన మీమ్ గురించి స్పందించడం పై కూడా నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.


ఇవి కూడా చ‌ద‌వండి.


స్వలింగ బంధంలో ఉన్నా.. ఆ అమ్మాయినే పెళ్లాడి జీవితంలో స్థిరపడతా: ద్యుతీ చంద్


ఈ ఏడాది కేన్స్‌లో.. ఈ భామ‌ల అందాల‌ను చూడొచ్చు. ఎప్పుడో తెలుసా?


పెళ్లికి సిద్ధమైన మరో నటి.. ఎంగేజ్ మెంట్‌తో అందరికీ సర్ ప్రైజ్..!