12 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ పాఠాలు బోధిస్తున్న.. హైదరాబాద్ ఆణిముత్యం..!

12 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ పాఠాలు బోధిస్తున్న.. హైదరాబాద్ ఆణిముత్యం..!

జునైరా ఖాన్ (Zunaira Khan).. హైదరాబాద్‌ ప్రాంతంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలులో ఏడవ తరగతి చదువుకుంటున్న బాలిక. తన వయసు 12 సంవత్సరాలు. కానీ తెలివితేటలు మాత్రం అమోఘం. ఏడేళ్ల వయసు నుండే ఆమె సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ చేయడం ప్రారంభించింది.

ఆమె తల్లి కూడా ఐటి ఉద్యోగిని కావడంతో.. జునైరాకి కూడా తన తల్లి చేస్తున్న పని మీద ఆసక్తి పెరిగింది. తెలియని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అనతికాలంలోనే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, పీహెచ్‌పీ, జావా స్క్రిప్ట్.. ఇలా అన్నింటి మీదా పట్టుసాధించింది. అలా పట్టు సాధించడమే కాదు.. తనకున్న ప్రతిభతో ట్యూటర్‌గానూ మారింది.

సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్‌కు (Software Programming) సంబంధించి ఏ అంశమైనా విడమరిచి.. విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పడం జునైరాకి ఉన్నఅదనపు అర్హత. అందుకే ఆ బాలిక చెప్పే పాఠాలు ఇంజనీరింగ్ స్టూడెంట్లకు చాలా బాగా అర్థం అవుతున్నాయట. ఇప్పటి వరకూ అయిదు బ్యాచ్‌లకు జునైరా కోచింగ్ ఇచ్చింది. అంతే కాదు.. ప్రస్తుతం వెబ్, మొబైల్ అప్లికేషన్ల తయారీకి కూడా శ్రీకారం చుట్టింది. ఓ ఎన్జీఓకి తానే స్వయంగా వెబ్ సైట్ డిజైన్ చేసి అందించింది. 

సంతోషం సగం బలం.. అందుకే హాయిగా నవ్వేయండి

ప్రస్తుతం తాను చదువుతున్న పాఠశాలకు తానే డిజిటల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది జునైరా. అలాగే పలు సంస్థలకు బిజినెస్ అప్లికేషన్లను తయారుచేసి అందిస్తోంది. అయితే తను ఇంత చిన్న వయసులో ఇన్ని ప్రతిభా పాటవాలు పొందడానికి కారణం తన తల్లి అని గర్వంగా చెబుతోంది జునైరా.

తన తల్లి బీటెక్ విద్యార్థులకు ప్రోగ్రామింగ్ పాఠాలు చెబుతున్నప్పుడు అనుకోకుండా తనకు కూడా ఆసక్తి పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం జునైరా ఒక కంపెనీని ప్రారంభించి.. ప్రస్తుతం దానికి సీఈఓగా కూడా వ్యవహరిస్తోంది. 

జునైరా గురించి ఆమె తల్లి నిషాత్ ఖాన్ మాట్లాడుతూ "తొలుత తాను నా వద్దకు వచ్చి.. తనకు కూడా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని ఉందని చెప్పినప్పుడు  ఆశ్చర్యపోయాను. కానీ తన ఆసక్తిని గమనించి నేర్పేందుకు సిద్ధమయ్యాను. ఎంత కఠినమైన ప్రోగ్రామింగ్‌నైనా ఈజీగా చేయడం తనకు అలవాటు.

అప్పుడే అర్థమైంది తనకు మంచి తెలివితేటలు ఉన్నాయని. బాాగా ప్రోత్సహిస్తే.. తను అనుకున్నది సాధించగలదని నమ్మాను. ఇప్పుడు తను కూడా ఇంత చిన్న వయసులో బీటెక్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తుందంటే నాకు గర్వంగా ఉంది" అని తెలిపారామె. 

విజేతగా నిలవాలంటే ఏం చేయాలి?

ఇంకొక విషయం ఏమిటంటే.. జునైరా వద్దకు పాఠాలు నేర్చుకోవడానికి వచ్చే విద్యార్థులు కూడా ఆమెతో ఎంతో స్నేహంగా ఉంటారు. ఆమె పాఠాలు చాలా సులభంగా అర్థమవుతున్నాయని అంటున్నారు వాళ్లు. "టీచింగ్, లెర్నింగ్ అనే విషయాలకు వయసుతో పనిలేదు. ఆమె చాలా స్నేహంగా మాట్లాడుతూ.. మాకు అర్థం అయ్యే విధంగా ప్రోగ్రామింగ్ పాఠాలు నేర్పుతుంది. తనకు ఉన్న అపారమైన తెలివితేటలు నిజంగానే మా కెరీర్‌కు ఉపయోగపడతాయి" అని విద్యార్థులు చెప్పడం విశేషం. 

Featured Image: ANI

ముచ్చటైన "మైక్రో ఆర్ట్స్‌"తో.. మనసులను దోచేస్తున్న "తెలుగమ్మాయి"

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.