సంతోషం సగం బలం.. అందుకే హాయిగా నవ్వేయండి (ఈ ప్రముఖ కొటేషన్లు చదివేయండి) - (Happiness Quotes In Telugu)

సంతోషం సగం బలం.. అందుకే హాయిగా నవ్వేయండి (ఈ ప్రముఖ కొటేషన్లు చదివేయండి) - (Happiness Quotes In Telugu)

"అమ్మ కడుపు వదిలిన అడుగడుగు.. ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో కడవరకు.. చిరునవ్వు వదలకు" అన్నారో సినీ కవి. నిజమే ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు ఎప్పుడూ ఆనందంగా ఉండేవారైతే.. మరొకరు తమ జీవితంలోకి ఆనందం ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూసేవారు. సంతోషాలు, ఆనందాలు అనేవి మనకు ప్రతీ నెలా వచ్చే జీతాలు, బోనస్‌లు లాంటివైతే ముమ్మాటికీ కాదు. మీ జీవితంలో ఆహ్లాదాన్ని నింపుతూ.. మరింత ఉత్తేజంగా, ఉల్లాసంగా మీరు మీ పనులు చేసుకొనేలా ప్రేరేపించేదే సంతోషం. ఎందరో గొప్ప గొప్ప తత్వవేత్తలు, మహనీయులు, సెలబ్రిటీలు సంతోషం లేదా ఆనందం గురించి తమకు తోచిన నిర్వచనాలు అందించారు. అందులో కొన్ని మంచి కొటేషన్లు (quotes) ఈ రోజు మీకోసం ప్రత్యేకం


సెలబ్రిటీ కొటేషన్లు


కవులు, రచయితల కొటేషన్లు


మహనీయుల కొటేషన్లు మీకోసం


కొన్ని ఫన్నీ కొటేషన్లు మీకోసం


నిజమైన సంతోషం అంటే ఏమిటి? (సెలబ్రిటీ కొటేషన్లు) (Happiness Quotes In Telugu By Celebrities)


1. మీరు మీకు నచ్చినట్లు ఉంటే.. సంతోషం, విజయం అనేవి ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటాయి. అందులో ఎలాంటి సందేహమూ లేదు - మెరిల్ స్ట్రీప్


2. మీరు మీ కుటుంబంతో హాయిగా గడపడం అనేదే నిజమైన సంతోషం. అందుకే ఎప్పుడూ మీ కుటుంబంతో హాయిగా, ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి - కిమ్ కర్దాషియన్


3. సంతోషం అనేదాన్ని మీకు మీరుగానే పొందగలరు. ఎవరి ప్రోద్బలంతోనో మీరు సంతోషాన్ని పొందగలరనేది కేవలం భ్రమ మాత్రమే - బియాన్స్


4. సంతోషం అనేది అత్యుత్తమమైన అలంకరణ లాంటిది. మీరు పూసుకొనే లిప్ స్టిక్ కన్నా.. మీ నవ్వు వెయ్యి రెట్లు గొప్పది - డ్రూ బారీమోర్


5. మీపట్ల మీరు నిజాయతీగా ఉండండి. మీతో మీరు నిస్వార్థంగా వ్యవహరించండి. అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అదే నిజమైన సంతోషం - ప్రియాంకా చోప్రా


ఇన్స్పిరేషనల్ లవ్ కోట్స్ (Inspirational Love Quotations)


 


via GIPHY


6. మీరు మీరుగానే ఉండడానికి ప్రయత్నించండి. మరొకరిలా మీరెందుకు మారేందుకు ప్రయత్నించాలి. మీకంటూ ఒక అస్తిత్వం ఉన్నప్పుడే.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలరు - హృతిక్ రోషన్


7. మీకు నచ్చిన పని చేస్తూ.. మీ ఇష్ట ప్రకారమే మీరు జీవించడానికి ప్రయత్నించండి. అప్పుడు  అనేకమంది కన్నా మీరు ఉన్నతంగా జీవించగలరు - లియోనార్డో డికాప్రియో


8. నేను చేసే పని ఏదైనా.. అది నలుగురికీ సంతోషాన్ని పంచాలని.. నేను ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటాను - జాకీ చాన్


9. ప్రతీ ఒక్కరూ ఇతరులకు సహాయపడడాన్ని అలవర్చుకోవాలి. ఒకరికి సహాయం చేయడంలో ఉన్న సంతోషం.. మీకు ఇక ఎందులోనూ లభించదు - జార్జ్ లుకాస్


10. ఆకాశంలో నక్షత్రాలకు.. మనకు ఎలాంటి తేడా లేదు. అందుకే ఎప్పుడూ మనం సంతోషంతో మెరవడానికి ప్రయత్నించాలి - మార్లిన్ మన్రో


 


via GIPHY


Read More: Inspirational Quotes In Teluguసంతోషంగా జీవించాలంటే ఏం చేయాలి? కవులు, రచయితల కొటేషన్లు ((Happiness Quotes In Telugu By Poetss & Writers)


11. ప్రేమ అనేది ఎంతో గొప్పది.. అది మీ సంతోషంతో పాటు ఎదుటి మనిషి సంతోషాన్ని కూడా కోరుకుంటుంది  - రాబర్ట్ ఏ హీన్లీన్


12. హాయిగా నవ్వుకున్నాక.. హాయిగా ఊపిరి పీల్చుకోవడంలో కూడా ఎంతో మజా ఉంటుంది - స్టీఫెన్ చోబోస్కి


13. మీ జీవితంలోని సంతోషమనేది దేని వల్లా ప్రభావితం కాకూడదని భావించండి. అలాగే మీరు కలిసే ప్రతీ వ్యక్తి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి - క్రిస్టియన్ డి లార్సన్


14. జీవితంలో నిజమైన సంతోషాన్ని పొందాలంటే కొన్ని సందర్భాల్లో..  రిస్క్ తీసుకోవడం కూడా అవసరమే  - చక్ పాలహనిక్


15. ఎటువంటి బాదర బందీ లేకుండా హాయిగా జీవించడమే అసలైన ఆనందమని.. నిన్నటి వరకూ కల కంటూ వచ్చాను. కానీ సేవ చేయడంలోనే అసలైన ఆనందం ఉందని.. అదే జీవితమని వాస్తవిక ప్రపంచంలోకి వచ్చాక తెలుసుకున్నాను.  - రవీంద్రనాథ్ టాగూర్.


 


via GIPHY


16.సంతోషంగా జీవించాలంటే.. ప్రేమలో పడకపోవడమే బెటర్ - బెర్ట్రాండ్ రస్సెల్


17. అంధకారంలో కూడా మనం ఆనందాన్ని వెతుక్కోవచ్చు. కానీ వెలుగును రప్పించగల సత్తా మనలో ఉండాలి   - జేకే రౌలింగ్


18. చిత్తశుద్ధి, ఆనందం అనేవి ఒకే ఒరలో ఇమడని రెండు కత్తుల్లాంటివి - మార్క్ ట్వైన్


19. ఈ ప్రపంచంలో సగానికి సగం మంది.. ఇతరుల ఆనందాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతూనే ఉంటారు - జేన్ ఆస్టన్


20. మీరు ఆనందంగా జీవించాలంటే ..  గతం కన్నా వర్తమానం పై దృష్టి పెట్టడం మంచిది - పాలో కొయిలో


Read More: Good morning quotes in telugu


సంతోషం సగం బలం - మహనీయుల కొటేషన్లు మీకోసం (Happiness Quotes By Famous People)


21. మంచి ఆరోగ్యాన్ని మించిన ఆనందం.. ఈ ప్రపంచంలో లేదు - ఆల్బర్ట్ స్చ్వైట్జర్


22.మనం ఏం చెబుతున్నామో, ఏం చేస్తున్నామో, ఏం ఆచరణలో పెడుతున్నామన్న దాని బట్టే.. మనకు లభించే ఆనందం ఉంటుంది - మహాత్మా గాంధీ


23. సంతోషమనేది రెడీమేడ్‌గా తయారయ్యేది కాదు. మీ చర్యలను బట్టే అది మీకు సిద్ధిస్తుంది - దలైలామా 


24. మనకు ఉన్నదానితోనే మనం సంతోషంగా ఉండాలి. కానీ మనకు కావాల్సినదాని కోసం శ్రమపడడంలో తప్పులేదు - అలాన్ కోహెన్


25. సంతోషంగా ఉన్నవారే.. ఇతరులనూ సంతోషపరుస్తారు. - అన్నే ఫ్రాంక్


26. అమ్మాయిలను అందంగా కనిపించేలా చేసేది.. నవ్వు మాత్రమే - ఆడ్రీ హెప్బర్న్


27.మనం కోరుకొనే ఆనందం కొన్నిసార్లు మనకు అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఎలాంటి ఆనందమైనా అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది - బెంజమిన్ ఫ్రాంక్లిన్


28.మంచి ఆరోగ్యాన్ని పొందడం, ఒకరికి సహాయ పడడం, తెలియని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం,  క్రమశిక్షణను కలిగి ఉండడం, మన మనసును నియంత్రించుకోవడం వల్లే మనం జ్ఞాన మార్గాన్ని పొందగలం. అదే మనకు అలౌకికమైన ఆనందాన్ని ఇస్తుంది - బుద్ధుడు


29. అంధకారం లేనిదే వెలుగు రాదు. అలాగే కష్టనష్టాలను అనుభవించకుండా.. వచ్చే  సంతోషం కూడా ఎక్కువ సేపు నిలవదు. ఓర్పు, సహనంతో బాధను అనుభవించి.. తద్వారా వచ్చే విజయాన్ని ఆస్వాదించడంలోనే ఆనందం ఉంది - కార్ల్ జంగ్


30. స్వతంత్రంగా బతకడం.. మంచి కుటుంబం, స్నేహితులను పొందడంలోనే  ఆనందమనేది ఉంది - దివ్యాంక త్రిపాఠిసంతోషమంటే ఏమిటి? కొన్ని ఫన్నీ కొటేషన్లు మీకోసం (Funny Quotations)


31. జీవితమనేది చాలా చిన్నది. మీ దంతాలు ఊడకముందే.. మనసారా నవ్వుతూ జీవించేయండి - మల్లోరీ హాప్కిన్స్


32. పెళ్లయ్యాకే చాలామందికి అసలైన ఆనందం దొరుకుతుంది. కానీ అదే పెళ్లి ఆలస్యమైందని బాధపడితే.. ఉన్న ఆనందం పోతుంది - పాత కొటేషన్


33. జీవితాన్ని సీరియస్‌గా తీసుకునేవారు.. ఎంతకాలం బతుకుతారో చెప్పలేం.. కానీ ఎంత వేగంగా పోతారో ఈజీగా చెప్పేయచ్చు  - ఎల్బర్ట్ హుబ్బార్డ్


34. నేను చిన్నప్పుడు అసలైన సంతోషమనేది డబ్బు గడించడం వల్లా, పేరు  ప్రతిష్టలను సంపాదించుకోవడం వల్లా వస్తుందని బాగా నమ్మేవాడిని. మీరేం అనుకోకపోతే ఓ మాట. పెద్దయ్యాక కూడా అదే విషయాన్ని నమ్ముతున్నాను - ఆస్కార్ వైల్డ్


35. సంతోషకరమైన జీవితమనేది తలుపు గొళ్లెం లాంటిది. వేయలా.. తీయాలా అన్నది మన ఇష్టం - పాత కొటేషన్


36. మనం నిజంగా ఆనందంగా ఉండాలంటే.. కావాలనే కొందరిని కలుపుకొని వెళ్లాలి. అలాగే, కావాలనే కొందరిని వదిలించుకోవాలి - ఆస్కార్ వైల్డ్


37.ఒక్క నిముషం మీరు బాధపడితే.. 60 సెకన్లు మీరు ఆనందాన్ని కోల్పోయినట్లే - రాల్ఫ్ వాల్డో ఎమర్సన్


38.మహా జ్ఞానులుగా పేరుగాంచిన వారు.. జీవితంలో ఒక్కసారైనా ఆనందంగా గడిపారా? నాకు డౌటే - ఎర్నస్ట్ హెమింగ్ వే


39.సంతోషమనేది కుక్కపిల్ల లాంటిది. మనం ముద్దు చేసే కొద్దీ.. మనకు అంతే దగ్గరవుతుంది - ఛార్లెస్ స్కల్జ్


40.మీరు ఆనందాన్ని వెతుకుతున్నారా? అయితే మీలాంటి అవివేకిని ఇప్పటి వరకూ నేను చూడలేదు. మీకు కావాల్సిన ఆనందాన్ని మీలో ఉంచుకొని.. బయట వెతకడం ఏమిటి? - పాత కొటేషన్


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ


క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన వస్తువులను కొనేయండి


ఇవి కూడా చదవండి


బ్యూటీ కొటేషన్లు ఆంగ్లంలో చదివేయండి


మహిళా దినోత్సవం కొటేషన్లు ఆంగ్లంలో చదివేయండి


ఈ కొటేషన్లు బాయ్ ఫ్రెండ్స్‌కి ప్రత్యేకం - ఆంగ్లంలో చదివేయండి


స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..