ADVERTISEMENT
home / Family
కుటుంబం అంటేనే సంతోషం .. (ఈ కొటేషన్లు కచ్చితంగా మీ ఫ్యామిలీని గుర్తుచేస్తాయి)

కుటుంబం అంటేనే సంతోషం .. (ఈ కొటేషన్లు కచ్చితంగా మీ ఫ్యామిలీని గుర్తుచేస్తాయి)

ఈ ప్రపంచంలో ఎంత డబ్బు సంపాదించినా.. ఏ చోటికి వెళ్లినా.. జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగినా దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ కుటుంబం (Family) ఉండాల్సిందే. లేకపోతే మనం ఎంత సాధించినా అది వృథానే అవుతుంది. అయితే కుటుంబంలో బంధాన్ని ఆనందంగా కొనసాగించాలంటే.. అది మామూలు విషయం కాదు.

రోజులో కాస్త సమయం వాళ్లకు కేటాయించి.. వాళ్లు మన కోసం చేస్తున్న సేవలకు  ధన్యవాదాలు చెబుతూ.. వారిపై మనకున్న ప్రేమను (Love) చాటితే బాగుంటుంది కదా.  అలాంటి ప్రేమను చాటేందుకు చక్కటి కొటేషన్లను మీకోసం అందిస్తున్నాం. వీటిని గ్రీటింగ్ కార్డ్స్‌లో, మెసేజెస్‌లో పంచుకొని మీ మనసులో కుటుంబంపై ఎంత ప్రేమ ఉందో చాటేయండి. 

 1. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనది కుటుంబం.. మన తల్లిదండ్రుల ప్రేమ : జాన్ వుడెన్

2. ఇంటికి వెళ్లడం.. కుటుంబ సభ్యులతో సమయం గడపడం.. వారితో కలిసి మంచి భోజనం చేయడం.. రిలాక్స్ అవ్వడం.. వీటికంటే ఈ ప్రపంచంలో విలువైనది ఇంకొకటి ఉండదు. : ఇరినా షైక్

ADVERTISEMENT

3. మా దృష్టిలో కుటుంబమంటే.. ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసి.. వారికి అన్నివేళలా ఆసరాగా నిలబడడం : బార్బరా బుష్

4. కుటుంబంలో ప్రేమ అనేది రాపిడి తగ్గించే నూనెలాంటిది. అందరినీ కలిపి ఉంచే సిమెంట్ లాంటిది. ప్రశాంతతను అందించే సంగీతం లాంటిది : ఫ్రెడ్రిక్ నీడ్సెచ్

5. మనం కుటుంబంతోనే మొదలవుతాం. కుటుంబంతోనే అంతమవుతాం. : ఆంటోనీ బ్రాండ్

6. వెళ్లడానికంటూ ఓ చోటుంటే దాన్ని ఇల్లు అంటాం. ప్రేమించడానికి వ్యక్తులుంటే వారిని కుటుంబం అంటాం. ఈ రెండూ ఉన్నవాళ్లను అదృష్టవంతులు అంటాం.

ADVERTISEMENT

7. అన్నం లేకపోవడం పేదరికం కాదు.. కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం

8. మంచి, సంతోషకరమైన కుటుంబం మీకుంటే.. భూమ్మీదే స్వర్గంలో ఉన్నట్లు లెక్క.

9. ఈ ప్రపంచంలో ఖర్చుపెట్టకుండా మీపై నమ్మకం ఉంచేవారు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే. ఎందుకంటే బాధలోనూ, విజయంలోనూ.. వాళ్లు మీ జీవితంలోని ప్రతి సందర్భంలోనూ అండగా నిలుస్తారు. మిమ్మల్ని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉంటారు.

10. మీ కుటుంబంలో సభ్యులెవరో తెలుసుకోవాలంటే మీ చుట్టూ చూడండి. మీరు గెలిస్తే చప్పట్లు కొట్టేవాళ్లు.. మీపై ఎంత నమ్మకముందో చెప్పేవాళ్లంతా మీ కుటుంబ సభ్యులే.

ADVERTISEMENT

Facebook

11. ఈ ప్రపంచంలో  మీ కుటుంబం ఉండే చోటు కన్నా.. సురక్షితమైనది ఏదీ లేదు. దాన్ని మీరు వీలైనంత వరకూ కాపాడుకోవాల్సిందే.

12. మీ కుటుంబాన్ని గౌరవించలేనివారెవరూ.. మిమ్మల్ని  గౌరవించలేరు. 

ADVERTISEMENT

13. కుటుంబంలో భాగంగా ఉండడం అంటే రక్షణదళంలో ఉన్నట్లే.  రెండింటి లక్ష్యం ఒకటే.. సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం.

14. ఈ ప్రపంచంలో అతి పెద్ద సమస్య డబ్బు, శక్తి, రక్షణ వంటివి లేకపోవడం కాదు. కుటుంబ వ్యవస్థ అంతరిస్తూ ఉండడమే. 

15. కుటుంబం అంటే ఎప్పుడూ ఆనందమే కాదు. బాధను కూడా పంచుకోవాల్సి ఉంటుంది. గొడవలు, బాధలు, సంతోషాలు ఉండేదే అసలైన కుటుంబం.

16. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటే.. మీ కుటుంబాన్నీ సంతోషంగా ఉంచండి. మీకెప్పుడూ ప్రేమ దక్కాలనిపిస్తే.. మీ కుటుంబాన్నీ ప్రేమించండి. మీకేది కావాలనిపిస్తే మీ కుటుంబానికి అది చేయండి.

ADVERTISEMENT

17. మన జీవితాల్లో చాలా పెద్ద పెద్ద విషయాలు జరుగుతుంటాయి. అందుకే కుటుంబంలో జరిగే చిన్న చిన్న విషయాలకు మనం పెద్దగా గుర్తింపునివ్వం. కానీ కుటుంబం, ఇల్లు, మనల్ని ప్రేమించే వ్యక్తుల కంటే మన జీవితంలో ముఖ్యమైనవి వేరేవి ఉండనే ఉండవు.

18. మీరు ప్రపంచాన్ని మార్చాలనుకుంటే సందులు, రహదారులు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ప్రపంచం మీ కుటుంబం నుంచే మొదలువుతుంది.

19. మీరు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వారి ఇంటికి వెళ్లండి. వారి కుటుంబాన్ని కలవండి. ఎందుకంటే కుటుంబంతో ఉన్నప్పుడే ఒక వ్యక్తి యథార్థంగా ఉంటాడు.

20. మీరు మీ కుటుంబాన్ని ఎలా చూస్తున్నారన్నది.. మీరు ఇతరులను ఎలా చూస్తారన్నదానికి నిదర్శనం. ఎందుకంటే వారికి నువ్వు ఓ పని చేయగలిగితే.. ఇతరులకు చేసేందుకు నువ్వు పెద్దగా ఆలోచించవు. అది మంచైనా.. చెడైనా.

ADVERTISEMENT

Facebook

21. కొన్నిసార్లు కుటుంబం మనల్ని ముందుకు వెళ్లనివ్వదు. పైగా వెనక్కి లాగుతుంది. మనవాళ్లకి మన పైన ఉన్న ప్రేమ వల్ల.. వారికున్న భయాలు మన దారికి అడ్డంకులుగా మారతాయి.

22. మీరు సంపాదించే ధనం, మీ చుట్టూ ఉండే మనుషులు, మీ ఆరోగ్యం ఇవన్నీ మిమ్మల్ని వదిలిపెట్టచ్చు.. కానీ మీ కుటుంబం మాత్రం మిమ్మల్ని వదలదు. అదే రక్త సంబంధానికి ఉండే విలువ. 

ADVERTISEMENT

23. జీవితంలో మీరు వెలకట్టలేని అంశాలు ఎన్నో ఉంటాయి. అందులో ఒకటి కుటుంబ సభ్యుల ప్రేమ. మీరు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వేరేవాళ్లు మిమ్మల్ని గుర్తించకపోయినా.. మీ కుటుంబం మీ కోసం ఎప్పటికీ ఉంటుంది.

24. మీరు లక్ష్యం చేరాలంటే.. దానికి గురించి ఎదుటి వ్యక్తికి చెప్పాల్సి ఉంటుంది.  కానీ కుటుంబానికి మాత్రం కాదు. వాళ్లు ఏం చెప్పకుండానే మీకు అండగా నిలిచి  ప్రోత్సహిస్తారు.

25. కుటుంబంలో వ్యక్తులను కలిపేది రక్త సంబంధం కాదు. ఒకరి పట్ల మరొకరికి ఉండే ప్రేమ, గౌరవం.

26. జీవితమనే సముద్రంలో కుటుంబం ఓ లైఫ్ జాకెట్ లాంటిది. అది లేకుంటే మనం సముద్రంలో మునిగిపోతాం.

ADVERTISEMENT

27. కుటుంబం అంటే ఏ ఒక్కరినీ మర్చిపోకుండా.. ప్రతి ఒక్కరినీ పట్టించుకుంటూ ముందుకు సాగే బంధం.

28. జీవితంలో కుటుంబం అనేది మన గతానికి బంధం. మన భవిష్యత్తుకు బాట.

29. జీవితంలో కుటుంబం అనేది ముఖ్యమైనది కాదు.. అదే జీవితం.

30. కుటుంబం అనేది మనల్ని జీవితంలో సరైన దిశలో ముందుకు నడిపే దిక్సూచి లాంటిది. ఎత్తుకి ఎదిగేందుకు మనవాళ్లే మనకు స్పూర్తి. తప్పు చేసినప్పుడు వాళ్లే మనకు సహాయం.

ADVERTISEMENT

Facebook

31. నువ్వు నీ కుటుంబాన్ని ఎంచుకోలేవు. అది నీకు దేవుడిచ్చిన బహుమతి. వారికి నువ్వూ దేవుడు అందించిన బహుమతే.

32. మీకంటూ ఓ కుటుంబం ఉందంటే.. ఓ అద్భుతమైన అంశంలో మీరు భాగస్వాములుగా ఉన్నట్లే. దాని అర్థం మీరు జీవితాంతం ప్రేమిస్తారు.. ప్రేమించబడతారు.

ADVERTISEMENT

33. జీవితం పరీక్ష పెడితే.. కుటుంబం ఆ పరీక్షలో మనకు తోడు నిలుస్తుంది.

34. నా కుటుంబమే నా జీవితం.  కుటుంబం కంటే మరేదీ ముఖ్యమైన విషయం కాదు.

35. జీవితంలో చెట్టులా ఎత్తుకి ఎదగాలన్నా.. కష్టాలనే వానలకు తట్టుకొని నిలవాలన్నా కుటుంబం అనే వేరు కావాల్సిందే.

36. కుటుంబం అనేది ప్రతి ఒక్కరి బలం, బలహీనత.

ADVERTISEMENT

37. జీవితంలో అత్యంత విలువైన వరం.. కుటుంబం అందించే ప్రేమ.

38. నా విషయంలో ప్రేమ, కుటుంబం.. ఈ రెండింటికీ అర్థం ఒక్కటే..

39. కుటుంబం అనేది మంచి పాట లాంటిది. కొన్నిసార్లు తాళం తప్పినా..  పాట మాత్రం అద్భుతంగా ఉంటుంది.

40.మీకు అందమైన కుటుంబాన్ని అందించిన దేవుడికి ధన్యవాదాలు చెప్పడానికి.. రోజుకి కనీసం ఒక నిమిషం అయినా కేటాయించండి. చాలామందికి దక్కని వరం అది.

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ఇవి కూడా చదవండి. 

మీ అక్క కూడా అమ్మకు మరో రూపమా? అయితే ఈ మీమ్స్ మీ ఇద్దరి కోసమే..!

ADVERTISEMENT

#ToMaaWithLove మీ అమ్మ కూడా.. ఈ డైలాగ్స్ తప్పనిసరిగా చెప్పే ఉంటారు కదా..!

భాగస్వామి ఫోన్ మనం చెక్ చేయడం.. సరైన పనేనా?

24 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT