ADVERTISEMENT
home / Education
మీ జీవితాన్ని మార్చేది మీ వైఖరి.. మీ దృక్పథమే (ఈ కొటేషన్స్ మీకోసం ప్రత్యేకం)

మీ జీవితాన్ని మార్చేది మీ వైఖరి.. మీ దృక్పథమే (ఈ కొటేషన్స్ మీకోసం ప్రత్యేకం)

జీవితంలో మనం ఏది సాధించాలన్నా.. దానికి మన వైఖరి చాలా (attitude) ముఖ్యం. మన వైఖరి మన జీవితంలో ఎవరుండాలో.. మనం ఎవరితో ఉండాలో.. ఎక్కడికి వెళ్లాలో.. ఏం సాధించాలో చెబుతుంది. ఎందులోనైనా విజయం (success) సాధించాలన్నా.. లేక ఏదీ సాధించలేక ఊరికే కూర్చోవాలన్నా దానికి మన వైఖరే కారణం. అందుకే జీవితంలో వివిధ సందర్భాలకు సరిపడేలా స్పూర్తిదాయకమైన, తెలివైన, నవ్వించే కొటేషన్స్ మీ కోసం అందిస్తున్నాం..

1. అవకాశాలు నీ తలుపు కొట్టకపోతే.. నువ్వే ఓ తలుపు నిర్మించుకో..

2. నీకు ఏదైనా నచ్చకపోతే దాన్ని మార్చే ప్రయత్నం చేయి.. దాన్ని మార్చడానికి కుదరకపోతే నీ వైఖరి మార్చుకో.

3. మంచి మనుషులే మంచి ప్రదేశాలను తయారుచేయగలరు.

ADVERTISEMENT

4.కాస్త ముందో, వెనుకో..తాము గెలుస్తాం అని నమ్మకం ఉన్నవాళ్లే ఎప్పుడూ సక్సెస్ సాధిస్తారు.

5. ఒక మనిషి తన మనసులో ఎలాంటి ప్రపంచాన్ని వూహించుకుంటాడో అలాంటి ప్రపంచాన్నే బయట చూస్తాడు.

6. నీకు ఎదురైన సంఘటన కాదు.. దానికి నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావు అన్నదే ముఖ్యం.

7. నువ్వు నిజంగా మార్చాలని నిర్ణయించుకుంటే ప్రపంచాన్నైనా మార్చగలవు.

ADVERTISEMENT

8. ఒకవేళ నీకు ఒక మనిషి నచ్చకపోతే.. అతడి గురించి నువ్వు మరింత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట.

9. నేను పరిస్థితుల వల్ల ఇలా మారలేదు. నా నిర్ణయాల వల్లే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా.

10. ఎవరి స్నేహం కోసమో మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం మంచిదైతే వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారు.

ADVERTISEMENT

Shutterstock

11. ఒక్క నిమిషంలో ఏమీ మారదు. కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మన జీవితాన్ని మార్చేస్తుంది.

12. గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్లుంటాయి. ఎత్తిచూపే వేళ్లు, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లు కూడా ఉంటాయి. వాటికి బెదిరితే నువ్వు నీ గమ్యాన్ని చేరలేవు.

13. నీ డిగ్రీ కేవలం ఓ పేపర్ ముక్క మాత్రమే. నీ విద్య నువ్వు చేసే పనుల్లో, నీ ప్రవర్తనలో కనిపిస్తుంది.

ADVERTISEMENT

14. నిన్ను ఎవరూ నమ్మని రోజున, నీకు సహాయం చేయని సమయాన.. నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేయకుండా.. నీపై నమ్మకం ఉంచి ముందుకు సాగడమే ఆత్మ విశ్వాసం అనిపించుకుంటుంది.

15. మనం ఒకరిని మంచిగా అర్థం చేసుకుంటే మంచిగానే కనిపిస్తారు. చెడుగా అర్థం చేసుకుంటే చెడుగా కనిపిస్తారు. తప్పు వారిది కాదు.. అర్థం చేసుకునే విధానానిది.

16. మీకు నచ్చని వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే.. వారు అందుకోలేని స్థాయికి అంది చూపించండి చాలు.

17. అందరూ తప్పు చేయడం అనేది.. సక్సెస్‌కి మొదటి మెట్టు అంటుంటారు. కానీ తప్పును సరిచేసుకోవడం సక్సెస్‌కి మొదటి మెట్టు.

ADVERTISEMENT

18. జీవితం ఓ పుస్తకం లాంటిది. కొన్ని పేజీలు సంతోషంగా ఉంటాయి. కొన్ని బాధతో నిండి ఉంటాయి. కానీ బాధకు భయపడి.. పేజీ తిప్పకుండా ఉండకపోతే తర్వాత పేజీలో ఏముందో తెలుసుకోలేం.

19. నువ్వు చేసే తప్పే.. నీకు కొత్త పాఠం నేర్పే టీచర్.

20. మంచి వైఖరి అన్నది ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. కానీ ఒకరు నీకు దాన్ని అందించడం కోసం వేచి చూడొద్దు. నువ్వే వేరొకరికి అందించేలా ఉండు.

ADVERTISEMENT

shutterstock

21. యాటిట్యూడ్ అనే చిన్న విషయం పెద్ద మార్పును తీసుకొస్తుంది. 

22. జీవితంలో నీ వైఖరి.. నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలో నిర్ణయిస్తుంది.

23. చెడు ప్రవర్తన అనేది గాలి పోయిన టైర్ లాంటిది. దాన్ని మార్చుకోకపోతే జీవితంలో ముందుకు నడవడం కష్టం.

ADVERTISEMENT

24. మన ప్రవర్తన మన ఆలోచనలకు ప్రతిబింబం. మనం ఆలోచించే విషయాలు.. మనం చేసే పనులను నిర్ణయిస్తాయి.

25. మనం ఎప్పుడూ పరిస్థితులను మార్చలేం కానీ మన వైఖరిని మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది.

26. నేను జీవితంలో ప్రస్తుతం ఉన్న స్థితిలో.. ఎవరినీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం  లేదు. వాళ్లకు నేను నచ్చితే మంచిది. లేదంటే వాళ్లే జీవితంలో చాలా కోల్పోతారు.

27. మీరు నన్ను వేరే అమ్మాయితో పోల్చలేరు. ఎందుకంటే నాకు పోటీ లేదు. నేను ప్రత్యేకమైన వ్యక్తిని.

ADVERTISEMENT

28. నేను చేయలేనని వాళ్లన్నారు. నేను వాటిని చేసి చూపించాను.

29. నేనెలా ఉన్నానో అలా ఇష్టపడితేనే నాతో ఉండండి.. నువ్వు నాలో కావాలనుకుంటున్న మార్పుని ఇష్టపడి ఉండకండి.

30. నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు అన్నది నేను అస్సలు పట్టించుకోను.. నువ్వు నేను అద్భుతం అనుకుంటే తప్ప. ఎందుకంటే అది నిజం కాబట్టి.

ADVERTISEMENT

shutterstock

31. నేను నా నోటితో చెప్పిన వాటికే బాధ్యురాలిని.. నువ్వు అర్థం చేసుకున్న విషయాలకు మాత్రం కాదు.

32. యాటిట్యూడ్ అనేది గర్భం లాంటిది. నువ్వు దాన్ని ఎంత దాచాలనుకున్నా కొన్ని రోజుల తర్వాతైనా అది బయటపడుతుంది.

33. నాపై రాళ్లు విసిరిన వాళ్లందరికీ థ్యాంక్స్.. నేను వాటిపైనే నా సక్సెస్ అనే సౌధాన్ని నిర్మించుకున్నా.

ADVERTISEMENT

34. యాటిట్యూడ్ అనేది చేతికున్న గడియారం లాంటిది. ప్రతి ఒక్కరి వాచీ వేరే సమయాన్ని చూపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ తమ సమయమే సరైనదనుకుంటారు.

35. ఎవరో నిన్ను ఇష్టపడాలనుకొని నువ్వు మారొద్దు. నువ్వు నువ్వుగానే ఉండు. సరైన వ్యక్తులు నిన్ను నిన్నుగానే ప్రేమిస్తారు.

36. నెగటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్లు.. ఎప్పుడూ పాజిటివ్ ఫలితాలు పొందలేరు. పాజిటివ్‌గా ఆలోచిస్తేనే పాజిటివ్ ఫలితాలొస్తాయి.

37. నేను ఇతరులను ఫాలో అవ్వను. నేను నా నిర్ణయాలను మాత్రమే ఫాలో అవుతాను. ఎందుకంటే నేను నా సొంత బాస్.

ADVERTISEMENT

38. పాజిటివ్ యాటిట్యూడ్ “నేను చేయలేను, నేను చేయను” అన్న మాటలను.. “నా వల్ల అవుతుంది” అన్నట్లుగా మారుస్తుంది.

39. యాటిట్యూడ్ అనేది స్కూల్లో నేర్చుకునే విషయం కాదు. అది నీ స్వభావంలోనిది. పుట్టుకతో వచ్చేది.

40. సక్సెస్ ఫుల్ వ్యక్తులు ఇతరులు ఏం చేస్తున్నారు అన్న విషయం గురించి ఆలోచించి ఫీలవ్వరు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ఇవి కూడా చదవండి.

విజేతగా నిలవాలంటే ఏం చేయాలి? (ఈ 40 కొటేషన్లు మీకోసం)

సంతోషం సగం బలం.. అందుకే హాయిగా నవ్వేయండి (ఈ ప్రముఖ కొటేషన్లు చదివేయండి) – (Happiness Quotes In Telugu)

ADVERTISEMENT

రిపబ్లిక్ డే స్పెషల్: వీరి వాక్కులు మనకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే..!

26 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT