హైదరాబాద్ ట్రెండ్స్: మంచి బ్యూటీ పార్లర్ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి

హైదరాబాద్ ట్రెండ్స్: మంచి బ్యూటీ పార్లర్ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి

బ్యూటీ పార్లర్ ( beauty parlour).. అమ్మాయిల జీవితం దీనితో చాలా ముడిపడి ఉంటుంది. ఏ ప్రత్యేక సందర్భం వచ్చినా.. తన అందానికి మెరుగులు దిద్ది.. మరింత అద్భుతంగా కనిపించాలని ఆశించని అమ్మాయి  ఉంటుందా?

మరి, అలా మీ అందానికి మెరుగులు దిద్దేందుకు.. బ్యూటీ పార్లర్ కన్నా మంచి చోటు మరేముంటుంది? కేవలం అందానికి మెరుగులు దిద్దడమేనా? చర్మం, కేశ సౌందర్యాన్ని కాపాడడంలో కూడా ఈ పార్లర్లు ముందుంటాయి.

మరి, మీరూ హైదరాబాద్‌లో ఉండి మీ చర్మ సంరక్షణ కోసం లేదా మీ జీవితంలోని ప్రత్యేక సందర్భాలకు సిద్ధమయ్యేందుకు.. ఓ మంచి బ్యూటీ పార్లర్ కోసం వెతుకుతున్నారా? అయితే హైదరాబాద్‌లోనే (Hyderabad) అత్యుత్తమమైన పది బ్యూటీ పార్లర్స్ లిస్ట్ మీకోసం..

bubbles

1. బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్

హైదరాబాద్‌లో అత్యుత్తమమైన బ్యూటీ పార్లర్ అనగానే గుర్తొచ్చే పేర్లలో.. బబుల్స్ పేరు ముందు వరుసలో ఉంటుంది. అత్యుత్తమమైన ఆర్గానిక్ ఫేషియల్స్, చక్కటి మసాజ్‌లు, బాడీ రాప్స్ వంటివి మన చర్మానికి ఎలాంటి హాని కలిగించకుండా మన అందాన్ని మెరుగుపరుస్తుంది. కేవలం పార్లర్ ట్రీట్‌మెంట్లే కాదు.. పియర్సింగ్, స్పా, కెరాటిన్ ట్రీట్ మెంట్, గ్రూమింగ్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

అడ్రస్ : ప్లాట్ నం. 21బి, జర్నలిస్ట్ కాలనీ, కేబీఆర్ పార్క్ ఎదురుగా, జూబ్లీ హిల్స్, హైదరాబాద్

ఫోన్ : 90327 65577

2. కిరణ్ వర్మ బ్యూటీ పార్లర్

1997లో ప్రారంభమైన ఈ బ్యూటీ సెలూన్‌కి ప్రస్తుతం ఆరు బ్రాంచీలున్నాయి - మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, అరుణోదయ కాలనీ, మియాపూర్, నిజాం పేట్. సీజన్కి తగినట్లుగా ప్రత్యేక ప్యాకేజీలు, డిస్కౌంట్లతో కస్టమర్ల మనసు దోచేస్తూ.. చర్మతత్వానికి తగిన విధంగా ట్రీట్ మెంట్స్ అందిస్తుంటారు.. ఇక్కడి అనుభవం ఉన్న బ్యుటీషియన్లు. ఇక్కడి ఫేషియల్ చాలా బాగుంటుందని చాలామంది చెబుతుంటారు.

ఫోన్ : 040 23 119 666

justdial

3. మిర్రర్స్ లగ్జరీ సెలూన్స్

దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ సంస్థ.. వివిధ రకాల స్కిన్ ట్రీట్ మెంట్లను వయసుకు తగినట్లుగా అందిస్తుంది. రోజూ రకరకాలుగా రడీ అయ్యేందుకు స్టైలింగ్ టిప్స్ కూడా అందిస్తారు ఇక్కడి నిపుణులు. అంతేకాదు.. మీకున్న చర్మ, కేశ సమస్యలను తగ్గించుకోవడానికి రోజూ ఇంట్లోనే ఏం చేసుకోవచ్చో కూడా చెబుతారు. పార్లర్ ట్రీట్ మెంట్లతో  పాటు స్పా, మసాజ్ థెరపీలు, స్లిమ్మింగ్ బాడీ ర్యాప్ వేయడం వీరి స్పెషాలిటీ.

అడ్రస్ : ప్లాట్ నం 6, పార్క్ వ్యూ ఎన్ క్లేవ్, రోడ్ నం. 1, జూబ్లీ హిల్స్, హైదరాబాద్.

ఫోన్ : 040 23540003, 040 23544236

4. హనీస్ బ్యూటీ పార్లర్

తక్కువ ధరలో మంచి సర్వీస్ కావాలంటే హనీస్ బ్యూటీ పార్లర్‌‌ని ఎంపిక చేసుకోవచ్చు. దీని సర్వీస్ ఎంత అద్భుతంగా ఉన్నా.. ధర మాత్రం.. మిగిలిన లగ్జరీ బ్యూటీ పార్లర్ల కంటే తక్కువగానే ఉంటుంది. కేవలం బ్యూటీ పార్లర్ సర్వీసులు మాత్రమే కాదు.. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మేకప్‌తో పాటు డ్రస్సింగ్‌లోనూ సహాయం చేస్తారు వీళ్లు. గతంలో అబిడ్స్‌లో మాత్రమే ఉన్న ఈ పార్లర్.. ఇప్పుడు టోలిచౌకిలో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేశారు.

అడ్రస్ : 9-4-62/86, రెండో ఫ్లోర్, నిజాం కాలనీ, ఇక్బాలియా కాలేజీ వెనుక, టోలీచౌకీ, హైదరాబాద్.

ఫోన్ : 7207036399

justdial

5. కకూన్ సెలూన్ మణికొండ

బేసిక్ హెయిర్ కట్స్ నుంచి అడ్వాన్సడ్ కట్స్, ట్రీట్ మెంట్స్ వరకూ.. ఫేషియల్స్ నుంచి బాడీ పాలిషింగ్ వరకూ ప్రతి ఒక్క సర్వీస్ కకూన్ సెలూన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వివిధ రకాల ట్రీట్ మెంట్స్‌కి కలిపి ప్యాకేజీలు డిస్కౌంట్లతో అందుబాటులో ఉంటాయి. కొత్తగా వెళ్లే వారికి యాభై శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.

అడ్రస్ : ప్లాట్ నం. 558, హెచ్ డీ ఎఫ్ సీ ఏటీఎం ఎదురుగా, డ్రీమ్ వ్యాలీ, ఓయూ కాలనీ, షేక్ పేట్, మణికొండ, హైదరాబాద్

ఫోన్ : 040 64636200, 7032111525

6. గ్రీన్ ట్రెండ్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్

గ్రీన్ ట్రెండ్స్ కెవిన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సంస్థ. దీనికి హైదరాబాద్‌లోనూ బ్రాంచీలున్నాయి. ట్రెండీ హెయిర్ కట్స్ నుంచి కలర్ వరకూ.. స్కిన్ కేర్ నుంచి బ్రైడల్ ప్యాకేజీల వరకూ ప్రతి ఒక్కటి ఇక్కడ తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటుంది. విటమిన్ సి గ్లో ఫేషియల్ వీరి ప్రత్యేకం.

అడ్రస్ : ప్లాట్ నం. 275, ఐసీఐసీఐ బ్యాంక్ పైన, కావూరి హిల్స్, హైదరాబాద్.

ఫోన్ : 040 40036868

justdial

7. జ్యూస్ సెలూన్

హెయిర్ కేర్‌లో ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న జ్యూస్ సంస్థ సెలూన్లు దేశంలోని వివిధ నగరాల్లో ఉన్నాయి. హైదరాబాద్ ప్రాంతంలోనూ దీని బ్రాంచీలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ హెయిర్, స్కిన్, నెయిల్ కేర్‌కి సంబంధించి సేవలు అందుబాటులో ఉండడమే కాదు.. అందానికి సంబంధించిన వివిధ ఉత్పత్తులను కూడా కొనుక్కునే వీలుంటుంది.

అడ్రస్ : ప్లాట్ నం. 270 ఎన్, కరూర్ వైశ్యా బ్యాంక్ ఎదురుగా, రోడ్ నం. 10, జూబ్లీ హిల్స్, హైదరాబాద్

ఫోన్ : 040 23541270

8. జావేద్ హబీబ్స్ సెలూన్

దేశంలోని వివిధ నగరాల్లో ఉన్నట్లు హైదరాబాద్‌లోనూ 14 జావేద్ హబీబ్స్ సెలూన్లు ఉన్నాయి. అయితే వాటిలో ముఖ్యంగా కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ దగ్గర ఉన్న సెలూన్ మాత్రం చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి బ్యూటీ ట్రీట్ మెంట్స్ తీసుకుంటారంటే.. ఇక్కడి సేవల గురించి తెలుసుకోవచ్చు.

అడ్రస్ : ఫస్ట్ ఫ్లోర్, కరాచీ బేకరీ పైన, ధర్మారెడ్డి కాలనీ, ఫేజ్ 2, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, హైదరాబాద్

ఫోన్ : 07426321999

just dial

9. నాచురల్స్ బ్యూటీ పార్లర్

నాచురల్స్ దేశంలోనే ప్రఖ్యాత బ్యూటీ పార్లర్. హెయిర్ కేర్, స్కిన్ కేర్, బాడీ కేర్‌తో పాటు బ్రైడల్ సర్వీసులను కూడా అందిస్తోంది. హైదరాబాద్‌లోనూ ఎన్నో బ్రాంచీలున్నా.. మాదాపూర్‌లోని బ్రాంచికి మాత్రం మంచి పేరుంది. తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ సర్వీసులను అందిస్తుందని ఈ సంస్థకి పేరు.

అడ్రస్ : ప్లాట్ నం. 122, మంగత్రాయ్ జ్యుయలర్స్ పైన, హుడా ఎన్ క్లేవ్, మాదాపూర్, హైటెక్ సిటీ, హైదరాబాద్.

ఫోన్ : 040 40119682

10. లాక్మే సెలూన్

బ్యూటీ ఉత్పత్తుల సంస్థలు పార్లర్లను స్థాపించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ అందులో మొదటిది మాత్రం లాక్మేనే. హైదరాబాద్‌లో లాక్మేకి చాలా పార్లర్స్ ఉన్నాయి. కానీ అమీర్ పేటలో ఉన్నది మాత్రం పాపులర్. ఈ సెలూన్ ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుందంటేనే.. దీని పాపులారిటీ ఏమిటో తెలుసుకోవచ్చు.

అడ్రస్ : H.no - 7-1-59/2, ఫస్ట్ ఫ్లోర్, మందన టవర్స్, అమీర్ పేట్, హైదరాబాద్.

ఫోన్ : 040 66202013, 8916616020

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ఇవి  కూడా చదవండి. 

హైదరాబాద్ ఫ్యాషన్ ట్రెండ్స్: మోడరన్ అమ్మాయిలకు ప్రత్యేకం.. ఈ టాప్ 10 డిజైనర్ బొతిక్స్..!స్ట్రెయిటెనింగ్‌, స్మూతెనింగ్‌తో.. జుట్టును స్టైలిష్‌గా మార్చుకుందాం.. (Hair Straightening And Smoothening In Telugu)మేకప్ ట్రయల్ వేసే ముందు మేకప్ ఆర్టిస్ట్ ను ఈ ప్రశ్నలు అడగండి