ఈ రోజు (జూలై 30) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. రుణాలు ఇచ్చేటప్పుడు లేదా తీసుకొనేటప్పుడు చాలా అప్రమత్తతతో వ్యవహరించాలి. అలాగే ఉద్యోగస్తులు పలు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆఫీసులో ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. వివాహితులకు కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కనుక పొదుపు పథకాల గురించి ఓమారు ఆలోచించండి.
వృషభం (Tarus) – ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగుల్లో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి. ఉద్యోగులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారిని దీటుగా ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. ఈ రాశికి సంబంధించి రాజకీయ నాయకులు.. ఈ రోజు ప్రజల నుండి అమితమైన గౌరవాన్ని పొందుతారు.
మిథునం (Gemini) – ఈ రోజు ఉద్యోగులు పలు అనుకోని సమస్యల్లో చిక్కుకుంటారు. ఇలాంటప్పుడే సహనంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించడం బెటర్. వ్యాపారస్తులు తమ భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకుంటే మంచిది. సృజనాత్మక రంగంలోని వ్యక్తులకు ఈ రోజు బాగా కలిసొస్తుంది. అలాగే వాహన వినియోగంలో జాగ్రత్తగా ఉండండి.
కర్కాటకం (Cancer) – ఈ రోజు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించండి. వ్యాపారస్తులకు సంపద, సామాజిక గౌరవం పెరుగుతాయి. అలాగే భాగస్వాముల సహాయంతో బిజినెస్ విస్తరించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులకు పెండింగ్ పనులు పూర్తవుతాయి. రాజకీయ రంగంలో ప్రత్యర్థులను మీరు దీటుగా ఎదుర్కొంటారు. అయితే ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మన రాశిని బట్టి బలాలు, బలహీనతలు ఇట్టే తెలుసుకోవచ్చట. అవేంటో చూసేద్దామా..!
సింహం (Leo) – ఈ రోజు వ్యాపారస్తులకు బాగా కలిసొచ్చే రోజు. మీ మొండి బాకీలు కూడా వసూలయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు తమ కెరీర్‌కు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొన్ని వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. పాతమిత్రులు మిమ్మల్ని కలుస్తారు. రాజకీయాల్లో ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి.
కన్య (Virgo) – ఈ రోజు కోర్టు కేసులు, ఆస్తి లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే కుటుంబంలో వాతావరణం చాలా సరదాగా ఉంటుంది. మీ సానుకూల ఆలోచనలు ఓ వ్యక్తిని ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. వివాహితులు తమ భాగస్వామి నుండి ఓ శుభవార్తను తెలుసుకుంటారు. అదేవిధంగా, మీరు ఈ రోజు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
తుల (Libra) – ఈ రోజు నిరుద్యోగులు సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడం ద్వారా, చాలా మంచి అవకాశాలను కోల్పోతారు. అలాగే వాణిజ్యవేత్తలకు వ్యాపార ఒప్పందాలు విచ్ఛిన్నమవుతాయి. కొత్త సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు కొత్త పద్ధతుల ద్వారా తమ అధ్యయనాన్ని కొనసాగిస్తారు.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు మిమ్మల్ని భయాందోళనలకు గురిచేసే పలు సంఘటనలు ఎదురుకావచ్చు. అయినప్పటికీ మీరు సహనంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు. అలాగే వ్యాపారస్తులు ఈ రోజు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి కూడా ఈ రోజు బాగా కలిసొస్తుంది. సృజనాత్మక రంగంలోని వ్యక్తులకు కూడా పనిలో పురోగతి ఉంటుంది.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఉద్యోగులు ఆఫీసులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడిట్ జరిగే అవకాశాలున్నాయి. కనుక పెండింగ్ పనులు పూర్తిచేసుకోవడం బెటర్. అలాగే విద్యార్థులు కష్టపడితేనే లక్ష్యాన్ని సాధిస్తారు. ఆ విధంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం మంచిది. వివాహితులకు కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి.
మకరం (Capricorn) – ఈ రోజు మీరు ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ చూపించడం మంచిది. అలాగే దినచర్యలో మార్పులు చేసుకుంటే బెటర్. అదేవిధంగా కొన్ని విషయాలలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో.. ఆచితూచి ఆలోచించండి. వ్యాపార రంగంలోని వ్యక్తులకు ప్రయోజనాలు మరియు విస్తరణ అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులు సిఫార్సుల మేరకు ఉద్యోగాలు పొందుతారు.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభం (Aquarius) – ఈ రోజు ప్రేమికుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన అవకాశం. అలాగే ఆఫీసులో మీరు అనుకోని చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అయితే అధికారులు అటువంటి వివాదాలను సులువుగానే పరిష్కరిస్తారు. అలాగే వివాహితులకు భాగస్వామితో పాటు తల్లిదండ్రుల నుండి కూడా సహకారం లభిస్తుంది. విద్యార్థులు సానుకూల ఆలోచనలతో విజయం సాధిస్తారు. కాకపోతే.. చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండండి.
మీనం (Pisces) – ఈ రోజు వ్యాపారులు లేదా ఉద్యోగులు ప్రతికూల చర్యల దృష్ట్యా.. రుణం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అలాగే యువత, నిరుద్యోగులు కెరీర్‌లో కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది. అదేవిధంగా విద్యార్థులకు కళలపై మక్కువ పెరుగుతుంది. ఈ రోజు మీరు ఏ పని చేసినా, సులభంగానే ఫలితాలను పొందుతారు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.