ఉదయం లేవగానే ముఖంపై చిన్న చిరునవ్వుతో.. ఎవరైనా ఒక గుడ్ మార్నింగ్ (Good Morning) చెప్తే చాలు.. రోజంతా ఎంతో ఉత్సాహంగా గడుస్తుంది. అలాంటిది మనకు నచ్చిన లేదా మనం మెచ్చిన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు మనమే మనసారా శుభోదయం అంటూ చక్కని సందేశాలు (messages) పంపితే?? వాహ్.. రోజంతా చాలా ఆనందంగా గడిచిపోతుంది కదూ. అందుకే మన ప్రాధాన్యాలకు అనుగుణంగా ఎవరెవరికి, ఎలాంటి గుడ్ మార్నింగ్ మెసేజెస్ పంపించాలో మీకు మేం చెప్పాలని అనుకుంటున్నాం
అందరికీ పంపదగిన గుడ్ మార్నింగ్ సందేశాలు..
మనం పంపించే సందేశాల్లో.. సాధారణంగా కొన్ని అందరికీ పంపించేందుకు వీలుగా ఉంటాయి. అలాంటి వాటిలో సందేశాత్మకంగా లేదా ప్రేరణాత్మకంగా ఉండే కొన్ని కొటేషన్లు మీకోసం
1. పుట్టుకతో ఎవ్వరూ గొప్పవారు కాలేరు.. మన ప్రవర్తన, మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి.. శుభోదయం.
2. అహం వల్ల ఏర్పడే అంధకారం చీకటి కంటే భయకరంగా ఉంటుంది.. అందుకే అహంకారాన్ని వీడండి.. వెలుగు దిశగా అడుగులు వేయండి.. గుడ్ మార్నింగ్..
3. ఓ చిన్న నవ్వు నవ్వితే అది అందం.. ఇతరులను నవ్విస్తే అది ఆనందం.. నువ్వు నవ్వుతూ, ఇతరులను నవ్విస్తూ పదికాలాలపాటు నడిస్తే అదే అనుబంధం.. ఈ రోజుని నీ చిరునవ్వుతో ప్రారంభించు.. గుడ్ మార్నింగ్..
4. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది.. శుభోదయం..
5. ఆశ మనషిని బతికిస్తుంది.. ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది.. కానీ అవసరం.. మనిషికి అన్నీ నేర్పిస్తుంది.. శుభోదయం..
6. ఇతరులు నీ పట్ల చూపే నిర్లక్ష్యం, అసహ్యం, డ్రామా లేదా నెగెటివిటీ.. మొదలైనవాటి ప్రభావం నీపై అస్సలు పడనీయద్దు. నువ్వు ఎప్పటికీ నీలానే ఉండు.. గుడ్ మార్నింగ్..
7. ఎవరిపట్ల అయినా ద్వేషభావం ఉంటే.. వారిని ప్రేమిస్తున్నట్లు అస్సలు నటించద్దు. అది మీ ఇద్దరికీ మంచిది కాదు.. శుభోదయం..
8. నిన్ను భారంగా భావించే బంధాలతో బలవంతంగా జీవించే కన్నా.. అటువంటి వారికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవించడం మేలు.. శుభోదయం..
9. మనిషిలో కొత్త అవకాశపు ఆశలను చిగురింపజేస్తూ ప్రతిరోజూ తెల్లవారుతుంది.. గుడ్ మార్నింగ్..
10. మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది.. శుభోదయం..
குட் நைட் எஸ்.எம்.எஸ்ஸையும் படியுங்கள்
బాయ్ ఫ్రెండ్‌కు పంపదగిన గుడ్ మార్నింగ్ సందేశాలు..
గుడ్ మార్నింగ్ మెసేజెస్ అందరికీ పంపిస్తాం.. అయితే మనసు దోచుకున్న చెలికాడికి పంపించే సందేశాలు మరింత ప్రత్యేకంగా ఉండాలని కూడా అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారు. దీనికి తోడు తమ మనసులోని ప్రేమను తెలియజేస్తూనే చక్కని సందేశాన్ని సైతం పంపాలని భావిస్తారు. అలాంటి సందేశాలు కొన్ని..
1. నీవు ప్రేమించే హృదయంతో ఏళ్ల తరబడి బతకడం కన్నా.. నిన్ను ప్రేమించే హృదయంతో కొంత కాలం జీవించినా చాలు.. గుడ్ మార్నింగ్..
2. నువ్వు ఎవరి మనసులో ఉన్నావో నాకు తెలియదు.. కానీ నా మనసుకు చేరువైన ఒకే ఒక్క వ్యక్తివి నువ్వే.. గుడ్ మార్నింగ్..
3. చక్కటి సంబంధానికి కావాల్సిన మూడు ముఖ్యమైన అంశాలు.. కన్నీరు రాని కళ్లు.. అబద్ధాలు చెప్పని పెదవులు.. నిజమైన ప్రేమ.. శుభోదయం..
4. నిజంగా ప్రేమించే వారు ఎవరైనా.. ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలని కోరుకోరు.. తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగలవారినే కోరుకుంటారు. శుభోదయం..
5. మనం ఎదురుచూసే ప్రేమ కన్నా.. మన కోసం ఎదురుచూసే ప్రేమే చాలా గొప్పది.. గుడ్ మార్నింగ్..
6. నిజమైన ప్రేమికులు ఎప్పటికీ విడిపోరు.. ఒకవేళ విడిపోతే అది ప్రేమ అనిపించుకోదు.. శుభోదయం..
7. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది.. కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది.. కాబట్టి చేసే పని ఏదైనా సరే.. ఇష్టంతో చేయడానికే ప్రయత్నించు.. గుడ్ మార్నింగ్..
8. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది.. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది.. నమ్మకమే ఏ బంధానికైనా పునాది.. శుభోదయం..
9. జీవితంలో నీవు ఎవరిని కలవాలన్నది కాలమే నిర్ణయిస్తుంది.. నీకెవరు కావాలి అనేది హృదయం నిర్ణయిస్తుంది.. కానీ నీ దగ్గర ఎవరు ఉండాలనేది నిర్ణయించేది మాత్రం నీ ప్రవర్తన మాత్రమే.. శుభోదయం..
10. గొడవపడకుండా ఉండే బంధం కన్నా.. ఎంత గొడవపడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఓ వరం.. గుడ్ మార్నింగ్..
ప్రేరణను నింపే శుభోదయ సందేశాలు
కొన్ని మాటలు వింటే చాలు.. మనలో ఎక్కడ లేని ఉత్సాహం పుట్టుకొస్తుంది. చక్కని ప్రేరణ కలుగుతుంది. ఈ విధంగా మనలో ప్రేరణ నింపే సందేశాలు పంపడం ద్వారా కూడా గుడ్ మార్నింగ్ అంటూ మనకు తెలిసిన వారిని విష్ చేయచ్చు. అలాంటి సందేశాలు కొన్ని..
1. అవసరం ఉన్నప్పుడే నిన్ను పలకరిస్తున్నారని ఎవరి గురించీ బాధపడకు. వాళ్లు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తొస్తావని సంతోషించు.. శుభోదయం..
2. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది. అలాగే సమస్యతో పాటు పరిష్కారమూ కచ్చితంగా ఉంటుంది. దానిని మనం కనుక్కోవడమే ఆలస్యం.. గుడ్ మార్నింగ్..
3. మొదటి అడుగు వేసే ముందు ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించు.. కానీ ఒక్కసారి ముందడుగు వేశాక వందమంది వెనక్కిలాగినా వెనుతిరిగి చూడకు.. శుభోదయం..
4. నీ ఆశయసాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే.. మరోసారి ప్రయత్నించడం మానద్దు.. గుడ్ మార్నింగ్..
5. గెలుపు కోసం పరుగులు పెట్టకు.. విలువలతో కూడిన బంధాలను కొనసాగిస్తూ తెలివితేటలు సంపాదించుకో.. అదే నీకు విజయం సాధించి పెడుతుంది.. శుభోదయం..
6. విజయమే సర్వస్వం కాదు.. పరాజయమే అంతం కాదు.. ఏం జరిగినా మన ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే జీవితం.. శుభోదయం..
7. చేసే పని చిన్నదైనా.. సవ్యంగా చేస్తే.. అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.. గుడ్ మార్నింగ్
8. గెలిచినప్పుడు పొంగిపోకుండా.. ఓడినప్పుడు కుంగిపోకుండా ఉంటేనే సంతోషం నీ సొంతమవుతుంది.. శుభోదయం
9. సమస్య ఎదురైనప్పుడు అద్దం ముందు నిలబడితే.. ఆ సమస్యను పరిష్కరించే గొప్ప వ్యక్తిని అద్దం మనకు చూపిస్తుంది.. శుభోదయం
10. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా.. బిందెడు మంచి నీళ్లకే విలువ ఎక్కువగా ఉంటుంది. అలాగే నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నా.. నీలో ఉన్న మంచితనానికే విలువ ఎక్కువగా ఉంటుంది.. గుడ్ మార్నింగ్
స్నేహితులకు పంపే శుభోదయ సందేశాలు
మన ఫ్రెండ్స్‌కు రోజూ మనం ఏవో ఒక మెసేజెస్ పంపుతూనే ఉంటాం.. కానీ ఉదయాన్నే వారిని పలకరించే తొలిపలకరింపు మాత్రం కచ్చితంగా వారికి ప్రత్యేకమనే చెప్పాలి. అలాంటి మెసేజెస్ కొన్ని..
1. నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుని కన్నా.. నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న.. గుడ్ మార్నింగ్ మిత్రమా..
2. స్నేహం చేయడానికి తొందరపడద్దు.. స్నేహం చేశాక ఎప్పటికీ వదలద్దు.. శుభోదయం మిత్రమా..
3. కాలాలు మారవచ్చు.. మనం కనే కలల్లో మార్పు రావచ్చు.. అలాగే మనసులూ మారవచ్చు.. మదిలో తలపులూ మారవచ్చు.. కానీ మన స్నేహం ఎన్నటికీ మారదు.. గుడ్ మార్నింగ్
4. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి.. ఆనందం నీడలా వెంటే ఉంటుంది.. శుభోదయం
5. ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం.. కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం.. గుడ్ మార్నింగ్ మిత్రమా
6. నిజమైన స్నేహం మంచి ఆరోగ్యంలాంటిది.. పోగొట్టుకోనంత వరకూ దాని విలువ తెలుసుకోలేం.. శుభోదయం..
7. స్నేహం నిదానంగా వికసించేది.. నెమ్మదిగా వర్థిల్లేది.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా విస్తరించేది.. శుభోదయం..
8. అమ్మను మించిన దైవం లేదు.. స్నేహాన్ని మించిన బంధం లేదు.. గుడ్ మార్నింగ్..
9.విలువనేది తెలుసుకోలేని వాడు ఎప్పటికీ సంపాదించలేడు.. సంపాదించినా నిలబెట్టుకోలేడు.. కష్టపడి సాధించుకునన్న వ్యక్తి దానిని వృధా చేయలేడు.. అది స్నేహం అయినా, ప్రేమ లేదా డబ్బు.. ఇలా ఏదైనా సరే.. శుభోదయం..
10. వేలాది మిత్రులు ఉండడం అద్భుతం కాదు.. ఏ సమస్యనైనా తీర్చగల స్నేహితుడు ఒకే ఒక్కడు ఉండడం అద్భుతం.. అసలు ఎలాంటి సమస్యనైనా.. మన దరి చేరనీయని స్నేహితుడు ఉండడం ఇంకా అద్భుతం.. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్..
మంచి ఆలోచనలు కలిగించే గుడ్ మార్నింగ్ మెసేజెస్
కొన్ని మెసేజెస్ చదవగానే మనసులో మంచి ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఇలాంటి సందేశాలు పంపడం ద్వారా ఎదుటివారి మనసుని.. మనం మంచి ఆలోచనలు చేసే దిశగా మనం మళ్లించవచ్చు.. అలాంటి కొన్ని మెసేజెస్ మీ కోసం..
1. ఓటమి గురువులాంటిది.. ఏం చేయాలో.. ఏం చేయకూడదో అదే మనకు నేర్పిస్తుంది.. శుభోదయం..
2. నిన్ను నువ్వు తక్కువగా చేసుకొని చూడకు.. అది ఆత్మహత్య కంటే ఘోరమైంది.. శుభోదయం..
3. చేయడానికి ఓ పని.. ప్రేమించడానికి ఓ వ్యక్తి.. జీవించడానికి ఓ ఆశ.. ఈ మూడూ ఉన్నవారు నిత్యం సంతోషంగా ఉంటారు.. గుడ్ మార్నింగ్..
4. కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పద్దు.. సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇవ్వద్దు.. అలాగే బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.. గుడ్ మార్నింగ్..
5. అనుభవించదలచుకుంటే జీవితం అంత గొప్పది.. స్నేహం చేయదలుచుకుంటే ప్రకృతి అంత మంచిది వేరొకటి లేదు.. గుడ్ మార్నింగ్..
6. ఒకరు గెలిచినప్పుడు ఇచ్చే ప్రశంస కన్నా.. ఒకరు ఓడినప్పుడు ఇచ్చే ఓదార్పు మిన్న.. శుభోదయం..
7. మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటివారిలోని లోపాలు, తప్పులు మరింత చిన్నవిగా కనిపిస్తాయి. అలాగే మనలో ఓర్పు, క్షమాగుణం మరింత పెరుగుతాయి.. శుభోదయం..
8. మంచి వ్యక్తిత్వమే మనిషికి అసలైన ఆభరణం.. గుడ్ మార్నింగ్..
9. ఈ ప్రపంచంలో నీలా ఉండేది.. ఉండబోయేది.. ఇకపై ఉండాల్సింది.. కేవలం నువ్వు మాత్రమే.. అందుకే ఎవ్వరినీ నువ్వు అనుకరించాల్సిన అవసరం లేదు.. గుడ్ మార్నింగ్..
10. అపనమ్మకంతో ఏ పనీ మొదలుపెట్టద్దు.. ఎందుకంటే నీ మీద నీకు ఉన్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు.. శుభోదయం..
జీవిత భాగస్వామికి పంపదగిన చిలిపి శుభోదయ సందేశాలు..
ఈ రోజుల్లో ఉద్యోగం లేదా పలు కారణాలు, బాధ్యతల రీత్యా ఆలుమగలిద్దరూ.. విడివిడిగా వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తూ ఉండడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలో ఉదయాన్నే జీవిత భాగస్వామికి పంపించే సందేశాలు సైతం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. వాటికే ఇంకాస్త రొమాంటిక్ టచ్ ఇస్తే.. వారి రోజుని మరింత ఉత్సాహంగా గడిపేలా చేయచ్చు. అలాంటి సందేశాల్లో కొన్ని..
1. నువ్వంటే నాకు ఈ ప్రపంచాన్నే మరిచిపోయేంత ఇష్టం.. నా ప్రాణాన్నే విడిచేంత ప్రేమ.. గుడ్ మార్నింగ్..
2. ఏడే ఏడు స్వరాలు కలిస్తే కొన్ని వేల కొలదీ రాగాలు పలుకుతాయి.. అలాగే నువ్వు నేను అనే పదాలు కలిసి కోటి ప్రేమ కావ్యాలను నడిపిస్తాయి.. శుభోదయం..
3. ఈ ప్రపంచంలో నాకు అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే అది నీ ప్రేమే.. గుడ్ మార్నింగ్..
4. నాకు నువ్వు ఎంత దూరంలో ఉన్నా.. నా మనసుకి మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటావు.. గుడ్ మార్నింగ్..
5. నీ అడుగుల్లో కలిసిపోవాలని.. నీ చేతుల్లో వాలిపోవాలని.. నీ మాటల్లో మెదులుతూ ఉండాలని.. నీ స్పర్శలో నిలిచిపోవాలని.. నీ మనసంతా నేనే నిండిపోవాలని.. కోరుకుంటోంది నా మనసు.. గుడ్ మార్నింగ్..
6. నా ఊహల్లో చిత్రం నువ్వు.. నా నిద్రలో కలవి నువ్వు.. నన్ను నేను తట్టి చూసుకుంటే ఆ పులకరింతకు చిరునామా నువ్వు.. శుభోదయం..
7. నన్ను నేను అన్వేషించుకునే ప్రయత్నం నిన్ను చూసిన తర్వాతే పూర్తయింది.. అప్పుడే అర్థమైంది.. దాని పేరే ప్రేమని.. గుడ్ మార్నింగ్..
8. ఈ ప్రపంచంలో విలువైనదంటూ ఏదీ లేదు.. నీ నుంచి నేను పొందే ప్రేమ తప్ప.. శుభోదయం..
9. ఎవరికైనా జీవితకాలం అంటే జనన, మరణాల మధ్య కాలం. కానీ నాకు మాత్రం నీతో గడిపిన కాలమే నా జీవితం.. శుభోదయం..
10. కోమలమైన నీ నవ్వు.. గుండె గదిలో దాచుకోనివ్వు.. ప్రేమకు పర్యాయపదానివి నువ్వు.. నాకేమవుతావు?? నా జీవితమే నువ్వు.. శుభోదయం..
శుభోదయం తెలిపే కోట్స్..
ఉదయాన్నే ఫొటోల రూపంలో ఉన్న సందేశాలకు బదులుగా చక్కని కోట్స్ ఉన్నవి మీ స్నేహితులకు సందేశాలుగా పంపాలని మీరు భావిస్తున్నారా? అయితే చక్కని కోట్స్ కొన్ని మీ కోసం..
1. పట్టుదల ఉంటే చాలు.. దారి ఏదైనా సరే.. గమ్యం తప్పకుండా చేరవచ్చు.. ఉదయించే సూర్యుణ్ని ఆపడం ఎవ్వరి తరం కాదని గుర్తుంచుకోండి.. శుభోదయం..
2. మరణం మనిషిని ఒకసారే చంపుతుంది.. కానీ మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజూ చంపుతుంది.. ధైర్యంగా ఉండండి.. గుడ్ మార్నింగ్..
3. జీవితంలో మనం అన్నీ కోల్పోయినా ఒకటి మాత్రం మన కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.. అదే భవిష్యత్తు.. శుభోదయం..
4. పొగిడేవాళ్లు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు.. తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు.. గుడ్ మార్నింగ్..
5. సమస్య తీర్చమని దేవుడిని వేడుకోవడం కన్నా.. ఆ సమస్యను ఎదుర్కునే శక్తిని ప్రసాదించమని కోరుకోవడం మంచిది.. శుభోదయం..
6. ఒకరు చెప్పింది కాదనడం కంటే పట్టించుకోకపోవడం లేదా నిర్లక్ష్యం చేయడమే మరింత ఎక్కువ అవమానకరం.. శుభోదయం..
7. సమయాన్ని సరిగా వినియోగించుకోలేని వ్యక్తులు ఏ రంగంలోనూ విజయం సాధించలేరు.. గుడ్ మార్నింగ్..
8. నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంత పైకి తీసుకొస్తుందో.. నేనే అన్న అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది.. శుభోదయం..
9. వెయ్యి వ్యర్థమైన మాటలు వినడం కన్నా.. ప్రశాంతతను ప్రసాదించే ఒకే ఒక్క మంచిమాట వినడం ఉత్తమం.. గుడ్ మార్నింగ్..
10. అవకాశాల కోసం ఎదురుచూడడం కాదు.. మీరే స్వయంగా అవకాశాలను సృష్టించుకోవాలి.. శుభోదయం..
ఇవి కూడా చదవండి
‘ఫ్రెండ్షిప్ డే’ రోజున.. మీ స్నేహితులకి ఈ సరదా సందేశాలు పంపించండి…!
రక్షాబంధన్‌కి మీ సోదరుడికి ఇలా విషెస్ చెప్తే వాళ్లెంతో సంతోషిస్తారు..
రాఖీ పండక్కి మీ చెల్లెలిని సంతోషపరిచే బహుమతులు
Good Morning Quotes in English