సోదరులకి చెప్పే రక్షాబంధన్ విషెస్ (Raksha Bandhan Quotes In Telugu)

సోదరులకి చెప్పే రక్షాబంధన్ విషెస్ (Raksha Bandhan Quotes In Telugu)

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు.. ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. వారి మధ్య ప్రేమతో పాటు చిలిపి తగాదాలు కూడా ఎన్నో ఉంటాయి. కానీ రోజూ ఎంత గొడవ పెట్టుకున్నా సరే.. ఒక్క రోజు కూడా తమ తోబుట్టువులను చూడకుండా ఉండనివారు చాలామందే ఉంటారు. పెరిగి పెద్దయ్యి.. పెళ్లిళ్లు అయ్యాక వారి మధ్య కాస్త దూరం పెరుగుతుంది. అయితేనేం.. కొన్ని నెలల పాటు ఒకరినొకరు చూసుకోకపోయినా.. తిరిగి కలుసుకున్నప్పుడు  మాత్రం అదే కలుపుగోలుతనం వారి మధ్య కనిపిస్తుంది.

అలాంటి సోదరీ, సోదరుల బంధాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మన పూర్వీకుల నుండి ఆనవాయితీగా వస్తున్న ప్రత్యేకమైన రోజు రక్షాబంధన్ (raksha bandhan). ఈ రోజున మీ మనసులో తనపై ఉన్న సముద్రమంత ప్రేమను.. మీ సోదరుడికి చాటడానికి ఇదో మంచి అవకాశం.

చిన్నతనంలో ఒకరి జుట్టు మరొకరు పీక్కునే శత్రువుల స్థాయి నుంచి.. ఒకరి రహస్యాలు మరొకరు దాచుకునే స్నేహితులయ్యేంత వరకూ.. సోదరీ సోదరుల మధ్య బంధం ఎన్నో రకాలుగా మారుతూ ఉంటుంది. మన జీవితంలో..  ఆకాశమంత ఆత్మీయతను, అనురాగాన్ని పంచే అన్నాదమ్ముల ప్రేమను సెలబ్రేట్ చేసుకొనే విషయంలో రక్షాబంధన్ నిజంగానే ఎంతో ప్రత్యేకం. ఈ పర్వదినం సందర్భంగా మీరు కూడా.. మీ సోదరులకు రాఖీ (Rakhi) కట్టడంతో పాటు.. ఈ అద్భుతమైన మెసేజ్‌లను వారికి పంపి.. మీ సోదరులతో మీ బంధాన్ని సెలబ్రేట్ చేసుకోండి.

 

Table of Contents

  Instagram

  రక్షాబంధన్ భావోద్వేగపూరిత మెసేజ్ లు (Emotional Raksha Bandhan Quotes In Telugu)

  1. నువ్వు ఎప్పుడూ నా బెస్ట్ ఫ్రెండ్‌వి. నా గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. నేను నడిచే దారిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూసుకున్నావు. ఇంత అద్భుతమైన సోదరుడిగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నేను ప్రపంచమంతా వెతికినా నీకంటే మంచి సోదరుడు నాకు దొరికే అవకాశం లేదు. నీ జీవితమంతా అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా.

  2. నేను ఎదిగిన తర్వాత.. మా సోదరులు నా గురించి పెద్దగా పట్టించుకోనట్లుగా కనిపిస్తారు. కానీ నాకు తెలుసు వాళ్లు నాతో ఎప్పటికీ ఉంటారు : క్యాథరిన్ పల్సిఫర్

  3. హ్యాపీ రక్షాబంధన్. దేవుడి దయ, ఆశీర్వాదం నీకు ఈ రోజే కాదు.. ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా. ఆ దేవుడు నీకెప్పుడూ ఆనందాన్ని అందించాలని.. ప్రేమ, సంతోషం, ఆరోగ్యం అన్నీ సమకూర్చాలని కోరుకుంటున్నా.

  4. చిన్నతనం నుండీ మనం పంచుకున్న ఆనందం, నమ్మకం, ప్రేమ, సంతోషం, బాధ.. వీటన్నింటితో పాటు నువ్వు మాత్రమే ప్రత్యేకంగా నాకోసం తెచ్చే కానుకలు ఎంతో గొప్పవి .. వీటన్నింటి కోసం నీకు థ్యాంక్స్. హ్యాపీ రక్షాబంధన్.

  5. చిన్నతనంలో మనం పోట్లాడుకున్న రోజులను.. ఇప్పుడు గుర్తుచేసుకుంటే నాకు నవ్వొస్తుంది. అప్పుడే పోట్లాడుకొని అప్పుడే కలిసిపోయేవాళ్లం. ఆ జ్ఞాపకాలను మనం మర్చిపోవచ్చు. కానీ మన మధ్య ఉన్న ప్రేమను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేం. ఎందుకంటే అది రోజురోజుకీ పెరుగుతూనే ఉంటుంది.

  6. నేను రోజూ ఏదో ఒకటి పోగొట్టుకుంటూ ఉంటాను. కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ పోగొట్టుకోలేను. అది నీ మీద నా ప్రేమ. అదెప్పటికీ చెరిగిపోదు. హ్యాపీ రక్షాబంధన్.

  7. మనం ఎప్పుడూ దగ్గరిగానే ఉంటాం. జీవితం మన దారులు వేరు చేసి దూరం చేసినా.. మన మనసులు మాత్రం ఎప్పుడూ దగ్గరిగానే ఉంటాయి. మన మధ్యనున్న ప్రేమ.. ఓ కనిపించని దారంలా మనల్ని ఎప్పుడూ దగ్గర చేస్తుంది. మనిద్దరం ఒకరికొకరు ఎవరమో ఎప్పుడూ గుర్తుంచుకునేలా చేస్తుంది. నా సోదరుడికి ఇవే నా రక్షాబంధన్ శుభాకాంక్షలు.

  8. అన్నలాంటి స్నేహితుడు ఇంకెవరూ ఉండరు. చెల్లెలు వంటి సూపర్ గర్ల్ ఇంకెవరూ ఉండరు. నీలాంటి వ్యక్తి నా జీవితంలో ఉన్నందుకు నేను అదృష్టవంతురాలిని..

  వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా చెప్పండి.. (Vinayaka Chavithi Quotes And Wishes)

  Instagram

  ఫన్నీ రక్షాబంధన్ మేసేజ్‌లు (Funny Raksha Bandhan Messages)

  9. నీలాంటి ప్రేమ, కరుణ, ఆప్యాయత ఉన్న క్యూట్ బడ్డీ.. నాతో ఉన్నందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని. నువ్వు నా ప్రతి కోరిక నెరవేర్చావు. ఈ రోజు కూడా గిఫ్ట్స్ కోసం వేచి చూస్తుంటాను. ఒకవేళ నాకు నచ్చిన బహుమతులు తేకపోతే.. నువ్వు పెద్ద సమస్యలో పడతావు.

  10.తోబుట్టువులంటే ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు సాధారణ వ్యక్తులు. వాళ్లిద్దరూ ఒక దగ్గర ఉన్నప్పుడు తప్ప.. మిగిలిన అన్ని సందర్బాల్లో  సాధారణంగానే ఉంటారు : సామ్ లీవెనసన్

  11. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధం... కొన్నిసార్లు టామ్ అండ్ జెర్రీ పొట్లాటను గుర్తుకు తెస్తుంది . ఒకరిపై మరొకరు ఎంతో చిరాకు పెడతారు.. కోపం తెప్పిస్తారు.. కొట్టుకుంటారు.. కానీ ఒకరు లేకపోతే మరొకరు ఉండలేరు.

  12. ఈ రాఖీ పండగ సందర్భంగా మన చిన్నతనంలో పొందిన ఆనందాన్ని తిరిగి తీసుకొద్దాం. ఇద్దరం ఒకరిపై ఒకరం జోకులు వేసుకుంటూ.. అప్పటి క్రేజీ తోబుట్టువులుగా మారిపోదాం. హ్యాపీ రక్షాబంధన్.

  13. మనమిద్దరం ఒకరినొకరం ఏడిపించుకున్న సందర్భాలు,  తిట్టుకున్న సందర్భాలు అన్నీ.. నీ మీద నాకున్న ప్రేమ ముందు చాలా చిన్నగా కనిపిస్తాయి. నీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. నాకు గిఫ్ట్స్ పంపడం మాత్రం మర్చిపోవద్దు..

  14. చిన్నతనం నుండి నువ్వు నాకు.. తిట్లు, దెబ్బలు, గాయాలు, గొడవలతో కూడిన అనుభవాలను అందించినందుకు ధన్యవాదాలు. నువ్వు లేకుండా ఉంటే.. నా చిన్నతనం మొత్తం బోరింగ్‌గా గడిచేది. అలాంటి నా నాటీ బ్రదర్‌కి రక్షా బంధన్ శుభాకాంక్షలు.

  కృష్ణాష్టమి సందేశాలు (Janmashtami Quotes In Telugu)

  Instagram

  అన్నయ్య కోసం రాఖీ మెసేజ్‌లు (Rakhi Wishes For Elder Brother)

  15. నువ్వు ఏ విషయంలోనైనా "కాదు... అవ్వదు" అనే పదాలు నా దగ్గర వాడవు. "నువ్వు ఏ పని చేయలేవు" అని కూడా నాతో చెప్పవు. అందుకే నా అన్నయ్య సూపర్ మ్యాన్. తనుంటే చాలు.. అన్ని విషయాలూ సాధ్యమే.. అన్ని దారులు సవ్యంగానే సాగుతాయి. ఐ లవ్యూ అన్నయ్య.

  16. నేను ఏడుస్తుంటే నాకు తోడున్నావు. నన్ను అన్ని కష్టాల నుంచి కాపాడావు. సూపర్ హీరోలు నిజంగా ఉంటే.. వారిలో నువ్వూ ఒకడివి. నువ్వు చేసిన పనులన్నింటికీ థ్యాంక్యూ అన్నయ్య. హ్యాపీ రక్షాబంధన్

  17. ఈ రోజు రాఖీ పండగ కాబట్టి.. నువ్వెంత ప్రత్యేకమో.. నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వే నా ఫ్రెండ్, గైడ్, టీచర్.. నీతో ఉంటే నేనెంతో స్పెషల్‌గా ఫీలవుతాను. రాఖీ పండగ శుభాకాంక్షలు అన్నయ్య.

  18. నువ్వు ఎప్పుడూ నా బెస్ట్ ఫ్రెండ్‌వి. నా గురించి శ్రద్ధ తీసుకుంటూ నేను వెళ్లే దారి సవ్యంగా ఉండేలా చూసుకుంటావు. నేను ప్రపంచమంతా వెతికినా.. నీకన్నా మంచి అన్న నాకు దొరకడు. రాఖీ పండగ శుభాకాంక్షలు అన్నయ్య.

  19. ఆత్మను వెతికాను. అది నాకు కనిపించలేదు. దేవుడిని వెతికాను. ఆయన నాకు దూరమయ్యాడు. అన్నను వెతికాను. తనలో మిగిలిన ఇద్దరినీ కూడా చూశాను.

  20. డియర్ అన్నయ్య.. ఈ రక్షా బంధన్ సందర్భంగా నేను చెప్పేదేమిటంటే.. ఈ ప్రపంచంలోనే గొప్ప అన్నవి నువ్వు .. నా ప్రపంచం నువ్వే అని చెప్పాలనుకుంటున్నా.. రాఖీ పండగ శుభాకాంక్షలు.

  21. నన్ను సమర్థించేందుకు నా ముందు నిలిచావు. తలెత్తుకొని జీవిస్తూ నాకు ఆదర్శంగా మిగిలావు. థ్యాంక్స్ అన్నయ్యా. రాఖీ శుభాకాంక్షలు.

  Also Read About కుమార్తె రోజు శుభాకాంక్షలు

  Instagram

  తమ్ముడికి రాఖీ శుభాకాంక్షలు (Rakhi Wishes For Younger Brother)

  22. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. నా రహస్యాలు దాచే వ్యక్తివి, నేను ప్రేమించే నా ముద్దుల తమ్ముడివి. నాకేదైనా కావాలన్నప్పుడు ముందుగా గుర్తొచ్చే వ్యక్తివి కూడా నువ్వే. హ్యాపీ రక్షాబంధన్.

  23. నా జీవితంలో కొన్నిసార్లు నిన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించాను. కొన్నిసార్లు అందరి కంటే ఎక్కువగా ద్వేషించాను. కానీ నేను నిన్నెప్పుడూ మర్చిపోలేదు. హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు.

  24. నీలాంటి తమ్ముడు ఉండడం.. నా జీవితంలోనే నేను పొందిన అతి గొప్ప వరం. నువ్వు నాకు తోడుగా ఉన్నప్పుడు.. నేనెప్పుడూ డల్‌గా ఫీలవ్వలేదు. నన్ను అలా ఆనందంలో ముంచిన వ్యక్తివి నువ్వే. హ్యాపీ రక్షాబంధన్.

  25. నాకు బాధ కలిగిన సమయంలో.. నాకు తోడు నిలిచే వ్యక్తివి నువ్వే. నేను ఆనందంగా ఉన్న సమయంలో నాతో పాటు డ్యాన్స్ చేసింది కూడా నువ్వే. నువ్వు నా జీవితంలో లేని.. ఒక్క రోజు కూడా నాకు గుర్తు లేదు. ఐ రియల్లీ లవ్ యూ. హ్యాపీ రక్షాబంధన్.

  26. నా పెద్ద తమ్ముడి లోపల ఓ చిన్న పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడిని నేను ఎంతో ద్వేషించానో అంతకంటే ఎక్కువగా ప్రేమించాను: అన్నా క్విండ్లెన్

  27. బేబీ బ్రో.. నీకు సలహాలు ఇవ్వడానికి.. నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను. నీకు ప్రేమలో వచ్చే సమస్యలు తీర్చడానికి.. నువ్వు ప్రేమించిన అమ్మాయిల గురించి చెప్పి నిన్ను ఏడిపించేందుకు ఎప్పుడూ నేను రడీ.. ఇంత క్యూట్‌గా ఉన్నందుకు నీకు థ్యాంక్స్.

  28. నీకు తెలుసా? నా రహస్య నిధిలో నువ్వే వెలకట్టలేని వజ్రానివి. రాఖీ పండగ శుభాకాంక్షలు.. నీ జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకుంటూ నీ అక్క.

   

  ఇంతే అద్భుతంగా మీ ప్రియమైన వారికీ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పండి.

  Instagram

  సోదరి కోసం రక్షా బంధన్ సందేశాలు (Raksha Bandhan Messages For Sisters)

  29. సోదరి అంటే ఎప్పటికీ మర్చిపోలేని బాల్యం : మారియన్ సి గర్రెట్టీ

  30. సోదరి కంటే మంచి స్నేహితురాలు లేదు. నీకంటే మంచి సోదరి లేదు.

  31. సోదరి అంటే మనసుకు ఓ మంచి బహుమతి. ఆత్మకు మంచి స్నేహితురాలు.. జీవితానికే ఓ మంచి బంగారు జరీ లాంటిది : ఇసాడోరా జేమ్స్

  32. సోదరి ఉండడం అంటే.. ఎప్పటికీ వదులుకోలేని ఓ మంచి స్నేహితురాలు ఉండడమే. జీవితంలో నువ్వెలా ఉన్నా.. ఏం చేసినా ఆమె నీతోనే ఉంటుంది.

  33. చిన్నప్పుడు నన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తి, తన ఆత్మబంధువు, నన్ను కాపాడే తోడు, నా బెస్ట్ ఫ్రెండ్.. అన్నీ నువ్వే.. హ్యాపీ రక్షా బంధన్ .

  34. డియర్ అక్కా.. నువ్వు నాకు అమ్మ తర్వాత అమ్మలాంటి దానివి. ఒక తల్లి బిడ్డ కోసం ఏమేం చేస్తుందో అవన్నీ నువ్వు నాకోసం చేశావు. థ్యాంక్యూ..

  35. నా అక్కవి కాబట్టే.. నాకు ఏ సమస్య వచ్చినా వాటిని చెప్పుకోవడానికి.. పరిష్కారం కోసం అడగడానికి నాకు ఓ వ్యక్తి ఉన్నారు అనిపించేది. నిన్ను నేను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. నాకు ఎప్పుడూ తోడుగా ఉన్నందుకు థ్యాంక్స్.

  36. డియర్ సిస్టర్.. నువ్వు నాకు లక్కీ.. నువ్వు నాతో ఉంటే నాకెప్పుడూ మంచే జరుగుతుంది. నీలాంటి దేవత నా జీవితంలో ఉన్నందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. నీకు నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే. నువ్వు చాలా అమూల్యమైన వ్యక్తివి. నేను ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తాను.

  37. నువ్వు లేకపోతే.. నా చిన్నతనం అంత ప్రత్యేకంగా ఉండేది కాదేమో.  జీవితంలోని ప్రతి దశలోనూ నన్ను సపోర్ట్ చేసినందుకు నీకు ధన్యవాదాలు.

  38. నా జీవితంలోకి నీలాంటి దేవతను పంపి దేవుడు చాలా గొప్ప పని చేశాడు. సంతోష సమయంలో.. బాధలో ఉన్నప్పుడు నువ్వు నాతో ఉన్నావు. నాకు తోడుగా నిలిచి సహాయం చేశావు. నువ్వు చేసిన దానికి ధన్యవాదాలు. హ్యాపీ రక్షాబంధన్.

   

  ఇంతే అద్భుతంగా మీ ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా చెప్పండి.

  Instagram

  సోదరుడి లాంటి సోదరికి శుభాకాంక్షలు (Rakhi Wishes To Sister Who Is Your Bro..)

  39. నేను నీ సమస్యలన్నింటినీ తీర్చలేకపోవచ్చు. కానీ వాటిని ఎదుర్కోవడంలో మాత్రం నిన్ను ఒంటరిని కానివ్వను.

  40. మా అమ్మ నాకిచ్చిన బెస్ట్ సలహా - నీ సోదరితో మంచిగా వ్యవహరించు.. స్నేహితులు వస్తారు.. పోతారు.. కానీ నీ సోదరి మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. ఏదో ఒక రోజు తను నీకు బెస్ట్ ఫ్రెండ్ కూడా అవుతుంది.

  41. జీవితంలోని కష్టాలనే కొండలు మరీ ఎత్తుగా మారి నన్ను ఇబ్బంది పెడుతుంటే.. నేను వాటిని ఒంటరిగా ఎక్కేందుకు ఆయాసపడే సమయంలో..  నా సోదరి నా చేయి పట్టుకొని వాటన్నింటినీ.. నేను ఒంటరిగా ఎక్కాల్సిన అవసరం లేదని గుర్తు చేస్తుంది.

  42. జీవితంలో అక్క లేదా చెల్లెలు ఉండడంలోని ఆనందమైన విషయం.. మనకెప్పుడూ వారు ఓ బెస్ట్ ఫ్రెండ్  రూపంలో తప్పకుండా సహాయం చేస్తారు.

  43. ఈ అస్తవ్యస్తమైన ప్రపంచంలో.. మనకు తోడుగా సేఫ్టీ నెట్‌గా ఉండే వ్యక్తి అక్క లేదా చెల్లెలు మాత్రమే: కారోల్ సెలైన్

  44. కుటుంబం లోపల.. బయట కూడా మన సోదరి మనకు అద్దంలా నిలిచి ఉంటుంది. మనం ఎలా ఉన్నామో అన్న విషయాన్ని మాత్రమే కాదు.. మనం ధైర్యం చేస్తే ఎలా ఉండగలం అన్న విషయాన్ని కూడా మనకు చూపుతుంది: ఎలిజబెత్ ఫిషెల్

  45. సోదరి ఒడి కంటే.. ఈ ప్రపంచంలో మనల్ని సంతృప్తి పరిచే ఓదార్పు ఇంకెక్కడా దొరకదు.

  46. విజయం పొందే మార్గంలో.. నువ్వు కిందపడినప్పుడు ఎలా ఉన్నావో.. విజయం సాధించినప్పుడు ఎలా ఉన్నావో.. కేవలం నీ సోదరికి మాత్రమే తెలుసు. నువ్వు నీ స్థానం నుంచి కింద పడినప్పుడు, అందరూ నీ చేయి విడిచినప్పుడు.. జీవితంలో వెళ్లాల్సిన అతి కింద స్థాయి నుంచి అత్యధిక స్థాయి వరకూ.. ప్రతి దశా తనకు తెలుసు. ఎందుకంటే తను ఎప్పుడూ నీతోనే ఉంటుంది.

  47. సోదరి అంటే అప్పుడప్పుడూ మనలాగే అనిపిస్తుంది. అప్పుడప్పుడూ మనకు పూర్తి వ్యతిరేకంగానూ కనిపిస్తుంది. ఇలా రెండు రకాలుగా కనిపించే ప్రత్యేకమైన వ్యక్తి సోదరి మాత్రమే: టోనీ మారిసన్

  Instagram

  రక్షాబంధన్ వాట్సాప్ స్టేటస్‌లు (Whatsapp Status To Wish Raksha Bandhan)

  48. నేనెంతగానో ప్రేమించే నా డియర్ పిసినారి అన్నయ్యకి (ఎప్పటిలాగే జోక్ చేస్తున్నా)  రాఖీ పండగ శుభాకాంక్షలు.

  49. అన్నదమ్ములు మనం వెళ్లే దారిలో స్ట్రీట్ లైట్స్ లాంటివారు. వాళ్లు దూరాన్ని ఏమాత్రం తగ్గించరు. కానీ మనం చేసే ప్రయాణాన్ని వెలుగులో ఉండేలా చేసి.. సరైన దిశలో నడిచేలా చేస్తారు.

  50. రాఖీ అనే దారం రెండు ఆత్మలను సంతోషమనే బంధంతో ఎల్లప్పుడూ కలిపి ఉంచుతుంది - హ్యాపీ రక్షాబంధన్.

  51. అన్నీ ఒకరే.. ఒక్కరే అందరూ.. నా సోదరుడు, స్నేహితుడు అయిన నీకు.. మనం గడిపిన సంతోషకరమైన సమయం, మన ఆనందాలు అన్నీ గుర్తు చేస్తూ.. రక్షాబంధన్ శుభాకాంక్షలు.

  52. రాఖీ అనేది ప్రేమతో కూడిన బంధం, మనల్ని దగ్గర చేసే బంధం. మన జీవితాలు, మన మనసులను కలిపి ఉంచే దారం ఇది. హ్యాపీ రక్షాబంధన్.

  53. నేను నీకు చెప్పాల్సింది ఒక్కటే.. నేను నీ సోదరిగా పుట్టినందుకు నువ్వెంతో అదృష్టవంతుడవి. జోక్ చేస్తున్నా.. నువ్వు నాకు సోదరుడిగా పుట్టినందుకు నేనే ఎంతో అదృష్టవంతురాలిని.

  54. మన చిన్నతనంలో నువ్వు నా చాక్లెట్ తిన్నప్పుడు నాకెంతో కోపం వచ్చేది. కానీ నీకు అమ్మ చాక్లెట్ ఇవ్వకపోతే కూడా కోపం వచ్చేది. ఇలాంటి ప్రేమ, ద్వేషం కలగలిసిన అద్భుతమైన బంధాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  55.ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ గ్లూ ఏదో నీకు తెలుసా? నీకు, నాకు మధ్య ఉన్నదే.. లవ్ యూ బ్రో..

  56. తోబుట్టువులు మనకు ప్రాక్టీస్ చేయించేవాళ్లు.. సరైన విషయం బోధించే వాళ్లు.. మంచి, సహాయం, కరుణ ఇవన్నీ నేర్పించేవాళ్లు.. కొన్నిసార్లు ఇబ్బందైనా సరైన విషయమే చెబుతారు : పమేలా డగ్డేల్

  Instagram

  దూరంగా ఉన్న సోదరుడి కోసం రాఖీ విషెస్ (Raksha Bandhan Messages For Long Distance Sibling)

  57. నువ్వు నాకు ఎంత దూరంగా ఉన్నా సరే.. నా రాఖీ నీకు సరైన సమయానికి చేరుతుంది. నా ప్రియమైన సోదరుడి చేతిపై మెరవడమే దాని అదృష్టం. నా నుంచి నీకు మనసుకు హత్తుకునే శుభాకాంక్షలతో పాటు.. నీ జీవితం మొత్తం నిండేంత ఆనందాన్ని తీసుకొచ్చిందీ రాఖీ.

  58. మనిద్దరం ఒక దగ్గర లేకపోయినా.. మన మధ్య కంటికి కనిపించని ఓ దారం.. మనల్ని కలిపి ఉంచుతుంది. దానికి మనం ఎంత దూరం ఉన్నామనే విషయం అవసరం లేదు. మన మనసులను ఎప్పుడూ దగ్గరగానే ఉంచుతుంది. అదే రక్షా బంధన్

  59. మనసులు దగ్గరగా ఉన్నప్పుడు ..మన మధ్య ఉన్న దూరం పెద్ద విషయం కాదు. నేను నీ చేతికి రాఖీ కట్టలేకపోయినా "నా శుభాకాంక్షలు" ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ జీవితం సుఖశాంతులతో.. ఆనందంగా కొనసాగాలని కోరుకుంటున్నా. మిస్ యూ.

  60. డియర్ బ్రదర్.. నువ్వెక్కడున్నా నాకెంతో ప్రత్యేకం అని గుర్తుంచుకో... నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటా. హ్యాపీ రక్షాబంధన్.

  61. ఈ రాఖీ పండక్కి నేను నీతో ఉండలేకపోయినందుకు సారీ.. నీపై మనసంతా నిండిన ప్రేమతో నీకు శుభాకాంక్షలు పంపుతున్నా. నీ జీవితంలో స్నేహం, సంతోషం, సుఖం, శాంతి వంటివన్నీ నిండి ఉండాలని కోరుకుంటున్నా. రాఖీ పండగ శుభాకాంక్షలు.

  62. డియర్ బ్రదర్.. ఈ రోజు రాఖీ పండగ. నువ్వు నాతో ఇక్కడ లేకపోయినా మనిద్దరం ఒకరి మనసులో.. ఒకరి ఆలోచనలో మరొకరం ఉన్నాం. నా ప్రేమ ఎప్పుడూ నీతో పాటు ఉంటుంది. రాఖీ పండగ శుభాకాంక్షలు.

  63. డియర్ బ్రదర్.. నేను నిన్ను బాగా మిస్సవుతున్నా. మనిద్దరం పాడుకునే ఫన్నీ పాటలు.. మన సిల్లీ మాటలు.. నన్ను నువ్వు ఏడిపించే విధానం..వీటన్నింటినీ మిస్సవుతున్నా. నిన్ను వీలైనంత త్వరగా చూడాలనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు లేకుండా నా జీవితం చాలా బోరింగ్‌గా ఉంది.

  Instagram

  రాఖీ సందర్భంగా థ్యాంక్యూ మెసేజ్‌లు (Thanksgiving Messages During Rakhi)

  64. దేవుడు అన్ని చోట్లా ఉండలేడు.. కాబట్టి మనకు అమ్మను ఇచ్చాడు. అలాగే అమ్మ అన్ని విషయాల గురించి శ్రద్ధ తీసుకోలేదు కాబట్టి.. మనకు సోదరుడిని అందించింది. థ్యాంక్యూ బ్రదర్.

  65. బయట కనిపించే ప్రపంచానికి మనం పెద్దవాళ్లం. కానీ మన అన్నదమ్ములకు మాత్రం కాదు. మనం చిన్నతనంలో ఒకరికొకరం ఎలా తెలుసో.. అలాగే ఇప్పటివరకూ మనల్ని మనం చూసుకుంటున్నాం. నాకోసం ఎప్పుడూ తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు.

  66. అన్నయ్యా.. నాకంటే ముందు పుట్టినందుకు ధన్యవాదాలు. మన కంటే ముందు పుట్టిన వాళ్లు ఒకరు ఉండడం అదృష్టం. నువ్వు నాతో ఉన్నప్పుడు నేనెప్పుడూ ధైర్యంగా ఫీలవుతాను.

  67. మనం చిన్న చిన్న విషయాల గురించి గొడవ పడతాం. కానీ నువ్వు నన్నెంతగా ప్రేమిస్తున్నావో.. నాకు తెలుసు. నాకు ప్రతి సందర్భంలోనూ.. ఓ వ్యక్తి తోడుగా ఉంటాడని ఎంతో ధైర్యంగా ఫీలవుతాను. నా గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు.

  68. ఈ చెల్లెలికి జీవితంలో.. ఎంతగానో ఉపయోగపడే సలహాలు ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. నువ్వు చెప్పిన మాటలే.. నేను నా  లక్ష్యాల దిశగా అడుగులు వేసేందుకు ఎంతగానో తోడ్పడ్డాయి.

  69. నిన్ను సాయం అడగాల్సిన అవసరం నాకు ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే నేను అడగకముందే నువ్వు నాకు ఎప్పుడూ తోడుగా నిలిచావు. థ్యాంక్యూ అన్నయ్యా.

  70. నా బాల్యం ఎంతో ప్రత్యేకంగా ఉందంటే దానికి కారణం నువ్వే. నా టీనేజ్ గుర్తుండిపోయేలా ఉందన్నా.. దానికి కారణం నువ్వే. పెద్దయ్యాక నా జీవితం మర్చిపోలేనిదిగా ఉండేందుకు కారణమయ్యావు. మొత్తంగా నా జీవితాన్ని గొప్పగా మార్చావు. అందుకు నీకు ధన్యవాదాలు.

  ఈ సంవత్సరం రాఖీ పండగ ఆగస్టు 15న రానుంది. అందుకే ఈ సందర్బంగా మీరు మీ తోబుట్టువుల నుంచి ఎంత దూరంగా ఉన్నా.. ఈ మెసేజ్‌ల ద్వారా వారికి మీ ప్రేమను అందించండి. వారి ముఖంపై సన్నని చిరునవ్వు మెరిసేలా చేయండి.

  POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

  క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

  ఇవి కూడా చదవండి.