సెల్ఫీ (selfie) తీసుకోని వారు.. సెల్ఫీ అంటే తెలియనివారు ఈ రోజుల్లో ఉండటం చాలా అరుదు. ఎక్కడికి వెళ్లినా ఓ సెల్ఫీ తీసుకోవడం.. దాన్ని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడం.. వంటివి ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయి. కుటుంబ సభ్యులంతా ఓ చోట చేరితే ఫ్యామిలీ సెల్ఫీ… ఫ్రెండ్ పెళ్లికెళితే గ్రూప్ సెల్ఫీ, పార్క్‌కి వెళితే బ్యాక్ గ్రౌండ్ సెల్ఫీ,, ఇలా మన జీవితంలో జరిగే ప్రతి అనుభవాన్నీ సెల్ఫీ రూపంలో భద్రపరుచుకుంటున్నాం. వాటిని సోషల్ మీడియా ఖాతాల్లో స్నేహితులతో పంచుకుంటున్నాం.
అయితే వాటిని అలానే పోస్ట్ చేసేస్తే ఏం బాగుంటుంది? దానికి ఓ అందమైన క్యాప్షన్ కూడా జోడిస్తే మరింత అందంగా ఉంటుంది. అందులోనూ సందర్భానికి తగిన క్యాప్షన్ ఎంచుకుంటే అది ఎక్కువ మందికి చేరుతుంది కూడా. ఆలోచన బాగుంది కదా మరి.
అయితే సెల్ఫీకి తగినట్లుగా క్యాప్షన్ ఎలా రాయాలో తెలుసుకుందాం. దానితో పాటు సందర్భానికి తగినట్లుగా పెట్టదగిన కొన్ని సెల్ఫీ క్యాప్షన్లు మీకు అందిస్తున్నాం. వాటిలో మీకు నచ్చినవి, మీ సెల్ఫీకి సరిపోయేవి ఎంచుకొని వాటిని మీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాల్లో పోస్ట్ చేయండి.
సెల్ఫీ క్యాప్షన్స్ రాయడానికి కొన్ని చిట్కాలు(Tips For Selfie Captions)
సెల్ఫీ తీసుకొని దాన్ని పోస్ట్ చేస్తే సరిపోదు. మీ సెల్ఫీ ఎక్కువ మందిని ఆకర్షించాలంటే.. దానికి తగిన క్యాప్షన్ రాయాల్సిందే. మీ ఫొటోకి క్యాప్షన్ ఎంచుకునే ముందు ఏ ఫొటోకి ఏ తరహా క్యాప్షన్ రాయాలి? క్యాప్షన్ ఎంచుకునే విషయంలో ఏ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో తెలుసుకోవడం మంచిది. అందుకు ఉపకరించేవే ఈ చిట్కాలు.
మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఎవరున్నారు?
మీ ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ ఖాతాలో సెల్ఫీని పోస్ట్ చేసే ముందు.. మీ సోషల్ మీడియా ఏ తరహాదో పరిగణనలోకి తీసుకోవాలి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారా? లేదా మీరు పబ్లిక్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారా? దాని ఆధారంగా ఎలాంటి క్యాప్షన్ పెడితే ఎక్కువ మందికి చేరుతుందో చూసుకోవాలి. అలాగే ఫొటోకి మీరు పెట్టే క్యాప్షన్ ఎవరినీ నొప్పించకుండా ఉండేలా చూసుకోవాలి. మనం పోస్ట్ చేసే ఫొటో ఎంత ముఖ్యమో దానికి మనం జోడించే క్యాప్షన్ కూడా అంతే ముఖ్యం.
సూటిగా, క్లుప్తంగా..
ఫొటో క్యాప్షన్లను చదవడానికి అందరూ ఇష్టపడతారు. అందుకే వాటిని అందంగా, అర్థవంతంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే వాటిని వీలైనంత వరకు క్లుప్తంగా రాయడానికి ప్రయత్నించండి. ఒకవేళ పెద్ద క్యాప్షన్ రాయాల్సిన అవసరం ఏర్పడితే.. ఆసక్తిని కలిగించే వాక్యాలను ముందు రాయండి. ఇలా చేయడం వల్ల మనం రాసిన క్యాప్షన్ పూర్తిగా చదువుతారు. లేదంటే అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్లిపోతారు. ప్రశ్నల రూపంలోనూ క్యాప్షన్లు రాయొచ్చు. దీనివల్ల మీ పోస్ట్‌కి కామెంట్ల రూపంలో రిప్లై ఇచ్చేవారు పెరుగుతారు. అంటే మీ పోస్ట్ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది.
ఎమోజీలు తెలివిగా వాడండి
ఎమోజీలు కూడా ఇతరుల దృష్టిని బాగా ఆకర్షిస్తాయి. కాబట్టి వాటిని సందర్భానికి తగినట్టుగా ఉపయోగించండి. వీటిని మీ క్యాప్షన్లలో కూడా ఉపయోగించవచ్చు. ఒక్క ఎమోజీని ఉపయోగించి మనం చెప్పాలనుకున్నది ఎదుటివారికి బాగా అర్థమయ్యేలా వివరించవచ్చు.
కొటేషన్స్ ఉపయోగించి..
మనం తీసుకొన్న కొన్ని సెల్ఫీలకు సూటయ్యే కొటేషన్స్ ఉపయోగించడం ద్వారా కూడా.. మీ సెల్ఫీని మరింత ఎట్రాక్టివ్‌గా మార్చేయచ్చు. అయితే మీరు తీసుకున్న సెల్ఫీకి, మీరెంచుకున్న క్యాప్షన్‌కి కాస్త సంబంధం ఉండేలా చూసుకోవడం మంచిది.
సమాచారాన్ని అందించేవి
టూర్స్, ట్రిప్స్‌కి వెళ్లినప్పుడు అక్కడ మీరు కచ్చితంగా సెల్ఫీలు తీసుకుంటారు కదా. ఆ సెల్ఫీలు పోస్ట్ చేసినప్పుడు.. దానితో పాటు మీరు సెల్ఫీ దిగిన స్పాట్ గురించి సమాచారాన్ని ఇస్తే మీ పోస్ట్ చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.
ఫొటో వెనుక ఉన్న కథ
ప్రతి ఫొటో వెనుక ఓ కథ ఉంటుంది. ఆ కథేంటో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది కదా. మీరు తీసుకున్న సెల్ఫీ వెనుక కూడా ఏదో ఒకటి జరిగే ఉంటుంది కదా. ఆ స్టోరీని అందంగా మీ ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ వాల్ పై పోస్ట్ చేయండి.
మనం తీసుకొనే సెల్ఫీల్లో ఎన్నో రకాలుంటాయి. అమ్మానాన్నలు, తోబుట్టువులు, స్నేహితులు, అప్పుడప్పుడూ వస్తువులతో.. ఇలా మనకు నచ్చినట్టుగా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటాం. అయితే ఆ సెల్ఫీలకు ఎలాంటి క్యాప్షన్లు పెడితే బాగుంటుందో తెలుసుకుందాం.
ఇన్స్ట్రాగ్రాం ఖాతాలో పోస్ట్ చేయడానికి పనికొచ్చే 95 క్యాప్షన్లు
Giphy
ఫన్నీ సెల్ఫీ క్యాప్షన్స్ (Funny Selfie Captions)
- నేను చాలా హాట్. ఆ విషయం నాకు తెలుసు. మీక్కూడా తెలియాలిగా.
- నేను ఇలానే నిద్ర లేచాను. (అంటే మేకప్ వేసుకుని పడుకున్నానులే.)
- నా సెల్ఫీకి సరిపోని క్యాప్షన్లు.. నాకు పెద్దగా నచ్చవు.
- మన సెల్ఫీని మనం ఎంతగా ఇష్టపడతామో.. ఇతరుల్ని అంత తక్కువ ఇష్టపడతాం. ఇది చాలా స్పెషల్ క్వాలిటీ. అందరిలోనూ ఇది ఉండదు.
- నేను దిగిన సెల్ఫీ ఎలాంటిదైనా సరే.. నా దగ్గర ఓ క్యాప్షన్ రెడీగా ఉంటుంది.
- ఈ సెల్ఫీ దిగినందుకు నేను చాలా బాధపడ్డా. అయినా పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నా.
- మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడం కూడా ఓ ఆర్ట్.
- ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం.(ప్లీజ్ నవ్వు ఆపుకోవద్దు)
- మన సెల్ఫీనే. తప్పదు నా టాలెంట్ మీరు మెచ్చుకోవాల్సిందే.(అదే సెల్ఫీ తీసుకునే టాలెంట్).
- ఈ సెల్ఫీ పోస్ట్ చేసినందుకు నాతో పాటు మీరు కూడా బాధపడతారేమో. ఏం చేస్తాం. అయినా తప్పడం లేదు.
సెల్ఫీ విత్ బెస్టీ క్యాప్షన్స్ (Selfie With Bestie Captions)
- అసలు ఇలాంటి పిచ్చి పనులు నా స్నేహితురాలిని చేయనిస్తానా? నేను లేకుండా అది సాధ్యం కానే కాదు.
- జీవితం చాలా చిన్నదట. కానీ మన అనుబంధం మాత్రం చాలా సుదీర్ఘమైనది.
- మనిద్దరం కలసి ఏదైనా చేద్దామనుకుంటే అది కచ్చితంగా చేసి తీరతాం.
- నాకు తెలుసు.. నేనంటే నీకు ప్రాణమని. నువ్వు కూడా నాకు ప్రాణంతో సమానం.
- భూమండలం ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు తెలుస్తుంది. అయితేనేం మనమెప్పుడూ బెస్ట్ ఫ్రెండ్సే కదా.
- ప్రకాశవంతమైన వెలుగులో ఒంటరిగా నడిచే కంటే.. చిమ్మ చీకటిలో ఫ్రెండ్‌తో నడవడం మంచిది.
- ప్రేమ చాలా గొప్పది. స్నేహం విలువైనది.
- గుడ్ టైమ్స్ + క్రేజీ ఫ్రెండ్స్ = గ్రేట్ మెమరీస్
- నేను చేసే ప్రతి నేరంలోనూ భాగస్వామి నా స్నేహితురాలు.
- అసలు నేనేమంత గొప్ప పని చేశానో నాకు తెలియదు. కానీ భగవంతుడు మాత్రం నిన్ను నాకు స్నేహితురాలిగా పంపించాడు.
Giphy
అమ్మానాన్నతో తీసుకున్న సెల్ఫీ క్యాప్షన్లు(Selfie With Family Captions)
- అసలు మనమెంత దూరం వెళ్లినా సరే.. అమ్మానాన్నల మనసు మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటుంది.
- దేవుడు ఎక్కడో లేడు. అమ్మానాన్న రూపంలో మన ముందే ఉంటాడు.
- నా అల్లరిని, నా పిచ్చితనాన్ని పాతికేళ్ల నుంచి ఓపిగ్గా భరిస్తున్న అమ్మానాన్నకి థ్యాంక్స్ చెప్పడం అంత సులభం కాదు.
- కొంతమంది నిజజీవితంలో హీరోలుండరనుకుంటారు. అలాంటి వారికి ఓ సారి మా నాన్నను పరిచయం చేయాలి.
- మీరు చేసిన త్యాగాల వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఐ లవ్యూ అమ్మ, ఐ లవ్యూ నాన్న.
- నా జీవితాన్ని ఒక సెల్ఫీలో ఇమడ్చాలనుకుంటే.. అందులో అమ్మానాన్న కచ్చితంగా ఉండాలి. లేదంటే అది అసంపూర్ణమే అవుతుంది.
- నా జీవితం ఓ కామిక్ బుక్ లాంటిది. ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే.. అమ్మానాన్న సూపర్ హీరోలు అయిపోతారు.
- నేను ఇప్పటి వరకూ ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. ఎందుకంటే.. అవి నా వరకు రాకుండా అమ్మానాన్న రక్షణ కవచంగా నిలిచారు.
- మనం ఎంత ఎదిగినా అమ్మానాన్నకు పసిపిల్లలమే కదా.
- అమ్మానాన్న అయ్యేంత వరకు వారి విలువేంటో మనకు నిజంగానే తెలియదు.
Giphy
అక్కా చెల్లెళ్లతో తీసుకున్న సెల్ఫీకి తగ్గ క్యాప్షన్లు (Selfie With Sisters Captions)
- అమ్మానాన్న మనల్ని అర్థం చేసుకోనప్పుడు.. తోబుట్టువులే మనల్ని అర్థం చేసుకుంటారు.
- ఎవరినైనా మోసం చెయ్యచ్చు. కానీ అక్కలను మాత్రం మోసం చేయలేం.
- నా గురించి ఈ ప్రపంచంలో.. నా అక్క కంటే బాగా ఇంకెవరికీ తెలియదు.
- నీకు ఎదురయ్యే సమస్యలన్నింటినీ నేను పరిష్కరించలేకపోవచ్చు. కానీ వాటిని నువ్వొక్కదానివి కాదు.. మనిద్దరం కలసి ఎదుర్కొందాం.
- మనిద్దరం ఎందుకు కొట్టుకుంటున్నామో చూసేవాళ్లకు అర్థం కాదు. ఎంతైనా మనిద్దరం అక్కాచెల్లెలం కదా. దెబ్బలాడుకోవడానికి అంతకు మించిన కారణం మరొకటి అవసరం లేదు. – కెన్ వీటెన్
- నీ వల్లే కేవలం నీ వల్లే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒకవేళ బాధపడే సందర్భాలు వచ్చినా నువ్వు ఏదోలా నవ్వించేస్తావుగా..
- అక్కను మించిన బెస్ట్ ఫ్రెండ్ మరొకరు ఉండరు. నిన్ను మించిన బెస్ట్ అక్క ఇంకెవరూ ఉండరు.
- నేను ఎవరికీ చెప్పనని మీకు మాటిచ్చానంటే.. మా అక్కకి తప్ప ఇంకెవరికీ చెప్పనని అర్థం.
- ఇది నా చెల్లి. తనను ఎవరైనా బాధపెట్టారో.. వాళ్ల ముక్కు పగలగొడతా.. ఖబడ్దార్
- దేవతలు ఏదో పనిలో బిజీగా ఉంటారు కాబట్టి.. దేవుడు నీలాంటి సోదరిని సృష్టించాడు.
Giphy
అన్నదమ్ములతో తీసుకున్న సెల్ఫీకి తగిన క్యాప్షన్లు (Selfie With Brothers Captions)
- కొన్నిసార్లు సూపర్ హీరో కంటే.. అన్నయ్యే చాలా బెటర్ అనిపిస్తాడు – మార్క్ బ్రౌన్
- ఎంతమంది అన్నదమ్ములు మనకుంటే.. అంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ మనకున్నట్టే – కిమ్ కర్దాషియాన్
- మన అమ్మానాన్నలు మనకిచ్చిన గొప్ప బహుమతి ఏంటో తెలుసా? నీకు నన్ను, నన్ను నీకు తోడుగా పుట్టించడం.
- మనమెలా పెరిగామో.. మన తోబుట్టువుకి తప్ప ఇంకెవరికీ తెలియదు.
- కొన్నిసార్లు అన్నయ్యతో కాసేపు మాట్లాడితే చాలు.. మనసు ప్రశాంతంగా మారిపోతుంది.
- అన్నదమ్ములు ఎలాంటివారంటే.. మనం కిందపడినప్పుడు ముందు పడీ పడీ నవ్వి ఆ తర్వాతే మనల్ని పైకి లేపుతారు.
- అన్నయ్య: కొన్ని లక్షల జ్ఞాపకాలు, కొన్ని వేల జోక్స్, కొన్ని వందల సీక్రెట్స్
- మనం పెరిగే కొద్దీ.. మన చుట్టూ వంద మంది ఉండక్కర్లేదు. మన క్షేమాన్ని కాంక్షించే సోదరుడు ఉంటే చాలు.
- సోదరుడు ఎంత మంచి వాడంటే.. మనం ఎంత బాధలో ఉన్నా సరే.. ఏదో ఒక కుళ్లు జోక్ వేసి నవ్వించడానికి ప్రయత్నిస్తాడు.
- అమ్మాయికి పెద్ద సపోర్ట్ ఎవరో తెలుసా? అన్నయ్యే.
రాఖీ పండక్కి మీ చెల్లెలిని సంతోషపరిచే బహుమతులు
Giphy
బాయ్ ఫ్రెండ్ కలిసి దిగిన సెల్ఫీకి తగిన క్యాప్షన్లు(Selfie With Boyfriend Captions)
- నువ్వు + నేను = (హార్ట్ ఎమోజీ)
- పీకల్లోతు ప్రేమలో మునిగిపోయా.
- నా జీవితంలోకి నవవసంతం నీ రూపంలో వచ్చింది.
- నేను అనుకున్నదానికంటే నువ్వు నన్ను మరీ ఎక్కువ చికాకు పెడుతున్నావు. అయినా నీ మీద నాకు ప్రేమ పెరుగుతోంది.
- చాలా అందంగా ఉన్నాడు కదా. ఈ పిల్లడు నా సొంతం. ఎవరైనా కన్నెత్తి చూశారో చంపేస్తా.
- నీ ప్రేమతో నా గుండెను కొల్లగొట్టావు.
- నా అందమైన భవిష్యత్తు నువ్వే.
- నువ్విచ్చిన సంతోషమే నా ముఖంపై చిరునవ్వుగా మారింది.
- కొన్నిసార్లు నిన్ను చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నువ్వింత క్యూట్‌గా ఎలా ఉంటావ్?
- ఎక్కువ ఆలోచించకు. నువ్వెలా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.
Giphy
భర్తతో కలసి తీసుకున్న సెల్ఫీకి.. తగిన క్యాప్షన్లు (Selfie With Husband Captions)
- నా మెదడు ప్రశాంతత కోరుకున్నప్పుడు నీ ఒడిలోకే నేను చేరతాను.
- నువ్వు భూమి అయితే.. నేను చందమామను. ఎందుకంటే చందమామ ఎప్పుడూ భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుందిగా.
- నీ అల్లరి, ఆనందం నావే. నీ బాధ, కోపం నావే. అసలు నేనే నువ్వైనప్పుడు నీవన్నీ నావి కావా?
- ఇలా నా చేతిని ప్రేమగా పట్టుకుంటే చాలు. ఎంత దూరమైనా నేను వచ్చేస్తా.
- మనిద్దరి శరీరాలు వేరు కావచ్చు. కానీ ఆత్మ మాత్రం ఒక్కటే.
- నిజమైన ప్రేమకు ఆరంభమే కానీ.. అంతం ఉండదు.
- ప్రేమ, సహనం ఉన్న చోట సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. వాటితోనే నువ్వు నా మనసును గెలుచుకున్నావు.
- నా జీవితంలో ఎన్నో సంతోషాలు నీతోనే మొదలయ్యాయి
- నీతో కలిసి జీవిస్తున్నప్పటికీ.. నిన్ను చూసిన ప్రతిసారి నా శరీరంపై సీతాకోకచిలుకలు వాలినట్లుగా అనిపిస్తూ ఉంటుంది.
- చిరునవ్వు ప్రపంచాన్ని మార్చేస్తుందంటారు. అది నిజమో కాదో తెలియదు కానీ.. నీ చిరునవ్వు మాత్రం నా జీవితాన్ని రంగుల హరివిల్లుగా మార్చేసింది.
ప్రేమ మాధుర్యాన్ని అందంగా వివరించే 40 కొటేషన్లు
క్యూట్ సెల్ఫీ క్యాప్షన్స్ (Cute Selfie Captions)
- మన నవ్వే మన జీవితాన్ని అందంగా మార్చేస్తుంది.
- అందమైన జీవితం పొందాలంటే.. ఎవరినీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.
- నన్ను క్వీన్‌లా చూసేవారికే.. నా జీవితంలో చోటు ఉంటుంది.
- నేను సెల్ఫీలో అందంగా నవ్వనని ఎవరు చెప్పారు?
- ప్రపంచాన్ని చూసి అందమైన చిరునవ్వు నవ్వితే.. అది కూడా మనకు నవ్వులనే పంచుతుంది.
- నవ్వుతా.. నవ్వుతూనే ఉంటా..
- ఎప్పుడూ ఆనందంగా ఉండాల్సిందే.. దానిని మించిన స్టైల్ మరొకటి లేదు.
- వేసవిలో ఎండలా కనిపిస్తున్నా.. తొలకరి జల్లులాంటి మనసు నా(ఆమె) సొంతం.
- ఎవరైనా సరే.. ఒక్క క్షణం ఆగి నిన్ను చూడాల్సిందే.
- కొంచెం కారంగా.. కొంచెం తియ్యంగా..
Giphy
విభిన్నమైన సెల్ఫీ క్యాప్షన్స్(Unique Selfie Captions)
- నువ్వు ఏది కోరుకుంటే.. అదే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
- అంతా చాలా బాగున్నట్టు నేను నడుస్తున్నాను. కానీ.. నా చెప్పులో ఉన్న రాయి నన్ను బాగా ఇబ్బంది పెడుతోంది.
- తెలివితేటలు పెంచుకోవాలంటే.. ముందు పిచ్చి పనులు చేయాలి కదా.
- అందం కళ్లను ఆకర్షిస్తుంది. వ్యక్తిత్వం మనసుని ఆకర్షిస్తుంది.
- నా సెల్ఫీపై నాకు నమ్మకం చాలా ఎక్కువ.
- మీ అందమైన అనుభవాలతో మీరు ప్రేమలో పడండి.
- మన జీవితం చాలా చిన్నది. విలువైనది. అందుకే ప్రతిక్షణం సంతోషంగా గడపండి.
- చిన్న చిరునవ్వు ఎంతటి కష్టాన్నైనా అధిగమించే బలాన్నిస్తుంది.
- నేను ఏ విషయంలోనూ పర్ఫెక్ట్ కాదు. అయినా నేను హ్యాపీగానే ఉన్నా.
- సెల్ఫీ పర్ఫెక్ట్‌గా తీసుకోలేకపోవచ్చు. కానీ బ్యాగ్రౌండ్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఉంది.
మిర్రర్ సెల్ఫీ క్యాప్షన్లు (Mirror Selfie Captions)
- ఇతరులను మెప్పించడానికి నేను రెడీ అవ్వను. అద్దం ముందు నడుస్తున్నప్పుడు నన్ను నేను చూసుకోవడానికి మేకప్ అవుతా.
- అద్దం కనిపిస్తే చాలు.. ఎంతటి వారైనా సరే ఆగిపోవాల్సిందే.
- మనందరం అద్దాల వంటి వాళ్లమే. ఇతరుల్లో మనమేం చూస్తున్నామో.. అదే మనం.
- మీ జీవితాన్ని మార్చేసే వ్యక్తి కోసం వెతుకుతున్నారా? అద్దంలో ఒకసారి చూడండి. ఆ వ్యక్తి కచ్చితంగా దొరుకుతారు.
- అద్దం ఎప్పుడూ నిజమే చెబుతుంది. దానికి అబద్ధం చెప్పడం రాదు.
- అద్దం: నువ్వు చాలా అందంగా ఉన్నావు. సెల్ఫీ : LOL. అది అబద్ధం చెబుతోంది డ్యూడ్.
- నువ్వు ఎలా ఉన్నావో.. నీ అద్దం కంటే బాగా ఎవ్వరూ చెప్పలేరు.
- ప్రతి రోజూ అద్దంలో మిమ్మల్ని మీరు చూసి నవ్వుకోండి. మీకు తెలియకుండానే మీలో మార్పు మొదలువుతుంది.
- అద్దాల ప్రపంచంలో నాలాగే ఉన్న మరొకరిని చూసి కళ్లు తిప్పుకోలేకపోతున్నా.
- అద్దంలోకి చూస్తున్నప్పుడు నాలోని నిజాన్ని నేను చూసుకుంటా.
Giphy
క్లుప్తంగా ఉండే సెల్ఫీ క్యాప్షన్లు (Short Captions For Selfie)
- బెస్ట్ సెల్ఫీ ఎవర్
- నేను, నా సెల్ఫీ, సెల్ఫీలో నేను.
- ఎవరు చెప్పారు నేను ఏంజెల్ అని?
- ధైర్యం లేకపోతే.. జీవితమే లేదు.
- ఎవరూ నూరు శాతం పరిపూర్ణులు కాదు.
- నేను బద్ధకస్తురాలిని కాదు. విశ్రాంతి తీసుకుంటానంతే.
- యూనివర్సిటీ ఆఫ్ సెల్ఫీస్‌లో నేను గ్రాడ్యుయేషన్ చేశాను.
- నా దగ్గర సెల్ఫీ కంట్రోల్ ఉంటే బాగుండు.
- నా పనేదో నేను చూసుకుంటున్నా.
- హార్డర్, బెటర్, ఫాస్టర్, స్ట్రాంగర్.
Giphy
డీపీ క్యాప్షన్లు(Caption For DP)
- సముద్రంలో లక్షల సంఖ్యలో చేపలుండొచ్చు. కానీ జలకన్య మాత్రం ఒక్కరే.
- రూల్స్ బ్రేక్ చేసిన వారే చరిత్రను తిరగ రాస్తారు.
- ఎవరూ పర్ఫెక్ట్ కాదు. అందుకే పెన్సిల్‌తో పాటు ఎరేజర్ కూడా వాడతాం.
- జీవితం మసకగా మారిందనిపిస్తే.. మీ దృష్టిని సరిచేసుకోండి.
- రెస్ట్ ఆఫ్ మై లైఫ్‌ను బెస్ట్ ఆఫ్ మై లైఫ్‌గా మార్చేద్దామనుకుంటున్నా.
- ఎవరికీ అర్థం కాకుండా ఉండటమే మంచిది.
- ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేయండి. రేపనేది ఉంటుందో లేదో తెలీదు కదా.
- సంతోషంగా ఉండేవాళ్లే అందంగా ఉంటారు.
- కోపంగా ఉండొచ్చు. కానీ క్రూరంగా ఉండకూడదు.
- మీ ప్రభను తగ్గించే అవకాశం ఎవరికీ ఇవ్వొద్దు.
సెల్ఫీ క్యాప్షన్లుగా పాటలు (Captions From Movie Songs)
- అసలేం గుర్తుకు రాదు.. నా కన్నుల ముందు నువ్వు ఉండగా.. (అదే ఫోన్)
- అటు నువ్వే ఇటు నువ్వే.. మనసెటు చూస్తే అటు నువ్వే.. ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోటా నువ్వే (ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలే తీసుకుంటున్నాంగా మరి)
- నన్ను చూపగల అద్దం..నువ్వు కాక మరి..ఎవరు అన్నది మనసే..
- నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం ఊగింది ఎదలో.. నవ్వాలో లేదో అనుకుంటూ లోలో సంతోషం దాగుంది తెరలో..
- ఈ మనసుది ఎగసిపడే అలల గుణం.. ఇది నిజం నిజం నిలవదే క్షణం.. ఇక నిరంతరం మనసుతో మనం
- ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను.. రెండూ రెండేగా ఉన్నాయంట నా కన్నులూ
- ఆనందమా.. ఆరాటమా.. ఆలోచనా ఏవిటో పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
- ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి.. నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా
- పువ్వుల నదిలో..అందంగా నడుచుకుంటుపోనా.. ఊహల రచనే.. తీయంగా చేసి తిరిగి రానా.. వెన్నెల పొడిమినీ.. చెంపలకి రాసి చూడనా..
- గుండెచాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ.. నిన్ను కలుసుకోనీ..
You Might Also Like