పంద్రాగస్టు సందర్భంగా అందరికీ విషెస్ చెప్పేద్దామిలా.. (Independence Day Quotes In Telugu)

పంద్రాగస్టు సందర్భంగా అందరికీ విషెస్ చెప్పేద్దామిలా.. (Independence Day Quotes In Telugu)

‘మేరా భారత్ మహాన్..’ – ఈ మాట వినగానే మన నరనరాల్లోనూ దేశభక్తి ఉప్పొంగడం ఖాయం. భారతీయులైన ప్రతిఒక్కరూ తల పైకెత్తి మరీ సగర్వంగా మనకు ఉన్న స్వేచ్ఛ, స్వతంత్రాల గురించి మాట్లాడుతూ ఉంటారు. కొన్ని వందల ఏళ్ల పాటు బ్రిటిష్ వారి బానిస సంకెళ్లలో నలిగిపోయిన భారతావనిని వారి కబంధ హస్తాల నుంచి విడిపించి స్వాతంత్య్రం దిశగా నడిపించేందుకు ఎందరో గొప్ప గొప్ప నాయకుల శ్రమ, త్యాగఫలమే కారణమని మనందరికీ తెలుసు.

అందుకే స్వాతంత్య్ర దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం లాంటి సందర్భాలను పురస్కరించుకొని.. ఆ రోజు  పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటాం. మన పంద్రాగస్టు.. అదేనండీ.. స్వాతంత్య్ర దినోత్సవం (Independence day) త్వరలోనే రానుంది. ఈ సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులకు పంపించదగిన శుభాకాంక్షలతో పాటు మన దేశనాయకులు చెప్పిన కొన్ని స్ఫూర్తివంతమైన వాక్యాలను (quotes) కూడా ఓసారి తలుచుకుంటూ మన భారతదేశ గొప్పదనాన్ని అందరికీ చాటుదామా..

Table of Contents

  స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.. (Independence Day Quotes In Telugu)

  సందర్భం ఏదైనా సరే.. ఈ రోజుల్లో ఒకరికొకరు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చెప్పుకోదగిన కొన్ని శుభాకాంక్షలు సందేశాలు మీ కోసం..

  - మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

  - అన్ని దేశాల్లోకెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులు వేస్తూ.. జరుపుకుందాం.. ఈ స్వాతంత్య్ర వేడుకను కన్నులపండువగా.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

  - ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపర నీ జాతి నిండు గౌరవము.. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

  - సిరులు పొంగిన జీవగడ్డై.. పాలు పారిన భాగ్యసీమై.. రాలినది ఈ భారతఖండం… భక్తితో పాడరా సోదరా.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

  - భారత సంస్కృతి శోభాయమానం.. భారతదేశం మంచికి నివాసం.. శాంతి మన సందేశం.. సహనమే సంస్కారం.. అహింసా పథమే మన మార్గం.. త్యాగధనుల త్యాగంతో సూర్యునిగా వెలుగొందుతున్న దేశం.. మన భారతదేశం.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  - వందేమాతరం.. వందేమాతరం.. భారతీయతే మా నినాదం.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  - అమరం మా స్వాతంత్య్ర సమరయోధుల జీవితం.. శాశ్వతం మా మువ్వన్నెల పతాకం.. చరితార్థం మా భారతావని భవితవ్యం.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  - సమరయోధుల పోరాట బలం.. అమర వీరుల త్యాగఫలం.. బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం.. మన స్వాతంత్య్ర దినోత్సవం.. సామ్రాజ్యవాద సంకెళ్లు తెంచుకుని.. భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు.. మిత్రులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  - భారతీయతని బాధ్యతగా ఇచ్చింది నిన్నటి తరం.. భారతీయతని బలంగా మార్చుకుంది నేటి తరం.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  - నేటి మన ఈ స్వాతంత్య్ర సంబరం.. ఎందరో వీరుల త్యాగఫలం.. భరతమాత దాస్య శృంఖలాలకు విమోచనం ఈ శుభదినం.. అమరవీరుల త్యాగఫలాన్ని అనుభవిస్తూ వారి ఆత్మశాంతి కోసం నివాళి అర్పించే దినం.. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  Shutterstock

  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పంపించదగిన సందేశాలు (Independence Day Messages)

  సాధారణంగానే ఉదయం, సాయంత్రం.. మనకు కావాల్సినవారు గుర్తొచ్చినప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అంటూ సందేశాలు పంపిస్తూ ఉంటాం. మరి, దేశమే గర్వించదగిన ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనలోని దేశభక్తిని ఎదుటివారికి తెలియజేస్తూనే.. వారిలోనూ ఆ భక్తిని కలిగించాలి కదా.. అందుకే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులకు పంపదగిన సందేశాలు కొన్ని మీ కోసం..

  - తల్లీ భారతి వందనం.. నీ ఇల్లే మా నందనం.. మేమంతా నీ పిల్లలం.. నీ చల్లని ఒడిలో మల్లెలం.. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

  - బానిస బ్రతుకులకు విముక్తి చెపుతూ.. అమరవీరుల త్యాగానికి ప్రతీకగా ఏటా జరిపే సంబరం.. స్వాతంత్య్ర దినోత్సవం.

  - నేను భారతీయుడనైనందుకు గర్వపడుతున్నాను.. సదా నేను భరతమాతకు రుణపడి ఉంటాను.. వందేమాతరం.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  - అన్ని దేశాల్లోకెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా వడివడిగా అడుగులేస్తూ.. జరుపుకుందాం ఈ స్వాతంత్య్రపు పండగను మెండుగా.. కన్నులపండువగా.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  - అమరం మా స్వాతంత్య్ర సమరయోధుల జీవితం.. శాశ్వతం మా మువ్వన్నెల పతాకం.. చరితార్థం మా భారతావని భవితవ్యం.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  - మతం తలపక.. గతం తడవక.. ద్వేషం, రోషం.. సకలం మరచి.. స్వతంత్ర భారత జయ పతాకను అంతా మొక్కండి.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  - మన దేశం భారతదేశం.. సంస్కృతంలో భా అంటే ప్రకాశం, అమృతత్వం, వెలుగు, విజ్ఞానం, వివేకం అని అర్థం.. రతి అంటే ఆసక్తి, అనురక్తి అని అర్థం. అలాంటి వెలుగు నుందు వర్తించు ఆసక్తి గల జనులున్న దేశం కాబట్టి.. మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  - ఏదైనా ప్రయోజనం, లక్ష్యం కొరకు నిరంతరం కర్మాచరణ చేయడమే ఏకైక ఆదర్శంగా ఉండేది. అందుకే మన దేశాన్ని కర్మభూమి అని కూడా అంటారు. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  - గాంధీజీ కలలు కన్న సమాజం కోసం కృషి చేద్దాం అవిశ్రాంత పోరాటంతో.. నెహ్రూజీ నేర్పిన మానవతా విలువలను పాటిద్దాం మనం నిరంతరం.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  - మీరు చూపిన మార్గం మేమెప్పుడూ మరువలేదు. మీరు చేసిన త్యాగాలను మేమెప్పుడూ మరువలేదు. మన స్వాతంత్య్రం కోసం త్యాగం చేసిన ఎందరో మహానుభావులు.. వారందరికీ మా వందనాలు. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  Shutterstock

  దేశభక్తి కొటేషన్లు (Quotes on Patriotism)

  కొన్ని కొటేషన్లు చదవగానే మనలో ఎక్కడ లేని ఉత్సాహం, ప్రేరణ కలుగుతుంటుంది. అలాగే దేశభక్తికి సంబంధించిన కొన్ని వాక్యాలు చదువుతుంటే చాలు.. మన నరనరాల్లోనూ దేశభక్తి ఉప్పొంగడం ఖాయం. అలాంటి కొన్ని కోటేషన్లు మీ కోసం..

  - మాతృభూమి కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావులు.. వారందరికీ వందనాలు.

  - తెల్లవారికి ఎదురెళ్లి.. తూటాలకి గుండె చూపి.. ఉద్యమాల పోరులో బ్రతుకునంత బలి చేసి.. ఐక్యంగా అడుగులేసి.. ఆంగ్లేయుడి వెన్ను విరిచి.. భరతమాత సంకెళ్లు తెంచి.. బానిసత్వాన్ని విముక్తి గావించి.. స్వరాజ్యాన్ని సాధించిన వీరులను స్మరిస్తూ.. అనుసరిస్తూ పాడుదాం.. వందేమాతరం..

  - దేశభక్తి అంటే జేబుకి జెండాని అతికించుకోవడం కాదు.. మన దేశభక్తిని చూసి జేబు వెనకాల ఉన్న గుండె కూడా లబ్ డబ్.. లబ్ డబ్.. అని కాకుండా భారత్ మాతాకి జై.. భారత్ మాతాకి జై.. అని కొట్టుకోవాలి.

  - దేశభక్తి గుండెల్లో ఉండాలి.. చేతినిండా జెండాలతో కాదు.. నేలపై పడ్డ పతాకం కాలి కింద పడి నలగకుండా గుండెలకు హత్తుకోవడంలో ఉంటుంది నిజమైన దేశభక్తి.

  - దేశభక్తి అంటే జాతీయ జెండాకి సెల్యూట్ చేయడం, జైహింద్ అని నినదించడమే కాదు.. పక్కనున్న మనిషిని ప్రేమించడం.. సమాజం పట్ల, చట్టాల పట్ల బాధ్యతగా మెలగడం.. ప్రభుత్వం సూచించే నియమాలు పాటించడం.. ఎదుటివ్యక్తుల పట్ల గౌరవంగా ప్రవర్తించడం.

  - దేశభక్తి అంటే కేవలం మాతృదేశాన్ని ప్రేమించడం మాత్రమే కాదు.. తోటి మానవులకు సాయం అందించడం కూడా..

  - కుల మత భేదాలెన్నున్నా.. పేద ధనిక విచక్షణలెన్ని ఉన్నా.. నా దేశంలో జీవించేందుకు ఎంతో స్వేచ్ఛ ఉంది.. అందుకే నా దేశమంటే నాకు ఇష్టం..

  - మనుషులలో వేషభాషలు వేరైనా.. భావావేశాలు వేరైనా.. కులమతజాతులు వేరైనా.. నా భారతజాతి ఎప్పటికీ గొప్పదే..

  - నీ కోసం నీ దేశం ఏం చేస్తుందని అడగడం కాదు.. నీ దేశం కోసం నువ్వు ఏం చేస్తావో నిన్ను నువ్వు ప్రశ్నించుకో..

  - కేవలం మనం పలికే పదాల్లోనే కాదు.. మన గుండె నరాల్లోనూ దేశభక్తి ఉండాలి..

  Also Read : హ్యాపీ కుమార్తె దినం

  Shutterstock

  వాట్సాప్, ఫేస్‌బుక్ లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పెట్టుకోదగిన స్టేటస్‌లు (Independence Day Special Whatsapp and Facebook Quotes)

  ఈ రోజుల్లో  ఏదైనా సరే.. మన ఎమోషన్స్ ని మాత్రం వాట్సాప్, ఫేస్‌బుక్.. వంటి మాధ్యమాల ద్వారా వ్యక్తం చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఈ క్రమంలోనే పంద్రాగస్టు సందర్భంగా ఆయా మాధ్యమాల్లో పెట్టుకోదగిన కొన్ని స్టేటస్ మెసేజ్‌లు మీ కోసం..

  - నేటితరం అనే ఓ గొప్ప శక్తి తెలివితేటలనే ఆయుధంగా చేబూనాలని.. దుష్టశక్తులను సంహరించి విజయమనే శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటోంది నేటి భారత్..

  - సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు.. మన స్వాతంత్య్ర దినోత్సవం..

  - అమరం మా స్వాతంత్య్ర సమరయోధుల జీవితం.. శాశ్వతం మా మువ్వన్నెల పతాకం.. చరితార్థం మా భారతావని భవితవ్యం.. వందేమాతరం..

  - దేశం కోసం ప్రాణాలు సమర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ అలాంటి భరతమాత ముద్దుబిడ్డలందరికీ వందనములు..

  - భారతదేశానికి స్వాతంత్య్రాన్ని అందించేందుకు క్రుషి చేసి తమ జీవితాలను అర్పించిన మహానుభావులందరికీ వందనములు.

  జాతీయ నాయకులు చెప్పిన కోట్స్ (Quotes By National Leaders)

  తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భారతదేశ స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం పోరాడిన కొందరు జాతీయ నాయకులు చెప్పిన కోట్స్ కూడా మనలో దేశభక్తిని తట్టి లేపుతాయి. అలాంటి కొన్ని కోట్స్ మీ కోసం..

  - దేశం అభివ్రుద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగు గోడలు కాదు.. పౌరుల నైతికాభివ్రుద్ధే నిజమైన అభివ్రుద్ధి – మహాత్మా గాంధీ

  - దేశం కోసం చనిపోయినవారు ఎల్లకాలం బ్రతికే ఉంటారు.. – భగత్ సింగ్

  - మన దేశం యొక్క స్వాతంత్ర్యాన్ని రక్షించడం కేవలం సైనికుల పని మాత్రమే కాదు.. ఇది మొత్తం దేశం యొక్క కర్తవ్యం.. – లాల్ బహుదూర్ శాస్త్రి

  - భారతమాత సేవలో వినయం, శీలం లేని విద్యావంతుడు మ్రుగం కన్నా ప్రమాదకరం.. – డా బి.ఆర్.అంబేడ్కర్

  - మేము ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు శాంతి మరియు శాంతియుత అభివ్రుద్ధిని నమ్ముతున్నాము.. – లాల్ బహదూర్ శాస్త్రి

  - అన్నింటినీ మించిన నేరం.. అన్యాయం, అక్రమంతో రాజీపడడమే.. – నేతాజీ సుభాష్ చంద్రబోస్

  - తల్లులు అందించే స్ఫూర్తి, వారి ప్రేమ, త్యాగాలపైనే దేశ గొప్పదనం కూడా ఆధారపడి ఉంటుంది.. – సరోజినీ నాయుడు

  - ఒక వ్యక్తి చనిపోవచ్చు.. కానీ అతడు చేసిన ఆలోచన మాత్రం మరణించదు. అతని మరణం తర్వాత వేల మంది జీవితాల్లో అది భాగమవుతుంది.. – నేతాజీ సుభాష్ చంద్రబోస్

  - మనం కోరుకున్న లక్ష్యం చేరుకోవాలంటే కేవలం లక్ష్యం మాత్రమే కాదు.. దానిని చేరుకోవడానికి ఎంచుకున్న మార్గం కూడా సరైనదై ఉండాల్సిందే.. – డా. రాజేంద్ర ప్రసాద్

  - తప్పులు చేసి సరిదిద్దుకునే స్వేచ్ఛ లేకపోతే స్వేచ్ఛ ఉన్నా దానికి ఏ మాత్రం అర్థం ఉండదు.. – కస్తూర్బా గాంధీ

  - మనిషి శీల ప్రవర్తనలను తీర్చిదిద్దలేని విద్య విలువ లేనిది.. – మహాత్మా గాంధీ

  - ఎక్కువ, తక్కువలు కులమత భేదాలు ఉండడం మానవజాతికి అవమానకరం – మహాత్మా గాంధీ

  - మార్పుకు సిద్ధంగా ఉండండి.. అప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలరు.. – మహాత్మా గాంధీ

  - ఆలోచనల్లో నిజాయతీ, వాక్కులో ధైర్యం, చేతల్లో నిబద్ధత ఉన్నవారే మనకు అవసరం.. – సరోజినీ నాయుడు

  - లక్ష్యాన్ని సాధించలేని జ్నానం నిరుపయోగమైంది.. – జవహర్ లాల్ నెహ్రూ

  Wikipedia

  స్వాతంత్య్ర సమరయోధులు పలికిన స్ఫూర్తిమంతమైన వాక్యాలు (Inspirational Quotes By Freedom Fighters)

  మన స్వాతంత్య్ర సమరయోధులు పలికిన వాక్యాలు కూడా మనలో స్ఫూర్తిని నింపడంతో పాటు, మనలోని దేశభక్తిని రగిలిస్తాయి. అలాంటి వాక్యాలు కొన్ని మీ కోసం..

  - జ్నానం వల్ల మాత్రమే మన ఉనికిని ఊహించగలం.. – జవహర్ లాల్ నెహ్రూ

  - కష్టాలు, విమర్శలు, వ్యతిరేకత.. మనం వాటిని అధిగమించేందుకే వస్తాయి. వాటిని ఎదుర్కొని విజేతలుగా నిలవడంలో ఓ ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. ఎక్కడైతే ప్రశంసలు మాత్రమే లభిస్తాయో అక్కడ జీవితం కొన్ని రోజుల తర్వాత అందాన్ని కోల్పోతుంది.. – విజయలక్ష్మీ పండిట్

  - ఒక దేశ స్థితి గురించి చెప్పాలంటే ఆ దేశంలోని స్త్రీల పరిస్థితి ఆధారంగా చేసుకొని చెప్పచ్చు.. – జవహర్ లాల్ నెహ్రూ

  - పని చేయడానికి ఆసక్తి లేకపోతే దాని గురించి ఆలోచించడం కూడా వ్యర్థమే.. అందుకే అలాంటప్పుడు నిశ్శబ్దంగా ఉండడం మంచిది.. – అనిబిసెంట్

  - నేను స్వేచ్ఛను, స్వేచ్ఛాయుతమైన అభివ్రుద్ధిని కోరుకుంటున్నా. కేవం నా దేశానికి మాత్రమే కాదు.. ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కోసం కోరుకుంటున్నా.. – లాల్ బహదూర్ శాస్త్రి

  - గర్వపడాల్సింది ధనవంతుడైనప్పుడు కాదు.. ఆ డబ్బు పేదలకు ఉపయోగపడినప్పుడు.. – జవహర్ లాల్ నెహ్రూ

  - స్వరాజ్యం నా జన్మహక్కు.. దాన్ని నేను సాధించి తీరతాను.. – బాలగంగాధర్ తిలక్

  - జీవితాన్ని ప్రేమిస్తాం.. మరణాన్ని ప్రేమిస్తాం.. మేం మరణించి ఎర్రపూల వనంలో ఉరి కంబాన్ని ఎగతాళి చేస్తాం. నిప్పు రవ్వల మీద నిదురిస్తాం.. – భగత్ సింగ్

  - బాంబులు మరియు తుపాకులు విప్లవం చేయవు.. విప్లవం అనే కత్తికి మీ ఆలోచనలతో పదును పెట్టండి.. భగత్ సింగ్

  - మనుషులను చంపగలరేమో కానీ వారి ఆదర్శాలను మాత్రం కాదు.. – భగత్ సింగ్

  Wikipedia

  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాడుకునే కొన్ని ప్రత్యేక గీతాలు.. (Songs For Independence Day)

  ఏటా ఎంతో ఘనంగా జరుపుకునే స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొన్ని గీతాలను ప్రత్యేకంగా ఆలపిస్తూ ఉంటాం. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీల్లో జరుపుకునే వేడుకల్లో కొన్ని గీతాలను పాడుతుంటారు. అలాంటి కొన్ని గీతాలు మీ కోసం..

  - వందేమాతరం.. బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతాన్ని రోజూ పాఠశాలల్లో ఆలపించడం సహజమే. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా ఈ గీతాన్ని వేడుకలు నిర్వహించిన ప్రతి ప్రదేశంలోనూ ఆలపిస్తారు.

  - శంకరంబాడి సుందరాచారి రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ.. గీతాన్ని కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆలపిస్తారు.

  - కొన్ని పాఠశాలలు, కళాశాలల్లో మహ్మద్ ఇక్బాల్ రచించిన సారే జహసే అచ్చా.. గీతాన్ని కూడా ఆలపిస్తారు.

  - దేశమును ప్రేమించుమన్నా.. మంచి అన్నది పెంచుమన్నా.. అంటూ సాగే దేశభక్తి గీతాన్ని కూడా ఈ వేడుకల్లో భాగంగా ఆలపిస్తుంటారు.

  - జయ జయ ప్రియ భారత జనయిత్రి,. దివ్యధాత్రి.. అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటి చెప్పే పాటను కూడా పాఠశాలల్లో విద్యార్థులు ఆలపించడం మనం గమనించవచ్చు.

  - ఇవి మాత్రమే కాదు.. కొన్ని సినీగీతాలు సైతం మనలోని దేశభక్తిని తట్టి లేపుతాయి. వాటిలో రోజా చిత్రంలోని వినరా వినరా దేశం మనదేరా.. అంటూ సాగే గీతం వింటుంటేనే నరనరాల్లోనూ దేశభక్తి ఉప్పొంగుతుంది. ఏ.ఆర్.రెహమాన్ స్వరపరిచిన ఈ గీతాన్ని మనో ఆలపించారు.

  - ఖడ్గం సినిమాలో మనకు వినిపించే మేమే ఇండియన్ప్.. మేమే ఇండియన్స్.. అనే పాటలో కూడా మన దేశ గొప్పతనం, భిన్నత్వంలో ఏకత్వం.. వంటివి మనకు స్పష్టంగా వినిపిస్తాయి.

  - అలాగే జై సినిమాలో వినిపించే దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే.. అంటూ సాగే పాట విన్నప్పుడు కూడా మనలో దేశభక్తి తొణికిసలాడుతుంది.

  - స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన బొబ్బిలిపులి చిత్రంలోని మనకు వినిపించే జననీ జన్మభూమిశ్చ అనే పాట కూడా ఈ కోవకు చెందినదే. అలాగే మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నా దేశం నమో నమామి.. అనే పాట కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నదే.

  - మహేష్ బాబు నటించిన బాబీ చిత్రంలోని ఈ జెండా పసిబోసి.. అనే పాట.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి చిత్రంలోని ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. అనే పాట.. ఝుమ్మంది నాదం చిత్రంలోని దేశమంటే.. అనే పాట.. మొదలైనవన్నీ మన దేశ గొప్పదనాన్ని ఎలుగెత్తి చాటావే.

  Shutterstock