1 ఆగస్టు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

1 ఆగస్టు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 1, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం


మేషం (Aries) – ఈ రోజు మీరు బిజినెస్‌లో దూసుకుపోతారు. మీ స్నేహితుల్లో ఒకరు మీ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు సత్తా చాటేందుకు.. ఇదే సరైన సమయం. కొంచెం కష్టపడితే.. విజయం మిమ్మల్నే వరిస్తుంది. అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్‌లోని వ్యక్తులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. అయితే అందివచ్చిన అవకాశాలను ఎలా వినియోగించుకోవాలన్నది.. మీ వివేకం మీద ఆధారపడి ఉంటుంది. 


వృషభం (Tarus) – ఈ రోజు ఇంజనీర్లకు, సాంకేతిక నిపుణులకు బాాగా కలిసొస్తుంది. మీ ఐడియాలు మీకు ఊహించని అవకాశాలను అందివచ్చేలా చేస్తాయి. ఉద్యోగులు తొలుత మూడీగా పనిని ప్రారంభించినా.. తర్వాత ఆఫీసులో బాస్‌ను సైతం ఇంప్రెస్ చేస్తారు. కితాబులు కూడా అందుకుంటారు. వ్యాపారస్తులు ఎంత బిజీగా ఉన్నా.. కాస్త అప్పుడప్పుడు కుటుంబం కోసం కూడా సమయం కేటాయించడం మంచిది.  


మిథునం (Gemini) –  ఈ రోజు మహిళలకు పండగే. షాపింగ్ కోసం అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోరు. ఇక వ్యాపారస్తులకు కాస్త గడ్డుకాలం. మీ భాగస్వాములు సహకరించకపోవడం వల్ల ప్రాజెక్టులో అయోమయ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగులు డబ్బులున్నాయి కదా అని.. అధికంగా ఖర్చు చేసి.. తర్వాత బాధపడితే ప్రయోజనం లేదు. అలాగే డబ్బులు తిరిగిచ్చే ఉద్దేశం లేని వ్యక్తులకు.. మరల మరల అప్పులు ఇవ్వడం శ్రేయస్కరం కాదని తెలుసుకోండి. 


కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. ఆఫీసులో ప్రమోషన్ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులు ఇంకాస్త శ్రద్ధగా పనిచేయడం వల్ల మంచి రిటర్న్స్ వస్తాయి. ముఖ్యంగా బాధ్యతలన్నీ ఇతరులకే వదిలేయడం శ్రేయస్కరం కాదు. విద్యార్థులు కాస్త యాక్టివ్‌గా పనిచేయాలి. క్రీడలతో పాటు.. చదువుకి కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలి. 


మన రాశిని బట్టి బలాలు, బలహీనతలు ఇట్టే తెలుసుకోవచ్చట. అవేంటో చూసేద్దామా..!


సింహం (Leo) – ఈ రోజు ప్రేమికులకు కొత్త అనుభవాలు ఎదురవుతాయి. ముఖ్యంగా నూతన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు నూటికి పదిసార్లు ఆలోచించండి. వివాహితులకు ఆర్థికపరమైన ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకు తమ మీద నమ్మకం సన్నగిల్లినా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. కష్టపడకుండా ఫలితం సిద్ధించదనే విషయాన్ని నమ్మాలి. ఉద్యోగస్తులు ఆఫీస్ పాలిటిక్స్‌లో తలదూర్చకుండా ఉంటే బెటర్. 


క‌న్య (Virgo) – ఈ రోజు తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెట్టడం మంచిది. ముఖ్యంగా చంటిపిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాహితులు పొదుపు సూత్రాలు పాటిస్తే బెటర్. అనవసర ఖర్చులను తగ్గించుకుంటే ఇంకా మంచిది. అలాగే స్వార్థ ప్రయోజనాల కోసం దేవుడిని వేడుకోకండి. మీ నిజాయతీ, మీ మంచితనమే మిమ్మల్ని కాపాడతాయని, మీ సమస్యలను తీరుస్తాయని నమ్మండి.  అప్పుడే మీ ప్రార్థనలకు తగిన బలం చేకూరుతుంది. 


తుల (Libra) – ఈ రోజు క్రియేటీవ్ ఫీల్డ్‌లో పనిచేస్తున్న వ్యక్తులకు.. ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ఊహించని ఆఫర్స్ సైతం మీ తలుపు తడతాయి. అలాగే వివాహితులకు ఈ రోజు రొమాంటిక్‌గా సాగుతుంది. మీ భాగస్వామితో కలిసి హాయిగా ఎంజాయ్ చేయండి. ఉద్యోగస్తులు కాస్త స్మార్ట్‌గా పనిచేయడానికి ప్రయత్నించండి. హార్డ్ వర్క్ కన్నా.. కొన్ని విషయాల్లో స్మార్ట్ వర్క్ ఫలితాలను తీసుకొస్తుందని నమ్మండి. 


వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబంలో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరి మనసును కష్టపెట్టకుండా.. నిజాయతీగా వ్యవహరించాలి. అలాగే వ్యాపారస్తులు పార్ట్‌నర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అక్కరకు రాని స్నేహాలు.. వ్యాపారాల్లో చెల్లవని గుర్తుపెట్టుకోవాలి. ఆఫీసులో ఉద్యోగులు డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఉండాలి. మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించే వారిని పట్టించుకోకుండా ఉంటే బెటర్. మీరు నిజాయతీగా ఉన్నంత కాలం.. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని గుర్తుంచుకోండి. 


ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం


ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కాస్త ఓపిగ్గా పనిచేయాల్సి ఉంటుంది. ఆఫీసులో బాస్ నుండి నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినా.. మీరు మాత్రం పాజిటివ్‌గానే తీసుకోండి. ఆ సానుకూల ఆలోచనలే మిమ్మల్ని కాపాడతాయి. మీ కెరీర్‌‌కు ప్లస్ కూడా అవుతాయి. అలాగే బిజినెస్ చేసేవారికి ఈ రోజు గడ్డుకాలం.  కష్టపడి పనిచేసినప్పటికీ, ఆశించిన ఫలితాలు రాకుండా ఉండే అవకాశం ఉంది. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. అనుభవాలు విలువైన పాఠాలు నేర్పాయని భావించండి. 


మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తుల కదలికలన్నీ కూడా డ్రీమ్స్ చుట్టూ తిరుగుతాయి. వివాహితులు స్థిర నివాసం ఏర్పరచుకొనే ప్రయత్నాల్లో ఉంటారు. ఉద్యోగులు తమకు నచ్చిన కెరీర్‌కు షిఫ్ట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. వ్యాపారస్తులు తమ డ్రీమ్ ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. పెళ్లికాని అమ్మాయిలకు.. తమ కలల రాకుమారుడు పరిచయమయ్యే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ.. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. 


ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి


కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులను నిర్లక్ష్యం, బద్దకం, అతి విశ్వాసం లాంటివి పట్టి పీడించే అవకాశం ఉంది. కనుక మీలో మీరే ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని వాటికి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల వద్ద, కొత్త బాధ్యతలు స్వీకరించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాన్ఫిడెన్స్ మంచిదే.. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది. కనుక తస్మాత్ జాగ్రత్త సుమా


మీనం (Pisces) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పాజిటివిటీకి దగ్గరలో ఉంటారు. ముఖ్యంగా కోర్టు వ్యవహరాలు, ఆస్తి తగాదాలు లాంటి సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. మీ మంచితనం, నిజాయతీ మీకు ఊహించని ఆఫర్స్ తీసుకొస్తాయి. వ్యాపారస్తులకు వృత్తిపరమైన భాగస్వామ్యం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఏజెంట్లు, భాగస్వాములు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. 


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు


అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.