సెక్షన్ 377 కు వ్యతిరేకంగా పోరాడారు.. ఇప్పుడు జంటగా మారారు..!

సెక్షన్ 377 కు వ్యతిరేకంగా పోరాడారు.. ఇప్పుడు జంటగా మారారు..!

ఐపీసీ సెక్షన్ 377 .. స్వలింగ సంపర్కం నేరమని చెప్పే చట్టం. అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడడం మాత్రమే కాదు... దానిని రద్దు చేయడం కోసం అహర్నిశలు శ్రమించిన న్యాయవాదుల జంట (lawyers) మేనకా గురుస్వామి, అరుంధతీ కట్జూ. ఇప్పుడు ఆ జంట సహజీవనం చేయనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రెండు రోజుల క్రితమే ఈ వార్తను బహిర్గతం చేశారు.  ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరు ఈ విషయాన్ని తెలిపారు. సెక్షన్ 377 కు వ్యతిరేకంగా తాము వేసిన పిటీషన్ తమ వ్యక్తిగత నిర్ఱయమని కూడా తెలిపారు.

స్వలింగ బంధంలో ఉన్నా.. ఆ అమ్మాయినే పెళ్లాడి జీవితంలో స్థిరపడతా: ద్యుతీ చంద్

ప్రస్తుతం ఈ జంట తీసుకున్న నిర్ణయం పట్ల అనేకమంది అభినందనలు కురిపిస్తున్నారు. పలువురు విమర్శలు కూడా చేస్తున్నారు. చిత్రమేంటంటే.. ఈ సంవత్సరం టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచంలోనే 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో వీరిద్దరు కూడా చోటు దక్కించుకున్నారు. సెక్షన్ 377 కు నూట యాభై అయిదేళ్ల చరిత్ర ఉంది. అంత పాత చట్టాన్ని రద్దు చేయడం అంటే మాటలు కాదు. కానీ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నందున.. దానిని ఎట్టకేలకు రద్దు చేయాల్సి వచ్చింది. 

గణితంలో భారతీయుల సత్తాని ప్రపంచానికి చాటిన .. "హ్యూమ‌న్ కంప్యూట‌ర్" శ‌కుంత‌లా దేవి

మేనకా గురుస్వామి సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్. ఈమె నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా నుండి బీఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు. అలాగే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి ప్రతిష్టాత్మక రోడ్స్ స్కాలర్ షిప్ కూడా పొందారు. అదే యూనివర్సిటీ నుండి తర్వాత పీహెచ్‌డి కూడా పొందారు. ఇక అరుంధతీ కట్జూ కూడా సుప్రీంకోర్టులో అడ్వకేటుగా ఉన్నారు. తను కొలింబియా లా స్కూలు నుండి మాస్టర్స్ చేశారు. అలాగే ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీలో విద్యార్థులకు వైట్ కాలర్ క్రైమ్ లా బోధిస్తున్నారు. 

 

 

 

మేనకా గురుస్వామి, అరుంధతీ కట్జూలు తీసుకున్న నిర్ణయం.. వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది. వారిని ప్రముఖ సినీ నటి ప్రియాంక చోప్రా కూడా ఎంతగానో ప్రశంసించారు. "ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అరుంధతి, మేనకలు కలిసి ఎల్‌జీబీటీక్యూ హక్కుల కోసం పోరాడిన తీరు ప్రశంసనీయం. న్యాయం కోసం, ప్రగతి సిద్ధాంతాల కోసం వారు చట్టాన్నే ప్రశ్నించారు. దానిని రద్దు చేసేందుకు కష్టపడ్డారు. వారిని మనం అర్థం చేసుకోవాలి" అని తెలిపారు. 

రాజ్యాంగం కల్పించిన హక్కులు.. మహిళ స్వేచ్ఛగా అనుభవించేదెన్నడు?

ఐపీసీ సెక్షన్ 377 అనేది 1864లో బ్రిటీష్ ప్రభుత్వం చేత అమలులోకి తీసుకురాబడింది. 1533 బగ్గరీ యాక్టు ఆధారంగా ఇది రూపొందించబడింది. ఈ చట్టం ప్రకారం స్వలింగ సంపర్కం (హోమో సెక్సువాలిటీ) అనేది చట్టరీత్యా నేరం. ఇదే చట్టాన్ని 6 సెప్టెంబరు 2018 తేదిన సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే మైనర్లతో సెక్స్ చేయడం లేదా  ఇతరులను వారి ఇష్టం లేకుండా లైంగిక చర్యకు ప్రోద్బలించడాన్ని మాత్రం  నేరంగా పరిగణించవచ్చని మాత్రం కోర్టు తెలిపింది. 

ఈ క్రమంలో కోర్టు కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. సెక్షన్ 377 ను అమలు చేయడం అంటే.. ఆర్టికల్ 14 ప్రకారం భారత పౌరులు దక్కించుకున్న వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అని తెలిపింది. లైంగిక స్వభావం అనేది అంతర్గత విషయమని.. శరీర లక్షణాలు వ్యక్తిగతమైనవని.. వాటిని అణిచివేయాలని చూడడం వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని కోర్టు అభిప్రాయపడింది. తమకు నచ్చినవారితో లైంగిక చర్యలో పాల్గొనే ఎల్‌జీబీటీలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం తగదని తెలిపింది. అందరిలాగే ఎల్‌జీబీటీలకు లైంగిక హక్కులు ఉంటాయని.. వాటిని ప్రశ్నించే సెక్షన్ 377 అహేతుకమైనదని కోర్టు తెలియజేసింది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.