వర్షాకాలంలో మీ మొబైల్ ఫోన్ పాడవకుండా.. ఇలా కాపాడుకోండి.

వర్షాకాలంలో మీ మొబైల్ ఫోన్ పాడవకుండా.. ఇలా కాపాడుకోండి.
Products Mentioned
iStore

చూస్తుండగానే వేసవి ముగిసి వర్షాకాలం( rainy season) ప్రారంభమైంది. అడపాదడపా అప్పుడప్పుడూ వానలు పడుతూనే ఉన్నాయి. ఇంకొన్ని రోజులు పోతే వానలు ఎక్కువైపోతాయి. అందుకే ముందుగానే వానాకాలానికి సిద్ధమవుతూ రెయిన్ కోట్స్, గొడుగులు, వానల్లో తడిచినా పాడవని దుస్తులు, చెప్పులు వంటివి కొనుక్కునే ఉంటారు చాలామంది. అయితే వానాకాలం వస్తోందంటే అవసరమైనవి సిద్ధం చేసుకోవడం మాత్రమే కాదు.. ఆ కాలానికి మనం కూడా ముందుగానే సిద్ధమై ఉండాల్సిందే.

ఇందులో ముఖ్యంగా మన మొబైల్ ఫోన్‌ని (Mobile phone) జాగ్రత్తగా కాపాడుకోవాలి. మొబైల్ కాపాడుకోవడం ముఖ్యమే.. కానీ అది అందరివల్లా అయ్యే పని కాదు. చాలామంది బయట పని మీద వెళ్లినప్పుడు.. వర్షం పడితే అందులో తామూ తడుస్తారు. అలాంటప్పుడు వారితో పాటు వారి మొబైల్ కూడా తడిచిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే..

ఫోన్ ఎలా కాపాడుకోవాలంటే..

iStore
iStore Waterproof Underwater Pouch Bag Cover for Mobile Phone
INR 199 AT Amazon
Buy

1. ప్రస్తుతం అన్ని చోట్లా ఫోన్ల కోసం ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో ఉంటున్నాయి. వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని కొని మీ మొబైల్‌ని వాటిలో పెట్టుకోవడం మంచిది. మీకు ప్లాస్టిక్ బ్యాగ్‌ని ఉపయోగించడం ఇష్టం లేకపోతే మీ ఫోన్‌ని హ్యాండ్ బ్యాగ్‌లోనే ఉంచండి. అందులోంచి బయటకు తీయకండి. దీనివల్ల అందులోకి నీళ్లు పోయే అవకాశం చాలావరకూ తగ్గుతుంది.

2. వర్షం పడుతున్నప్పుడు ఫోన్ చేతిలో పట్టుకొని లేదా పాకెట్‌లో పెట్టుకొని ప్రయాణం చేయడం సరికాదు.

3. మీ ఫోన్ ఒకవేళ వానలో తడిచి పాడైనా.. ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండేలా మీ ఫోన్లోని ఫొటోలు, వీడియోలు, మెయిల్స్ వంటివన్నీ బ్యాకప్ చేసి పెట్టుకోవాలి. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఎదురై ఫోన్ పాడైనా.. మీ సమాచారం భద్రంగా ఉంటుంది.

4. సమాచారాన్ని వేరే ఎక్కడా కాకుండా.. గూగుల్ డ్రైవ్‌లోనే సేవ్ చేసుకోవడం వల్ల ఫోన్ పాడైనా.. ఆ తర్వాత మొబైల్ బాగుచేశాక సమాచారాన్ని ఫోన్లోకి సులువుగా తీసుకొచ్చే వీలుంటుంది.

5. వర్షం పడే సమయంలో అప్పుడప్పుడూ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. ఇలా జరిగే సమయంలో మీ ఫోన్‌ని ఛార్జింగ్ పెట్టకుండా ఉండడం మంచిది.

అనుకోకుండా వర్షం లో తడిస్తే..

Shutterstock

అప్పుడప్పుడూ అనుకోని విధంగా వాన పడుతుంటుంది. ఈ రోజు వర్షం రాదులే అంటూ గొడుగు తీసుకెళ్లకుండా ఉన్న రోజే.. వర్షం పడుతుంది. లేదా బైక్ డ్రైవ్ చేస్తుండగా వర్షం ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయాల్లో అనుకోకుండా ఫోన్ వానలో తడిచే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలో మీకు తెలుసా? మీ ఫోన్ అనుకోకుండా నీళ్లలో పడిపోయినప్పుడు కూడా ఈ చిట్కాలను ఉపయోగించవచ్చు.

1. మీ ఫోన్ లేదా మొబైల్ వర్షంలో తడవడం లేదా నీళ్లలో పడిపోవడం జరిగినప్పుడు ముందు వెంటనే దానిని స్విచ్ఛాఫ్ చేసేయండి.

2. నీళ్లలో నానిన ఫోన్ పనిచేస్తుందా? లేదా? అని చెక్ చేయాలనిపించడం సహజం. కానీ తడిగా ఉన్నప్పుడు అలా ఫోన్ మాట్లాడడం సరికాదు.

3. ఫోన్ నీళ్లలో నానినప్పుడు దాన్ని కాటన్ క్లాత్, టిష్యూ పేపర్.. వంటి వాటితో తుడవాలి. కేవలం బయటే కాదు.. ఫోన్ లోపల తుడిచే వీలుంటే.. ఆ పని కూడా చేయడం మంచిది.

4. ఫోన్ త్వరగా తడి ఆరిపోతుంది కదా.. అని చాలామంది హెయిర్ డ్రయ్యర్‌ని ఉపయోగిస్తుంటారు. ఇది మంచిది కాదు. హెయిర్ డ్రయ్యర్ వేడి ఫోన్‌ని పాడు చేస్తుంది. కావాలంటే ఫ్యాన్ కింద ఆరబెట్టండి.

Shutterstock

5. మీ మొబైల్ ఫోన్‌లో తడిదనం వేగంగా ఆరిపోవాలంటే.. దాన్ని కొంచెంసేపు బియ్యంలో  ఉంచండి. బియ్యం ఫోన్‌లోని తడినంతా పీల్చుకుంటుంది. దీని కోసం ఒక డబ్బాలో మీ ఫోన్ మునిగేలా.. కొంత బియ్యం తీసుకొని అందులో దానిని ఉంచితే సరిపోతుంది. 

6. ఇన్ని చేసినా.. ఫోన్ పూర్తిగా తడిదనం తగ్గుతుందన్న గ్యారంటీ లేదు. కాబట్టి రెండు మూడు రోజుల వరకూ మరీ అవసరం ఉంటే తప్ప ఫోన్ ఆన్ చేయకండి. అవసరం పూర్తవ్వగానే స్విచ్ఛాఫ్ చేయండి. కావాలంటే అప్పటివరకూ వేరే ఫోన్ ఉపయోగించడం మంచిది.

7. ఇదంతా ఎందుకు అనుకుంటే.. ఫోన్ రిపేర్ చేసే నిపుణుల వద్దకు మీ మొబైల్‌ను తీసుకెళ్లండి. దాని లోపల ఎలాంటి డ్యామేజ్ జరగలేదని తెలుసుకొన్నాక.. మరల దానిని తిరిగి ఉపయోగించడం ప్రారంభించవచ్చు.

ఇవి కూడా చదవండి.

వాట్సాప్ వల్ల మీ ఫోన్ హ్యాక్ కాకుండా.. ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసా?పబ్లిక్ టాయిలెట్ వాడేముందు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా?వాట్సాప్ సంభాషణలు.. స్క్రీన్ షాట్ తీసుకోవడం అలవాటా? అయితే ఇకపై కష్టమే ..!