వాట్సాప్ సంభాషణలు.. స్క్రీన్ షాట్ తీసుకోవడం అలవాటా? అయితే ఇకపై కష్టమే ..!

వాట్సాప్ సంభాషణలు.. స్క్రీన్ షాట్ తీసుకోవడం అలవాటా? అయితే ఇకపై కష్టమే ..!

టెక్నాలజీ పెరిగి మనకి మరింత సౌకర్యాన్ని అందించింది. అందులోనూ మొబైల్ అయితే మరీనూ. అన్నిరకాల సేవలను యాప్‌ల ద్వారా మన చేతి వేళ్ల దగ్గరికే తీసుకొచ్చేసింది. అయితే టెక్నాలజీ పెరిగిన కొద్దీ మన వ్యక్తిగత సమాచారానికి భద్రత కూడా తగ్గుతూ వస్తుందన్నది మాత్రం నిజమే.


మొబైల్‌లో ఎక్కువ మంది ఉపయోగించే యాప్ ఏది అంటే వాట్సాప్ (Whats app) అనే చాలామంది సమాధానం ఇస్తారు. అంతగా ఈ యాప్ మనందరితో పెనవేసుకుపోయింది. అయితే వాట్సాప్ తాజాగా అందించిన అప్ డేట్‌తో.. ఈ యాప్‌ను నిత్యం ఉపయోగించేవాళ్లకు కాస్త కష్టమే అని చెప్పుకోవాలి. ఎందుకంటారా? తెలుసుకుందాం రండి..


11325204 1602218590035048 230702838 n


source : Instagram


ఫోన్‌లో ఉన్న అత్యద్భుతమైన ఆప్షన్లలో నాకు నచ్చేది స్క్రీన్ షాట్ (Screenshot). నేను, నా బాయ్ ఫ్రెండ్ వాట్సాప్‌లోనో.. స్నాప్ చాట్‌లోనో చాటింగ్ చేస్తూ గొడవ పెట్టుకుంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసి నా బెస్ట్ ఫ్రెండ్‌కి పంపడం.. అందులో తప్పెవరిది అని అడగడం.. ఆ తర్వాత నేను చేయాల్సిన పని గురించి ఇద్దరం చర్చించడం మాకు సాధారణంగా జరుగుతూనే ఉంటుంది.


ఇదొక్కటే కాదు..పవర్ కీ, వాల్యూమ్ కీ కలిపి నొక్కితే వచ్చే ఈ స్క్రీన్ షాట్ నా జీవితంలో ఎన్నో పనులు చేసి పెడుతుంది. ఎవరిదైనా ఇన్ స్టాగ్రామ్ స్టోరీ నచ్చినా.. మంచి మోటివేషనల్ కోట్ కనిపించినా, ఎక్కడికైనా వెళ్లేందుకు చక్కటి డ్రస్ సెలెక్ట్ చేస్తున్నా.. ఇలా చాలా పనులకి స్క్రీన్ షాట్‌ని నేను ఉపయోగిస్తుంటా. నేనొక్కదాన్నే కాదు.. మనలో చాలామంది దీన్ని ఇష్టపడడం సహజం. కానీ వాట్సాప్‌లో కొత్తగా వచ్చిన అప్ డేట్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవడాన్ని నిషేధిస్తుందట. కేవలం స్క్రీన్ షాట్ తీయడం మాత్రమే కాదు.. దీనిని పంపడానికి కూడా వీలుండదట.


ప్రతి యాప్‌ని రోజురోజుకీ ఇంకా మెరుగ్గా, సురక్షితంగా చేసేందుకు ఆ యాప్ తయారీదారులు ప్రయత్నిస్తారన్న విషయం మనకు తెలిసిందే. అలా వాట్సాప్‌ని మరింత సురక్షితంగా మార్చే ప్రయత్నంలో భాగంగానే ఈ మార్పును చేశారట. దీనిలో భాగంగా యూజర్లు తమ చాట్‌ని స్క్రీన్ షాట్ తీసుకోవడం లేదా..  దాన్ని షేర్ చేయడం కానీ చేయలేరు. దీనిని మీ ప్రైవసీకి భంగం కలిగించే విషయంగా భావించి.. వాట్సాప్ ఈ స్క్రీన్ షాట్లను బ్లాక్ చేసింది. దీనివల్ల మీ ఫోన్ స్క్రీన్ షాట్లను ఎవరూ తీసుకొని తమ మొబైల్‌కి పంపించుకునే వీలు ఉండదు.


AUTH NO SCREENSHOTS


Source : Whatsapp beta info


ఇదొక్కటే కాదు.. ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేస్తోంది వాట్సాప్ సంస్థ. దీన్ని ఆన్ చేస్తే.. వాట్సాప్ తెరవాలంటే తప్పనిసరిగా మీ వేలి ముద్ర ఉండాల్సిందే. అయితే ప్రతి మెసేజ్‌కి రిప్లై ఇవ్వడానికి ఫింగర్ ప్రింట్ పెడుతూ లాక్ తీస్తూ ఉండాలా? అని ఆలోచించాల్సిన అవసరం లేదు.


లాక్ తీయకుండానే మెసేజ్‌లకు రిప్లై పంపడం, కాల్స్ మాట్లాడడం చేయవచ్చట. కానీ అంతకుముందు మాట్లాడిన చాట్స్ చూడాలంటే మాత్రం ఫింగర్ ప్రింట్ కావాల్సి వస్తుంది. ఈ ఫింగర్ ప్రింట్ మోడ్‌ని కూడా మనమే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తరహా ఫీచర్ అవసరం లేదు అనుకుంటే దాన్ని వద్దనుకొని డిజేబుల్ కూడా చేసేయొచ్చు.


అంటే మీ బెస్ట్ ఫ్రెండ్‌తో మీ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడాలన్నా.. తన స్క్రీన్ షాట్స్ పంపాలన్నా ఇబ్బందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఇలా స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎనేబుల్, డిజేబుల్ చేసుకునే వీలును కూడా కల్పిస్తోంది వాట్సాప్.


ఈ బయోమెట్రిక్ ఫీచర్ ద్వారా మన ఫోన్‌ని ఓపెన్ చేసినట్లుగానే వాట్సాప్‌ని కూడా వేలు ముద్ర సహాయంతో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు కావాల్సినప్పుడు మాత్రం దాన్ని డిజేబుల్ చేసి స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత స్క్రీన్ షాట్స్ తీయకుండా ఈ బయోమెట్రిక్ ఫీచర్‌ని.. ఆన్ చేసి ఉంచడం వల్ల మీరు వాట్సాప్‌లో మాట్లాడుకున్న సీక్రెట్లను ఎవరూ చదవకుండా ఉంటారు.


అయితే ఈ బయోమెట్రిక్ ఫీచర్ గురించి వాట్సాప్ ఇంకా ఏ వివరాలనూ వెల్లడించలేదు. ప్రస్తుతం ఇది బీటా వర్షన్‌లో యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్లన్నీ ఆండ్రాయిడ్ ఫోన్ల వారికి అందుబాటులోకి త్వరలోనే వస్తాయని తెలిసింది.


అయితే ఐఓఎస్ యూజర్ల గురించి ఏమాత్రం సమాచారం అందలేదు. అయితే ఇప్పటికే ఐఫోన్‌లో వాట్సాప్‌ని ఉపయోగించడానికి ఫేస్ ఐడీ, టచ్ ఐడీ వంటివి అందుబాటులో ఉన్నా.. యూజర్లు స్క్రీన్ షాట్స్ తీయకుండా అడ్డుకునే నియమం మాత్రం లేదు.


ఇవి కూడా చదవండి.


టిక్ టాక్ ( Tiktok) యాప్ బ్యాన్ అయింది.. మీమ్‌ల పండగ మొదలైంది..


టిక్ టాక్ (Tik Tok) వీడియోలతో ఆకట్టుకుంటోన్న కథానాయికలు వీరే..


నిద్రంటే మీకు ఇష్ట‌మా? అయితే ఈ నాసా ఉద్యోగం మీ కోస‌మే ..!