సినిమాల్లో రొమాంటిక్ సీన్లు.. ఎలా షూట్ చేస్తారో తెలిస్తే షాకవుతారు

సినిమాల్లో రొమాంటిక్ సీన్లు.. ఎలా షూట్  చేస్తారో తెలిస్తే షాకవుతారు

ఎప్పుడైనా పెద్ద స్క్రీన్ మీద రొమాంటిక్ సన్నివేశాలు చూశారా..? మీకెప్పుడైనా వాటిని ఎలా తెరకెక్కించారనే సందేహం  వచ్చిందా? అసలు సెక్స్‌లో పాల్గొనకుండానే.. పాల్గొన్నట్లుగా హావభావాలు ఎలా పలికిస్తారు? తెరపై మనకు కనిపించేది ఇద్దరే అయినా.. షూటింగ్ సమయంలో పదుల సంఖ్యలో చుట్టూ జనాలుంటారు. అంత మంది ముందు న్యూడ్‌గా ఎలా ఉండగలుగుతారు? ఇవేమీ మనకు తెలియదు. కానీ కొన్ని సందర్భాల్లో నిజంగానే అలా చేశారేమో అని అనుకోకుండా ఉండలేం. వారి నటన తెరపై అంత సహజంగా ఉంటుంది.

ఇలాంటి సన్నివేశాలు చూడటానికి మనకు బాగానే ఉన్నా.. అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి రావడం నటీనటులకు చాలానే ఇబ్బందిని కలిగిస్తుంది. తెర మీద హీరోహీరోయిన్ల మధ్య హాట్ హాట్ సన్నివేశాలున్నాయని మనం చాలా హుషారుగా చెప్పుకుంటాం. కానీ వారు నిజంగానే వేడిగా ఉన్న వాతావరణంలో షూటింగ్ చేయాల్సి వస్తుంది. అయినా తెరమీద మనకు వారి ఇబ్బందులేమీ కనిపించవు.

ఇదంతా కెమెరా యాంగిల్ మహిమ. ఇలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు ఫుల్ బాడీమేకప్ వేసుకుంటారు. న్యూడ్ కలర్లో ఉన్న ఇన్నర్ వేర్ ధరిస్తారు. ప్రోస్తటిక్ మేకప్ కూడా వేసుకుంటారు. నమ్మలేకపోతున్నారు కదా. అసలు సినిమాల్లో  సెక్స్ సీన్స్(sex scenes) ఎలా చిత్రీకరిస్తారో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.

ఒక్కోసారి అలా జరుగుతుందట.

మనం ఇలా అనుకుంటే అలా రొమాంటిక్ థాట్స్ రావు. కలయికలో పాల్గొనాలనే కోరికా పుట్టదు. అందులోనూ ఫ్లాష్ లైట్స్, కెమెరాలు, చుట్టూ కొంతమంది సినిమా యూనిట్ సభ్యులు చూస్తూ ఉండగా.. రొమాంటిక్‌గా ప్రవర్తించాల్సి వస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ విషయంలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ నటుడు ఇలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు.. తన సహనటితో ఎలా ప్రవర్తించేవాడో చెప్పుకొచ్చారు.

‘ఇలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎరక్షన్స్ రావడానికి అవకాశం ఉంది. ఆ సమయంలో ఆమె భయపడొచ్చు. అందుకే ముందు నేను ఆమెకు సారీ చెబుతాను. విషయం వివరిస్తాను. ఎందుకంటే నటించే సమయంలో ఎరక్షన్స్ వస్తే భయపడకుండా ఉండటానికి, తనని మరో విధంగా ట్రీట్ చేస్తున్నారనే భావన కలగకుండా ఉండటానికి సారీ చెప్తా’  అని అతడు వివరించాడు. కాస్త రొమాంటిక్‌గా ఉండాల్సి వస్తే అనుకోకుండా ఇలాంటి యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంటుంది.

Giphy

పీరియడ్స్‌లో ఉన్నా షూటింగ్ ఆగదు

పీరియడ్స్ సమయంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే.. ఓ రోజు సెలవు తీసుకునైనా విశ్రాంతి తీసుకుంటాం. కానీ హీరోయిన్లకు అవకాశం లేదు. పీరియడ్స్‌లో ఉన్న సరే షూటింగ్‌లో పాల్గొనాల్సిందే. ఇలాంటి సమయంలో బికినీ ధరించి నటించాలంటే అది మరింత కష్టం. సాధారణంగా హీరోయిన్లు బికినీ సీన్స్ చేయాల్సిన సమయంలో.. అది కదలకుండా ఉండేందుకు బికినీ బైట్ ఉపయోగిస్తారు. అలాగే ఆ సమయంలో వారు ప్యాడ్లకు బదులుగా టాంఫూన్లను ఉపయోగిస్తారు.

ఆ చెమట కూడా అబద్ధమే

రొమాంటిక్, సెక్సీ సీన్లలో హీరోహీరోయిన్లకు పట్టే చెమట ఉంది చూశారూ.. అది కూడా మేకప్పేనట. అంటే ఈ విషయంలో మనం మేకప్ ఆర్టిస్టులను మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే లేని చెమటను ఉన్నట్టు చూపించడమంటే..  అందులోనూ చెమటతో తడిసి ముద్దైపోయినట్టు చూపించడమంటే మామూలు విషయం కాదు కదా.

అయితే చెమట పట్టినట్టుగా మేకప్ వేయడానికి ఎన్నో ట్రిక్స్ ఉన్నాయని చెబుతున్నారు మేకప్ ఆర్టిస్ట్ రోసియో జహాన్ భక్ష్. దర్శకుడి అవసరాన్ని బట్టి చెమట మేకప్ ఉంటుందట. చెమటతో పాటు చర్మం కాస్త ఆయిలీగా కనిపించాలంటే.. ముఖానికి వ్యాజలీన్ వాడతానని, మిగిలిన శరీరానికి బేబీ ఆయిల్లో నీరు కలిపి దాన్ని శరీరానికి అప్లై చేస్తానంటున్నారు రోసియో.

Giphy

ఫుల్ బాడీమేకప్

నటీనటుల శరీరంపై మొటిమలుండవచ్చు లేదా టాటూలుండొచ్చు. వాటిని కవర్ చేయడానికి లేదా సెన్సువల్ లుక్ రావడం కోసం పూర్తిగా బాడీ మేకప్ వేయాల్సివస్తుంది. దీనివల్ల సీన్స్ మధ్యలో వచ్చే గ్యాప్‌లో వాళ్లు తమ శరీరాన్ని కవర్ చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే అలా చేయడం వల్ల మేకప్ చెదిరిపోయే అవకాశం ఉంది. పైగా చిత్రీకరణ సమయంలో బాడీ మేకప్ ఆర్టిస్ట్‌‌కు, బెడ్ షీట్స్‌కు అంటుకోవచ్చు. మేకప్ చెదిరిన ఆ భాగంలో మళ్లీ మేకప్ వేయాల్సి రావడం కూడా.. కవర్ చేసుకోకుండా ఉండాల్సి వస్తుంది.

వెజీనా విగ్స్

మెర్కిన్, వెజీనా విగ్స్, పుస్సీ విగ్స్ ఇలా ఎన్నో పేర్లున్నాయి. వీటి గురించి మనకు పెద్దగా తెలియదు కానీ.. మధ్యయుగ కాలంలోనే వీటిని మహిళలు ఉపయోగించేవారట. ఈ మెర్కిన్స్‌ను సెక్స్‌కు సంబంధించిన సీన్స్ షూట్ చేసే సమయంలో వాస్తవికత ప్రతిఫలించడం కోసం హీరోయిన్లు ఉపయోగిస్తారట. ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రేలో డకోటా జాన్సన్, ది రీడర్ సినిమాలో కేట్ విన్స్లెట్ మెర్కిన్స్ ఉపయోగించారట. అయితే ఈ మెర్కిన్స్ వాడాలా వద్దా అనేది పూర్తిగా దర్శకుడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందట.

Giphy

బాడీ డబుల్స్ స్టంట్స్‌కి మాత్రమే కాదు.. సెక్స్ సీన్స్ కి కూడా ఉంటారు

కొంతమంది యాక్టర్లు కెమెరా ముందు నగ్నంగా  లేదా చాలా తక్కువ దుస్తులతో నటించడానికి చాలా ఇబ్బంది పడుతుంటారట. ఆ సమయంలో బాడీ డబుల్స్‌తో షూటింగ్ పూర్తి చేస్తారట. ఓ హాలీవుడ్ టీవీ సిరీస్‌లో ఇలాంటి సెక్స్ సీన్‌లో బాడీ డబుల్‌గా చేసిన యాక్టర్.. ఈ విషయం గురించి మాట్లాడుతూ ‘ఈ తరహా షూటింగ్ చాలా డిఫరెంట్‌గా  ఉంటుంది. కామసూత్ర పొజిషన్‌లో ఆరుగంటల పాటు మోకాళ్లపై నిల్చుని షూటింగ్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల నా మోకాళ్ల  దగ్గర గాయాలయ్యాయి. కొన్ని రోజుల పాటు ఆ గాయాలకు ప్లాస్టర్లు వేసుకుని తిరగాల్సి వచ్చింద’ని చెప్పారు.

ఆ భాగం కవర్ చేసే ఉంటుందట

పూర్తిగా నగ్నంగా నటించడం ఏ నటుడికీ లేదా నటికీ ఇష్టం ఉండదు. పైగా అలాంటి సీన్లలో నటించినప్పుడు తమ సహచర నటీనటులకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే వారు ఆ భాగాలను కచ్చితంగా కవర్ చేసుకుంటారట. దీని కోసం కాస్ట్యూమ్ డిజైనర్లు సైతం సిద్ధంగానే ఉంటారట. పురుషుల కోసం కాక్ సాక్, మహిళల కోసం లాండింగ్ స్ట్రిప్ ఉపయోగిస్తారట.

Giphy

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది