ADVERTISEMENT
home / Food & Nightlife
దోశ అంటే మీకు ఇష్టమా..? అయితే ఈ టాప్ 10 స్పెషల్స్ ట్రై చేసేయండి

దోశ అంటే మీకు ఇష్టమా..? అయితే ఈ టాప్ 10 స్పెషల్స్ ట్రై చేసేయండి

దక్షిణాదిలో (south india) బాగా పాపులరైన వంటకాల్లో ఇడ్లీ, వడ, దోశ.. ప్రధానమైనవి. అయితే వీటిలో దోశకు చాలా ప్రాధాన్యముంది. బెంగళూరు లాంటి ప్రాంతాల్లో అయితే దాదాపు 100 రకాల దోశలు లభిస్తాయట. అలాగే అదే ప్రాంతంలో దోశా ప్లాజా అనే పెద్ద రెస్టారెంటు కూడా ఉంది. చూశారా.. ఈ రోజు దోశలకు ఎంత డిమాండ్ ఉందో.. ఈ క్రమంలో మీరు కూడా దోశ (Dosa) ప్రియులు అయితే.. ఈ టాప్ 10 దోశలను ఎప్పుడైనా కడుపురా హాయిగా ఆరగించేయండి. 

నీర్ దోశ – కర్ఱాటకలో ఈ దోశ చాలా ఫేమస్. సన్నగా, క్రిస్పీగా ఉండే ఈ దోశను బియ్యప్పిండితో చేస్తారు. మామూలు దోశ తయారీ కంటే.. దీని తయారీకి చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. 

రవ్వ దోశ – బొంబాయి రవ్వ, బియ్యపు పిండి, మైదాలను పెరుగుతో మిక్స్ చేసి ఈ దోశను తయారు చేస్తారు. ఇతర దోశల్లా దీనిని పులియబెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో పచ్చి మిర్చి, అల్లం ముక్కలు వేసి బాగా కాలుస్తారు. 

 

ADVERTISEMENT

 

ఎగ్ దోశ – మూమూలు దోశ మధ్యలో.. గుడ్డును గిలక్కొట్టి ఆమ్లెట్ వేసేస్తే సరి.. అదే ఎగ్ దోశ అయిపోతుంది. 

మసాలా దోశ – దోశ మీద  చట్నీ పౌడర్ జల్లిన తర్వాత.. బాగా కాల్చి దాని మీద ఆలుగడ్డలు, ఉల్లి కలిపి మిక్స్ చేసిన మసాలా ముద్ద పెట్టి మడిచి వడ్డిస్తే.. అదే మసాలా దోశ. 

పేపర్ దోశ – ఈ దోశను చాలా పొడవుగా, పలుచగా తయారుచేయడం వల్ల.. దీనికి ఆ పేరు వచ్చింది. ఈ దోశను కాల్చాలంటే.. చాలా పెద్ద పెనం కావాలి. 

ADVERTISEMENT

ఫ్యామిలీ దోశ –  ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి తినేవిధంగా ఈ దోశను తయారుచేస్తారు. ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది ఈ దోశ. అయితే కొన్ని రెస్టారెంట్లలో మాత్రమే ఇది లభ్యమవుతుంది. 

చౌ చౌ దోశ – నూడిల్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత..  అలా వేయించిన దాన్ని దోశ మధ్యలోకి చొప్పించి.. ఆ తర్వాత ఎర్రగడ్డలను బాగా కాల్చి పైన అద్దితే అదే చౌచౌ దోశ.

ఉల్లి దోశ – ఉల్లిగడ్డలను పలుచని ముక్కలుగా తరిగి.. ఆ తర్వాత వాటిని దోశ మీద పరచి.. బాగా పెనం మీద కాలుస్తారు. అంతే ఉల్లిదోశ లేదా ఆనియన్ దోశ రెడీ.

ఎమ్మెల్యే దోశ – ఈ పేరు వెనుక చాలా ఆసక్తికరమైన కథనం ఉంది. హైదరాబాద్ అసెంబ్లీ క్యాంటిన్‌లో తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఈ దోశను తయారుచేశారట. మసాలా దోశకే మరికొన్ని అదనపు హంగులు అద్ది (అనగా జీడిపప్పు లాంటివి అద్ది) దీనిని తయారుచేశారట. తర్వాత ఇదే రెసిపీతో అనేక ప్రముఖ హోటల్స్ ఈ దోశను భోజన ప్రియులకు అందివ్వడం గమనార్హం. 

ADVERTISEMENT

పంచరత్న దోశ –  బియ్యపు పిండి, శనగ పిండి, మైదా పిండి, గోధుమ పిండి, రవ్వ.. ఈ అయిదు  పదార్ధాలను కలిపి.. పెరుగుతో మిక్స్ చేసి ఈ దోశను తయారు చేస్తారు. ఈ పిండిని పులియబెట్టవలసిన అవసరం లేదు. 

ఇవే కాకుండా చాలా రకాల దోశలు ప్రస్తుతం.. హోటళ్లలో, రెస్టారెంట్లో అందుబాటులో ఉన్నాయి. అల్లం దోశ, మెంతి దోశ, కొబ్బరి దోశ, 70 ఎంఎం దోశ, రాగి దోశ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.

Featured Image: Hungryforeverco

ఇవి కూడా చదవండి

ADVERTISEMENT

రంజాన్ స్పెషల్: భాగ్యనగరంలో బెస్ట్ బిర్యానీ.. లభించేది ఈ హోటల్స్‌లోనే..!

హైదరాబాద్ నగరవాసులను విశేషంగా అలరిస్తోన్న తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ 2019

మరో సరికొత్త రికార్డు సాధించిన.. హైదరాబాద్ ప్యార‌డైజ్ బిర్యానీ

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

ADVERTISEMENT

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

22 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT