పెళ్లి (Wedding).. ఏ అమ్మాయి జీవితంలోనైనా ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. అలాగే ప్రతి వివాహం ఎంతో విభిన్నం. పద్ధతులు ఒకేలా ఉన్నా.. ప్రతి ఒక్కరి ప్లానింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే ఎంత బాగా ప్లాన్ చేసినా.. ఆఖరి నిమిషంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం సహజం. మనం అనుకోనివి జరుగుతుంటాయి.
అందుకే పెళ్లికి ముందే ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనుభవం ఉన్నవారి సూచనలు తీసుకోవడం మంచిది. ఈ క్రమంలో ఓ పదిహేను మంది నవవధువులు (Brides).. పెళ్లి సమయంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి.. మీకు పలు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మరి, మీ వివాహ వేడుకల్లో.. ఈ సూచనలనూ అమలు చేసేయండి.
1. అన్నీ ఒక దగ్గరే..
పెళ్లి సమయంలో ముహూర్తానికి ముందు.. చీర మార్చుకోవడం కొన్ని సంప్రదాయాల్లో కనిపిస్తుంది. మధుపర్కం కట్టుకునే సంప్రదాయం మీక్కూడా ఉందా..? అయితే మీరు కట్టుకునే చీరతో పాటు.. ఆభరణాలు, యాక్సెసరీస్ అన్నీ ఒకే దగ్గర సర్ది పెట్టుకోండి. దీనివల్ల మధ్యలో మరీ ఆలస్యం కాకుండా.. ఇబ్బంది పడకుండా ఉండచ్చు.
అంకిత, 28
2. ముందే ప్రయత్నించండి..
పెళ్లి సమయంలో కొత్తగా ఏదీ ప్రయత్నించకూడదు. ముఖ్యంగా మేకప్, హెయిర్ స్టైల్ వంటివి మీకు నప్పుతాయా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలి. వాటిని ముందే ఓసారి ట్రై చేయాలి. అలా చెక్ చేసుకొని.. ఫలానా మేకప్, స్టైల్ మీకు బాగుందనిపిస్తేనే.. పెళ్లి సమయంలో చేయించుకోవాలి. అంతేకాదు.. మేకప్ ఉత్పత్తులను కూడా.. వివాహ సమయంలో కొత్తవి ఏవీ ఉపయోగించవద్దు. పెళ్లికి కనీసం వారం ముందుగానే వాటిని ఓసారి వేసుకొని చెక్ చేసుకోవాలి. అప్పుడే అవి మీ చర్మతత్వానికి సరిపోతాయో లేదో? తెలుస్తుంది.
కిరణ్, 27
3. లిస్టు రాసుకోండి.
పెళ్లి రోజు మీకు అవసరమయ్యే వాటికోసం, ముందే ఓ లిస్టు రాసుకోవడం బెటర్. ఉదయం నిద్ర లేచిన దగ్గరనుండీ.. పెళ్లికి రెడీ అయ్యేవరకూ.. మీకు ఉఫయోగపడే ప్రతి వస్తువునూ లిస్ట్‌లో పొందుపరచండి. మీ లోదుస్తులు నుంచి నగల వరకూ.. బ్రష్ నుంచి సేఫ్టీ పిన్ వరకూ.. మేకప్ కిట్ దగ్గర నుంచి తలలో పెట్టుకునే పూల వరకూ ప్రతి ఒక్కటీ చెక్ చేసుకోవాలి. వాటిని ఓ చోట భద్రపరచుకోవాలి. పెళ్లికి కొన్ని గంటల ముందే వీటిని… మీకు అందుబాటులో ఉండే చోట భద్రపరిచే ఏర్పాటు చేసుకోవాలి. నా పెళ్లి జరుగుతున్నప్పుడు పూల జడలో జతచేయడానికి మల్లెపూలు కావాల్సి వచ్చాయి. వాటి కోసం మా డ్రైవర్‌ని నాలుగు సార్లు పంపినా అవి మార్కెట్‌లో దొరకలేదు. దాంతో గులాబీ పూలతో సర్దుకోవాల్సి వచ్చింది.
స్వాతి, 25
4. కంగారు అస్సలొద్దు..
పెళ్లి సమయంలో అప్పుడప్పుడూ తప్పులు దొర్లడం సహజం. చిన్న చిన్న విషయాల్లో అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే కంగారు పడకండి. పెళ్లి రేపనగా.. మీ బ్లౌజ్ టైట్ కావడమో లేదా ముఖంపై మొటిమలు రావడమో జరగవచ్చు. అయినా కంగారుపడద్దు.
నా పెళ్లి రోజు చక్కగా రోజ్ వాటర్, పాలు పోసుకొని బాత్ టబ్‌లో స్నానం చేశాను. ఆ తర్వాత.. కడుపు నిండా టిఫిన్ చేసి రడీ అవ్వాలనేది నా ప్లాన్. కానీ మా మేనల్లుడు కుళాయి విప్పి వదిలేయడంతో.. ఆరోజు ఇంట్లో నీళ్లు లేకుండా పోయాయి. అయినా నేను కంగారు పడలేదు. ప్రశాంతంగా కూర్చొని నీళ్లు వచ్చేవరకూ వేచి చూశాను. నీళ్లు వచ్చాక.. మేమంతా స్నానం చేసి రడీ అయిపోయాం. ఇలాంటి సందర్భాల్లో చాలామంది కంగారు పడతారు. కానీ ఇలాంటి ఘటనలే మీరు ఆరోజును ఎప్పటికీ గుర్తుంచుకొనేలా చేస్తాయి. కాబట్టి ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయండి.
సనా, 25
5. అవి తప్పనిసరి..
రేపొద్దున పెళ్లి అనగానే.. చాలామంది రాత్రంతా వచ్చిన బంధువులతో, స్నేహితులతో ముచ్చట్లు పెడతారు. మెలకువగా ఉంటారు. కానీ పెళ్లి రోజు ఫ్రెష్‌గా కనిపించాలంటే.. ముందు రోజు రాత్రి నిద్రపోవడం ఎంతో అవసరం. అలాగే ప్రతి విషయానికి కంగారు పడకుండా రిలాక్స్ అవ్వండి. ఇది మీ జీవితంలోనే బెస్ట్ రోజు. అందుకే ఈ రోజును మీకు నచ్చినట్లుగా ఎంజాయ్ చేయండి. ఫొటోలల్లో నవ్వడం మర్చిపోకండి. అప్పుడే అద్భుతమైన ఆల్బమ్ రడీ అవుతుంది.
సుష్మ, 24
6. అదో రకం ఆనందం..
పెళ్లి రోజు అందరూ డ్రింక్స్ తీసుకుంటుంటే.. మీరు మాత్రం దూరంగా ఎందుకుండాలి? మీరూ ఒకటి లాగించేయండి.
షెఫాలీ, 34
7. భగవంతుడితో ప్రారంభం..
మీ పెళ్లి రోజు.. మీ జీవితంలోనే ప్రత్యేకమైన రోజు. అందుకే ఈ రోజును మొదట దేవుడికి ప్రార్థన లేదా పూజ చేయడంతో ప్రారంభించండి. ఉదయాన్నే లేచి స్నానం పూర్తి చేసుకొని కాసేపు పూజ, ధ్యానం చేయండి. ఈ సమయం మీకు కంగారును తగ్గించి పెళ్లి వేడుకల్లో మీరు ఉత్సాహంగా పాల్గొనేలా చేస్తుంది.
రష్మి, 34
8. వాళ్లకు దగ్గరగా ఉండండి..
మీకు నచ్చిన వ్యక్తులు, ముఖ్యంగా పిల్లలను మీకు దగ్గరగా ఉంచుకోండి. వాళ్లు మిమ్మల్ని ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉండేలా చేస్తారు. ఏదైనా ఫంక్షన్ అంటే వాళ్ల సందడి అంతా ఇంతా ఉండదు. వాళ్లను చూస్తుంటే మీకూ ఉత్సాహం పెరుగుతుంది. మీ ఒత్తిడి తగ్గుతుంది. నా పెళ్లిలో నా బుల్లి కోడళ్లిద్దరు, నా బెస్ట్ ఫ్రెండ్, నా ముగ్గురు కజిన్స్ ఎప్పుడూ నాతోనే ఉండి.. నన్నో రాకుమారిలా చూసుకున్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి తినిపించడం, నీళ్లు తాగించడం, అద్భుతమైన క్యాండిడ్ ఫొటోలు తీయడం, నాకు ఒత్తిడి లేకుండా చూసుకోవడం ఇవన్నీ చేశారు.
రితూ, 31
9. ప్రత్యేకంగా కనిపించండి.
ఎప్పుడూ సంప్రదాయబద్ధమైన జ్యుయలరీ మాత్రమే కాదు.. ఈ ప్రత్యేక సందర్భం కోసం జెమ్ స్టోన్స్ జ్యుయలరీ ఉపయోగించండి. అవి ఆర్టిఫిషియల్ వి అయినా సరే.. అవి మీకు డిఫరెంట్ లుక్ ని అందిస్తాయి.
నిడా మోనిస్, 26
10. ఆహారం మర్చిపోవద్దు.
మీ చుట్టూ జరుగుతోన్న చిన్న చిన్న తప్పుల గురించి పట్టించుకొని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. పెళ్లి వేడుకల మధ్యలో తినడానికి కూడా సమయం ఉండదు. కాబట్టి ముందే తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది.
మిస్బా హజిరా, 33
11. ఆ విషయం పట్టించుకోవద్దు.
చాలామంది అమ్మాయిలు పెళ్లి పూర్తవగానే ఫస్ట్ నైట్ గురించి ఆలోచించి కంగారు పడతారు. కానీ వరుసగా పెళ్లి వేడుకలతో అలసిపోయి ఉంటారు కాబట్టి శోభనం రోజు ఏ ఒక్కరూ ఆ విషయం గురించి ఆలోచించరు. కాబట్టి టెన్షన్ పడకండి.
దీప, 31
12. బ్యాకప్ పెట్టుకోండి..
బ్యుటీషియన్ నుంచి ఫొటోగ్రాఫర్ వరకూ.. ఆ మాటకొస్తే పెళ్లికి సంబంధించి ప్రతి వెండర్ గురించి ఒక ప్లాన్ బి ఉంచుకోవడం మంచిది. వాళ్లందరి ఫోన్ నంబర్లు ఓ లిస్టు రాసి దాన్ని పెళ్లి ఏర్పాట్లు చూసే మీ బంధువులకు అందించండి. ఒకవేళ మీరు బుక్ చేసిన వాళ్లు రాకపోతే మరొకరికి ఫోన్ చేయవచ్చు. నా పెళ్లిలో మేకప్ చేసే అమ్మాయి పెళ్లికి ముందు రాలేనని చెప్పింది. దాంతో నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ఊర్వశి, 38
13. కంగారు పడొద్దు..
పెళ్లి సమయంలో చాలా తక్కువ ఎక్కువలు అవుతుంటాయి. మీరు అస్సలు వూహించని సంఘటనలు చాలా ఎదురవుతాయి. వాటి గురించి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉంటే చాలు.. దీనికోసం మీ మనసులో మీకు మీరే ఈ పెళ్లి మీకో అద్భుతమైన జీవితాన్ని అందిస్తుందని గుర్తుచేసుకోండి. అంతే.. మీ కంగారు తగ్గుతుంది.
మేరీ సాల్వే, 35
14. పర్సనల్ మూమెంట్స్
మన తెలుగు పెళ్లిళ్లంటే ఎన్నో పద్ధతులు, మరెన్నో ఆచారాలు.. ఇవన్నీ చేస్తూ అలా మెకానికల్ గా రోజు ను పూర్తి చేయకుండా మీ భాగస్వామితో ఆ రోజు ప్రత్యేకమైన అనుభవాలు కొన్ని ఉండేలా చూసుకోండి. దీనివల్ల భవిష్యత్తులో మీకోసం కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు, అనుభూతులు మిగులుతాయి. దీనికోసం మీ భాగస్వామికి ఓ ప్రత్యేకమైన బహుమతి ఇవ్వడం, మీ కపుల్ పిక్చర్స్, బంధువులందరికీ దూరంగా కాస్త సమయం వంటివి ఉండేలా చూసుకోవాలి.
ఆర్తి, 30
15. ఆకలితో ఉండొద్దు..
పెళ్లి రోజు మధ్యాహ్నం భోజనం చేయడం ఆలస్యం కావచ్చు. అందుకే ఉదయం ఆహారం కాస్త ఎక్కువగానే తీసుకోండి. ఆ రోజు చాలా అలసిపోతారు. శ్రమతో పాటు భావోద్వేగాలు కూడా కలగలిసిన రోజు అది. అందుకే ముందే దానికి తగినట్లుగా కడుపు నిండా ఆహారం తీసుకోండి. అంతేకాదు.. పెళ్లి వేడుకల మధ్యలోనూ నీళ్లు తాగడం, జ్యూసులు తాగడం చేస్తుండండి.
ప్రేరణ, 27.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.
ఇవి కూడా చదవండి.
పెళ్లికి ముందే ఈ ఎమర్జెన్సీ కిట్.. సిద్ధం చేసుకోవడం మర్చిపోవద్దు..
ఈ వధువు స్టెప్పులేస్తే.. ప్రపంచమే ఫిదా అయిపోయింది..!
ఈ వధువు వరకట్నంగా.. ఏమిచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..!