home / లైఫ్ స్టైల్
మన జీవితం గురించి.. పవిత్ర గ్రంధాలు చెప్పే ఆధ్యాత్మిక సూక్తులు ఇవే..!

మన జీవితం గురించి.. పవిత్ర గ్రంధాలు చెప్పే ఆధ్యాత్మిక సూక్తులు ఇవే..!

పుట్టుక నుంచి తిరిగి మరణించే వరకు మనం జీవించే కాలం.. ఆ సమయంలో మనం చేసే పాప, పుణ్యాలు.. అవి మన జీవితాన్ని ఏ విధంగా నిర్దేశిస్తాయి?.. వంటి సందేహాలు మనలో చాలామందికి ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటాయి. ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే మన పవిత్ర గ్రంథాలను ఓసారి చదవాల్సిందే.

ఎందుకంటే ఇవి మన జీవితానికి సంబంధించి మనకు ఉన్న అనేక సందేహాలకు సమాధానాలీయడం మాత్రమే కాదు.. ఆధ్యాత్మికత గురించి కూడా మనకు ఎన్నో సందేశాలు, సూక్తులను (Spiritual quotes) అందిస్తాయి. మన దైనందిన జీవితంలో వాటిని భాగం చేసుకుంటే తప్పకుండా సత్ఫలితాలు అందుకోవచ్చంటున్నారు పండితులు. మరి, మన పవిత్ర గ్రంథాలు మనకు చెబుతోన్న ఆ సందేశాలు, సూక్తులు ఏంటో ఓసారి మనమూ తెలుసుకుందాం రండి..

భగవద్గీత చెబుతోన్న సూక్తులు..

shutterstock

మన జీవిత సారాంశం మొత్తం గీతలో బోధించబడి ఉంటుంది అంటారు పెద్దలు. అందుకే జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా గీతాపఠనం చేయాలని వారు సూచిస్తారు. మరి, ఈ పవిత్ర గ్రంథంలో మన జీవితం గురించి చెప్పిన కొన్ని సందేశాలు, సూక్తులు ఓసారి చూద్దాం..

1· ఇతరులను అనుకరిస్తూ బ్రతికే కంటే అపరిపూర్ణంగా అయినా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించడం ఉత్తమం – భగవద్గీత.

2· శ్రద్ధగా పని చేయకుండా ఎవరూ మంచి ఫలితాన్ని పొందలేరు – భగవద్గీత.

3· ప్రయత్నం ఎప్పటికీ వృథా కాదు. వైఫల్యం అనేది శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా మనకు ఉన్నత స్థానాన్ని అందిస్తుంది – భగవద్గీత.

4· కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే మిగులుతుంది – భగవద్గీత.

5· నీ తప్పు లేకున్నా.. నిన్ను ఎవరైనా బాధపెడితే నీకు ప్రతీకారం తీర్చుకోవడం చాతకాకపోయినా వారికి కాలం తప్పకుండా శిక్ష విధిస్తుంది – భగవద్గీత.

6· విశిష్టమైన గుణం, శోభ, శక్తి కలిగింది ఏదైనా సరే.. అది నా తేజము నుంచే ఆవిర్భవించిందని తెలుసుకో – భగవద్గీత.

7· మనం బయటి ప్రపంచాన్ని కళ్లతో చూస్తున్నాం. చర్మంతో తాకుతున్నాము. చెవులతో వింటున్నాం. నాలుకతో రుచి చూస్తున్నాం. మంచి వాసనలు నాసికంతో ఆస్వాదిస్తున్నాం. ఈ ఐదింటి వల్ల బయట ప్రపంచం మన లోపలకు వెళ్తూ ఉంటుంది. కానీ ఈ ఇంద్రియములు జడములు. వీటి వెనుక మనసు ఉండి నడిపిస్తుంది. మరణించిన తర్వాత కూడా ఈ ఇంద్రియములు ఉంటాయి. కానీ అవి ఆయా పనులను చేయలేవు. కాబట్టి బయటి ప్రపంచం అంతా మన సృష్టి. మనసు చేసే పనులన్నీ ఆత్మ సాక్షీభూతంగా చూస్తూ ఉంటుంది – భగవద్గీత.

8· ఎవరు భక్తితో నాకు పవిత్రమైన పుష్పమైనా, ఫలమైనా, ఉదకమైనా ఫలాపేక్షరహితంగా సమర్పించుచున్నారో అట్టివారిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను – భగవద్గీత.

9· ఒకసారి అర్జునుడు శ్రీ కృష్ణుడిని అడిగాడు – ” ఈ గోడ పై ఓ సందేశాన్ని లిఖించు మిత్రమా.. అది ఎలా ఉండాలంటే.. సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దు:ఖం రావాలి.. దు:ఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం కలగాలి. అప్పుడు శ్రీ కృష్ణుడు ఇలా రాశాడు.. ‘ఈ సమయం వెళ్లిపోతుంది’ – భగవద్గీత.

10· ఓడిపోయానని బాధపడకు. ఇంకోసారి ప్రయత్నించు.. ఈసారి నీకు నేను తోడుగా ఉంటాను.. – భగవద్గీత.

11· అందరిలో ఉండే ఆత్మ ఒక్కటే కనుక.. ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది – భగవద్గీత.

12· దు:ఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు.. సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు.. రాగం, భయం, క్రోధం పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్తారు – భగవద్గీత.

13· ఏ పనైనా కష్టపడితే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చొంటే అణువంతైనా ముందుకు సాగదు.. సింహం నోరు తెరుచుకుని కూర్చున్నంత మాత్రాన వన్య మృగం దానికది నోటి దగ్గరికి వస్తుందా?? – భగవద్గీత.

14· ఏ విషయం మీదా ఆసక్తి లేనివారంటూ ఎవ్వరూ ఉండరు. ఎలాంటి ఆసక్తి ఉంటుందో.. అలాంటివారిగానే తయారవుతారు. ఎలాంటి ఆలోచనలు ఉంటే.. అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది. అలాంటి ఫలితాలనే నువ్వు అనుభవిస్తావు – భగవద్గీత.

15· చావు, పుట్టుకలు సహజం. ఎవరూ వాటిని తప్పించుకోలేరు. వివేకవంతులు వాటి గురించి అస్సలు ఆలోచించరు – భగవద్గీత.

బైబిల్‌లో చెప్పిన సందేశాలు, సూక్తులు..

shutterstock

హిందువులు పవిత్రంగా భావించే భగవద్గీతలానే.. క్రిస్టియన్లంతా బైబిల్‌ని తమ పవిత్ర గ్రంథంగా భావిస్తారు. ఇందులో కూడా మనుషుల మధ్య ఉండే సత్సంబంధాలు, వారి జీవితం గురించి అనేక సూక్తులు, సందేశాలు ఉంటాయి. వాటిలో కొన్నింటిని మనం చూద్దాం..

16· నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ.. నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును – ద్వితీయోపదేశ కాండం

17· శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి –  రోమా 12.12

18· భయపడకు.. నిన్ను నడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను –  ఝర్మియా 1:8

19· అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసినవాడా.. నీవు మరల మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాథ స్థలములలో నుంచి నీవు మరల మమ్ములను లేవనెత్తెదవు – కీర్తన 71:20

20· మీకు ఈ శిక్షను కొని వచ్చిన దేవుడు మిమ్మల్ని కాపాడి శాశ్వతానంద భరితులను చేయును – బారూకు 4:29

21· దయాగుణం, సత్యం పరస్పరం కలిసే ఉంటాయి. అలాగే ధర్మం, శాంతి ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయి – బైబిల్

22· ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు. కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా పరిగణించబడతారు – రోమన్స్ 2:13

23· నీతిమంతులు మొరపెట్టగా యోహోవా ఆలకించును. వారి శ్రమలన్నింటి నుంచీ వారిని విడిపించును – కీర్తనలు 34:17

24· నిన్ను చూసి ఈ ప్రపంచం మారాలి.. కానీ ఈ ప్రపంచాన్ని చూసి నువ్వు మారవద్దు – బైబిల్

25· ఎదుటివారి కన్నీళ్లు చూసి.. నీవు ఆనందించాలని అనుకుంటే ఆ క్షణమే నీవు మరణించినట్టు లెక్క – బైబిల్

26· ఎదుటివారికి క్షమించబడే అర్హత లేకపోయినా,, వారిని మీరు క్షమించండి. ఎందుకంటే ప్రశాంతంగా ఉండే అర్హత మీకు ఉంది కనుక – బైబిల్

27· దేని గురించీ చింతించకండి. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి – ఫిలిప్ఫీయులు 4:6

28· పాపము వల్ల వచ్చు జీతం మరణం.. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవం – రోమా 6:23

29· భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు. కనుక వారికి క్షేమం కలుగదని, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురని నాకు తెలుసు – ప్రసంగి 8:13

30· ప్రభువే నాకు దీపం.. నాకు రక్షణం.. ఇక నేను ఎవరికీ భయపడక్కర్లేదు. ప్రభువే నాకు కోట.. ఇక నేను ఎవరికీ వెరువనక్కరలేదు – కీర్తనలు 27:1

ఖురాన్ గ్రంథం చెప్పే సూక్తులు..

shutterstock

హిందువులు భగవద్గీత, క్రిస్టియన్లు బైబిల్‌ను పవిత్ర గ్రంథాలుగా ఆరాధించినట్లే.. ముస్లింలంతా ఖురాన్‌ను తమ పవిత్ర గ్రంథంగా భావిస్తారు. మరి, ఇందులో మానవ జీవితం గురించి చెప్పిన కొన్ని కోట్స్ చూద్దాం రండి..

31· ప్రేమించే బంధువులను ప్రేమించడం.. బంధుప్రేమ అనిపించుకోదు.. మిమ్మల్ని ప్రేమించని బంధువులను కూడా మీరు ప్రేమించడమే నిజమైన బంధుప్రేమ – మహమ్మద్ ప్రవక్త.

32· కూలీలతో పని చేయించుకున్నప్పుడు.. వారి చెమట ఆరక ముందే వారి కష్టార్జితం చెల్లించాలి – ఖురాన్

33· ఉపవాసంతో, ఆకలిదప్పులతో మనిషిని బాధించడం.. ఇస్లాం ఉద్దేశం కాదు.. పేదవాడి బాధలు తెలుసుకోవడమే ముఖ్యోద్దేశం – ఖురాన్

34· బంధువులకు, పేదలకు మరియు బాటసారులకు వారి హక్కు ఇవ్వు. మరియు వృథా ఖర్చులతో ధనాన్ని వ్యర్థం చేయకు. – ఖురాన్

35· నిన్ను నమ్మిన వారిని ఎప్పటికీ మోసం చేయకు – ఖురాన్

36· చెడు అలవాటును ప్రారంభంలోనే అరికట్టకపోతే.. అది అతి త్వరలోనే ఒక అవసరంగా మారిపోతుంది. – ఖురాన్

37· తమకి ఏమి కావాలో, అది ఎక్కడ దొరుకుతుందో తెలిసినవారు జీవితంలో పైకి వస్తారు. ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి.. నీకు ఏది సరైందో వెతికి పట్టుకోవడమే జీవితం -ఖురాన్

38· రాజు, రైతు, ధనిక, పేద, జాతి, వర్గ బేధాలు లేకుండా అందరూ ఒకరికొకరు భుజానికి భుజం.. పాదానికి పాదం.. కలిసి నమాజుకై రోజుకి 5సార్లు నిలబడి విశ్వమానవ సోదర భావాన్ని చాటుతారు. ఇస్లాంలో అంటరానితనం లేదు – ఖురాన్

39· సర్వలోకాలకూ ప్రభువైన అల్లాయే సర్వస్తోత్రాలకూ అర్హుడు – ఖురాన్

40· మనం చేసే పనులు మంచివా లేక చెడువా అని ఎప్పటికప్పుడు తేల్చి చెప్పేది మన జయాపజయాలే – ఖురాన్

బుద్ధుడు చెప్పిన సూక్తులు

shutterstock

గౌతమ బుద్ధుడు సైతం మానవ జీవితం, అందులో ఎదురయ్యే ఒడిదుడుకులు… మొదలైన వాటి గురించి కొన్ని సూక్తులు చెప్పారు. ఆయన చెప్పిన వాటిలో కొన్ని ఓసారి మనమూ చూద్దాం రండి

41· నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు. కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం నువ్వు హాని చేయకు – గౌతమ బుద్ధుడు

42· మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు  – గౌతమ బుద్ధుడు

43· ద్వేషాన్ని దూరం చేయగలిగేది.. ప్రేమే తప్ప ద్వేషం కాదు – గౌతమ బుద్ధుడు

44· వేలాది వ్యర్థమైన మాటలు వినడం కన్నా.. శాంతిని, కాంతిని ప్రసాదించే ఒక్క మంచి మాట విన్నా చాలు – గౌతమ బుద్ధుడు

45· తనని తాను వశపరుచుకోగల మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు.. వారి విజయాలను అపజయాలుగా మార్చలేరు – గౌతమ బుద్ధుడు

46· ఏ వ్యక్తి పవిత్రమయిన ఆలోచనలతో మాట్లాడినా లేక పని చేసినా ఆనందం ఎప్పటికీ వారిని విడువని నీడలా వెన్నంటే ఉంటుంది – గౌతమ బుద్ధుడు

47· శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే.. కానీ మనసుకు మాత్రం తప్పు చేసిన ప్రతిసారీ మరణమే – గౌతమ బుద్ధుడు

48· శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు – గౌతమ బుద్ధుడు

49· ఎవరూ చూడట్లేదని తప్పు చేయకు. అందరూ చేస్తున్నారని అప్పు చేయకు. ఈ రెండూ జీవితంలో పెద్ద ప్రమాదాలే అని గుర్తుంచుకో – గౌతమ బుద్ధుడు

50· మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లోనే – గౌతమ బుద్ధుడు

51· కోపం కలిగి ఉండడం నిప్పు కణికను ఎవరిపైనో విసరాలనే ఉద్దేశంతో అరచేతిలో ఉంచుకోవడమే. అది నిన్నే దహించివేస్తుంది – గౌతమ బుద్ధుడు

52· గతాన్ని తలచుకోవడం మానుకో.. భవిష్యత్తు గురించి కలలు కనకు.. ప్రస్తుతం పై మనసు లగ్నం చేయి – గౌతమ బుద్ధుడు

53· మన ముందు ఏముంది? పక్కన ఏముంది?? అన్నది విషయం కాదు.. అసలు మనలో ఏముంది?? అన్నదే అసలైన విషయం – గౌతమ బుద్ధుడు

54· సాయం చేసేవాడు దేవుడు. మంచిగా మాటలు చెప్పేవాడు గురువు. నీతిగా బ్రతికేవాడు మనిషి – గౌతమ బుద్ధుడు

55· గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు.. మనసు ఉండాలి – గౌతమ బుద్ధుడు

అందరికీ పంపదగిన కొన్ని ఆధ్యాత్మిక సందేశాలు

shutterstock

ఈ రోజుల్లో ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు గుడ్ మార్నింగ్.. గుడ్ నైట్.. అంటూ రకరకాల సందేశాలు మన మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు.. తదితరులకు పంపడం సర్వసాధారణంగా మారిపోయింది. మరి, ఆధ్యాత్మికత కలిగిన కొన్ని సందేశాలను సైతం మనం వారికి పంపవచ్చు. తద్వారా వారిలో ప్రేరణ కలిగించడంతో పాటు.. ఆధ్యాత్మిక చింతన కూడా కలిగించే ప్రయత్నం చేయచ్చు. అలాంటి సందేశాలు కొన్ని..

56· జీవితం చదరంగం వంటి ఒక ఆట. దీన్ని మనం దేవుడితో కలిసి ఆడతాం. మనం పావుని కదిపిన ప్రతిసారీ దేవుడు తన పావుని కదుపుతాడు. కాకపోతే మనం కదిపే పావుల పేర్లు ఎంపికలు అయితే.. దేవుడు కదిపే పావులకు పర్యవసానాలు అని పేరు. అంతే..

57· అదృష్టమంటే మనం కోరుకున్నవి మనకు ఇవ్వడమే కాదు.. మనకు అవసరం లేని వాటిని నిర్దాక్షిణ్యంగా మనకు దూరం చేయడం.

58· నీటిలో పడిన ప్రతివారు మునిగి చనిపోరు.. ఈత రాని వారే మునిగిపోతారు. అలాగే.. సమస్యల్లో పడిన ప్రతిఒక్కరూ బాధల్లో మునిగిపోరు.. ఓర్పు, నేర్పు లేనివారే కూరుకుపోతారు.

59· ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది. అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది.

60· బంగారం నాణ్యత అగ్నిలో తెలుస్తుంది.. మనిషి మంచితనం కష్టంలో తెలుస్తుంది..

61· తినడానికి భోజనం లేని స్థాయి నుంచి.. తినడానికి సమయమే లేని స్థాయికి ఎదగడమే విజయం

62· ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు.. ముందుచూపు లేని మనిషికి ఆలోచన ఉండదు.

63· అన్నీ కోల్పోయినా.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి చాలు.. మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు.

64· నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే.. మరోసారి ప్రయత్నించి చూడు..

65· నీవు ఏ పని చేసినా.. ఎవరో ఒకరు రాళ్లు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ ఒక గోడ కట్టుకోవచ్చు. లేదా వాటన్నింటినీ మీ గెలుపుకు బాటగానూ పరుచుకోవచ్చు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.

వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోదగిన సందేశాలు

shutterstock

ప్రేరణ కలిగించే సందేశాలను ఇతరులకు పంపడం మాత్రమే కాదు.. మన వాట్సాప్ స్టేటస్‌గా కూడా పెట్టుకోవచ్చు. అలాంటి కొన్ని సందేశాలు..

66· నీకు మంచి చేసిన వారిని మరువకు – భగవద్గీత

67· నిన్ను ప్రేమించినవారిని ద్వేషించకు – బైబిల్

68· అవసరమైతే మాట్లాడు.. లేదంటే నిశ్శబ్దంగా ఉండు.. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి – గౌతమ బుద్ధుడు.

69· జీవితం అంటేనే పోరాటం.. అలాంటప్పుడు స్వార్థం కోసమో, అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు?? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు.. జనం కోసం పోరాడు – గౌతమ బుద్ధుడు.

70· ఎంత తక్కువ మాట్లాడితే.. అంత విలువ; ఎంత తక్కువ ప్రేమిస్తే.. అంత మనశ్శాంతి; ఎంత దూరంగా ఉంటే.. అంత గౌరవం; ఎంత హద్దుల్లో ఉంటే.. అంత మర్యాద; ఎంత తక్కువ ఆశిస్తే.. అంత ప్రశాంతత; ఎంత నిగ్రహంతో ఉంటే.. అంత అగ్రస్థానం – గౌతమ బుద్ధుడు.

71· ప్రియమైన వారి వల్ల మనకు ఆనందమే కాదు.. దు:ఖం, వ్యాకులత, బాధ, కష్టాలు కూడా సంభవిస్తాయి. – గౌతమ బుద్ధుడు.

72· ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో.. తర్వాత సమాజాన్ని సంస్కరించు – గౌతమ బుద్ధుడు

73· విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు.. నిన్ను నువ్వు గెలవాలి – గౌతమ బుద్ధుడు

74· ఏదీ శాశ్వతం కాదు.. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోవద్దు.. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే.. మారిపోక తప్పదు – గౌతమ బుద్ధుడు.

75· ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం.. తీసుకోగలిగిన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం – గౌతమ బుద్ధుడు.

76· ఆశ దు:ఖానికి హేతువు అవుతుంది. ఆశ నుంచి విముక్తి పొందితే దు:ఖం అంతమవుతుంది – గౌతమ బుద్ధుడు.

77· జీవితంలో సర్వం కోల్పోయినా.. ఒకటి మాత్రం మిగిలే ఉంటుంది.. అదే భవిష్యత్తు. ఎన్నిసార్లు ఓడిపోయినా దేవుడు భవిష్యత్తు అనే అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. అందుకే ఆత్మవిశ్వాసంతో ఆశించేది ఏదైనా నిత్య జీవితంలో నిజం అవుతుంది – గౌతమ బుద్ధుడు.

78· ఇతరుల నుంచి నీవు ఏం ఆశిస్తావో.. దానినే ఇతరులకు చేయడం లేదా అందించడం నిజమైన మానవధర్మం – గౌతమ బుద్ధుడు.

79· వాళ్లేమనుకుంటారో.. వీళ్లు ఏమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది.. అసలు నువ్వు ఏమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. కనీసం ఏదో ఒగ్గటన్నా అవుతుంది – గౌతమ బుద్ధుడు.

80· పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించకు. ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు – గౌతమ బుద్ధుడు.

చూశారుగా.. వాట్సాస్ స్టేటస్‌లుగా పెట్టుకోదగిన కొన్ని ఆధ్యాత్మిక ప్రేరణాత్మక సందేశాలు, కొటేషన్స్.. ఇక్కడ మనం చెప్పుకున్నవి కేవలం కొన్ని మాత్రమే. ఇలాంటి కొటేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. మరింకెందుకాలస్యం.. మీరు కూడా ఓసారి వాటిని చదివి.. వాటిలో మీకు నచ్చిన వాటిని మీ జీవితంలో భాగం చేసుకోండి.. అలాగే మీ స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులకు వాటిని పంపి, వారినీ ఆ సందేశాలలోని నీతిని అనుసరించమని తెలపండి. 

ఇవి కూడా చదవండి

ఈ గుడ్ నైట్ మెసేజ్‌లతో.. మీ రోజును ఆనందంగా ముగించండి..!

ఈ గుడ్ మార్నింగ్ మెసేజెస్‌తో.. రోజంతా మరింత ఉత్సాహంగా గడపండి..!

“యువతా మేలుకో..” – అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా.. ఈ కొటేషన్లు మీకోసం..!

20 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this