14 ఆగస్టు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

14 ఆగస్టు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 14, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు పలు ఆకస్మిక ప్రయాణాలు మీకు ఒత్తిడిని కలిగించవచ్చు. వాతావరణాన్ని అంచనా వేసి.. దూర ప్రయాణాలు చేయడం మంచిది. లేదంటే చిక్కుల్లో పడతారు. అలాగే తల్లిదండ్రులు పిల్లల విషయంలో కొన్ని మంచి విషయాలు వింటారు. వ్యాపారస్తులు తమ వాణిజ్యాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఆఫీసులో ఉద్యోగులు వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు చాలా రొమాంటిక్‌గా గడుస్తుంది. ప్రేమికులు ఆనంద డోలికల్లో తేలియాడుతారు. వివాహితులు తమ భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇక ఇతర విషయాలకు వస్తే.. వ్యాపారస్తులకు ప్రత్యర్థుల నుండి సవాళ్లు ఎదురవుతాయి. చట్టపరమైన సమస్యలు, ఆస్తి లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. 

మిథునం (Gemini) – సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ రోజు శుభదినం. వారు టేకప్ చేస్తున్న ప్రాజెక్టులు కచ్చితంగా విజయవంతమవుతాయి. అలాగే ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆఫీసులో కూడా ప్రశంసలు పొందుతారు.  వ్యాపారస్తులకు కూడా ఈ రోజు లాభసాటిగా సాగుతుంది. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) –  ఈ రోజు ఎవరినీ విశ్వసించి.. ఏ పనీ ప్రారంభించవద్దు. ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. అలాగే స్థిరాస్థి, బంగారం లేదా ఖరీదైన వస్తువులను కొనడాన్ని వాయిదా వేయండి. వ్యాపారస్తులు రుణాలు తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడం వల్ల.. మీకు ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్.  

సింహం (Leo) – ఈ రోజంతా ఈ రాశి వ్యక్తులకు హాయిగా, ఆనందంగా గడుస్తుంది. అలాగే వివాహితులకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. పాత స్నేహితులు కూడా  మిమ్మల్ని ఈ రోజు కలుస్తారు. వ్యాపారస్తులకు సామాజిక గౌరవం మరియు సంపద పెరుగుతుంది. ఆఫీసులో ఉద్యోగులు కూడా ఎంతో ఉల్లాసంగా పనిచేస్తారు. 

క‌న్య (Virgo) – ఈ రోజు వివాహితులకు భాగస్వామి విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. అలాగే పలు కుటుంబ సమస్యలు మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఇలాంటి సమయంలో మనోనిగ్రహాన్ని కోల్పోకూడదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించాలి. అలాగే వ్యాపారస్తులు ఈ రోజు ఏజెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు అలెర్జీ సమస్యలకు గురి కావచ్చు. అలాగే పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయం సాధించే అవకాశం మెండుగా ఉంది. వ్యాపారస్తులు కూడా తమ బిజినెస్‌‌ను విస్తరించే అవకాశం ఉంది.  అలాగే ఉద్యోగులకు సంబంధించి... ఆఫీసులో మీ పని తీరు వల్ల అధికారులు ప్రభావితమవుతారు. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. వివాహితులు.. తమ స్నేహితుల నుండి బహుమతులు పొందే అవకాశం ఉంది. అలాగే కొత్తగా పెళ్లైన వ్యక్తులు.. తమ భాగస్వామితో రొమాంటిక్‌గా గడుపుతారు. తల్లిదండ్రులకు పిల్లల విషయంలో కొన్ని కీలక బాధ్యతలు నెరవేరుతాయి. వ్యాపార ప్రణాళికలు ప్రయోజనకరంగా ఉంటాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు  ఇతరుల మద్దతు తీసుకోవడంలో  విజయం సాధించవచ్చు. అలాగే స్నేహితులకు సంబంధించి.. పరస్పర సంబంధాలలో సాన్నిహిత్యం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే మీ ఆరోగ్యం విషయంలో అప్రమత్తతతో ఉండండి. వ్యాపారస్తులకు అంతా లాభసాటిగా సాగుతుంది. 

మకరం (Capricorn) –  ఈ రోజు విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తి పెంచుకొనే అవకాశం ఉంది . అలాగే నిరుద్యోగులు కొంచెం కష్టపడితే.. భిన్న రంగాల్లో జాబ్ పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పలువురు మిమ్మల్ని ప్రలోభపెట్టి.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సహించవచ్చు. అలాంటి చిక్కులలో పడవద్దు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అంతా రొమాంటిక్‌గా సాగుతుంది. ప్రేమికులు, కొత్తగా పెళ్లైన వారు, వివాహితులు మీ భాగస్వామితో హాయిగా గడపండి. ఇక ఇతర విషయాలకు వస్తే.. వ్యాపారస్తులు పోటీ వాతావరణాన్ని చూస్తారు. మిమ్మల్ని పడగొట్టడానికి కొందరు రాజకీయాలు కూడా చేస్తారు. అలాగే ఉద్యోగులకు నిరాశజనకమైన పరిస్థితులలో కుటుంబ మద్దతు ఉంటుంది. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు సోమరితనం, నిర్లక్ష్యం కారణంగా అనుకోని అవకాశాలను చేజార్చుకుంటారు. అలాగే వాహన వినియోగంలో జాగ్రత్త వహించడం మంచిది. నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మరింత కష్టపడాలి. టెక్నిక్‌తో చదవాలి. వ్యాపారస్తులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.