ఈ రోజు (ఆగస్టు 16, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అంతా లాభసాటిగా గడుస్తుంది. వ్యాపారవేత్తలకు సులభ ధనయోగం ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా అదనపు ఆదాయపు వనరులు సమకూరుతాయి. కానీ షేర్ మార్కెట్లలో పెట్టుబడులు లేదా లాటరీ టికెట్లు కొనే విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. అలాగే వివాహితులు ఆర్థి ప్రణాళికలు వేయడం ప్రారంభిస్తే మంచిది.
వృషభం (Tarus) – ఈ రోజు తల్లిదండ్రులు పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. అలాగే కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. వివాహితులు తమ భాగస్వామితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు కూడా ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా తమ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. అలాగే అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు.
మిథునం (Gemini) – ఈ రోజు ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు తమ నిర్లక్ష్యం వల్ల మంచి అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది. అదేవిధంగా వివాహితులు తమ భాగస్వామికి తెలియకుండా.. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలు అవుతాయి. వివాహితులు కూడా తమ జీవిత భాగస్వామితో ఆనంద డోలికల్లో తేలియాడుతారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి మంచి విషయాలు వింటారు. అవివాహితులు ఈ రోజు వివాహ ప్రయత్నాలు మొదలుపెడితే మంచిది.
సింహం (Leo) – ఈ రోజు నిరుద్యోగులు సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని వీడి పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే మంచి అవకాశాలను కోల్పోతారు. వ్యాపారస్తులు కూడా తమ పనులను నత్తనడకన సాగిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు తమ ప్రత్యర్థులతో సమస్యలు ఎదురుకావచ్చు. వివాహితులకు తొలుత తమ జీవిత భాగస్వామితో మనస్పర్థలు వచ్చినా.. తర్వాత తనను అర్థం చేసుకుంటారు.
కన్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే కోరికలను నియంత్రించుకోవాలి. లేదంటే ధనం విపరీతంగా ఖర్చయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వివాహితులకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు ప్రత్యమ్నాయ కోర్సులు లేదా క్రీడలపై ఆసక్తి చూపించే అవకాశం ఉంది.
తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు లాభసాటిగా గడుస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు కొత్త కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లేదా బదిలీలు సంభవించే అవకాశం ఉంది. వివాహితులకు తమ జీవిత భాగస్వామితో పొరపొచ్చాలు ఏర్పడవచ్చు. అదే విధంగా మీ పాత స్నేహితులు మిమ్మల్ని ఈ రోజు కలిసే అవకాశం ఉంది.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వ్యక్తులకు లక్ ఫ్యాక్టర్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీకు కావాల్సిన సహాయం, వనరులు ఏదో ఒక రూపంలో అందుతాయి. అలాగే ప్రేమికులు తమ బంధానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా ప్రారంభిస్తారు. స్టార్టప్స్ ప్రారంభించే వారికి.. అనుకోకుండా మంచి పార్టనర్స్ దొరుకుతారు.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – యువ వ్యాపారవేత్తలు, స్టార్టప్స్ ప్రారంభించాలని భావించే వారు ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. క్లారిటీ లేకుండా ఎవరికీ ఎక్కువ మొత్తంలో పేమెంట్స్ చేయవద్దు. అలాగే ప్రేమికులు మనస్పర్థలు వచ్చినా.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే సమయంలో కలిసి ఆలోచనలు చేయడం శ్రేయస్కరం. అలాగే మహిళలకు ఈ రోజు షాపింగ్ చేయడానికి అనువైన రోజు. మంచి రిబేట్లు, డిస్కౌంట్లు లభిస్తాయి.
మకరం (Capricorn) – ఈ రోజు వివాహితులు తమ భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులు కూడా కొన్ని విషయాలలో అపోహలను వీడాలి. తమ సమస్యల పరిష్కారానికి మూడో వ్యక్తి సహాయం తీసుకోకుండా.. తమకు తామే నిర్ణయాలు తీసుకోవాలి. కొత్తగా బిజినెస్ ప్రారంభించాలని భావించే వారు.. తమ స్నేహితుల సహాయం కచ్చితంగా తీసుకోవచ్చు.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..
కుంభం (Aquarius) – ఈ రోజు మీ స్నేహితులలో కొందరి ప్రవర్తన.. మీకు ఆందోళనను కలిగించవచ్చు. అలాగే ఆఫీసులో అధికారులతో ఉద్యోగులకు వాగ్వాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో కూడా పలువురితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలోనే సహనంతో వ్యవహరించాలి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి.
మీనం (Pisces) – ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకున్నా ఫరవాలేదు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగంలోని వ్యక్తులకు ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. నిపుణులను సంప్రదించడం మంచిది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.